సాక్షి, హైదరాబాద్: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయని, తుది మెరుగులు దిద్ది ఈ నెలాఖరులో ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక ఐటీ ప్రాంతానికి రాకపోకలు మరింత సులభం కానున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకపోగా, కొత్త ఫ్లై ఓవర్ అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సైతం సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు)
దీనివల్ల జూబ్లీహిల్స్, పంజగుట్టల నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్‌చెరు కోకాపేట్, నార్సింగి, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్లేందుకు.. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment