పులివెందుల, న్యూస్‌లైన్: పులివెందుల బ్రాంచ్ కాలువ ఆయకట్టు రైతులకు నీరందించి ఆదుకోవాలని.. మూడు, నాలుగేళ్లుగా నీరు రాక.. ఆయకట్టు పరిధిలో చీనీచెట్లు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అనంతపురం కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యువజన విభాగపు నాయకులు, పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయకట్టుదారుల సంఘం నాయకులు చప్పిడి రమణారెడ్డిలతోపాటు పలువురు రైతులు శనివారం సాయంత్రం అనంతపురం కలెక్టర్‌కు అందజేశారు.
లేఖలోని సారాంశం..
పీబీసీ ఆయకట్టు స్థిరీకరణ కోసం చిత్రావతి బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని.. పులి వెందుల తాగునీటి అవసరాలతోపాటు అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల తాగునీటిని అందించేందుకు 2.83టీఎంసీల నీరు వినియోగమయ్యే పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి నీటిని డ్యాం నుంచి తరలిస్తున్నారని పేర్కొన్నారు.
సీబీఆర్ ప్రాజెక్టు నుంచి 75శాతం అనంతపురం జిల్లా నీటి పథకాలే ఉన్నాయని లేఖలో విజయమ్మ గుర్తు చేశారు. ఐఏబీ కేటాయింపులు బాగానే ఉన్నా..పారదర్శకంగా అమలు చేయడంతో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారని అం దులో పేర్కొన్నారు. దీంతో పీబీసీ కాలువ పరిధిలోని ఆయకట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఐఏబీలో పీబీసీకి నీటిని కేటాయిస్తున్నా.. పీబీసీ ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరి స్థితి నెలకొందని.. మూడేళ్లుగా వస్తున్న అరకొర నీటితో చివరకు పులివెందులకు తాగునీటికి కూడా అందించలేకపోయిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. దీనికి ప్రధాన కారణం సీబీఆర్‌లో ఉన్న తాగునీటి అవసరాలు 2.83 టీఎంసీలయితే.. అధికారికంగా 2టీఎంసీలే ఇవ్వ గా.. 0.83టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు లోటుగా భావించాలి. ఇదంతకూడా ఐఏబీలో అవగాహనారాహిత్యంగా జరుగుతున్న తతంగమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ పెన్నార్ నుంచి తుం పెర వరకు నీరు ప్రవహించే సమయంలో 15శాతం నీటిని.. అలాగే తుంపెర నుంచి సీబీఆర్‌కి చేరే సమయంలో జరిగే నీటి నష్టాన్ని 20శాతం లాసెస్ కింద నష్టం జరుగుతోందని అధికారులు రికార్డులలో చూపిస్తున్నారని.. ఈ లెక్కన 2టీఎంసీల నీటిలో 35శాతం లాసెస్ కింద పోగా.. సీబీఆర్‌కు 1.40 టీఎంసీల నీరు చేరుతోందని విజయమ్మ పేర్కొన్నారు.
మరోవైపు పీబీసీ రైతులకు చుక్కనీరు అందక.. బోర్లల్లో భూగర్భజలాలు అడుగంటి పులివెందుల ప్రాంత రైతులు చీనీ చెట్లను నరికివేసుకున్నారని వివరించారు. ఈ ఏడాది ఐఏబీ సమావేశంలో కేటాయింపుల అమలు తీరు మీకు వివరించాలనుకున్నామని.. ఈ ఏడాది ఐఏబీలో సీబీ ఆర్‌లోని తాగునీటికి 2 టీఎంసీలను.. పీబీసీ సేద్యపు నీటి అవసరాలకు 1.23టీఎంసీల నీటిని కేటాయించారు.
తొలి విడత కింద తాగునీటి కోటాను సీబీఆర్‌కు ఆగస్ట్‌లో ఇచ్చారన్నారు. హెచ్‌ఎల్‌సీ అధికారుల లెక్కల ప్రకారం 2.33టీఎంసీలు ఇచ్చినట్లు వారు నివేదికలో చూపించారని.. వాస్తవానికి సీబీ ఆర్‌కు చేరింది ఒక టీఎంసీ నీరు మాత్రమేనని.. ప్రస్తు తం పీబీసీకి కేటాయించిన సేద్యపు నీటి కోటా కింద 1.23టీఎంసీల నీరు ఇస్తున్నారని.. ప్రస్తుతం తుంపెర వద్ద ఇస్తున్న రీడింగ్ ఇదే విధంగా అమలు చేస్తే ఈనెల 10వ తేదీకి సేద్యపు నీటి కోటా ముగుస్తుందని అధికారు లు చెబుతున్నారని వివరించారు. ఒకవేళ అధికారుల లెక్కల ప్రకారమే ఇస్తున్నారనుకున్నా.. తుంగభద్ర డ్యా ం నుంచి హెచ్‌ఎల్‌సీకి అదనంగా కేటాయించిన 2టీఎం సీలలో దామాషా కింద పీబీసీకి 12.62శాతం రావాలి. అంటే సుమారు 0.25టీఎంసీల నీరు పీబీసీకి రావాల్సి ఉంది కదా అని ఆమె ప్రశ్నించారు. మీరు పీబీసీ రైతాంగ దీన స్థితిని అర్థం చేసుకొని ఈనెల చివరకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే విజయమ్మ లేఖలో కోరారు.
పీబీసీ రైతులను ఆదుకోండి
Published Sun, Jan 5 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement