ఆదివారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలు అంబరాన్ని తాకాయి. రొద్దంలో 1200 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని పోలీసుపరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ సేవలకు గాను 240 మంది అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. స్టాల్‌లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ప్రతిమ ఆకట్టుకుంది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం వందేమాతరం, జనగణమన గీతాలాపన గావించారు. తరువాత డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు సాంబమూర్తి, గంగిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. 9.15 నుంచి 9.40 గంటల వరకు తన సందేశాన్ని వినిపించారు. వివిధ పథకాల ప్రగతి తెలియజేశారు. దేశభక్తి చాటుతూ సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించడానికి అందరం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
ఈ ఏడాది ఖరీఫ్, రబీలో 10.89 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. వర్షాభావం వల్ల వేరుశనగ దిగుబడి తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 59 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేందుకు వీలుగా పంట నష్టం అంచనా వేసి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో పంట రుణాల కింద రూ.3,127 కోట్లకు గాను రూ.2,896 కోట్లు ఇచ్చాం. తద్వారా 6.40 లక్షల మందికి లబ్ధిచేకూర్చాం. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి వంద శాతం వడ్డీరాయితీ పొందాలి.
2012లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.648.88 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైంది. అందులో తొలివిడతగా రూ.407 కోట్లు విడుదల చేయగా... రూ.390 కోట్లు 3.79 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. రెండో విడతగా వారంలోగా 2.09 లక్షల మంది రైతులకు రూ.221 కోట్లు పంపిణీ చేస్తాం. అలాగే 2011కు సంబంధించి 67,010 మందికి రూ.42.27 కోట్లు వారంలోగా ఇస్తాం.
జిల్లా రైతాంగాన్ని శాశ్వతంగా ఆదుకోవాలనే ఆశయంతో ఐసీఏఆర్ సిఫారసులో రూ.7,676 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది రూ.100 కోట్లతో 14 గ్రామాల్లో ప్రాజెక్టు అమలు చేస్తాం. వేరుశనగ స్థానంలో కినోవా పంటను ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తాం.
ఏపీఎంఐపీ ద్వారా రూ.68.34 కోట్లతో 11 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందజేస్తాం. ఉద్యానశాఖ ద్వారా రూ.12 కోట్లు ఖర్చు చేసి పండ్లతోటల రైతులను ఆదుకుంటాం.
పశుక్రాంతి పథకం కింద 25 శాతం రాయితీతో 238 మినీ డెయిరీలు, ఆరు మోడల్ డెయిరీల ఏర్పాటు, సునందిని పథకం కింద రూ.1.20 కోట్లతో దూడల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం.
జలయజ్ఞం కింద రూ.6,850 కోట్లతో చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) మొదటి దశపూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.68 టీఎంసీల నీళ్లు ఇచ్చాం.
అలాగే పీఏబీఆర్‌కు 0.30 టీ ఎంసీలు, గుంతకల్లు ప్రాంతంలోని మూడు చెరువులకు 0.60 టీఎంసీలు ఇచ్చాం. 10వ పంప్‌హౌస్ నుం చి పేరూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నాం. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా 49 చెరువులకు నీళ్లు ఇస్తున్నాం.
శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాల కింద 15 సమగ్ర మంచినీటి పథకాల పను లు వేగంగా సాగుతున్నాయి. కొత్తగా రూ.34.71 కోట్లతో 210 గ్రామాలకు నీటి సదుపాయం కల్పిస్తున్నాం.
త్వరలో కొత్తగా 600 అంగన్‌వాడీ
కార్యకర్తల నియామకాలు చేపడతాం
ఏడో విడత భూపంపిణీలో 6,253 మందికి 11,088 ఎకరాలు పంపిణీ చేశాం. మొత్తమ్మీద ఇప్పటివరకు 34,750 మందికి 79,027 ఎకరాలు పంపిణీ చేశాం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలోనే మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆర్వీఎం ద్వారా 1,202 పాఠశాలల్లో రూ.147 కోట్లతో 2,487 అదనపు గదుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం.
తొలివిడత పల్స్‌పోలియో 102 శాతం విజయవం తం చేశాం. త్వరలో రెండో విడత కార్యక్రమం ఉం టుంది. ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు పీసీ-పీఎస్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.
బీఆర్‌జీఎఫ్ కింద రూ.37.22 కోట్లతో 1,833 పనులు చేపడతాం. 178 రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.151 కోట్లు కేటాయించాం. రూ.23.74 కోట్లతో 1,003 గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రూ.4.84 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.
జిల్లాలో 28.86 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి.
గణతంత్ర వేడుకల్లో అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కొట్రికె మధుసూదన్‌గుప్తా, పల్లె రఘునాథ్‌రెడ్డితో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
ఘనతంత్రం
Published Mon, Jan 27 2014 2:48 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement