EC gangi reddy
-
పేదల వైద్యుడు.. ఆదర్శనీయుడు ఈసీ గంగిరెడ్డి
పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల వైద్యుడిగా పేరు పొంది, ఎందరికో ఆదర్శనీయుడిగా నిలిచారు. ఆయన పులివెందులతోపాటు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20న ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6 నుంచి 8 వరకు పులివెందుల జెడ్పీ హైస్కూలు, 9 నుంచి 10వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో చదివారు. 10వ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఎంబీబీఎస్, పీడీ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. పులివెందులలోని శ్రీనివాస హాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా, ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. ఈ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందారు. మారుతున్న కాలాన్ని బట్టి భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి) స్థాపించి వైద్య సేవలు అందించారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు తపన పడేవారు. దినేష్ నర్సింగ్ హోం ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేశారు. రాజకీయ ప్రస్థానం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2001 నుంచి 2005 వరకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్రజలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. 2003 రబీ సీజన్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదని పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. నేడు ప్రత్యేక ప్రార్థనలు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తృతీయ వర్ధంతి వేడుకలు మంగళవారం పులివెందులలో ఘనంగా జరగనున్నాయి. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద మంగళవారం ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక భాకరాపురంలో గల దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
తండ్రికి నివాళులర్పించిన వైఎస్ భారతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. అంధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసిన గంగిరెడ్డి అభిమానులు.. దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ రాజారెడ్డి భవన్ వద్ద గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. చదవండి: ఖరీఫ్‌లో సిరుల పంట -
పేదల మనసు గెలిచిన డాక్టర్
సాక్షి, కడప: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తన సేవలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి చిరస్మరణీయులుగా నిలిచిపోయారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఆదివారం ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యమని ఎప్పుడూ వైఎస్సార్ చెప్పేవారన్నారు. అలాంటి వారు సమాజంలో ఒక గుర్తింపు కలిగి ఉంటారని, వారు ఈ లోకంలో లేకపోయినా వారు చేసిన పనులు, ప్రజలతో మెలిగిన తీరును కలకాలం ప్రజలు కీర్తిస్తూనే ఉంటారని వివరించారు. గంగిరెడ్డి అన్నలో తనకు.. క్రెడిబులిటీ, కమిట్మెంట్, కరేజ్, కేర్, కన్సర్న్ లక్షణాలు ప్రధానంగా కనిపించాయని, ఆయనలో ఇంకా అనేక మంచి గుణాలు ఉన్నాయని చెప్పారు. అందరికీ వారధి అన్న గంగిరెడ్డి, సుగుణమ్మ దంపతులిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వైఎస్ విజయమ్మ చెప్పారు. బంధాలకు, అనుబంధాలకు విలువ ఇస్తారన్నారు. ‘ఎలాంటి మనస్పర్థలు వచ్చినా వారధిలా వ్యవహరించి అందరినీ ఒకతాటిపైకి తెచ్చి నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రతిఫలం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లే వారు. డబ్బు గురించి ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఇది నా మాట కాదు.. జనం మాట. హస్తవాసి మంచిదని నాలుగు జిల్లాల నుంచి ప్రజలు వైద్యం కోసం వచ్చే వారు. వారణాసిలో తనకు అత్యంత ముఖ్య స్నేహితుడైన దినేష్‌ను మరచిపోకూడదని తన కుమారుడికి అదే పేరు పెట్టుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిల మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది’ అని వివరించారు. -
ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్
-
మరపురాని జ్ఞాపకం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి
సాక్షి, పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి ఆదివారం పులివెందులలో నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, ఇతర వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సంస్మరణ సభ అనంతరం మరపురాని జ్ఞాపకం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు వైఎస్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. సంస్మరణ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి క్రెడిబులిటీ ఉన్న వ్యక్తి అని అన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. పేదల మనసు గెలుచుకున్న వ్యక్తి' అంటూ కొనియాడారు. పేదల డాక్టర్‌గా గుర్తింపు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈయన చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20వ తేదీన ఇసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండో సంతానంగా వేముల మండలం గొల్లలగూడూరులో ఇ.సి. గంగిరెడ్డి జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6 నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలులో, 9 నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో, ఎంబీబీఎస్ వారణాసిలోని బెనారస్ యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. బెనారస్ యూనివర్శిటీలో ఆయన పీడీ కూడా పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. తర్వాత పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి వైద్య సేవలు అందించేవారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. పులివెందుల ప్రాంతంలో పేదల వైద్యునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఇక్కడ గు ర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయ న దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలేకాకుండా జిల్లాలో నలుమూలల నుంచే కాకుండా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలాన్ని బట్టి ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో దినేష్ నర్సింగ్ హోం(గంగిరెడ్డి ఆసుపత్రి)ను స్థాపించి వైద్య సేవలు అందించేవారు. తన వద్దకు వచ్చే రోగులపట్ల ఆయన ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. అలాంటి వ్యక్తి తమ మధ్య లేరన్న విషయాన్ని పులివెందుల ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రస్థానం : డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి 2001 నుంచి 2005 వ రకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్ర జలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించేవారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలోని ఆయన ప్రచారం నిర్వహించేవారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన వివరాలు..
సాక్షి, కడప సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శని, ఆదివారాలలో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 3.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.15 గంటలకు అక్కడి నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అక్కడ 4.50 గంటల వరకు పార్టీ నేతలతో మాట్లాడతారు. 5.00 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. ►3వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.50 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి 9.55 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి తన మామ, దివంగత ఈసీ గంగిరెడ్డి సమాధి వద్దకు చేరుకుని 10.00 గంటలకు సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 10.30 నుంచి 11.30 గంటల వరకు భాకరాపురంలోని ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.35 గంటలకు అక్కడి నుంచి భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. 12.15 గంటలకు తన నివాసం నుంచి భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 1.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2.00 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. చదవండి: (‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ –జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభం) భాకరాపురంలో హెలీప్యాడ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పులివెందుల/వేంపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా ఏర్పాట్లను కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పర్యవేక్షించారు. శుక్రవారం వారు పులివెందులలోని భాకరాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను, అలాగే డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న డాక్టర్ ఇసీ గంగిరెడ్డి ఘాట్‌ను, భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. వైఎస్సార్ ఆడిటోరియంలో డాక్టర్ ఇసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఘాట్ వద్ద సీఎం నివాళులర్పించనున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎవరెవరిని అనుమతించాలి, ఎంతమందిని అనుమతించాలన్న అంశంపై పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. కార్యక్రమంలో పులివెందుల సీఎం కార్యాలయ కో ఆర్డినేటర్ జనార్దన్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, అర్బన్ సీఐ భాస్కర్‌రెడ్డి, వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు , తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఈ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప ఎయిర్పోర్ట్ వద్ద.. కడప కోటిరెడ్డిసర్కిల్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం కడప విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రాకను పురస్కరించుకుని చేపట్టాల్సిన భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. -
నాన్నది కల్మషం లేని మనసు
సాక్షి కడప: ‘నాన్న వెరీ వెరీ సింపుల్ పర్సన్. ఆయన హస్తవాసి మంచిది కాబట్టి చనిపోయే పరిస్థితిలో ఉన్న చిన్నారులను కూడా బతికించేవారు. ఎక్కడా బాగు కాని కేసులు వచ్చేవి. వారందరినీ బతికించి, అందరి హృదయాలలో నాన్న చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు’ అని ఆయన కుమార్తె, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ భారతితోపాటు పలువురు డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని వైఎస్ భారతి ఇలా గుర్తు చేసుకున్నారు. చెట్ల కింద ఉండి చూపించుకుని పోయేవాళ్లు ► ‘మేము పులివెందులలో పాత ఆసుపత్రి మేడపైన ఉన్నప్పుడు కింద ఎవరైనా చిన్నపిల్లలు ఏడ్చినా.. ఏదైనా అరుపు వినిపించినా నాన్న వెంటనే ఫోన్ చేసి అక్కడి సిస్టర్లకు చెప్పేవారు. ఎన్నోసార్లు నేను చూశాను. చివరకు పైనుంచి కిందకు దిగివెళ్లి ఏడుస్తున్న బాబు తల్లిదండ్రులతో మాట్లాడేవారు. ► ఆస్పత్రిలో బెడ్స్ లేవన్నా.. నాన్న హస్తవాసి మంచిదని, చెట్ల కింద మంచాలు వేసుకుని చూపించుకుని పోయిన వాళ్లు కోకొల్లలుగా ఉన్నారు. పేదలు, వికలాంగులతో ప్రత్యేకంగా మాట్లాడేవారు. వారికి వైద్యం అందించడమే కాకుండా వ్యక్తిగత ఇబ్బందులు తీర్చేవారు. ► విద్యార్థులు, గల్ఫ్ దేశాలలో ఉన్న ముస్లిం కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా వైద్యం అందించేవారు. ఎందుకంటే గల్ఫ్‌లో ఉంటున్న వారి కష్టాలు, విద్యార్థులు, దివ్యాంగుల కష్టాలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి. చిన్న పిల్లల మనస్తత్వం ► చివరకు ప్రత్యర్థులను కూడా ప్రేమతో చూస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించిన మంచి మనిషి నాన్న. అక్కడ ఉన్న చిన్నపిల్లలను చూసి హర్షమ్మ, వర్షమ్మ అని పిలుచుకునే గొప్ప మనస్తత్వం ఆయనది. 40 ఏళ్ల పాటు ఆయన్ను చూశాను. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించేవారు. సీరియస్‌గా ఉండేవారు కాదు. ► అత్యవసరంగా ఎక్కడికన్నా వెళ్లాల్సి వచ్చినా చికిత్స అందించిన తర్వాతే ముందుకు అడుగు వేసేవారు. మూగ, చెవిటి, వికలాంగులను ప్రేమగా దగ్గరకు తీసుకునేవారు. ఇంట్లోకి వెళ్లండి.. భారతమ్మ, దినేష్‌లను కలవండి.. అని చెప్పి పంపేవారు. ► పేషెంట్లను చూస్తున్నప్పుడు నాన్న వెంట అమ్మ ఉండేది. నాన్న చనిపోయాక చూడటానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, దివ్యాంగులే. నాన్నది సున్నిత మనస్తత్వం. తొందరగా బాధ పడతారు.. అంతే తొందరగా సంతోష పడతారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లల మనస్తత్వం’ అని వైఎస్ భారతి గుర్తు చేసుకున్నారు. ► ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు, అభిమానులు, సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, ఈసీ సుగుణమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం పులివెందులకు వచ్చారు. స్థానిక వైఎస్సార్ ఆడిటోరియం ఆవరణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్ర పటం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ► ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమరనాథరెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గౌతమి, తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల : ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్
-
నాన్న వైద్యం కోసం జనం తరలివచ్చేవారు: వైఎస్ భారతి
-
ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్
సాక్షి, పులివెందుల: భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ కొనసాగుతోంది. తన మామ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈసీ గంగిరెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పులివెందులలో కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరి వెళతారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పిల్లల దేవుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు, పులివెందుల మాజీ ఎంపీపీ డాక్టర్ ఎద్దుల చెంగల్‌రెడ్డి గారి గంగిరెడ్డి (ఈసీ గంగిరెడ్డి) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. ఈసీ గంగిరెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్ భారతి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి. నాన్న మరణం మాకు తీరని లోటు తండ్రి మరణంపై వైఎస్ భారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈసీ గంగిరెడ్డి జ్ఞాపకాలను స్మరిస్తూ కంటతడి పెట్టారు. ఆయన సంస్మరణలో సభలో వైఎస్ భారతి మాట్లాడారు. ‘మా నాన్న ఈసీ గంగిరెడ్డి మనసున్న డాక్టర్. ఆయన హస్తవాసి మంచిదన్న పేరుంది. ప్రజల వైద్యుడిగా నాన్నకు మంచి గుర్తింపు ఉంది. క్రమశిక్షణ, విలువలు పాటించి నాన్న అందరికీ అదర్శంగా నిలిచారు. ప్రతి రోజూ 300 మంది రోగులకు వైద్య సేవలు అందించేవారు. రోజూ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా కలవడానికి వస్తే..నాన్న ఆప్యాయంగా పలకరించే వారు. తనకు వ్యతిరేకంగా ఉన్నా.. వారితో ప్రేమగా మాట్లాడేవారు. వైద్యం కోసం వచ్చేవారిని ఆత్మీయులుగా భావించేవారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.. నాన్న మరణం మాకు తీరని లోటు’అని వైఎస్ భారతి పేర్కొన్నారు. (చదవండి: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు పులివెందులకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు. సీఎం మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి శనివారం మృతి చెందిన విషయం విదితమే. డాక్టర్ గంగిరెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో సంస్మరణ సభకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై గంగిరెడ్డికి నివాళులు అర్పించనున్నారు. నేడు పులివెందులకు చేరుకుని ఇక్కడ కార్యక్రమాల తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరి వెళతారు. సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ పులివెందుల రూరల్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు. ఈనేపథ్యంలో ఏర్పాట్లను ఆదివారం ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, జాయింట్ కలెక్టర్లు గౌతమి, రవికాంత్ వర్మ పరిశీలించారు. ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ఈసీ గంగిరెడ్డి సంతాప సభను సోమవారం పట్టణంలోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. సంతాప సభకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించారు. పార్కింగ్‌కు సంబంధించిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహరరెడ్డి తదితరులు ఏర్పాట్ల గురించి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జాయింట్ కలెక్టర్లు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహరరెడ్డి, చక్రాయపేట వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకరరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఈ శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్ పౌండేషన్ ప్రతినిధి జనార్ధన్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. సీఎం పర్యటన వివరాలు .. ఉదయం 9.00 ముఖ్యమంత్రి తాడేపల్లెలోని నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలు దేరుతారు. 9.20 గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 9.30 గన్నవరం ఎయిర్ పోర్టునుంచి విమానంలో కడప ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. 10.10 కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 10.15 కడప ఎయిర్ పొర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో పులివెందులకు బయలు దేరుతారు. 10.35 పులివెందులలోని భాకారాపురంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.40హెలీప్యాడ్ నుంచి భాకారాపురంలోని నివాసానికి బయలు దేరుతారు. 10.50 భాకారాపురంలోని నివాసానికి ముఖ్యమంత్రి చేరు కుంటారు. 10.50 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు రిజర్వుగా ప్రకటించారు. మధ్యాహ్నం 1.00 పులివెందుల నివాసం నుంచి హెలీప్యాడ్‌కు బయలు దేరుతారు. 1.10 భాకారాపురంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.15 హెలీక్యాప్టర్‌లో కడప ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. 1.35: హెలీక్యాప్టర్‌లో కఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 1.40 కడప ఎయిర్ పోర్టు నుంచి విమానంలో గన్నవరం బయలు దేరుతారు. 2.20 గనవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 2.30 గన్న వరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలు దేరుతారు. సాయంత్రం5.00 ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 5.10 ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి 1–జనపథ్‌కు బయలు దేరుతారు. 5.50 ఢిల్లీలోని1– జనపథ్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారని కార్యాలయ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. -
డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు
సాక్షి ప్రతినిధి కడప/ అమరావతి/ హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మామ, పిల్లల దేవుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు, పులివెందుల మాజీ ఎంపీపీ డాక్టర్ ఎద్దుల చెంగల్‌రెడ్డి గారి గంగిరెడ్డి (ఈసీ గంగిరెడ్డి) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్ను మూశారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున ఆయన మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీ గంగిరెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్ భారతి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి. ఈసీ గంగిరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో సహా శనివారం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని ఈసీ గంగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. సీఎం సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. ప్రముఖుల నివాళి ► ఈసీ గంగిరెడ్డి భౌతికకాయాన్ని పులివెందులలోని ఆయన స్వగృహానికి తీసుకువస్తున్నారన్న విషయం తెలుసుకుని అప్పటికే రాయలసీమతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ► నేరుగా ఈసీ గంగిరెడ్డి నివాసానికి చేరుకున్న సీఎం జగన్.. మామ భౌతిక కాయాన్ని చూసి చలించిపోయారు. బాధాతప్త హృదయంతో కొద్దిసేపు మౌనంగా నిలుచుండిపోయారు. కన్నీటి పర్యంతమైన సతీమణి వైఎస్ భారతిని ఊరడించారు. ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గంగిరెడ్డి కుమారుడు దినేశ్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ► వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గంగిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గంటన్నరపాటు అక్కడే ఉండి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు గంగిరెడ్డికి నివాళులు అర్పించారు. పలువురు అభిమానులు, స్థానికులు కొందరు బోరున విలపించారు. అశ్రు నయనాల మధ్య అంతిమ యాత్ర ► ఈసీ గంగిరెడ్డి అంతిమ యాత్ర శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నివాసం వద్ద ప్రారంభమైంది. ఆ సమయంలో కుమార్తె భారతి కన్నీటి పర్యంతమయ్యారు. కిలోమీటరుకుపైగా దూరంలోని సమాధుల తోట వరకు అంతిమ యాత్ర సాగింది. ► సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ► సమాధుల తోటలో సాయంత్రం 4 గంటలకు జగన్‌తోపాటు ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ► ఈసీ గంగిరెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, మంత్రులు ఆదిమూలపు సురేశ్, శంకర్ నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, సిద్దారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► అంత్యక్రియలు ముగిసిన అనంతరం సీఎం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమై సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. పిల్లల దేవుడు ► పులివెందులలో 44 ఏళ్ల పాటు వైద్యుడిగా గంగిరెడ్డి విస్తృతంగా వైద్య సేవలు అందించారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన ఆయన పిల్లల దేవుడిగా పేరు పొందారు. వేముల మండలం గొల్లెల గూడూరుకు చెందిన ఈసీ సిద్దారెడ్డి, తులసమ్మ దంపతులకు 1949, ఏప్రిల్ 20న ఈసీ గంగిరెడ్డి జన్మించారు. ► 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లెలగూడూరులోని ఆర్సీఎం స్కూలులో.. 6, 7, 8 తరగతులు పులివెందుల జిల్లా పరిషత్ హైస్కూలులో చదివారు. 9, 10, 11 తరగతులు వేముల జెడ్పీ పాఠశాలలో, పీయూసీ తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో చదివారు. ► బెనారస్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ చేశారు. తొలుత వైఎస్ రాజారెడ్డి ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేశారు. ఆ తర్వాత సొంతంగా పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ► పిల్లల వైద్యుడిగా ఆయన చేయి పట్టుకుంటే చాలు.. ఎంతటి వ్యాధి అయినా నయమవుతుందన్న పేరు గడించారు. పేద వారికి ఉచిత వైద్య సేవలు అందించారు. దీంతో పులివెందుల నియోజకవర్గంతోపాటు రాయలసీమ వ్యాప్తంగా ఆయనకు పిల్లల దేవుడిగా పేరొచ్చింది. రాజకీయ ప్రస్థానం.. ► ఈసీ గంగిరెడ్డి రాజకీయాల్లో కూడా రాణించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. 2001లో పులివెందులలో ఎంపీటీసీ–1 స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన గంగిరెడ్డి పులివెందుల మండల పరిషత్ అధ్యక్షుడిగా చేశారు. పులివెందుల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ► 2003 రబీలో ప్రభుత్వం తమకు విత్తనాలు ఇవ్వడం లేదంటూ రైతులు గంగిరెడ్డికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆయన వేలాది మంది రైతులతో కలిసి పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. కలెక్టర్ హామీతో ఆ తర్వాత ఆందోళన విరమించారు. -
డాక్టర్ ఈసీ గంగిరెడ్డికి ఘన నివాళి
సాక్షి, తాడేపల్లి: పేదల వైద్యుడిగా పేరుగాంచిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణించడం బాధాకరమని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. డాక్టర్ గానే కాకుండా రైతాంగం కోసం పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయనను కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, గంగిరెడ్డి గారి కుటుంబాలకు ప్రజలతో ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. ఇవ్వాల తాడేపల్లిలోని వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలు ఫొటోలు
-
పేదల డాక్టర్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, పులివెందుల: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలు కార్యక్రమం ముగిసింది. అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. సమాధుల తోట వద్దకు అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి పేదల డాక్టర్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. -
ఈసీ గంగిరెడ్డికి సీఎం జగన్ నివాళి
-
ఈసీ గంగిరెడ్డికి సీఎం జగన్ నివాళి
సాక్షి, పులివెందుల: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్నారు. మధ్యాహ్నం జరగనున్న తన మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి నివాళర్పించారు. (చదవండి: సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. గవర్నర్ సంతాపం.. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం గంగిరెడ్డి మరణించిన గంగిరెడ్డి వైఎస్సార్ జిల్లాలో ప్రఖ్యాత శిశు వైద్యునిగానే కాక, ప్రజా వైద్యునిగా ప్రసిద్ది చెందారని ప్రస్తుతించారు. గంగి రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఆయన భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులకు గవర్నర్ హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ప్రజాసేవకు చిరునామా.. ప్రజాసేవకు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఒక చిరునామా అని.. ఆయన మరణం బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేదలకు విశేషంగా వైద్యసేవలు అందించారని, ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారన్నారు. పులివెందుల ప్రాంతం అభివృద్ధిలో ఈసీ గంగిరెడ్డికి సుస్థిర స్థానం ఉందని ట్వీట్ చేశారు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డికి ఆయన ఘన నివాళులు అర్పించారు. -
కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరారు. మధ్యాహ్నం జరగనున్న ఆయన మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం.గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, డీఐజీ వెంకటరామిరెడ్డి తదితర అధికారులు విమానాశ్రయంలో సీఎం జగన్‌ను కలిశారు. (చదవండి: సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి నివాళర్పించారు. -
ఈసీ గంగిరెడ్డి మృతికి ఆళ్ల నాని సంతాపం
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు పొందారని తెలిపారు. కడప జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేసి ఆ ప్రాంతంలో పార్టీకి పెద్దదిక్కుగా నిలిచారన్నారు. గంగిరెడ్డి మరణం తీరని లోటన్నారు. కరోనా కష్టకాలంలో కూడా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. నిత్యం అందుబాటులో ఉండి పేదలకు అండగా ఉండేవారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం చాలా బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గంగిరెడ్డి రాయలసీమ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. గంగిరెడ్డి మరణం తీరని లోటు: ఎమ్మెల్యే తోపుదుర్తి పులివెందుల పేదల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం పట్ల అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంతాపం తెలిపారు. పులివెందుల వచ్చిన ఆయన ఈసీ గంగిరెడ్డి మరణం తీరని లోటని స్పష్టం చేశారు. ఓవైపు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే రైతుల సమస్యలపై ఈసీ గంగిరెడ్డి పోరాటాలు చేశారని చెప్పారు. (సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) -
సీఎం వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి
-
సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఈసీ గంగిరెడ్డి మృతి చెందడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులకు రానున్నారు. పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఇవాళ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పేదల డాక్టర్‌గా ఖ్యాతి పొందిన ఈసీ గంగిరెడ్డి మరణంతో పులివెందుల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీఎం వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతిపట్ల వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డాక్టర్‌గానే కాక.. ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా ఆయన సేవలను విజయసాయి రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన ట్విటర్ ఖాతాలో.. 'ప్రజాసేవకు ఈసీ గంగిరెడ్డిగారు ఒక చిరునామా. ఆయన మరణం బాధాకరం. పేదలకు విశేషంగా వైద్యసేవలు అందించారాయన. ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. పులివెందుల ప్రాంతం అభివృద్ధిలో ఆయనకు సుస్థిరస్థానం ఉంది. ఆయనకు నా ఘన నివాళి' అంటూ ట్వీట్ చేశారు. -
'వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతిభా పురస్కారాలు'
తిరుపతి: వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. శనివారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామన్నారు. రామచంద్రాపురం మండలం కుప్పం బాదురులో ప్రతిభా పురస్కారాలను అందజేశామన్నారు. ప్రతి విద్యార్థి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకోవాలనీ, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక బద్ధంగా చదవాలని వారు ఆకాంక్షించారు.