నార్పలలోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం నుంచి రాష్ర్టస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌స్పైర్)-2013 నిర్వహించనున్నారు.
నార్పల, న్యూస్‌లైన్ : నార్పలలోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం నుంచి రాష్ర్టస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌స్పైర్)-2013 నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉంటాయి. 29వ తేదీ వరకూ ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం పర్యవేక్షించారు.
12 జిల్లాల నుంచి వస్తున్న విద్యార్ధులు, వారి కేర్ టేకర్ల కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రెవేట్ పాఠశాలలను పరిశీలించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులను తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయబృందంతో వచ్చేలా ప్రోత్సహించి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్వీఎం పీఓ రామారావు, డీఈఓ మధుసూదన్‌రావు, సైన్స్ మ్యూజియం క్యూరేటర్ రాఘవయ్య, కోఆర్డినేటర్ ఆనందభాస్కర్‌రెడ్డి ఉన్నారు.