![ycp mla pays tribute to ec gangi reddy - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/3/8_0.jpg.webp?itok=4uetsplW)
సాక్షి, తాడేపల్లి: పేదల వైద్యుడిగా పేరుగాంచిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణించడం బాధాకరమని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. డాక్టర్ గానే కాకుండా రైతాంగం కోసం పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయనను కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, గంగిరెడ్డి గారి కుటుంబాలకు ప్రజలతో ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. ఇవ్వాల తాడేపల్లిలోని వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment