సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరారు. మధ్యాహ్నం జరగనున్న ఆయన మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం.గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, డీఐజీ వెంకటరామిరెడ్డి తదితర అధికారులు విమానాశ్రయంలో సీఎం జగన్‌ను కలిశారు. (చదవండి: సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి)
ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.
ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి నివాళర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment