పులివెందుల/తొండూరు, న్యూస్‌లైన్ : పులివెందుల-జమ్మలమడుగు ప్రధాన రహదారిపై సైదాపురం-ఇనగలూరు మధ్యలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రొద్దుటూరు డిపో బస్సు, పులివెందుల డిపో బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
రెండు బస్సులలో ఉన్న సుమారు 42మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు భీతిల్లిపోయారు. ప్రొద్దుటూరు డ్రైవర్ దస్తగిరి పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు. 108 వాహనం దాదాపు 45నిమిషాల తర్వాత రావడంతో క్షతగాత్రులు అప్పటికే ఆటోలు, ఇతర వాహనాల్లో పులివెందుల ఆసుపత్రికి చేరుకున్నారు.
క్షతగాత్రులు వీరే
ప్రొద్దుటూరు డిపో డ్రైవర్ దస్తగిరి, కండక్టర్ బేబీరాణి, పులివెందుల డిపో డ్రైవర్ వల్లి, కండక్టర్ రఘురాంతోపాటు మంజుల, కుళ్లాయప్ప, ఎస్.మాబుజాన్, షేక్ నజీమున్నీషా, శ్రీనివాసులు, డి.మాధవి, నారాయణరెడ్డి, ఆదాంవల్లి, చంద్రశేఖరుడు, ఖాదర్ బాషా, సూర్యనారాయణ, శంకర్ నాయక్, కృష్ణమ్మ, రామ్మూర్తి, శ్రీదేవి, లింగమూర్తి, వసంత, ప్రసాద్, గంగిరెడ్డి, ఈశ్వరయ్య, నాగేంద్రకుమార్ రెడ్డి, షాజహాన్, సుబ్బరాయుడు, రంగాచారి, వరదప్ప, చిన్నారి అభిలాష్, స్వర్ణకుమారి, వెంకటేష్, ఆదినారాయణ, ఎరికలరెడ్డి, వీరన్న, రామయ్య, కృష్ణ, ఎర్రంరెడ్డి, సాల్మన్ రాజు, నరసింహులు, అల్లా బకాష్, పెద్ద గంగమ్మ, బాల గంగమ్మ తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు. వీరిలో 10మందిని కడప, కర్నూలుతోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేశారు.
హెడ్మాస్టర్లకు గాయాలు
తొండూరులో సమావేశానికి వెళుతున్న అగడూరు పాఠశాల హెడ్మాస్టర్ చంద్రశేఖరుడు, సంతకొవ్వూరు హెడ్మాస్టర్ కృష్ణమ్మ, క్రిష్ణంగారిపల్లె హెడ్మాస్టర్ శంకర్ నాయక్, గోటూరు పాఠశాల హెడ్మాస్టర్ సూర్యనారాయణతోపాటు ఐటీఐ ప్రిన్సిపాల్ రామ్మూర్తి తదితరులు గాయపడ్డారు.
క్షతగాత్రులను పరామర్శ
పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్‌ఆర్ సీపీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
బస్సులు ఢీ
Published Thu, Nov 28 2013 3:07 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement