ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు.
చక్రాయపేట, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. చక్రాయపేట పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. పోలీసు క్వార్టర్స్‌తో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
రికార్డులను చూశారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. చక్రాయపేట స్టేషన్‌లో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. కొండవాండ్లపల్లెకు చెందిన మహేష్‌పై జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపీరు. అనంతరం మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా గుర్తింపు పొందిన గండి కొవ్వూరును సందర్శించారు. పులివెందుల డీఎస్పీ హరినాథ్‌బాబు, లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆయన వెంట ఉన్నారు.