హైదరాబాద్ : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. హైదరాబాద్ నగరం అంబర్‌పేట్లోని శంకర్ నగర్‌కు చెందిన పి. అశోక్ కుమార్(57) అనే వ్యక్తి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అశోక్ కుమార్‌కు సుమారు రూ.40 లక్షలు అప్పు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అంబర్ పేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.