pullivendula
-
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్‌మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. -
తండ్రికి నివాళులర్పించిన వైఎస్ భారతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. అంధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసిన గంగిరెడ్డి అభిమానులు.. దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ రాజారెడ్డి భవన్ వద్ద గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. చదవండి: ఖరీఫ్‌లో సిరుల పంట -
సీబీఐ కస్టడీకి సునీల్‌కుమార్ యాదవ్
సాక్షి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. సునీల్ యాదవ్‌ను పులివెందుల తీసుకెళ్లి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. రోటరీపురం రోడ్డులో అనుమానాస్పద ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది. కాగా, అతడిని తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 16 వరకు సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం పులివెందుల మేజిస్ట్రేట్ అనుమతించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కడప కేంద్ర కారాగారం నుంచి సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర కారాగారం ఆవరణలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కార్యాలయానికి సునీల్‌కుమార్ యాదవ్‌ను తీసుకెళ్లారు. కాగా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్‌రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాలను సీబీఐ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. -
ఈసీ గంగిరెడ్డికి సీఎం జగన్ నివాళి
సాక్షి, పులివెందుల: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్నారు. మధ్యాహ్నం జరగనున్న తన మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి నివాళర్పించారు. (చదవండి: సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. గవర్నర్ సంతాపం.. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం గంగిరెడ్డి మరణించిన గంగిరెడ్డి వైఎస్సార్ జిల్లాలో ప్రఖ్యాత శిశు వైద్యునిగానే కాక, ప్రజా వైద్యునిగా ప్రసిద్ది చెందారని ప్రస్తుతించారు. గంగి రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఆయన భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులకు గవర్నర్ హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ప్రజాసేవకు చిరునామా.. ప్రజాసేవకు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఒక చిరునామా అని.. ఆయన మరణం బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేదలకు విశేషంగా వైద్యసేవలు అందించారని, ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారన్నారు. పులివెందుల ప్రాంతం అభివృద్ధిలో ఈసీ గంగిరెడ్డికి సుస్థిర స్థానం ఉందని ట్వీట్ చేశారు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డికి ఆయన ఘన నివాళులు అర్పించారు. -
కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరారు. మధ్యాహ్నం జరగనున్న ఆయన మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం.గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, డీఐజీ వెంకటరామిరెడ్డి తదితర అధికారులు విమానాశ్రయంలో సీఎం జగన్‌ను కలిశారు. (చదవండి: సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి నివాళర్పించారు. -
‘ఏపీ కార్ల్’కు మహర్దశ!
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్)కు మహర్దశ పట్టనుంది. పశు సంపద, పాల ఉత్పత్తుల్ని పెంచడంతోపాటు అందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టే లక్ష్యంతో వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలోని పెద్ద రంగాపురంలో దీనిని నెలకొల్పారు. మహానేత మరణానంతరం ఇది నిరాదరణకు గురైంది. దాదాపు రూ.300 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దాదాపు పదేళ్లపాటు పూర్తిగా పక్కన పెట్టేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పశు సంపద, పాల ఉత్పత్తుల పెంపుదల, వీటికి సంబంధించిన పరిశోధనలు చేపట్టేందుకు ఏపీ కార్ల్‌పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇక వాక్సిన్ తయారీ ఇక్కడే ►ఇకపై రాష్ట్రంలోనే పశు వ్యాధుల నివారణ వాక్సిన్ తయారు చేసే విధంగా హైదరాబాద్‌కు చెందిన ఐజీవై ఇమ్యూనోలాజిక్స్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ►పీపీపీ విధానంలో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జూలై నుంచి అన్ని రకాల పశు వ్యాక్సిన్ల తయారీ ఇక్కడ ప్రారంభమవుతుంది. ►ఇందుకోసం ఐజీవై సంస్థ దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 100 మంది నిపుణులు, సిబ్బందికి ఇక్కడ ఉపాధి లభించనుంది. మూడు కాలేజీలొస్తాయ్ ►ఇక్కడే వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక కళాశాలలను కూడా ఈ ఏడాది ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ►కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోవడంతో ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. ► రాష్ట్రంలో అరటి సాగు విస్తీర్ణం రాయలసీమ ప్రాంతంలోనే అధికంగా ఉండటంతో ఈ ప్రాంగణంలోనే 70 ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ►తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికి ఈ ప్రాంగణంలోనే పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.18 కోట్లు వెచ్చిస్తారు. ►2021 నాటికి ఏపీ కార్ల్‌లో ఈ సంస్థలన్నీ కార్యకలాపాలు చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. చదవండి: ప్రభుత్వానికి రూ.4,881 కోట్ల అదనపు ఆదాయం -
బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో బ్రౌన్ షుగర్ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి వారివద్ద నుంచి 1.5 కిలోల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప రింగ్‌రోడ్డు వద్ద ఆదివారం ఎస్ఐ అనిల్‌కుమార్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, అంజి, రాజేశ్వరరెడ్డి, హయాత్, సుబ్బరాయుడు, ధనుంజయలు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఇండికా వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న శివయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. వల్లూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాంకుమార్, కడప చిన్నచౌకుకు చెందిన శివ, ముస్తఫాలు కలిసి బ్రౌన్ షుగర్‌ను బెంగళూరుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో వాహనంలో ఉన్న నలుగురినీ అరెస్టు చేశారు. మరో ఇద్దరిపై కూడా అనుమానాలు ఉన్నాయని.. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తామని ఏఎస్పీ తెలిపారు. ఇందుకు బాధ్యులు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఈ బ్రౌన్ షుగర్‌ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు.. ఎవరెవరికి విక్రయించారు అనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బ్రౌన్ షుగర్ విలువ దాదాపు రూ.35లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందివ్వాలని.. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చె ప్పారు. నిందితులను అరెస్టు చేసే విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు అందేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. కార్యక్రమంలో పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు అనిల్‌కుమార్, వెంకటనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అండగా ఉంటా
వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ శాసనసభాప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పులివెందులలో బిజీబిజీగా గడిపారు. సీఎస్ఐ చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజల కష్టాలను ఓపిగ్గా విన్నారు. పలు సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడారు. పలువురిని పరామర్శించారు. అధైర్యపడొద్దు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయ కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు. -
జలం కోసం రణం
పులివెందుల జనం గొంతెండుతున్నా అధికారుల్లో స్పందన కరువైందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతుతడపండి అంటూ తహశిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో మహిళలు బైఠారుుంచారు. పట్టణ వాసుల దాహం తీర్చడానికి సీబీఆర్ నీటిని విడుదల చేయూలంటూ నినదించారు. పులివెందుల/రూరల్: పులివెందులలో నీటి సమస్య తీవ్రమవుతున్నా టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డిల నేతృత్వంలో ఖాళీబిందెలతో బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వెంటనే నీరు విడుదల చేయండి : వైఎస్ ప్రమీలమ్మ నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీరు పూర్తిగా రాకపోతే పులివెందుల మున్సిపాలిటీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నీటిలో ఎస్ఎస్ ట్యాంకుకు కేవలం 200 మిలియన్ల నీరు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ నీరు మున్సిపాలిటీ పరిధిలోని 70వేల జనాభాకు కేవలం నెలన్నర్ర రోజులకు మాత్రమే సరిపోతుందన్నారు. గతంలో అప్పటి కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీకి తాగునీటిని విడుదల చేశారని, ఆ నీళ్లు దాదాపు 6నెలల వరకు సరిపోయాయన్నారు. ప్రస్తుత కలెక్టర్ కూడా పులివెందుల మున్సిపాలిటీ ప్రజల అవసరాలను గుర్తించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఎస్ ట్యాంకులో 2860 మిలియన్ లీటర్ల నీటిని కచ్చితంగా నింపితే పులివెందుల ప్రజల దాహార్తిని తీర్చే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పులివెందుల పురపాలక ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా మహానేత వైఎస్ఆర్ 2008లో ఎస్ఎస్ ట్యాంకును రూ.30కోట్లతో నిర్మించి పట్టణ ప్రజలకు బహుమతిగా ఇచ్చారన్నారు. అయితే ఎస్ఎస్ ట్యాంకుకు పూర్తిస్థాయిలో నీరు రాకపోవడంతో గత ఏడాది, ఈ ఏడాది ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిధులతో వెలమవారిపల్లె, న్యాక్ బిల్డింగ్ సమీపంలో బోర్లు వేశారన్నారు. అయితే తీవ్ర వర్షాభావం కారణంగా ఆ బోర్లలో నీరు తగ్గిపోయిందన్నారు. మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చేయాలంటే కాలువల ద్వారా కాకుండా సీబీఆర్ నుంచి ఎస్ఎస్ ట్యాంకు వరకు ప్రత్యేక పైపులైన్ వేయాలన్నారు. దీంతోపాటు కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం రిజర్వాయర్ ద్వారా నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకుకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప మాట్లాడుతూ ఎస్ఎస్ ట్యాంకుకు కేటాయించిన నీటిని తెలుగుతమ్ముళ్లు అక్రమంగా వాడుకోవడంతోనే ట్యాంకుకు నీరు చేరలేదన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రుక్మిణీదేవి మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉన్నత ఆశయంతో వైఎస్ఆర్ ఎస్ఎస్ ట్యాంకును నిర్మిస్తే దానికి పూర్తిస్థాయిలో నీరు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. డీటీ, పీబీసీ డీఈలకు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్సీపీ నాయకులు : పులివెందుల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీబీఆర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ డిప్యూటీ తహశీల్దార్ సుధాకర్, పీబీసీ డీఈ రామాంజనేయరెడ్డిలకు వైఎస్సార్సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రసూల్, ప్రధాన కార్యదర్శి వీరభద్రారెడ్డి, రైతు సంఘ నాయకులు బాలవేమారెడ్డి, సర్వోత్తమరెడ్డి, ఎన్ఆర్ఐ రఘు, ఎంపీటీసీ విశ్వనాథరెడ్డి, డీసీసీ బ్యాంకు డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల : ప్రజల సమస్యలపట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేసే నాయకుడు వైఎస్ జగనన్న అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బాకరాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేక్‌ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేత వైఎస్ జగనన్న అని, ప్రజలపట్ల ఆయనకున్న సేవాభావాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేదలకు ప్రతి ఒక్కరు తమ చేతనైనంత సహాయం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, తొండూరు మండల నాయకుడు బండి రామమునిరెడ్డి, లింగాల కొండారెడ్డి, కసనూరు పరమేశ్వరరెడ్డి, ఎంపీటీసీ విశ్వనాథరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ : వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని కౌన్సిలర్ కోళ్ల భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, అంబకపల్లె మురళి, ఓ.రసూల్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేపు వైఎస్ జగన్ రాక
పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులకు వస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ శుక్రవారం తిరుపతిలో జరిగే కార్యక్రమాలలో పాల్గొని శనివారం ఉదయం పులివెందులకు చేరుకుంటారన్నారు. శనివారం ఉదయం పులివెందులలోని సుభాకర్‌రెడ్డి ఫంక్షన్ హాలులో పెద్దజూటూరుకు చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి తమ్ముని కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారన్నారు. అనంతరం తొండూరు మండలం బోడివారిపల్లె గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం ఆహోబిలం వెళ్లి సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తర్వాత పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకుని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని వెఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. -
తోడేస్తున్నారు
సాక్షి, కడప : ఏడాదికొకసారి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు అంతంత మాత్రంగానే నీరు.. సాగునీటికి గగనమే.. మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇస్తున్న నీటిని సైతం ‘అనంత’ రైతులు వదలడంలేదు. అక్రమ మోటార్లను ఏర్పాటు చేసుకుని నీటిని దోచేస్తున్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు 2014-15కు సంబంధించి అడ్వయిజరీ బోర్డు సమావేశంలో 3.200టీఎంసీల నీటిని కేటాయించారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో ఆశాజనకంగా నీరు ఉండటంతో ఆగస్ట్ 26న అనంతపురం జిల్లాలోని మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ వద్ద అధికారులు పీబీసీకి తొలి విడతగా నీటిని విడుదల చేశారు. అనంతరం రెండవ విడత ఈనెల 6వ తేదీన రెండవమారు విడుదల చేశారు. ముందే అంతంత మాత్రంగా విడుదల చేయడం, కాలువల్లో సగం నీరు వృథా అవుతుండటంతో పాటు అక్రమ మోటార్ల కారణంగా పులివెందుల రైతులతోపాటు ప్రజల తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మోటార్లతో జలదోపిడీ.. అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి నార్పల మండలంలోని తుంపెర డీప్‌కట్ వరకు సుమారు 80కి.మీ మేర హైలెవల్ కెనాల్ ద్వారా(హెచ్ఎల్సీ) నీరు పీబీసీకి రావాల్సి ఉంది. మిడ్ పెన్నార్, తుంపెర డీప్కట్ల మధ్య లెక్కలేనన్ని అక్రమ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. జల దోపిడీ జరుగుతున్నాఅక్కడి యంత్రాంగం చూస్తూ ఊరుకుందే తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదు. నీటి విడుదలకు ముందే ఎగువ ప్రాంతంలో ఉన్న 27 చిన్న, చిన్న గేట్లను అధికారులు మూసివేశారు. అయితే వీలు దొరికినప్పుడు స్వల్పంగా గేట్లు ఎత్తివేసి నీటిని మళ్లించుకుంటున్నట్లు తెలుస్తోంది. మిడ్ పెన్నార్ డ్యాం వద్ద 275 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తుండగా.. తుంపెర వద్దకు వచ్చేసరికి తక్కువ పరిమాణంలో రీడింగ్ నమోదవుతోంది. తుంపెర నుంచి పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్(పీబీఆర్) మధ్య కూడా అక్రమ మోటార్లు వెలిశాయి. మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్ మధ్య దాదాపు 700కు పైగా అక్రమ మోటార్లు వెలిసినట్లు తెలుస్తోంది. అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల అనంతపురం జిల్లాలోని 5వేల ఎకరాలతోపాటు వైఎస్ఆర్ జిల్లాలోని 55వేల ఎకరాలను కలుపుకుని సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు కలిగిన పీబీసీకి ప్రస్తుతం సాగునీటికి నీరు ఇవ్వలేదు. మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇస్తున్న నీటిని అనంతపురం జిల్లాలోని పలువురు రైతులు పంటలకు అందించుకుంటుండటంతో అక్కడ వరి పంట పచ్చగా కళకళలాడుతుండగా.. ఆయకట్టు ప్రాంతమైన పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లె, పులివెందుల మండలాల్లోని భూములు వెలవెలబోతున్నాయి. తుంపెర వద్ద లష్కర్ల పహారా తుంపెర డీప్‌కట్ వద్ద పీబీసీ... అటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ)కి నీటిని విడుదల చేసే ప్రాంతం. హైలెవెల్ కెనాల్ ద్వారా తుంపెరకు చేరుకుని.. అక్కడి నుంచి పీబీసీకి నీటిని విడుదల చేస్తున్న నేపధ్యంలో టీబీసీ పరిధిలోని రైతులు వచ్చి గేట్లు ఎత్తకుండా లష్కర్లు పహారా కాస్తున్నారు. అయితే తాడిపత్రి ప్రాంతానికి చెందిన రైతులు వచ్చి గేట్లు ఎత్తాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతిసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఏఈతోపాటు లష్కర్లతో పహారా కాస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఏఈఈ నరసింహారెడ్డిని వివరణకోరగా అక్రమ నీటి వినియోగం వాస్తవమేనన్నారు. తన రీచ్‌లో 50అక్రమ విద్యుత్ మోటార్లు ఉన్నాయన్నారు. మరో రెండు రీచ్‌ల్లో ఎన్ని మోటార్లు ఉన్నాయో లెక్క తెలియదన్నారు. అక్రమ మోటార్లను నిరోధించాలని నార్పల, తాడిమర్రి పోలీస్స్టేషన్లలో ఐదురోజుల క్రితం ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. -
మీరు నలభై..వారు ముప్పయా..
పులివెందుల అర్బన్ : సిబ్బంది 40 మంది ఉంటే.. రోగులు 30 మందే ఉన్నారు... ఇంత పెద్దాసుపత్రిలో ఇదేమి పరిస్థితి అని వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కనక దుర్గమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత సిబ్బంది ఇక్కడ అవసరం లేదన్నారు. పని ఉన్నచోటకు వారిని మార్చాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. ఆస్పత్రి ఇంత అధ్వాన్నంగా ఉంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందించే భోజనం సరిగా లేదనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. రికార్డులు తప్పుల తడకడగా ఉన్నాయన్నారు. కళ్లు మూసుకుని రికార్డులు రాస్తున్నారా అంటూ మండిపడ్డారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఆస్పత్రికి సంబంధించి రూ. 3 లక్షల నిధులు ఉన్నట్లు రికార్డులలో ఉన్నా... నిధులు లేవని చెప్పడంతో సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. మీరు డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించారు. పనితీరును మార్చుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రామ్మోహన్, సూపరింటెండెంటు ప్రసాద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్ర నీటిపై కుంటిసాకులు
రెండు రోజుల పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. తొలుత సింహాద్రిపురం మండల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సాగు, తాగు నీటి సమస్యతో అల్లాడుతున్నామని ప్రజలు తెలియజేయగా వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. సాగు, తాగు నీటి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడతామన్నారు. తుంగభద్ర నీటి విషయమై అధికారులు కుంటిసాకులు చెబుతుండడం మామూలైపోయిందన్నారు. ఇతర సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్ మరణానంతరం వైవీయూ గురించి పట్టించుకున్న వారే లేరని వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ అమరనాథ్ రెడ్డి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. సాయంత్రం ‘విజేత’ మానసిక వికలాంగులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. పిల్లలందరూ గుడ్ ఈవినింగ్ సర్ అనగా, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్ అంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఆప్యాయంగా పలుకరించారు. దగ్గరకు తీసుకుని పేర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు. మీకందరికీ మంచి చేసేందుకు కృషి చేస్తానన్నారు. - వివరాలు 2లోఠ సాక్షి, పులివెందుల : తుంగభద్ర నీటి విషయంలో అధికారులు కుంటిసాకులు చెప్పడం మామూలైపోయిందని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. తుంగభద్రలో నీరు ఉన్నప్పుడు సక్రమంగా ఇవ్వరు.. లేనప్పుడు లేదనే సాకుతో ఎగనామం పెడుతున్నారన్నారు. ప్రతి ఏడాది తుంగభద్ర నుంచి నీటిని అందించాల్సి ఉండగా.. మూడు, నాలుగేళ్లుగా సక్రమంగా అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలోని పీబీసీతోపాటు మైలవరం డ్యాంకు తుంగభద్ర నీరు రావాల్సి ఉందన్నారు. ప్రతి ఏటా కరవు వస్తుండటంతో భూములన్నీ బీళ్లుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో సింహాద్రిపురం మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలతో వైఎస్ జగన్ చర్చించారు. ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన కార్యకర్తలను, ప్రజలను ఒక్కోసారి లోపలికి పిలిపించి ప్రత్యేకంగా సమావేశమై సమస్యలను తెలుసుకోవడమేకాక పరిష్కారానికి చొరవ చూపారు. ప్రధానంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.. ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సింహాద్రిపురం మండల నాయకులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, బి.ఎన్.బ్రహ్మానందరెడ్డి, అరవిందనాథరెడ్డి, సోమశేఖరరెడ్డి, ఎంపీపీ కొమ్మా సుహాసిని, మండల ఉపాధ్యక్షురాలు శ్రీలత తదితర నాయకులు, కార్యకర్తలు సమీక్షలో పాల్గొన్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఇతర జిల్లాల నాయకులు : ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డిని పలువురు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు కలిసి చర్చించారు. పులివెందులలోని స్వగృహంలో ముందుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు జిల్లా రాజకీయాలపై చాలాసేపు చర్చించారు. తర్వాత వైఎస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం వైఎస్ఆర్ సీపీ నాయకులు తిమ్మంపల్లె పెద్దారెడ్డి తదితరులు కూడా వైఎస్ జగన్‌తో ప్రత్యేకంగా చర్చించారు. మైదుకూరు వైఎస్ఆర్ సీపీ నాయకుడు బండి హనుమంతు కూడా భేటీ అయ్యారు. వైవీయూకు నిధులు కేటాయించేలా చూడండి కడపలోని యోగివేమన యూనివర్శిటీకి సంబంధించి నిధులు కేటాయించకుండా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, దివంగత సీఎం వైఎస్ఆర్ మరణానంతరం యూనివర్శిటీ అభివృద్ధి పనులకు నోచుకోలేక మొండి గోడలతో దర్శనమిస్తోందని.. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను వైఎస్ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బి.అమరనాథరెడ్డి కలిశారు. భవనాలు, హాస్టల్ వసతి, పూర్తికాక అటు అధికారులు.. ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. కాగా వైఎస్ జగన్ రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 8న ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. మధ్యాహ్నం పులివెందులకు చేరుకొని వేంపల్లె మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. 9వ తేదీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. సింహాద్రిపురం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, కార్యకర్తలతో చర్చించారు. సాయంత్రం పులివెందులలో విజేత మానసిక వికలాంగుల పాఠశాలలో వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని వైఎస్ జగన్‌రెడ్డి ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వస్తున్న జనాలందరితోనూ జగన్ మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బుధవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. -
రేపు వైఎస్ జగన్ పులివెందుల రాక
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వ తేదీ పులివెందుల రానున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 తేదీలలో జిల్లాలో ఉంటారు. 8వ తేదీ ఉదయం ఇడుపులపాయ చేరుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయంలో వేంపల్లి మండల నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే గ్రామస్థాయి నేతల సమస్యలను తెలుసుకోనున్నారు. 9వ తేదీ ఉదయం పులివెందుల కార్యాలయంలో ఉదయం సింహాద్రిపురం మండల నాయకులతో గ్రామాల వారీగా సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం లింగాల మండల నాయకులతో గ్రామాలవారీగా సమీక్ష చేపట్టనున్నారు. -
కొలువుదీరారు
సాక్షి, పులివెందుల : మూడేళ్ల స్పెషల్ అధికారుల పాలన అనంతరం శుక్రవారం మండలాధీశులు కొలువుదీరారు. ఎంపీపీ ఎన్నిక తర్వాత ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎన్ని అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా.. జిల్లాలో అత్యధిక స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో 50స్థానాలకుగానూ.. వైఎస్ఆర్ సీపీ 27 ఎంపీపీ స్థానాలను వశపరుచుకోగా.. టీడీపీకి కేవలం 16స్థానాలు మాత్రమే దక్కాయి. మరో 7మండలాల్లో ఎంపీటీసీలు హాజరుకాకపోవడంతో ఎంపీపీ స్థానాలకు సం బంధించి కోరంలేక వా యిదా పడ్డాయి. వాటికి సంబంధించి శనివారం ఆయా మండల కేంద్రాలలో ఎంపీపీ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారులు నిర్వహించనున్నారు. కమలాపురం ఎంపీపీ, ఉపాధ్యక్ష, కోఆప్షన్ మెంబర్లకు సంబంధించి డిప్ తీయగా మూడు పదవులు టీడీపీకే దక్కాయి. రాయచోటి సెగ్మెంట్లో క్లీన్‌స్వీప్ రాయచోటి సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. నియోజకవర్గ పరిధిలో చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు, రామాపురం, రాయచోటి, ల క్కిరెడ్డిపల్లె మండలాలు ఉండగా.. అన్నింటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపీపీలే ఎన్నికయ్యారు. పులివెందుల సెగ్మెంట్లో 7మండలాలు ఉండగా.. 6మండలాల్లో వైఎస్ఆర్ సీపీ ఎంపీపీలను కైవసం చేసుకోగా.. ఒక్క మండలంలో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కోరంలేక పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
పల్లె క‘న్నీరు’ పెడుతోంది!
వాళ్లంతా నేల తల్లిని నమ్మిన రైతు బిడ్డలు. పుడమి కడుపును చీల్చుకుని పాతాళగంగ ఉబికి వచ్చిందంటే వారి కళ్లలో ఆనందానికి అవధులు ఉండవు. ఈ ప్రపంచాన్ని జయించినంతగా సంబరపడిపోతారు. కానీ గంగమ్మకు రైతన్నలపై కనికరం కలగలేదు. ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకుండా పోతోంది. పదుల సంఖ్యలో బోర్లు వేసి ఇక చేసేదేమీ లేక పొలాలను బీడుగా వదిలేస్తున్న రైతులకు లెక్కేలేదు. ఉన్న బోర్లలో నీరు తగ్గిపోవడం.. కొత్త బోర్లలో నీరు పడకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంతమంది రైతులు పంటలు పెట్టి.. దిగుబడులు రాక.. బోర్లు ఎండిపోయి ఏకంగా పొలాలను అమ్మి పట్టణాలకు వలసపోతున్నారంటే పల్లె ఎలా కన్నీరు పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, పులివెందుల: లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామంలో 1300 మందికిపైగా జనాభా ఉంది. గ్రామంలో ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందరూ ఎక్కువగా వర్షాధార పంటనే నమ్ముకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా బోర్లు వేసి గ్రామంలో అరటి పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది వరకు గ్రామానికి సంబంధించి అరటి రైతులు మంచి దిగుబడిని సాధిస్తూ వచ్చినా.. ఈ ఏడాది మాత్రం గ్రామంలో అరటి రైతులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామంలో ఒక బోరు మొదలుకుని 30 బోర్ల వరకు వేసిన రైతులు దాదాపు ఐదారు మంది ఉన్నారంటే అక్కడ పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు ఇట్టే అర్థమవుతాయి. వందలాది బోర్లు వేసినా.. : లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 400నుంచి 500బోర్లు వేసినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి మొదలైన నీటి కష్టం ఇప్పటికీగ్రామ రైతులకు తీరలేదు. వరుణ దేవుడు కరుణించి భారీ వర్షాలు కురిపిస్తే చుట్టు ప్రక్కల చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, గుంతలు నిండి సమీపంలోని బోర్లల్లో భూగర్భజలాలు పెరిగి నీటి సమస్య ఉండదని రైతన్నలు భావిస్తున్నారు. సుమారు 800నుంచి 1200అడుగుల వరకు నీటి కోసం బోర్లు తవ్వినా.. నీటి చెమ్మ జాడ కనిపించడంలేదు. కొంతమంది రైతులు బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి పంటలను సాగు చేసి బోర్లను వేశారు. ప్రతి రైతు రెండు, మూడు, నాలుగు, ఐదు.. ఇలా పదుల సంఖ్యలో అరటిని కాపాడుకునేందుకు బోర్లు వేసుకుంటూ వచ్చారు. వలసబాట పడుతున్న రైతన్నలు తాతిరెడ్డిపల్లెకు చెందిన ఆదినారాయణ అనే రైతు తనకున్న 6ఎకరాల పొలంలో అరటి పంట సాగు చేశాడు. కొన్ని బోర్లు వేసినా.. ఫలితం సున్న. ఈ నేపథ్యంలో భారీ నష్టం రావడంతో చేసేదేమీ లేక ఉన్న ఇంటిని, కొంత భూమిని అమ్మి బెంగళూరుకు వలసబాట పట్టాడు. అక్కడ ఒక ప్రయివేట్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఒక్క రైతే కాదు.. మరికొంతమంది రైతులు వలసబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ చీనీ రైతులు.. ఇక్కడ అరటి రైతులు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన నీరు రాక సింహాద్రిపురం, తొండూరు, వేముల, పులివెందుల మండలాల్లో పలువురు రైతులు చీనీచెట్లను కొట్టివేస్తే.. తాతిరెడ్డిపల్లెలో అరటి రైతులు బోర్లల్లో నీరు అడుగంటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీబీసీకి నీరు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లల్లో నీరు ఇంకిపోయి పలువురు రైతులు చీనీ చెట్లను కొట్టివేస్తున్నారు.. అక్కడ.. ఇక్కడ రెండు చోట్ల నీరులేక రైతన్నలు తోటల్లో సాగు చేసిన చెట్లనే తెగనరుక్కోవాల్సిన పరిస్థితి రావడం బాధగా ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మమేకం
సాక్షి, పులివెందుల : ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులలో నిస్తేజాన్ని తొలగించి నూతనోత్సాహాన్ని నింపారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ప్రజలతో మమేకమయ్యారు. నేనున్నానంటూ అందరికీ భరోసా నింపారు. ప్రతి ఒక్కరినీ దగ్గరకు తీసుకుని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌ను చూడగానే పులివెందుల ప్రజలు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. చమర్చిన కళ్లతో మాట్లాడుతున్న కార్యకర్తలు, అభిమానులను చూసి జగన్ చలించిపోయారు. కష్టపడ్డాం... ఫలితం దక్కలేదు. దేవుడు త్వరలోనే మంచి రోజులను ప్రసాదిస్తారంటూ వైఎస్ జగన్ కార్యకర్తలలో ధైర్యం నింపారు. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రతిఒక్కరినీ పలకరించారు. ఆర్యవైశ్యుల సత్కారం పులివెందులకు చెందిన ఆర్యవైశ్య సంఘ నాయకులు మిట్టా విశ్వనాథం, విజయ్‌కుమార్, పట్టాభి, రవికుమార్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి బొకేలను అందించి అభినందించిన అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం పొట్టిశ్రీరాములు బొమ్మతో కూడిన జ్ఞాపికను అందజేశారు. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి కూడా శాలువా కప్పి సన్మానించిన ఆర్యవైశ్య సంఘ నాయకులు ప్రత్యేక జ్ఞాపికను కూడా అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, అవినాష్‌లు ఆర్యవైశ్యుల సమస్యలపై చర్చించారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వైఎస్ జగన్‌రెడ్డిని కలిశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామని చంద్రబాబు పేర్కొంటున్న నేపథ్యంలో వారు జగన్‌ను కలిశారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం వైఎస్ జగన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డిని శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, జమ్మలమడుగు మున్సిపల్ మాజీ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ ైచె ర్మన్జగదేకరరెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు. వారితోపాటు పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, రాయచోటికి చెందిన కౌన్సిలర్లు కూడా వైఎస్ జగన్‌తో కరచాలనం చేసి పలు విషయాలు చర్చించారు. దాడులపై కఠినంగా వ్యవహరించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు జరుపుతున్న దాడులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు.సింహాద్రిపురం మండలానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు వెలుగోటి చంద్రశేఖరరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, యూత్ కన్వీనర్ శివారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి తదితరులు ఆయనను కలిసి కోవరంగుంటపల్లెలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త పెద్దబాదుల్లాపై టీడీపీ వర్గీయులు చేసిన దాడిని వివరించారు. వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పోలీసులు ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పర్యటన విజయవంతం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన నాలుగు రోజులు ఉంటుందని భావించినా.. తూర్పుగోదావరి జిల్లా నగరంలో గ్యాస్ పైపులైన్ లీకేజీ అయి 15మంది చనిపోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.ఈనెల 26వ తేదీన బద్వేలు, కడపలోని పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కార్యకర్తలతో అభిప్రాయాలు స్వీకరించిన ఆయన రెండవ రోజు శుక్రవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకమయ్యారు. -
ప్రతిపక్ష హోదాలో తొలిసారి...
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో తొలిసారి ఆయన పులివెందులకు విచ్చేసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన వైఎస్ జగన్‌కు కార్యకర్తలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ జగన్ ఈరోజు ఉదయం 10గంటల ప్రాంతంలో బద్వేలు బయలుదేరి వెళతారు. అక్కడ నూతన జంట మానస వీణ, సుభోద్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించనున్నారు. అనంతరం కొద్దిసేపు నాయకులు, ప్రజలను కలిసి ఆ తర్వాత కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే శనివారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన అధికారులతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్షించనున్నారు. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి,పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం పులివెందులకు రానున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు. వైఎస్ జగన్ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10గంటల ప్రాంతంలో బద్వేలు బయలుదేరి వెళతారు. అక్కడ నూతన జంట మానస వీణ, సుభోద్కుమార్రెడ్డిలను ఆశీర్వదించనున్నారు. అనంతరం కొద్దిసేపు నాయకులు, ప్రజలను కలిసి ఆ తర్వాత కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే శనివారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన అధికారులతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాలు ఖరారైనా తర్వాత పరిస్థితిని బట్టి మరికొన్ని కార్యక్రమాలు పొందుపరచనున్నట్లు వైఎస్ అవినాష్‌రెడ్డి సాక్షి ప్రతినిధికి వివరించారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో పులివెందులకు వచ్చిన ప్రతి సందర్భంలో నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూనే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు. అనంతరం వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత కూడా పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో పులివెందులకు వస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం గతనెల 22వ తేదీన ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే అధికారికంగా శాసనసభలో స్పీకర్ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనడంలో భాగంగా వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి పులివెందులకు రానున్నారు. నేడు కడపకు వైఎస్ జగన్ కడప కార్పొరేషన్ : వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురువారం కడపకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం బద్వేలులో పర్యటన ముగించుకొని మధ్యాహ్నానికి కడపకు చేరుకుంటారన్నారు. కడపలో సెంట్రల్ జైలు వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొని 3.30గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. -
ప్రజా సమస్యలను పరిష్కరిస్తా
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పలువురు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. దీనికి స్పందించిన ఎంపీ వెంటనే పరిష్కారమయ్యే వాటికి అధికారులకు ఫోన్‌చేసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అధికారం రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని.. భవిష్యత్ తమదేనని భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నందున అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని దీటుగా ఎదుర్కొవాలన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని వారికి సూచించారు. అలాగే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలోపేతం చేయాలన్నారు. -
నువ్వెంత.. నువ్వెంత
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: ఏయ్ నువ్వెంత.. నువ్వెంత అంటూ దూషించుకున్నారు... పార్టీ తరపున టికెట్టు పొంది ప్రచారానికి రాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి కూర్చోవడానికి సిగ్గుగా లేదని ఒకరంటే... ఏయ్ ఏమనుకుంటున్నావ్... నీలాంటోళ్లను చాలా మందిని చూశా..నాకేంది నువ్వు చెప్పేది అంటూ మరొకరు వాగ్వాదం చేసుకున్నారు. శనివారం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటమికి దారితీసిన కారణాలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న వ్యాఖ్యానాలు ఇవి. పులివెందుల అసెంబ్లీకి పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయకపోవడం వల్లే కేడర్ దెబ్బతిందన్నారు. దీనిపై డీసీసీ ఉపాధ్యక్షుడు వేలూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ వేసి ప్రచారం కూడా చేయకపోతే ఎలా ఓట్లు వస్తాయన్నారు. ప్రచారానికి రావాలని బతిమలాడాల్సివచ్చిందన్నారు. దీంతో ఇరువురూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగారు. అదే సందర్భంలో ఏపీసీసీ మహిళా సభ్యురాలు చిక్కెరూరు జానకీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ బఫేలాగా మారిందని అన్నారు. ఆమె మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని ఇలా తులనాడుతారా అంటూ మైదుకూరుకు చెందిన ఇంతియాజ్భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక మహిళా నాయకురాలు మాట్లాడుతుంటే పెడార్థాలు తీస్తూ మాట్లాడటం తగదని చిక్కెరూరు జానకి ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు అభ్యర్ధి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విభజనకు దారితీసిన కారణాలు చెప్పడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంద న్నారు. జిల్లా ఇన్చార్జ్ అధ్యక్షుడు ఎస్. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీకి కేడర్ ఉందన్నారు. పార్టీలో ఉండి ఇతర పార్టీల్లోకి పోయిన నేతలు కాంగ్రెస్‌పార్టీ పని అయిపోయిందని లేనిపోని అపోహలు, భయాలు కలిగించడంవల్లే కొంత కేడర్ వివిధ పార్టీల్లో చేరిందని అన్నారు. ఇప్పుడున్న కేడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో చర్చించిన విషయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోతామన్నారు. డుమ్మా కొట్టిన మాజీ మంత్రులు..... సమావేశానికి మాజీ మంత్రులు అహ్మదుల్లా, రామచంద్రయ్య డుమ్మా కొట్టడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. కీలక సమావేశానికి రాకపోవడం ఏమీ బాగోలేదని కార్యకర్తలు గుసగుసలాడుకోవడం కనిపించింది. సమావేశానికి వస్తే ఎక్కడ నిలదీస్తారోనని రాలేదని చర్చించుకున్నారు. మాజీ మంత్రి రామమునిరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు బండి జకరయ్య, ఏపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ దాసరి శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జోజప్ప, డీసీసీ ప్రధాన కార్యదర్శి నజీర్భాష, పార్టీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, ప్రొద్దుటూరు, కమాపురం, బద్వేలు అభ్యర్థులు జి శ్రీనివాసులు, సోమశేఖరరెడ్డి, కమల్ప్రభాష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
ఘన నివాళి
పులివెందుల, న్యూస్‌లైన్: పులివెందులలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాల రహదారిలో ఉన్న సమాధి ఘాట్ ప్రాంతంలో పలువురు వైఎస్ఆర్ అభిమానులు, స్థానికులు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిలు ఉదయాన్నే వచ్చి వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీఎల్పీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా సమాధి ఘాట్‌కు చేరుకొని తాత వైఎస్ రాజారెడ్డి, అవ్వ వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడంతోపాటు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు ఈసీ గంగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు వచ్చి వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సమాధి ఘాట్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పలకరించారు. పార్కులో వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళి : పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి సమాధి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా లయోలా డిగ్రీ కళాశాల రోడ్డు సమీపంలో ఉన్న రాజారెడ్డి పార్కుకు చేరుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు వెళ్లారు. పార్కులో వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద పూలమాలలువేసి నివాళులర్పించడంతోపాటు కొవ్వొత్తులను వెలిగించి నమస్కరించారు. వైఎస్ఆర్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రార్థనలు.. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్ఆర్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం ప్రారంభమైంది. సీఎస్ఐ చర్చి ఫాస్టర్ ఐజాక్ వరప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్సీపీఎల్పీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, సతీమణి ఈసీ సుగుణమ్మ, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, విమలమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన సతీ మణి సమతారెడ్డి, సోదరి శ్వేతారెడ్డి, మా జీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్షుమ్మ తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో తదితరులు పాల్గొన్నారు. -
రుణపడి ఉంటా
పులివెందుల, న్యూస్‌లైన్ : సుమారు 75వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించిన పులివెందుల ఓటర్లకు వందనం.. రాష్ట్రస్థాయిలో రికార్డు మెజార్టీతో మరోమారు పులివెందుల పేరును చరిత్రలో నిలిపినందుకు ధన్యవాదాలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ సీఎల్పీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి పులివెందులలోని బాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. పులివెందుల ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉద్వేగభరితంగా అన్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల ప్రజలు అండగా ఉంటున్నార న్నారు. ఉదయం నుంచి తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. కొందరిని పేర్లతో పిలుస్తూ.. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డిలతో వైఎస్ జగన్ చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు : పులివెందులలోని స్వగృహంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షనేత వైఎస్ జగన్‌ను పలువురు ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికాార్జునరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, తదితరులు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల సమస్యలతోపాటు పార్టీకి సంబంధించిన అంశాలపై వారు చర్చించుకున్నారు. కమలాపురం నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డిలు వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. అభినందనలు తెలిపిన స్థానికులు : క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందులకు చెందిన కార్యకర్తలు, నాయకులు, స్థానికులు వచ్చి అభినందనలు తెలియజేశారు. సుమారు 75వేలపైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో అభినందనలతో ముంచెత్తారు. పులివెందులోని దినేష్ మెడికల్ సెంటర్లో స్పెషలిస్ట్ డాక్టర్లుగా పనిచేస్తున్న రణధీర్‌రెడ్డి, జ్యోతి, సూపర్వైజర్ కనకరత్నమ్మ, ఆనంద్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌కు పుష్ప గుచ్చాలతోపాటు పూల బొకేలను అందించి అభినందనలు తెలియజేశారు. మండలాల నాయకులతో మాటామంతి : ఈ మధ్యనే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియటంతో ఏడు మండలాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీపీలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు పులివెందుల మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు వైఎస్ జగన్‌ను కలిశారు. సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, వేముల, పులివెందుల, లింగాల మండలాల కన్వీనర్లు, పరిశీలకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, వేల్పుల రాము, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, బలరామిరెడ్డి, సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి తదితరులు వచ్చి వైఎస్ జగన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై వారు మాట్లాడుకున్నారు. పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు వరప్రసాద్, చిన్నప్ప, కోడి రమణ, నూరుల్లా, సాతుపాటి వెంకటపతి, రామ లలిత, హేమలత, అ రుణకుమారి, కోళ్ల భాస్కర్, రామనాథ్ తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడారు. చర్చిలో వివాహానికి హాజరైన వైఎస్ జగన్ : పులివెందులలోని నగరిగుట్టకు చెందిన దేవదానం(దానమయ్య) వివాహ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో వివాహం జరుగుతున్న నేపథ్యంలో ఇడుపులపాయ నుంచి గురువారం మధ్యాహ్నం నేరుగా చర్చికి చేరుకుని నూతన వధూవరులు దేవదానం, కెజియాలను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీ వించారు. అనంతరం చర్చి బయట వైఎస్ జగన్‌తో కరచాలనం చేసేందుకు జనాలు ఆరాటపడ్డారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా పులివెందుల అర్బన్, రూర ల్ సీఐలు భాస్కర్, మహేశ్వరరెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భారీగా వచ్చిన జనం : వైఎస్ జగన్‌ను కలిసేందుకు గురువారం వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలి వచ్చిన జనాలతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. అభిమాన నేతను కలుసుకునేందుకు తరలి వచ్చిన జనాలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. -
జగన్ సారథ్యంలో అనునిత్యం పోరాటం
-
కీలక ఘట్టానికి వేదిక...ఇడుపులపాయ
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కీలక రాజకీయ ఘట్టానికి ఇడుపులపాయ మరోమారు వేదిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వీరంతా వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకోనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ సమీపంలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధుల భేటీ జరుగుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 66మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలతో పాటు తెలంగాణకు చెందిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకు ముందు వైఎస్ ఘాట్ వద్ద మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో 67మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా పోలింగ్ కంటే ముందే రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని ముందుగా రాజమండ్రిలో నిర్వహించాలని భావించినా గెలుపొందిన ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు ఇడుపులపాయలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.శాసనసభా పక్ష నేత ఎన్నికతోపాటు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు కూడా వీలుంటుందని వారు భావించటంతో ఇడుపులపాయకు ఈ కార్యక్రమాన్ని మార్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ శాసనసభా పక్షనేత ఎన్నికతో పాటు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహం, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమాచారం. -
మహానేతకు జగన్, విజయమ్మ నివాళులు
-
మహానేతకు జగన్, విజయమ్మ నివాళులు
ఇడుపులపాయ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద అంజలి ఘటించారు. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి బుధవారం సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఏర్పాటు, ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో గట్టి ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలవాలన్నదే సమావేశం ప్రధాన ఎజెండాగా నిర్ణయించారు. సభలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత గట్టిగా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలన్న ఆలోచనలో పార్టీ నేతలున్నారు. -
ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ జగన్, విజయమ్మ
-
ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ జగన్, విజయమ్మ
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఇడుపులపాయ చేరుకున్నారు. వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి నేడు సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. మరోవైపు వైఎస్ జగన్ బుధవారమంతా ఇడుపులపాయలోనే గడపనున్నారు. గురువారం పులివెందులలో తనను కలిసిన ప్రజలతో మమేకం కానున్నారు. 23న పులివెందులలో వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్నారు. -
నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
పులివెందుల/వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తెల్లవారు జామున ఇడుపులపాయకు రానున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షనేతను సమావేశంలో ఎన్నుకోనున్నారు. అనంతరం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. 23న తాత వర్ధంతి వేడుకల్లో వైఎస్ జగన్ : పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారమంతా ఇడుపులపాయలోనే గడపనున్నారు. గురువారం పులివెందులలో తనను కలిసిన ప్రజలతో మమేకం కానున్నారు. 23న పులివెందులలో వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇడుపులపాయలో ఏర్పాట్లు : ఇడుపులపాయలో వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షనేతను ఎన్నుకొనేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇడుపులపాయలోని బయట ఉన్న గెస్ట్‌హౌస్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి తాగునీరు, షామియానాలు తదితర ఏర్పాట్లను చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు బుధవారం రానున్న నేపథ్యంలో ఇబ్బందికలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పులివెందుల.. చదువుల కోవెల
పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంతంలో గ్రామీణ విద్య అంతంత మాత్రమే ఉండగా.. ప్రభుత్వానికి సంబంధించిన కళాశాలలు పెద్దగా లేని పరిస్థితి. పైగా గతంలో ప్రభుత్వాలు వైఎస్ఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై వివక్ష చూపుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక పులివెందుల స్వరూపమే మారిపోయిందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్యను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2006లో ఇంజినీరింగ్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.100కోట్లతో.. 185ఎకరాల్లో... పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో దాదాపు 185ఎకరాల విస్తీర్ణంలో రూ.100కోట్ల వ్యయంతో 5 అకడమిక్ బ్లాక్‌లు, ఒక అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ, స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్‌హౌస్, బాల, బాలికల హాస్టళ్లను నిర్మించారు. కళాశాల ఏర్పడిన అనతి కాలంలోనే అనంతపురం జేఎన్టీయూ పరిధితోపాటు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కళాశాలలో ప్రస్తుతం బీటెక్, ఎంటెక్‌లలో ట్రిపుల్ఈ, సీఎస్, మెకానికల్, సివిల్, బయో టెక్నాలజీ, ఈసీఈ కోర్సులలో దాదాపు 1650మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల కాలంలోనే కళాశాలకు స్వయంప్రతిపత్తిని జెఎన్టీయూ అనంతపురం అధికారులు ఇచ్చారు. కళాశాలలో వసతులకు టెక్విప్ నిధులు : జేఎన్టీయూ కళాశాలలో మౌలిక సదుపాయాల కోసం 2012-13లో టెక్విప్ కింద రూ.10కోట్ల నిధులు విడుదలయ్యాయి. కళాశాలలో ఇంటర్నెట్, సోలార్ లైట్లు, డిజిటల్ లైబ్రరీ, ఈ క్లాస్ తరగతులకు సంబంధించి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతోపాటు అధ్యాపకులకు ఎప్పటికప్పుడు తర్ఫీ దు ఇచ్చేలా ఐఐటీ ప్రొఫెసర్లచే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా 2013 డిసెంబర్లో కేంద్రమానవ వనరుల మంత్రిత్వ శాఖ క్యూట్రిపుల్ఈ కింద కళాశాలను ఎంపిక చేశారు. దీంతో కళాశాలలో ఆన్లైన్ ద్వారా ఢిల్లీ, చెన్నైలకు చెందిన ఐఐటీ సీనియర్ ప్రొఫెసర్లచే విద్యా బోధన చేస్తున్నారు. ఈ ఘనత వైఎస్ఆర్దే పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జేఎన్టీయూ కళాశాలను పులివెందులకు తీసుకొచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. రాజకీయాల్లో ఉన్ననాళ్లూ ప్రజల కష్టసుఖాల గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ పులివెందుల ప్రజల రుణం తీర్చుకోవడంలో భాగంగా జేఎన్టీయూ నెలకొల్పారు. - దేవిరెడ్డి కృష్ణారెడ్డి (స్థానికుడు), పులివెందుల సౌకర్యాలు భేష్ పులివెందులలోని జేఎన్టీయూ కళాశాలలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నా యి. ఇక్కడ వాతావరణంతోపాటు విద్యార్థులు చదువుకోవడానికి అనువైన సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సాధించుకున్నారు. - అనూష (జేఎన్టీయూ విద్యార్థిని), పులివెందుల -
చకచకా ఏర్పాట్లు
పులివెందుల/వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 2వ తేదీన ఇడుపులపాయలో నిర్వహించే రెండవ ప్లీనరీకి(ప్రజాప్రస్థానం) ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇడుపులపాయలో ఒకటవ తేదీన సీజీసీ సమావేశం, అధ్యక్ష పదవికి షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 2వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. వీరితోపాటు చక్రాయపేట వైఎస్ఆర్ సీపీ మండల ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే ఉన్న జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఏర్పాట్లపై ఆరా తీశారు. భోజన వసతి, పార్కింగ్, స్టేజీ నిర్మాణం తదితర వాటిపై సమగ్రంగా చర్చించారు. నేడు వైఎస్ జగన్ రాక : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఇడుపులపాయకు రానున్నారు. నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర ముగిసిన వెంటనే ప్రజాప్రస్థానం ప్లీనరీలో పాల్గొనడానికి వస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా శనివారం ఉదయాన్నే ఇడుపులపాయకు చేరుకోనున్నారు. నాయకులతో సమావేశం : పులివెందుల నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో పులివెందుల వైఎస్ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్లీనరీ కార్యక్రమంపై శుక్రవారం సమావేశమయ్యారు. పాసుల జారీ, భోజన వసతి, ఇక్కడికి వచ్చే నాయకుల సంఖ్య తదితర వాటిపై చర్చించారు. నేడు ఎమ్మెల్యే విజయమ్మ రాక వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శనివారం పులివెందులకు రానున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందులకు చేరుకుంటారు. శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో పులివెందులలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులకు సంబంధించిన భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు.అనంతరం ఇడుపులపాయకు వెళతారు. ప్లీనరీని జయప్రదం చేయండి ఇడుపులపాయలో ఈనెల 2వ తేదీన నిర్వహించనున్న వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ ప్లీనరీని జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సమావేశాలకు పార్టీలో 27 రకాల హోదాలున్న వారిని ప్రతినిధులుగా ఆహ్వానించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9వేల మంది ప్లీనరీలో పాల్గొననున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన నాయకులంతా తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. -
పీబీసీ రైతులను ఆదుకోండి
పులివెందుల, న్యూస్‌లైన్: పులివెందుల బ్రాంచ్ కాలువ ఆయకట్టు రైతులకు నీరందించి ఆదుకోవాలని.. మూడు, నాలుగేళ్లుగా నీరు రాక.. ఆయకట్టు పరిధిలో చీనీచెట్లు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అనంతపురం కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన విభాగపు నాయకులు, పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయకట్టుదారుల సంఘం నాయకులు చప్పిడి రమణారెడ్డిలతోపాటు పలువురు రైతులు శనివారం సాయంత్రం అనంతపురం కలెక్టర్‌కు అందజేశారు. లేఖలోని సారాంశం.. పీబీసీ ఆయకట్టు స్థిరీకరణ కోసం చిత్రావతి బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని.. పులి వెందుల తాగునీటి అవసరాలతోపాటు అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల తాగునీటిని అందించేందుకు 2.83టీఎంసీల నీరు వినియోగమయ్యే పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి నీటిని డ్యాం నుంచి తరలిస్తున్నారని పేర్కొన్నారు. సీబీఆర్ ప్రాజెక్టు నుంచి 75శాతం అనంతపురం జిల్లా నీటి పథకాలే ఉన్నాయని లేఖలో విజయమ్మ గుర్తు చేశారు. ఐఏబీ కేటాయింపులు బాగానే ఉన్నా..పారదర్శకంగా అమలు చేయడంతో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారని అం దులో పేర్కొన్నారు. దీంతో పీబీసీ కాలువ పరిధిలోని ఆయకట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఐఏబీలో పీబీసీకి నీటిని కేటాయిస్తున్నా.. పీబీసీ ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరి స్థితి నెలకొందని.. మూడేళ్లుగా వస్తున్న అరకొర నీటితో చివరకు పులివెందులకు తాగునీటికి కూడా అందించలేకపోయిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. దీనికి ప్రధాన కారణం సీబీఆర్‌లో ఉన్న తాగునీటి అవసరాలు 2.83 టీఎంసీలయితే.. అధికారికంగా 2టీఎంసీలే ఇవ్వ గా.. 0.83టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు లోటుగా భావించాలి. ఇదంతకూడా ఐఏబీలో అవగాహనారాహిత్యంగా జరుగుతున్న తతంగమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ పెన్నార్ నుంచి తుం పెర వరకు నీరు ప్రవహించే సమయంలో 15శాతం నీటిని.. అలాగే తుంపెర నుంచి సీబీఆర్కి చేరే సమయంలో జరిగే నీటి నష్టాన్ని 20శాతం లాసెస్ కింద నష్టం జరుగుతోందని అధికారులు రికార్డులలో చూపిస్తున్నారని.. ఈ లెక్కన 2టీఎంసీల నీటిలో 35శాతం లాసెస్ కింద పోగా.. సీబీఆర్‌కు 1.40 టీఎంసీల నీరు చేరుతోందని విజయమ్మ పేర్కొన్నారు. మరోవైపు పీబీసీ రైతులకు చుక్కనీరు అందక.. బోర్లల్లో భూగర్భజలాలు అడుగంటి పులివెందుల ప్రాంత రైతులు చీనీ చెట్లను నరికివేసుకున్నారని వివరించారు. ఈ ఏడాది ఐఏబీ సమావేశంలో కేటాయింపుల అమలు తీరు మీకు వివరించాలనుకున్నామని.. ఈ ఏడాది ఐఏబీలో సీబీ ఆర్‌లోని తాగునీటికి 2 టీఎంసీలను.. పీబీసీ సేద్యపు నీటి అవసరాలకు 1.23టీఎంసీల నీటిని కేటాయించారు. తొలి విడత కింద తాగునీటి కోటాను సీబీఆర్‌కు ఆగస్ట్‌లో ఇచ్చారన్నారు. హెచ్ఎల్సీ అధికారుల లెక్కల ప్రకారం 2.33టీఎంసీలు ఇచ్చినట్లు వారు నివేదికలో చూపించారని.. వాస్తవానికి సీబీ ఆర్కు చేరింది ఒక టీఎంసీ నీరు మాత్రమేనని.. ప్రస్తు తం పీబీసీకి కేటాయించిన సేద్యపు నీటి కోటా కింద 1.23టీఎంసీల నీరు ఇస్తున్నారని.. ప్రస్తుతం తుంపెర వద్ద ఇస్తున్న రీడింగ్ ఇదే విధంగా అమలు చేస్తే ఈనెల 10వ తేదీకి సేద్యపు నీటి కోటా ముగుస్తుందని అధికారు లు చెబుతున్నారని వివరించారు. ఒకవేళ అధికారుల లెక్కల ప్రకారమే ఇస్తున్నారనుకున్నా.. తుంగభద్ర డ్యా ం నుంచి హెచ్ఎల్సీకి అదనంగా కేటాయించిన 2టీఎం సీలలో దామాషా కింద పీబీసీకి 12.62శాతం రావాలి. అంటే సుమారు 0.25టీఎంసీల నీరు పీబీసీకి రావాల్సి ఉంది కదా అని ఆమె ప్రశ్నించారు. మీరు పీబీసీ రైతాంగ దీన స్థితిని అర్థం చేసుకొని ఈనెల చివరకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే విజయమ్మ లేఖలో కోరారు. -
అన్నదాతలంటే అంత అలుసా..?
కడప రూరల్, న్యూస్‌లైన్: బీమా ప్రీమియం చెల్లించే విషయంలో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మీ సేవ, వ్యవసాయ అధికారుల నిర్వాకాన్ని నిరసిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.రబీ సీజన్లో జిల్లాలో బుడ్డశనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి, అరటి, జొన్న పంటలను రైతులు సాగుచేశారు. ఆయా పంటలకు బీమా ప్రీమియం చెల్లించుకోవడానికి జాతీయ వ్యవసాయ బీమా సంస్థ (ఎన్ఎఐసీ) ప్రకటన జారీ చేసింది. అయితే గడువు దాటింది. దీంతో చాలామంది రైతులు బీమా ప్రీమియంచెల్లించలేకపోయారు. ఈ తరుణంలో గడిచిన 31వ తేదీ ఆఖరు కావడంతో పెండ్లిమర్రి, కమలాపురం, వీరపునాయునిపల్లె, వేంపల్లె, పులివెందుల తదితర ప్రాంతాలకు చెందిన రైతులు బీమా ప్రీమియం చెల్లించడానికి మంగళవారం కడప కలెక్టరేట్ ప్రక్కనున్న మీసేవ కేంద్రానికి వచ్చారు. అక్కడ సాంకేతిక కారణాల వలన మీసేవ సిబ్బంది బీమా ప్రీమియంను స్వీకరించలేకపోయారు. దీంతో రైతులు ఆందోళన చెందారు. అయితే వ్యవసాయ శాఖ, మీసేవ సిబ్బంది రైతులకు టోకన్లు ఇచ్చి మరుసటి రోజు బీమా ప్రీమియంను స్వీకరిస్తామని తెలిపారు. ఆ మేరకు రైతులు వారి వారి ఊర్లకు వెళ్లి మరుసటి రోజు బుధవారం మీసేవ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ మీసేవను మూసి ఉంచడం చూసి ఆగ్రహించారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన అన్నదాతలు శ్రీరంజన్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, గంగాధర్, మాధవరెడ్డి మాట్లాడుతూ గతనెల 24వ తేదీన ప్రకటన జారీచేసి 31వ తేదీకి ప్రీమియం గడువు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం వ్యవసాయ శాఖ జేడీ జయచంద్ర రావడంతో ఆయనతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో పై అధికారులతో మాట్లాడి గురువారం మీసేవలో చెల్లింపులకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు. -
జలచౌర్యం
పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంతానికి ప్రధాన జీవనాధారమైన పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) నీటితో అక్రమార్కుల పంట పండుతోంది. ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీటిని అక్రమంగా మళ్లించుకుంటున్నా.. ఇదేమని అడిగే అధికారులు లేకపోవడంతో కాలువ వెంబడి అక్రమ మోటార్లు వెలుస్తున్నాయి. హైలెవెల్ కెనాల్(హెచ్ఎల్సీ) పరిధిలో సుమారు 23కుపైగా చిన్న, చిన్న డిస్ట్రిబ్యూటరీ గేట్లు ఉండటంతో వాటిని ఎత్తి పంటలకు.. చెరువులకు నీటిని మళ్లించుకుంటున్నారు. కాలువ వెంబడి ఎక్కడ చూసినా అక్రమ ఆయకట్టుతో పంటలు కళకళలాడుతుండగా.. పీబీసీ ఆయకట్టు భూములు నీరులేక వెలవెలబోతున్నాయి. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి అనంతపురం జిల్లాలోని 5వేల ఎకరాల ఆయకట్టు కలుపుకుని పులివెందుల నియోజకవర్గంలో 55వేల ఎకరాలతో కలిసి సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏనాడూ పూర్తి ఆయకట్టుకు నీరు అందిన దాఖలాలు చరిత్రలో లేవు. కాలువ వెంబడి మోటార్లతో జలదోపిడి కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఆంధ్రా కోటా కింద నీరు విడుదల చేస్తే హెచ్ఎల్సీ ద్వారా పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు రావాలంటే పెన్నా ఆహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మిడ్ పెన్నార్ రిజర్వాయర్ వద్దకు నీరు వచ్చిన తర్వాత అక్కడ కేటాయింపుల ప్రకారం నీటిని విడుదల చేస్తారు. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి పెనకచర్ల, దుగ్గుపల్లె మీదుగా దాదాపు 72కి.మీ మేర తుంపెర వరకు నీరు రావాల్సి ఉంది. ఈ మధ్యలో సుమారు 23కుపైగా డిస్ట్రిబ్యూటరీ గేట్లు ఉన్న నేపథ్యంలో.. ఎప్పుడుపడితే అప్పుడు రైతులు ఎత్తేస్తున్నారు. దీంతో తుంపెర వద్ద నీటి ప్రవాహం తగ్గుతోంది. రీడింగ్‌లో ఇది స్పష్టమవుతోంది. ఇప్పటికే హెచ్ఎల్సీ అధికారులు లాసెస్ కింద 15శాతం కోత పెట్టి నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో కాలువల్లో నీరు చౌర్యానికి గురవుతుండటం రైతును కుంగదీస్తోంది. అంతటితో ఆగక మిడ్ పెన్నార్ తుంపెర వద్ద సుమారు 72కి.మీ మేర ఉన్న కాలువల్లోకి సుమారు 400కుపైగా మోటార్లు వేసి నీటిని అక్రమంగా తోడుకుంటున్నా.. ఇదేమని అడిగేవారు లేకపోవడం, అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పులివెందులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తుంపెర నుంచి సీబీఆర్ వరకు 150నుంచి 200 అక్రమ మోటార్లు తుంపెర నుంచి సీబీఆర్‌కు వచ్చే నీటికి సంబంధించి అధికారులు తుంపెర వద్ద రీడింగ్ తీసి కేటాయింపులు చేస్తున్నారు. తుంపెర, సీబీఆర్ మధ్య సుమారు 25కి.మీ మేర పీబీసీ కాలువ ఉంది. తుంపెర నుంచి గంగనపల్లె, రామాపురం, కునుకుంట్ల, ముచ్చుగుంటపల్లె, పాలెం, చిన్నకొండాయపల్లె, పెద్దకోట్ల తదితర గ్రామాల వద్ద ఎక్కడ చూసినా అక్రమ ఇంజన్లు, మోటార్లు, పైపులే దర్శనమిస్తున్నాయి. పైగా పీబీసీ నీటితో సాగు చేస్తున్న పంటలు కళకళలాడుతున్నాయి. కాలువ వెంబడి ఏదో అరుతడి పంటలు కాదు.. వరి పంటను దర్జాగా సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి, నార్పల, యల్లనూరు మండలాల్లోని కొన్ని గ్రామాలకు చెందిన రైతులు యథేచ్చగా నీటిని తోడేస్తున్నారు. ఒకటికాదు.. రెండు కాదు ఇక్కడ కూడా 150నుంచి 200మేర అక్రమ మోటార్లు ఉన్నట్లు పీబీసీ అధికారులకు తెలిసినా.. తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. పీబీసీ వెంబడి పోలీసు పహారా అవసరం : పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి మొదటి విడతగా ఆగస్ట్ 16వ తేదీనుంచి నీటిని విడుదల చేశారు. రెండవ విడతగా డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేశారు. మొదట్లో నీరు 100క్యూసెక్కులనుంచి ప్రారంభమై ఇప్పుడు 470నుంచి 500క్యూసెక్కుల వరకు విడుదలవుతున్నాయి. తుంపెర నుంచి అక్రమంగా నీరు పోకుండా ఉండాలంటే పోలీసు పహారా అవసరమని ఆయకట్టు సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నీరు విడుదల చేసినన్ని రోజులు ప్రత్యేకంగా ఒక పోలీసు మొబైల్ టీంను పెట్టి అక్రమంగా నీటిని తరలించకుండా చూస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. గడువు దాటినా టీబీసీకి నీరు.. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ)కు సంబంధించి గడువు దాటినా నీటిని మాత్రం అధికారులు విడుదల చేస్తూనే ఉన్నారు. కేటాయించిన నీటి కంటే ఎక్కువగానే అందించినట్లు తెలుస్తోంది. టీబీసీకి సంబంధించి సింగనమల చెరువుతోపాటు తాడిపత్రి పరిధిలోని పలు చెరువులకు, ఆయకట్టు రైతులకు నీరు అందుతున్న నేపథ్యంలో ఒక మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి నీటిని విడుదల చేయిస్తున్నారు. ప్రస్తుతం కూడా 50క్యూసెక్కుల చొప్పున జనవరి 10వ తేదీవరకు నీటిని విడుదల చేయనున్నారు. పుట్లూరు మండలానికి చెందిన కొంతమంది రైతులు కూడా రెండు రోజులక్రితం తుంపెర వద్ద ఉన్న పీబీసీకి చెందిన కొంతమంది వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లతో గేట్లు ఎత్తి టీబీసీకి ఎక్కువ నీటిని విడుదల చేయాలని డిమాండు చేసినట్లు కూడా తెలియవచ్చింది. అక్రమ నీటిని అరికట్టండి పీబీసీకి వస్తున్న నీటిని అక్రమంగా వాడుకోకుండా చర్యలు చేపట్టాలి. పులివెందుల రైతుకు సంబంధించి అన్నో.. ఇన్నో వస్తున్న నీటిని ఇతరులు మోటార్లు, పంపుల ద్వారా తీసుకెళితే.. మా పరిస్థితి ఏమిటి.. అక్రమ మోటార్లను తొలగించి పులివెందుల రైతుకు పీబీసీ నీటిని విడుదల చేయాలి. - చప్పిడి రమణారెడ్డి, ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడు అక్రమ కనెక్షన్లు నిజమే పీబీసీ నీటిని అక్రమంగా వాడుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. అక్కడక్కడ అక్రమ కనెక్షన్లు ఉన్న మాట వాస్తవమే.. అక్రమ కనెక్షన్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం.. ఈ మధ్యనే 30నుంచి 40 కనెక్షన్లు తొలగించాం. త్వరలోనే మిగతా వాటిని తొలగిస్తాం. - రాజశేఖర్,పీబీసీ ఈఈ, పులివెందుల -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
చక్రాయపేట, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. చక్రాయపేట పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. పోలీసు క్వార్టర్స్‌తో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులను చూశారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. చక్రాయపేట స్టేషన్లో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. కొండవాండ్లపల్లెకు చెందిన మహేష్‌పై జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపీరు. అనంతరం మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా గుర్తింపు పొందిన గండి కొవ్వూరును సందర్శించారు. పులివెందుల డీఎస్పీ హరినాథ్‌బాబు, లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ సునీల్ కుమార్ ఆయన వెంట ఉన్నారు. -
పుల్లారెడ్డి, సరస్వతి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
పులివెందుల/రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కచేరి రోడ్డులోని ఆర్యవైశ్య సంఘం నాయకుడు మిట్టా విశ్వనాథం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే విశ్వనాథం తల్లి సరస్వతి మృతి చెందిన నేపథ్యంలో జగన్ వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఈ మధ్యనే అనారోగ్యంతో మృతి చెందిన చిన్నరంగాపురం మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్‌ను చూడగానే రోదిస్తున్న మృతుని భార్య పద్మావతి, కుమార్తెలు గౌరి, తులసి, బుజ్జి ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుమునుపు పుల్లారెడ్డితోపాటు దివంగత సీఎం వైఎస్ఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుల్లారెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. తర్వాత బాకరాపురంలో ఇటీవలే వివాహమైన అంబకపల్లె మల్లికార్జునరెడ్డి కుమార్తె అనుజ, రాకేష్‌రెడ్డి దంపతులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సీఎస్ఐ చర్చి నుంచి వైఎస్ జగన్ బయటకు వచ్చిన తర్వాత చిన్నరంగాపురం, బాకరాపురం కాలనీల్లో ప్రజలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పలువురు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు అందరి సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. కిటకిటలాడిన క్యాంపు కార్యాలయం : పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం బుధవారం కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కిటకిటలాడింది. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి ఉండి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌ను కలిశారు. వైఎస్ జగన్‌ను అభినందించిన కడప న్యాయవాదుల జేఏసీ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఊపిరిగా భావించి రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌రెడ్డిని కడప బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు తరలి వచ్చి కలిశారు. -
సుఖ శాంతులు వెల్లివిరియాలి
పులివెందుల, న్యూస్‌లైన్: ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో శాంతి సౌఖ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి తదితరులు కూడా ప్రసంగించారు. సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు : క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం వైఎస్ కుటుంబ సభ్యులు సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి, సతీమణి భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష,వర్ష, వైఎస్ జగన్ తల్లి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ మేనేత్త కమలమ్మ, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, సతీమణి పద్మావతమ్మ, వైఎస్ మనోహర్‌రెడ్డి, సతీమణి ప్రమీలమ్మ, వైఎస్ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి కుమారులు వైఎస్ అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, జగన్ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మలతోపాటు పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, వైఎస్ వివేకా, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి తదితరులు క్రిస్మస్ కేక్‌ను చర్చిలో కట్ చేశారు. చర్చి ఫాస్టర్ ఐజాక్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. జీసెస్ చారిటీస్‌లో షర్మిల : పులివెందులలోని జీసెస్ చారిటీస్‌లో చిన్నారుల మధ్య షర్మిల, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలిలు క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో షర్మిల కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చాలాసేపు షర్మిల చిన్నారులతో గడిపారు. ఫాస్టర్ మృత్యుంజయ, జీసెస్ చారిటీస్ నిర్వాహకురాలు లిల్లీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు. -
అర్హులకు భూపంపిణీ
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ : నియోజకవర్గ వ్యాప్తంగా 7వ విడత భూ పంపిణీలోఅర్హులైన నిరుపేదలను గుర్తించి వారికే అందేటట్లు చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అధికారులను ఆదేశించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం 7వ విడత భూ పంపిణీపై అసైన్మెంటు కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు వైఎస్ఆర్ కూడా పేదలకు భూమి ఉంటే అభివృద్ధి చెందుతారని భావించారన్నారు. ప్రణాళికబద్ధంగా గ్రామాల్లో సర్వే చేపట్టి భూ పంపిణీ చేయాలన్నారు.అనంతరం ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు భూములు అందడంలేదన్నారు. ఆర్డీవో రఘునాథరెడ్డి మాట్లాడుతూ పులివెందులకు సంబంధించి 452 లబ్ధిదారులకు 823.39ఎకరాలు పంపిణీకి అర్హులుగా గుర్తించామన్నారు. అలాగే సింహాద్రిపురంలో 211మందికి 386.25ఎకరాలు, లింగాలకు చెందిన 286మందికి 561.21ఎకరాలు, తొండూరుకు సంబంధించి 838మందికి 1363.08, వేముల మండలానికి సంబంధించి 166మందికి 296.83, వేంపల్లె మండలానికి సంబంధించి 133మందికి 280.94 ఎకరాలు పంపిణీకి అర్హులన్నారు. కార్యక్రమంలో కడప ఆర్డీవో హరిత, టీడీపీ నాయకులు రాంగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్నాయకులు శివమోహన్‌రెడ్డి, అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
గోదామును సద్వినియోగం చేసుకోండి
పులివెందుల/లింగాల/వేంపల్లె, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంత రైతులే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల రైతులు వ్యవసాయ గోదామును సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. దొండ్లవాగు సమీపంలో ఏర్పాటు చేసిన రైతు గోదామును వైఎస్ జగన్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన విభాగం నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులనుద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేక లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే గోదాములు ఉంటే.. పంట పండిన తర్వాత మంచి ధర వచ్చేంతవరకు నిల్వ చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు. పులివెందులలో రైతుల సౌకర్యార్థం గోదాములు నిర్మించిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలను ఆయన అభినందించారు. గోదాము వద్దనే ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలతో కాసేపు : రైతు గోదాము ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన జిల్లాలోని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ,ఆకేపాటి అమరనాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రుక్మిణీదేవి, తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా చర్చించారు. రైతు గోదాము ప్రారంభం అనంతరం వైఎస్ జగన్‌రెడ్డికి పులివెందుల ఎస్బీఐ మేనేజర్ వెంకటసుబ్బయ్య పుస్తకాన్ని బహుకరించారు. ప్రముఖ ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శంకరణ్ రచించిన పుస్తకాన్ని ఆయన వైఎస్ జగన్‌కు అందించారు. వైఎస్ జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు వేంపల్లెకు చెందిన జగన్ సేవా సమితి అధ్యక్షుడు ఆర్.శ్రీను, యూత్ కన్వీనర్ వేణు, అలాగే కడప అసెంబ్లీ సమన్వయకర్త అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు డీసీ గోవిందరెడ్డి, కన్వీనర్లు బెల్లంప్రవీణ్కుమార్రెడ్డి, కల్లూరు చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొండయ్య, సర్పంచ్‌లు ఆర్ఎల్వి ప్రసాద్‌రెడ్డి, నారాయణ, డిష్ కొండయ్య, భారతి, ఝాన్సీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
ఆత్మీయ పలకరింపు
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ : పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు కుటుంబాలను పరామర్శించారు. అలాగే దారిపొడవునా బ్రహ్మరథం పట్టిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. స్థానిక జెండామాను వీధిలో నివాసముంటున్న కంచర్ల గంగాధరరెడ్డి సెప్టెంబర్ 7వ తేదీన గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మృతుడి భార్య లక్ష్మిదేవితోపాటు కుమార్తెను వైఎస్ జగన్ ఓదార్చారు. ముందుగా దివంగత సీఎం వైఎస్ఆర్, మృతుడు గంగాధరరెడ్డిల చిత్ర పటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్ రాజారెడ్డి వీధిలో నివాసముంటున్న సింహాద్రిపురం మండల వైఎస్ఆర్ సీపీ నాయకుడు కొమ్మా పరమేశ్వరరెడ్డి కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి తలసేమియా వ్యాధితో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో మృతి చెందారు. మంగళవారం రాత్రి పరమేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. సిటీ కేబుల్ సూరి ఇంటికి వైఎస్ జగన్ : వైఎస్ఆర్ సిటీ కేబుల్ నెట్వర్క్ ఎండీ సూర్యనారాయణ ఇంటికి మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఇటీవల వివాహం జరిగిన సూరి కుమార్తె భారతి, అల్లుడు అవినాష్‌లను ఆయన ఆశీర్వదించారు. బలిజ సంఘంలో కేక్ కట్.. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి బలిజ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. నూతన కార్యవర్గ సభ్యులు పరిచయం చేసుకొని అనంతరం వైఎస్ జగన్‌తో క్రిస్మస్ కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు శ్రీపతి చిన్నబాలుడు, ఉపాధ్యక్షుడు సోపాల వీరా, శ్రీనివాసులు, సంఘ పెద్దలు నక్కావెంకటసుబ్బయ్య తదితరులు మాట్లాడారు. పులివెందులలో వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
మావల్ల కాదు
పులివెందుల, న్యూస్‌లైన్ : అమృతహస్తం కార్యక్రమాన్ని అమలు చేయడం తమ వల్ల కాదని అంగ న్వాడీ కార్యకర్తలు చేతులెత్తేశారు. ఈ మేరకు 20 మంది అంగన్వాడీలు సీడీపీఓకు లేఖలు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులు, బాలింతలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని సోమవారం నుంచి ప్రొద్దుటూరు, పులివెందులలో అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడం తమ వల్ల సాధ్యం కాదంటూ కొంతమంది వర్కర్లు లేఖలు ఇచ్చారు. పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పులివెందుల అర్బన్, రూరల్, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లె మండలాల్లోని 249అంగన్వాడీ, 23మినీ అంగన్వాడీ కేంద్రాలలో ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రొద్దుటూరు రూరల్, అర్బన్ పరిధిలోని దాదాపు 356 అంగన్వాడీ కేంద్రాలలోఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాలలోని 2,165మంది గర్భిణులు, 4,131మంది బాలింతలకు ప్రతిరోజు(నెలకు24రోజులు) మధ్యాహ్న భోజనం, రోజూ 250మి.లీటర్ల పాలు, ఒక కోడి గుడ్డును అందించనున్నారు. ఈ పథకం ఆరంభం కాకముందే పులివెందులలో ఆయోమయం నెలకొంది. ఈ పథకాన్ని అమలు చేయలేమని కొంతమంది కార్యకర్తలు లేఖలు ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితులలోనూ పథకాన్ని ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సమాఖ్య(వీవో)లకు బిల్లులకు సంబంధించిన బాధ్యతలు పెట్టడంపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కష్టం మాకు.. బిల్లుల బాధ్యత వారికా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమకు ఇంతవరకు ఎలాంటి మెటీరియల్ రాలేదని.. ఏ విధంగా పథకాన్ని ప్రారంభించాలని కార్యకర్తలు పేర్కొంటున్నారు. తమకు వచ్చే జీతాలతో పెట్టుబడి పెట్టలేమని చెబుతున్నారు. గర్భిణులు బాలింతలకు సంబంధించిన పాలు, కూరగాయల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు లెక్కలు వీవోలకు చెప్పాల్సి వస్తుందన్న కారణంతో కొంతమంది వర్కర్లు ఈ పథకంపై నిరాసక్తత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీడీపీవో సావిత్రిదేవి వివరణ కోరగా. ఈ పథకాన్ని అమలు చేయలేమని దాదాపు 20మంది కార్యకర్తలు లేఖలు ఇచ్చిన మాట వాస్తవమేన న్నారు. అయితే అన్నిచోట్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. -
బస్సులు ఢీ
పులివెందుల/తొండూరు, న్యూస్‌లైన్ : పులివెందుల-జమ్మలమడుగు ప్రధాన రహదారిపై సైదాపురం-ఇనగలూరు మధ్యలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రొద్దుటూరు డిపో బస్సు, పులివెందుల డిపో బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సులలో ఉన్న సుమారు 42మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు భీతిల్లిపోయారు. ప్రొద్దుటూరు డ్రైవర్ దస్తగిరి పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు. 108 వాహనం దాదాపు 45నిమిషాల తర్వాత రావడంతో క్షతగాత్రులు అప్పటికే ఆటోలు, ఇతర వాహనాల్లో పులివెందుల ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులు వీరే ప్రొద్దుటూరు డిపో డ్రైవర్ దస్తగిరి, కండక్టర్ బేబీరాణి, పులివెందుల డిపో డ్రైవర్ వల్లి, కండక్టర్ రఘురాంతోపాటు మంజుల, కుళ్లాయప్ప, ఎస్.మాబుజాన్, షేక్ నజీమున్నీషా, శ్రీనివాసులు, డి.మాధవి, నారాయణరెడ్డి, ఆదాంవల్లి, చంద్రశేఖరుడు, ఖాదర్ బాషా, సూర్యనారాయణ, శంకర్ నాయక్, కృష్ణమ్మ, రామ్మూర్తి, శ్రీదేవి, లింగమూర్తి, వసంత, ప్రసాద్, గంగిరెడ్డి, ఈశ్వరయ్య, నాగేంద్రకుమార్ రెడ్డి, షాజహాన్, సుబ్బరాయుడు, రంగాచారి, వరదప్ప, చిన్నారి అభిలాష్, స్వర్ణకుమారి, వెంకటేష్, ఆదినారాయణ, ఎరికలరెడ్డి, వీరన్న, రామయ్య, కృష్ణ, ఎర్రంరెడ్డి, సాల్మన్ రాజు, నరసింహులు, అల్లా బకాష్, పెద్ద గంగమ్మ, బాల గంగమ్మ తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు. వీరిలో 10మందిని కడప, కర్నూలుతోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేశారు. హెడ్మాస్టర్లకు గాయాలు తొండూరులో సమావేశానికి వెళుతున్న అగడూరు పాఠశాల హెడ్మాస్టర్ చంద్రశేఖరుడు, సంతకొవ్వూరు హెడ్మాస్టర్ కృష్ణమ్మ, క్రిష్ణంగారిపల్లె హెడ్మాస్టర్ శంకర్ నాయక్, గోటూరు పాఠశాల హెడ్మాస్టర్ సూర్యనారాయణతోపాటు ఐటీఐ ప్రిన్సిపాల్ రామ్మూర్తి తదితరులు గాయపడ్డారు. క్షతగాత్రులను పరామర్శ పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్ సీపీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.