Sudhakar Babu
-
‘దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లతో పదవులా?’
తాడేపల్లి :రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లతో అరాచాకం సృష్టించి పదవులను దక్కించుకున్నాయని వైఎస్సార్సీపీ(YSRCP) రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు(TJR Sudhakar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పదవుల కోసం గుండా రాజ్యం, తాలిబన్ పాలనను తలపించేలా వ్యవహరించారని మండిపడ్డారు. కేవలం ఏడాది కాలం ఉండే పదవుల కోసం నిసిగ్గుగా రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అప్రజాస్వామిక విధానాలకు పాల్పడ్డాయి. రాష్ట్రంలో మూడు కార్పోరేషన్ల డిప్యూటీ మేయర్ పదవులు, ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి వైస్ చైర్ పర్సన్ ఎన్నికలను రాజకీయ వికృత క్రీడకు మార్చేశారు. అంతిమంగా అధికార దుర్వినియోగంతో తెలుగుదేశం పార్టీ దొడ్డిదోవన పదవులను దక్కించుకుంది. ప్రజాస్వామ్యంను ఖునీచేశారు. రాష్ట్రంలో మొత్తం 106 మున్సిపాలిటీలు ఉంటే వాటిల్లో 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వాటిల్లో 73 మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. కేవలం దర్శి, తాడిపత్రి మున్సిపాలిటీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డి గతంలో మాట్లాడుతూ వైఎస్ జగన్(YS Jagan) తలుచుకుంటే తాడిపత్రి కూడా వైఎస్సార్సీపీ పరం అయి ఉండేదని అన్నారు. అంటే సీఎంగా ఉండి కూడా వైఎస్ జగన్ ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించ కూడదంటూ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి విధానాలకు పూర్తి విరుద్దం. ఎలాంటి అడ్డదోవ తొక్కైనా సరే అధికారంలోకి రావాలన్నదే టీడీపీ లక్ష్యం. దానిలో భాగంగానే దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు, కిడ్నాప్ లు, అర్ధరాత్రి దాడులు, కోరం లేకుండా చేసి ఎన్నికలను వాయిదా వేయించడం, నామినేషన్లకు వెడుతున్న వారిని అడ్డుకోవడం వంటి ఘటనలు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా అనేకం జరిగాయి.పలుచోట్ల కొనసాగిన అరాచకపర్వంపార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్, నెల్లూరు, నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెం, కృష్ణాజిల్లా నూజివీడు, ఏలూరు కార్పోరేషన్లలో జరిగిన ఘటనలను రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు. కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్నారు. అధికారంలో ఉన్నామని, పోలీసులు తమ చెప్పుచేతల్లో ఉన్నారని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అడ్డదోవలో అన్యాయంగా ఉప ఎన్నికలు నిర్వహించిన కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లే దీనికి బాధ్యత వహించాలి. 16 మున్సిపల్ కార్పోరేషన్లలో 13 చోట్ల వైఎస్సార్సీపీ మేయర్లు పదవుల్లో ఉన్నారు. ఆనాడు పురపాలికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. ఏడాది తరువాత జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును కోరి, దర్జాగా పదవుల్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి భిన్నంగా కూటమి పార్టీలు ఉప ఎన్నికల్లో కుట్ర, కుతంత్రలకు పాల్పడటం హేయం. పద్మభూషణ్ అవార్డును అందుకున్న నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలోని హిందూపూర్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ఎటువంటి అక్రమాలను ప్రోత్సహించారు. గౌరవప్రథమైన పద్మభూషణ్ అవార్డుకు ఆయన అర్హులేనా? మంత్రి కొలుసు పార్థసారధి రాత్రిపూట వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇంటికి వెళ్ళి వారిని బెదిరింపులకు గురి చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తునిలో చేసిన అరాచకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తునిలో మద్యం మత్తులో మహిళా కౌన్సిలర్ పట్ల టీడీపీ నేతలు అసభ్యంగా వ్యవహరించారు. పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో నామనేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. తిరుపతిలో ఒక్క కార్పోరేటర్ ఉన్న టీడీపీ ఏకంగా డిప్యూటీ మేయర్ గా ఎన్నిక అవ్వడం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించడం కాదా? తెలుగుదేశం తమను భయపెట్టారు, బలవంత పెట్టారంటూ వైఎస్సార్సీపీ తిరుపతి కార్పోరేటర్లు మా పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ని కలిసి కన్నీటితో తమ ఆవేదనను చాటుకోవడం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. నెల్లూరులో మంత్రి నారాయణ వైఎస్సార్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ల ఇళ్ళపై దాడులు చేయించారు. ఏలూరు కార్పోరేషన్ లో బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ పదవుల కోసం అడ్డదారుల్లో ఆ పదవులను దక్కించుకున్నారు.ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలిరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ ఎదురుచూస్తోంది. ప్రజాతీర్పుతో మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్దంగా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రిటర్నింగ్ అధికారులు చట్టబద్దంగా, న్యాయబద్దంగా నిర్వహించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వమే ఎల్ల కాలం అధికారంలో ఉండదు. మళ్లీ ప్రజలు మార్పును కోరుకుంటారు, వైఎస్ జగన్‌కి అధికారాన్ని అప్పగిస్తారు. ఇప్పుడు అధికారం ఉందని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ మీరు చూపుతున్న మార్గం రాబోయే రోజుల్లో మిగిలిన వారు కూడా అనుసరించే అవకాశం ఉందని గ్రహించండి. కూటమి ప్రభుత్వంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మెప్పు కోసం రాజ్యాంగానికి విరుద్దంగా, చట్టాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రతి వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. దీనికి కారకులైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి’ అని హెచ్చరించారు. -
వలంటీర్లపై బాబు కూటమి కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకుండా తప్పించుకునేందుకే కూటమి నేతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వలంటీర్లకు సంబంధించి ఎలాంటి వ్యవస్థ లేదని, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని, దాని వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నామని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పడమూ ఈ కుట్రలో భాగమేనన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పూర్తి పారదర్శకంగా ఇంటి గడప వద్దే అందించడం కోసం 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకానికి ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ శాఖ బాధ్యతను ఒక మంత్రికి అప్పగించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి ఆ శాఖను కేటాయించారన్న విషయం తెలుసుకోవాలన్నారు.వలంటీర్ల నియామకంపైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పవన్ ఆ జీవోలు తెప్పించుకుని చూడాలని చెప్పారు. అంత పక్కాగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దానిపై పవన్ వెటకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల వ్యవస్థపై టీడీపీకి, జనసేన పార్టీకి సదభిప్రాయం లేదనడానికి గతంలో చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలకు వలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివని, కోవిడ్ బాధితులను వారి కుటుంబ సభ్యులే పట్టించుకోకపోతే వీరు ప్రాణా లకు తెగించి సేవలందించారని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో వలంటీర్లకు కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వారిన తిరిగి విధుల్లోకి తీసుకొని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వలంటీర్లకు ఏ హామీ ఇవ్వలేదని కూటమి నేతలు అనుకొంటే.. తిరుమల శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని సుధాకర్‌బాబు సవాల్ చేశారు.నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
సుబ్బారెడ్డి పై షర్మిల వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుధాకర్ బాబు
-
చంద్రబాబు పాలనంటే ఆస్తుల విధ్వంసమే: టీజేఎస్ సుధాకర్ బాబు
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో చంద్రబాబు వంద రోజుల పాలనలో ఆస్తుల విధ్వంసమే తప్ప మరొకటి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఎస్ సుధాకర్ బాబు. కూటమి సర్కార్ పాలనలో పోలవరం పనులు, రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు వంద రోజుల్లో విధ్వంసకర పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి, చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. మొదటి వంద రోజుల పాలన ఆస్తుల విధ్వంసం, ప్రతిపక్షాలను టార్గెట్ చేయటం, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులే లక్ష్యంగా పనిచేశారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారులపై తప్పుడు కేసులు బనాయించారు. నారా వారి వంద రోజుల పాలన బూటకం.నాలుగు నెలల కాలంలో చంద్రబాబు తెచ్చిన 45వేల కోట్లు ఏం చేశారో చెప్పాలి. పోలవరం పనులు, రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పాలి. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ప్రజలకు చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ హత్యలకు నిలయంగా మారింది. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. రైతు భరోసా కేంద్రాలను మూసేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు లేవు. రైతులకు అవస్థలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు చూపించిన రాజకీయ విధ్వంసకర ప్రక్రియను అందరూ చూస్తున్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే చేస్తే మీరు తట్టుకోగలరా?. దళిత నేత నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పేదలకు వచ్చే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ప్రైవేటు పరం చేశారు. అన్ని సామాజిక వర్గాల్లో పేదలకు ఈబీసీ నేస్తం కింద వైఎస్ జగన్ సహాయం అందించారు. ఇప్పుడు నువ్వు ఎవరికి సహాయం అందిస్తున్నావు చంద్రబాబు. అక్రమాలకు కేంద్రాలైన జన్మభూమి కమిటీలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సూపర్ సిక్స్-నారావారి వంచన ఫిక్స్.. జనం ఏమంటున్నారంటే.. -
నందిగం సురేష్ అరెస్ట్ పై సుదాకర్ బాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
సూపర్-6 హామీల అమలుపై చంద్రబాబు మోసం
-
35 లక్షల టన్నుల ఇసుక మాయం..
-
బాబు తెచ్చిన ఆనవాయితీనే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్న ఆరోపణల్లో నిజం లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు ఆద్యుడు సీఎం చంద్రబాబేనని, ఆమేరకు జీవోలిచ్చింది ఆయన ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అదే విధానాన్ని తరువాత ప్రభుత్వం కొనసాగించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకోటలు కట్టుకున్నారని, వైఎస్ జగన్‌కు ప్యాలెస్‌ల పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము కట్టినవి ప్యాలెస్‌లు అయితే టీడీపీ నిర్మించినవి ఏమిటని నిలదీశారు.హైదరాబాద్‌లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్టు భవనం ఏమైనా గుడిసెనా? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు చదువు నేర్పేందుకు వినియోగిస్తామంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుకు బదలాయించారన్నారు. ఆ ఆస్తి విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం రూ.1,000 కోట్లకుపైగా ఉంటుందన్నారు. మంగళగిరిలో హైవే పక్కన ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం భూమి విలువే రూ.75 కోట్లు ఉంటుందన్నారు. టీడీపీ తమ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించిన భూముల విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందన్నారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తమ పార్టీ కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టామని స్పష్టం చేశారు. ఎక్కడా అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు. మీ తాత జాగీరా? అంటూ మంత్రి లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అధికార మదంతో వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ కార్యాలయాలను బుల్డోజర్లతో కూలి్చవేసే సంస్కృతిని ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈ దుశ్చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.40 శాతం మంది ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేశారన్న సంగతి మర్చిపోవద్దన్నారు. ఎక్కడ లోపాలు జరిగాయో సరిదిద్ది వైఎస్ జగన్ మళ్లీ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిర్మించిన భారీ కార్యాలయాల ఫొటోలు, జీవోల కాపీలను ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మీడియాకు విడుదల చేశారు. ⇒ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సర్వే నంబర్లు 392/1, 392/3, 392/4, 392/8, 392/9, 392/10లో జీవో నంబర్ 228 ద్వారా ఆత్మకూరు గ్రామంలో 2017 జూన్ 22న 3.65 ఎకరాలు కేటాయింపు. 33 ఏళ్లు మాత్రమే లీజుకు ఇవ్వాల్సిన భూములను 99 ఏళ్ల పాటు ఏటా రూ.1,000 చొప్పున లీజుకు ఇవ్వటం నిజం కాదా? ⇒ వైఎస్సార్ కడప జిల్లా నాగార్జునపల్లిలో సర్వే నంబర్ 295/1ఎ, 1బిలో జీవో నంబర్ 279 కింద 2015 జూలై 20న 33 ఏళ్లకు ఏటా రూ.వెయ్యి లీజు చొప్పున కేటాయింపు. ⇒ శ్రీకాకుళంలో సర్వే నంబర్ 700/1లో రెండు ఎకరాల భూమి 99 ఏళ్లకు ఏటా రూ.25 వేల చొప్పున లీజుకు కేటాయింపు. ⇒ విజయనగరంలో సర్వే నంబర్ 15/క, అయ్యన్న పేట గ్రామంలో జీవో 195 ద్వారా 2018 ఏప్రిల్ 23న 33 ఏళ్లకు రూ.1000 చొప్పున ఒక ఎకరం భూమి కేటాయింపు. ⇒ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నం గ్రామంలో జీవో నంబర్ 197 ద్వారా 2018 ఏప్రిల్ 23న 20 సెంట్ల భూమి 33 ఏళ్లకు రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు. ⇒ విజయవాడ అర్బన్ మండలం గుణదలలో జీవో నంబర్ 513 ద్వారా 2018 అక్టోబర్ 11న 95 సెంట్లు స్థలం 33 ఏళ్లకు రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు. ⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరులో సర్వే నంబర్ 68/8లో జీవో నంబర్ 514 ద్వారా 2018 అక్టోబర్ 11న 33 ఏళ్లకు 1.96 ఎకరాల భూమి రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు. ⇒వైఎస్సార్ కడప జిల్లా అక్కాయపల్లి గ్రామంలో సర్వే నంబర్ 37/4లో జీవో 56 ద్వారా 2019 జనవరి 24న రెండు ఎకరాల భూమి 33 ఏళ్ల పాటు రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు. ⇒ చిత్తూరు జిల్లా గుండ్లాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 1/1బీ3లో జీవో 59 ద్వారా 2019 జనవరి 24న 1.20 ఎకరాల భూమి 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.1000 చొప్పున లీజుకు కేటాయింపు. ⇒ శ్రీకాకుళం జిల్లా కొత్త అంబళ్లపల్లి మండలం కొత్తపేట గ్రామంలో సర్వే నంబర్ 106/3లో జీవో 63 ద్వారా 2019 జనవరి 24న 30 సెంట్ల భూమి 33 ఏళ్ల లీజుకు కేటాయింపు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చట్టాన్ని లెక్క చేయడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం భవనాన్ని కూల్చేశారని మండిపడ్డారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన తొలిరోజు నుంచే నియంతృత్వ ధోరణితో సాగుతోందని అన్నారు. చంద్రబాబు నివసిస్తున్నదే అక్రమంగా కట్టిన కరకట్ట నివాసంలో అని, దాన్ని కూల్చేస్తామని గతంలో అదే పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా∙చెప్పారని తెలిపారు. అదే అక్రమ కట్టడంలో ఉంటూ చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు వచ్చి న దగ్గర నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమి నేతలు హింసాకాండకు పాల్పడటం ఈ ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెప్తున్నాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే వైఎస్సార్సీపీ కార్యాలయాల ధ్వంసానికి దిగిందన్నారు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం ఉందా? చట్టం పనిచేస్తోందా? వ్యవస్థలు ఉన్నాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయన్నారు. శనివారం అసెంబ్లీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తేనె పలుకులు పలికారని, బయట మాత్రం కత్తులతో ప్రత్యర్థి రాజకీయ పార్టీ గొంతు కోయాలని చూస్తున్నారని చెప్పారు. సభ ఎలా జరుపుతారో అయ్యన్న నియామకమే చెబుతుంది ఎక్కువ బూతులు మాట్లాడేదెవరని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అయ్యన్నపాత్రుడినే చూపిస్తోందని, అలాంటి వ్యక్తిని స్పీకర్‌గా నియమించారంటే సభను ఎలా జరపాలనుకుంటున్నారో అర్థమవుతోందని సుధాకర్‌బాబు అన్నారు. తన స్నేహితుడితో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలియాలంటూ సుధాకర్‌బాబు ఆ వీడియోను ప్రదర్శించారు. జగన్ కేవలం ఓడిపోయాడు కాని, చావలేదు, చచ్చేవరకూ కొట్టాలంటూ అత్యంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూటమి పార్టీలు కూర్చోపెట్టాయని ధ్వజమెత్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న స్పీకర్ విపక్ష వైఎస్సార్సీపీ సభ్యులను మాట్లాడనిస్తారా.. అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను అవమానించటానికి, ఆయన ఆస్తులను ధ్వంసం చేయడానికే చంద్రబాబు సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. -
మేలు చేస్తేనే ఓటేయండని చెప్పిన నాయకుడు సీఎం జగన్: సుధాకర్ బాబు
-
‘గుండ్లకమ్మ’ పాపం గత ప్రభుత్వానిదే
మద్దిపాడు: గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసి.. సుందరీకరణ పేరుతో నిధులు బొక్కేయడానికే ప్రాధాన్యత ఇవ్వడమే ప్రస్తుత దుస్థితికి కారణమని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద విరిగిపోయిన రెండో గేటును శనివారం పరిశీలించిన ఆయన రిజర్వాయర్ ఎస్ఈ ఆబూదలి, ఈఈ నాగమురళీమోహన్తో మాట్లాడారు. రిజర్వాయర్‌లోని మిగిలిన గేట్ల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014–19 కాలంలో వర్షాలు లేక రిజర్వాయర్‌లో నీరు అతి తక్కువగా ఉండటంతో నాయకులు రిజర్వాయర్‌కు వచ్చిన నిర్వహణ నిధులతో ఉపయోగం లేని పనులు చేసి నిధులను తమ ఖాతాల్లో వేసుకున్నారని విమర్శించారు. రిజర్వాయర్ గేటు గత సంవత్సరం విరిగిపోయినప్పుడు గేట్ల మరమ్మతులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.90 లక్షలు మంజూరు చేశారని, ఈ ఏడాది రిజర్వాయర్ గేట్లు పూర్తిగా మరమ్మతు చేయించేందుకు రూ.9 కోట్లు విడుదల చేశారని చెప్పారు. లెగ్మెంట్లు కొట్టుకుపోవడం దురదృష్టకరం మిచాంగ్ తుపాను కారణంగా గుండ్లకమ్మ జలాశయంలోకి నీరు పుష్కలంగా వస్తుండటంతో నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నించారని.. దురదృష్టవశాత్తు 2వ గేటు లెగ్మెంట్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. రిజర్వాయర్‌లో సాగర్ నుంచి ఒక టీఎంసీ నీరు విడుదల చేయించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. గేట్ల మరమ్మతులపై సీఎంవో, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే హుటాహుటిన తాడేపల్లి వెళ్లారు. అంతకుముందు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్లో మాట్లాడారు. కాగా.. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మండవ అప్పారావు, ఎంపీపీ వాకా అరుణకోటిరెడ్డి, నాయకులు రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రిజర్వాయర్‌కు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రిజర్వాయర్ నిర్వహణ కోసం గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను నాయకులు తినేశారన్నారు. టీడీపీ హయాంలో ఎన్ని టీఎంసీల నీరు సాగర్ నుంచి గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్రైతుల పక్షపాతి అని, అందుకే రిజర్వాయర్ నిర్వహణకు రూ.9 కోట్లు మంజూరు చేశారన్నారు. టీడీపీ నాయకుల హడావుడి గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటు విరిగిందన్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు శనివారం ఉదయం రిజర్వాయర్ వద్దకు చేరుకుని కొంతసేపు హడావుడి చేశారు. రిజర్వాయర్ నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, టీడీపీ నాయకుడు ముత్తుముల అశోక్‌రెడ్డి రిజర్వాయర్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు. -
వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
-
స్కిల్ స్కామ్ లో దొరికిన వ్యక్తికి పవన్ సపోర్ట్ చేస్తున్నారు : సుధాకర్ బాబు
-
‘జనం నిద్రపోయే టైంలో యాత్రలు ఏంటో అర్థం కాదు’
సాక్షి, తాడేపల్లి: యువగళం పేరుతో నారా లోకేశ్ చేస్తున్న యాత్రపై ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు జనం నిద్రపోయే టైమ్‌లో యాత్రలో ఏంటో అర్థం కావడం లేదన్నారు. ముఖం మీద ఎండపడకుండా చేసే యాత్ర ఒక యాత్రేనా అని మండిపడ్డారు సుధాకర్‌బాబు. పనికిమాలిన వాడిని రోడ్డుమీద తిప్పి సొల్లుకబుర్లు ఎందుకు చెప్పిస్తున్నారని ప్రశ్నించారు. విటమిన్లు లోపిస్లే ట్యాబ్లెట్లు వాడొచ్చని, మరి సిగ్గు లేని వాడికి ఏం మందలు వాడాలి? అని అడిగారు. లోకేష్ యాత్రలో రెడ్ టీషర్టులతో ఉన్న వారి దగ్గర ఎందుకు రాళ్లు, కర్రలు ఉన్నాయి?, వాళ్లు రోడ్ల మీద రౌడీయిజం ఎందుకు చేస్తున్నారు?, దత్తపుత్రుడు ఓడిపోయిన గోదావరి జిల్లాలో సొంతపుత్రుడిని పంపి అల్లర్లు సృష్టించటం ఎందుకు?, ఇవన్నీ మాఫియా డాన్ చేసే పనులే. ఐటీ నోటీసులకి స్పందించకుండా చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా ఉన్నాడు. దోపిడీ దొంగలకు బాస్ ఉన్నట్లే మాఫియాకు డాన్‌గా చంద్రబాబు మారారు’ అంటూ విమర్శించారు సుధాకర్‌బాబు. చదవండి: బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తి: సజ్జల -
పవన్ కళ్యాణ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
-
సీఎం జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి
-
‘తప్పు చేయని తమ్ముడికి అండగా నిలబడడం తప్పా?’
సాక్షి, గుంటూరు: వైఎస్ వివేకానందరెడ్డి హత్య టీడీపీ హయాంలోనే జరిగిందని, ఈ కేసులో చంద్రబాబే తొలి ముద్దాయి అని, ఈ కేసులో భాదితుల్ని నిందితులుగా చిత్రీకరించే యత్నం జరుగుతోందని, అన్నింటికి మించి సీఎం జగన్‌పై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమే ఇదంతా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసు ద్వారా సీఎం జగన్‌పై రాజకీయ కుట్ర జరుగుతోంది. జగన్ వ్యక్తిత్వం తక్కువ చేసే కుట్ర చేస్తున్నారు. కుట్రలో భాగంగానే వివేకా హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దస్తగిరి బయటకు వచ్చి హత్య చేసిన విధానం చెప్పడం ఏంటి?. గొడ్డలితో నరికానని చెప్తుంటే సునీత మౌనంగా ఎందుకు ఉన్నారు?. సునీత భర్తకు ఈ హత్యలో సంబంధం ఉందని ఆరోపించారు సుధాకర్‌బాబు. వివేకా హత్య కేసులో చంద్రబాబు తొలి ముద్దాయి. టీడీపీ హయాంలోనే వివేకా హత్య జరిగింది. అప్పుడెందుకు అవినాష్, భాస్కర్‌రెడ్డిల పేర్లు రాలేదు. వాళ్లిద్దరూ బాధితులు. ఇక్కడ బాధితుల్ని ముద్దాయిలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రం నిధుల సేకరణ కోసం ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం సాధారణం. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సుధాకర్‌బాబు మండిపడ్డారు. చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు వివేకా కేసు పరిణామాలపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. వివేకా కేసు ద్వారా చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారాయన. ‘‘పేదలకు మేలు చేయకుండా చంద్రబాబు అడ్డు తగులుతున్నాడు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. సంక్షేమ పథకాలు బాబుకు అవహేళనగా కనిపిస్తున్నాయి. మీ పాలనలో పేదలకు ఎందుకు మేలు చేయలేదని చంద్రబాబును ఎమ్మెల్యే సుధాకర్ బాబు నిలదీశారు. పారదర్శక పాలన సాగుతుంటే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. మాతో యుద్ధం చేయడానికి చంద్రబాబుకు యుద్ధసామగ్రి లేదు. మాతో పోరాడేందుకు చంద్రబాబుకు ఒక్క అంశం కూడా లేదు. చంద్రబాబు వస్తే కరువు వచ్చింది. చంద్రబాబు వస్తే చెరువులు ఎండిపోయాయి. పైగా సీఎం జగన్ పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే అడ్డు తగులుతున్నారు. రోజూ అబద్దాలు వల్లెవేయడమే పచ్చ గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. చంద్రబాబుకు దమ్ముంటే ఇళ్ల స్థలాల దగ్గర సెల్ఫీ దిగాలి. చంద్రబాబు చీకటి యుద్దాన్ని నమ్ముకున్నాడు వివేకా కేసు ద్వారా సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నాడు. చంద్రబాబు ఏపీకి పట్టిన పిశాచి. అందుకే చీకటి యుద్ధాన్ని నమ్ముకున్నాడు. అవినాష్ రెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేశారు. సీఎం జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాడు. తప్పు చేయని తమ్ముడికి(అవినాష్‌రెడ్డిని ఉద్దేశించి..) అండగా నిలబడటం తప్పా ?. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయమనడం తప్పా ?. వివేకా కేసులో ఆదినారాయణ రెడ్డి, బిటెక్ రవి పాత్రపై దర్యాప్తు చేయాలి. వివేకా హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు దర్యాప్తు సంస్థను డిమాండ్ చేశారు. వ్యవస్థలను వాడుకోవడంలో చంద్రబాబే ఓ కేస్ స్టడీ. చంద్రబాబు తన చుట్టూ పది మందికి దోచిపెట్టడం ఓ కేస్ స్టడీగా తీసుకోవచ్చు. లోకేష్ రాజకీయాల్లో విఫలం కావడం ఓ కేస్ స్టడీ. అలాగే.. లోకేష్ కు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఓ కేస్ స్టడీ. ఎన్నో నేరాలు చేసి తప్పించుకున్న చంద్రబాబే ఓ కేస్ స్టడీ. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు కూడా ఓ కేస్ స్టడీ. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చిన చంద్రబాబు ఓ కేస్ స్టడీ. మంగళగిరిలో కొడుకును గెలిపించుకోలేకపోవడం ఓ కేస్ స్టడీ. ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో నడుస్తోంది. హార్బర్లు, పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయడమే చంద్రబాబు పని. పేదల అభ్యున్నతికి సీఎం జగన్ పాటుపడుతుంటే.. బటన్ల ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు హేళన చేస్తున్నాడు. పేదలకు మేలు చేయకుండా అడ్డుపడుతున్నాడు. చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాడు. చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ, సీఎం వైఎస్ జగన్ ప్రతి గ్రామంలో అభివృద్ధి చేస్తున్నారు. నాడు - నేడు పేరుతో ఎంతో మందికి మేలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పష్టం చేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాసనసభలోని ఆయన కార్యాలయంలో సోమవారం వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభలో పార్టీ ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడిచేసిన ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే దాడిలో సుధాకర్‌బాబు మోచేతికి అయిన గాయం చూపించారు. సీఎంను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంశాఖ మంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, అలజంగి జోగారావు, కిలివేటి సంజీవయ్య, వి.ఆర్.ఎలీజ, తిప్పేస్వామి, కంబాల జోగులు, వరప్రసాద్, కొండేటి చిట్టిబాబు, ఆర్థర్, తలారి వెంకట్రావు, రక్షణనిధి తదితరులున్నారు. చదవండి: స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్ డే' -
పులి వస్తోంది
సిజు విల్సన్ లీడ్ రోల్లో కాయాదు లోహర్ హీరోయిన్గా తెరకెక్కిన మలయాళ చిత్రం పాథోన్ పథం నూట్టాండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సెప్టెంబరులో విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘పులి.. ది పంతొమ్మిదవ సెంచురీ’ పేరుతో సీహెచ్ సుధాకర్ బాబు తెలుగులో ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. ‘‘యాక్షన్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. తెలుగు టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగులోనూ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సీహెచ్ సుధాకర్ బాబు. అనూప్ మీనన్, పూనమ్ బజ్వా ఇతర పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్.కె. రామచంద్ర నాయక్. -
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ నడుచుకుంటున్నారు : సుధాకర్ బాబు
-
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు : ఎమ్మెల్యే సుధాకర్ బాబు
-
‘పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది’
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యిందని దుయ్యబట్టారు. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం. ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. ‘‘జనసేన కాదు.. అది ‘నారా-నాదెండ్ల’ సేన. రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోక కల్యాణం. పవన్‌కు ఉన్నది బాబు.. కావాల్సింది ప్యాకేజీ.’’ అంటూ నిప్పులు చెరిగారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మాజీ ఎంపీ ఉండవల్లి ‘‘మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉండగా పవన్‌కు వేరే ఆఫీసు ఎందుకు?. రాజకీయ కరువు బాధితుడు పవన్‌కు స్పెషల్ ప్యాకేజీలు అందాయి. టీడీపీ హయాంలో దుష్టచతుష్టయం, పవన్ కడుపు నిండింది. జనం కడుపు ఎండింది. 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టే జుట్టు పెంచుతున్నాడు. ప్రతి నమస్కారంతో పాటు ప్రతి ఒక్కరికి మంచి చేసే సంస్కారం జగన్‌కే సొంతం’’ అన్నారు. -
రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోకకల్యాణం
-
రైతుల పాదయాత్ర కాదు.. టీడీపీ రాజకీయ యాత్ర
-
విద్యుత్తు వాహనాలకు మళ్లే సమయమిదే!
దేశంలో విద్యుత్ వాహనాల వాడ కానికి మద్దతు ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇందుకు తగ్గట్టు గానే కంపెనీలు కూడా విద్యుత్ వాహనాలకు (ఈవీలు) సంబందించి తమదైన ప్రణాళికళను సిద్ధం చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం కూడా విద్యుత్ వాహనాల అవసరాన్ని గుర్తు చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థలో పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మిగిలిన వారి కంటే ఒకడుగు ముందుకేసినట్లుగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ద్విచక్రవాహనాల్లో 30 శాతం వరకూ విద్యుత్ వాహనాలే ఉండటం పెరుగుతున్న మద్దతుకు నిదర్శనం. 2040 నాటికి పెట్రోలు డీజిళ్లతో నడిచే వాహ నాలకంటే ఈవీలే ఎక్కువగా ఉంటాయని అంచనా. కానీ భారతదేశంలో వీటి కొనుగోలుకు ఆసక్తి పెరుగుతున్నా ఇతర దేశాలతో పోలిస్తే వాడకం తక్కువగానే ఉంది. ఇప్పటికీ దేశం మొత్తమ్మీద వాడకంలో ఉన్నది మూడు శాతమే. డా. ఎస్. సుధాకర్ బాబు పర్యావరణం దెబ్బతింటూండటం, వాతావరణ మార్పుల ప్రమాదం పొంచి ఉండటం, శిలాజ ఇంధనాలు తరిగిపోతూండటం ఈవీల అవసరాన్ని స్పష్టంగా చెబు తూండగా– వేగంగా పెరుగుతున్న జనాభా రవాణా అవసరాలను తీర్చేందుకు సృజనాత్మకమైన, సుస్థిరాభి వృద్ధికి దోహదపడే పరిష్కారాలు కావాలన్నది కూడా అంతే స్పష్టం. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు, స్థూలంగా ఉద్గారాల మోతాదును సున్నాకు చేర్చడం వంటి వాటి సాకారంలోనూ ఈవీల పాత్ర ముఖ్యమైందనడంలో సందేహం లేదు. రానున్న దశాబ్ద కాలంలో ఈవీల సంఖ్య పెరుగుతుందన్న అంచనా నిజమైతే, ముడిచమురు వినియోగం రోజుకు పదిలక్షల బ్యారెళ్ల వరకూ తగ్గుతుంది. భారత్ ఇంధన అవసరాలు 90 శాతం దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. దిగుమతుల మోతాదు తగ్గితే ముడి చమురు కొనుగోళ్లకు ఉపయోగిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ఈవీల వాడకం పెరిగిన కొద్దీ వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఈ క్రమంలో అనేక కొత్త ఉద్యోగాలూ అందుబాటులోకి వస్తాయి. పెట్రోలు, డీజిళ్లతో నడిచే వాహనాల కోసం ఏర్పాటైన వ్యవస్థ స్థానంలో విద్యుత్తు వాహనాలకు అవసరమైన ఏర్పాట్లు జరిగేందుకు కొంత సమయం అవసరం. పాత వాహనాల స్థానంలో కొత్త ఈవీలు కొనుగోలు చేయా లంటే... ధరలు మరింత తగ్గించడమే కాకుండా, ఛార్జింగ్ పాయింట్ల సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంతోపాటు భారత్‌లోనూ విద్యుత్తు వాహన వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 20 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వచ్చినప్పుడల్లా కొంతమందికి లాభం, మరికొంతమందికి నష్టం సహజం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో సామా న్యంగా పేదలు చివరివారుగా ఉంటారు. విద్యుత్తుతోనే నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తే తమ వద్ద ఉన్న పెట్రోలు, డీజిల్ వాహనాలను అమ్ముకుంటే వచ్చే నష్టాన్ని భరించడం, లేదా అధిక ధరలు వెచ్చించి విద్యుత్తు వాహ నాలను కొనుగోలు చేయడం రెండూ పేదల విషయంలో కష్టమైపోతాయి. పూర్తిస్థాయి విద్యుత్తు వాహనాలను ప్రవే శపెట్టాలని ప్రభుత్వాలు తలిస్తే... పేదల అవసరాలను, పరిమితులను గుర్తెరిగి ఈవీల వైపు మళ్లనందుకు వారికి జరిమానాలు విధిస్తే సమాజంలో అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల విస్తృత వాడకం జరిగేందుకు ముందే చాలా అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. పవర్ గ్రిడ్లు, మరీ ముఖ్యంగా భారత్‌లోని వాటితో ఉన్న ఒక సమస్య విద్యుత్తు వాడకంలో వచ్చే హెచ్చుతగ్గులు. ఒక్కో సారి విపరీతమైన డిమాండ్ ఉంటే, కొన్ని సందర్భాల్లో అతితక్కువ డిమాండ్ ఉంటుంది. వీటికారణంగా ఈవీ ల్లోని ప్రధాన విడిభాగాలైన బ్యాటరీలను దెబ్బతీసే అవ కాశం ఉంది. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో తగిన మార్పులు చేయడం అత్యవసరం. దీంతోపాటు ఈవీల వాడకంపై ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉండేందుకు తగినన్ని ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం కారణం. దూర ప్రయాణాల్లో ఛార్జింగ్ అయిపోతే? బ్యాటరీలను ఛార్జ్ చేసుకునేందుకు గంటల కొద్దీ వేచి ఉండటం కూడా సమస్యే. ఈ ‘రేంజ్ ఆంగై్జటీ’ సమస్యలను అధిగమించేం దుకు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రయత్నాలే జరుగు తున్నాయి. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 కోట్ల ఛార్జింగ్ పాయింట్లు అవసరమవుతాయని ఒక అంచనా. ప్రస్తుతం ప్రతి రోజూ పదిలక్షల కొత్త ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటవుతుండగా, భారత్‌లో ఈ సంఖ్య 25 లక్షలకు చేరుకుంటే కానీ రేంజ్ ఆంగై్జటీ సమస్యలను అధిగమించలేము. విద్యుత్తు వాహనాల వాడకం పెరక్కపోయేందుకు ఉన్న ఇంకో అవరోధం భారీ ధరలు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తగ్గించాలంటే ప్రజా రవాణా వ్యవస్థలో, మరీ ముఖ్యంగా రోడ్డు రవాణ రంగంలో ఈవీల వాడకం భారీగా పెరగాల్సి ఉంది. అయితే ఆర్థిక సమస్యల కార ణంగా చాలా రాష్ట్రాలు ఇప్పటికీ ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తటపటాయిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతుల్లేకుండా ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీజిల్ వాహ నాల స్థానంలో విద్యుత్తు వాహనాల కొనుగోళ్లకు రుణాలు ఇవ్వడం కాకుండా గ్రాంట్లు ఇవ్వాల్సిన అవసరముంది. గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు నిధులు సమకూర్చడం ద్వారా కేంద్రం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపునకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసేం దుకు వీలేర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈ గ్రాంట్లు కేవలం బస్సులు కొనేందుకు మాత్రమే కాకుండా... ఇతర మౌలిక సదుపాయాల కల్పనకూ ఉపయోగపడతాయి. అదే సమయంలో ఈవీ వాహనాల మరమ్మతులు చేసే వారు కూడా అవసరమవుతారు. దూర ప్రయాణాల్లో కొన్ని చోట్ల వాడేసిన బ్యాటరీల స్థానంలో పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీలను అమర్చేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల ప్రయాణీకులకు సమయం ఆదా అవు తుంది. ఇంకోటి ఏమిటంటే.. ప్రభుత్వం ఈవీలు కొనే వారికి ఇచ్చే సబ్సిడీలు కొనసాగించాలి. దూర ప్రయా ణాలకు ఈవీలను వాడని వారు కూడా ఈ సబ్సిడీల కారణంగా వీటిని కొనేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ -
నారా లోకేశ్ దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గు చేటు: ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
-
‘చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు’
సాక్షి, అమరావతి: లోకేష్ వ్యవహార శైలిపై చంద్రబాబు సిగ్గుపడాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ పదవి పోబోతోందని లోకేష్ తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. శరీరం సైజు తగ్గినా లోకేష్ బుద్ధి మాత్రం మారలేదన్నారు. ‘‘హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన మీకు మాట్లాడే అర్హత లేదు. రంగా హత్య నుంచి ఇప్పటివరకు హత్యారాజకీయాలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు. విఫల నేతలుగా మారిన మీరు జోకర్లుగా మిగిలిపోతారంటూ సుధాకర్ బాబు దుయ్యబట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రత్యేక హోదా అడుగుతూనే ఉన్నామని ఆయన అన్నారు. చదవండి: ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్ ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు -
'తిరకాసు వేతనం'పై ఆగ్రహం: ఒకరి సస్పెండ్
సాక్షి, అనంతపురం విద్య: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ సుధాకర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.వెంకటరమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 21న జరిగిన పాలకమండలి ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జూలై 9న సాక్షిలో తిర‘కాసు’ వేతనం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అనుకూలమైన వారికి అక్రమంగా పదోన్నతులు కట్టబెట్టారనే అంశాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించరాదని ఉన్నత విద్యామండలి 2017 సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేస్తూ ఇద్దరు ఉద్యోగులకు రిజిస్ట్రార్ హోదాలో పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను విస్మరించడంతో సస్పెండ్ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. సస్పెన్షన్ చేయడానికి పేర్కొన్న కారణాలు ► రిజిస్ట్రార్ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ► రికార్డుల నిర్వహణలో సరైన విధానం పాటించలేదు. ► రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చారు. ► 2017 ఫిబ్రవరి 4న క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ► 2018 జనవరి17న క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించకూడదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని ప్రిన్సిపల్ సెక్రెటరీ 2018 ఫిబ్రవరి 5న పునరుద్ఘాటించారు. పాలకమండలికి సమాచారం ఇచ్చి క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించి ఉంటే వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ► అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ► ఏపీ యూనివర్సిటీ యాక్ట్ నంబర్ 4, 1991 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా, అనుకూలమైన వ్యక్తుల ప్రయోజనాల నిమిత్తం వర్సిటీ నిధులను ధారాదత్తం చేసే రీతిలో రివైజ్డ్ పేస్కేల్ అమలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్ నిధులను దుర్వినియోగం చేశారు. ► దుర్వినియోగమైన నిధులు వ్యక్తిగతంగా ఎందుకు రాబట్టకూడదో జనవరి 28 లోపు వివరణ ఇవ్వాలని కోరారు. 2018 ఏప్రిల్ 4న పదోన్నతులు : బి.క్రిష్టప్ప, ఎల్.లింగమయ్య (సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్), బి.రామకృష్ణయ్య (సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్), బి.శ్రీలత, ఆర్.శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్ (సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్)లకు పదోన్నతులు కల్పించారు. 2018 జులై 11న తిరిగి పదోన్నతులు : ఎం.తిమ్మప్ప (సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్), పి.శ్రీనివాసులు (సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్)లకు పదోన్నతులు కల్పించారు. 2018 సెప్టెంబర్ 19న పదోన్నతులు : జి.వెంకట్రాముడుకు సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. 2018 సెప్టెంబర్ 28న పదోన్నతులు : ఎ.మల్లికార్జున, వెంకటరమణ (జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్), ఖతీజా బీ, జి.బాలవీరన్న, ఆర్.సాయిశివ, జమాలుద్దీన్, శ్రీనివాసులు, బ్రహ్మానంద, వెంకటవిజయ (సీనియర్ అసిస్టెంట్)లకు పదోన్నతులు కల్పించారు. ఎస్కేయూకు రూ.22.19 లక్షలు నష్టం : క్రియేటివ్ పోస్టులు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన పోస్టుల్లో కాకుండా ఇష్టానుసారంగా పోస్టులు క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించడం. క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పిస్తే సదరు ఉద్యోగుల జీతాన్ని మొత్తం వర్సిటీ ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా , పనిభారం లేకపోయినా క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతి కల్పించారు. దీంతో వర్సిటీకి ఇప్పటి దాకా రూ. 22,19,063 ఖజానాకు భారం పడింది. ► వీసీ ముందస్తు అనుమతి లేకుండానే డాక్టర్ రమేష్ బాబు (రీసెర్చ్ స్టాటిస్టికల్ ఆఫీసర్)కు యూజీసీ రివైజ్డ్పే స్కేలు మంజూరు చేయడానికి గత రిజిస్ట్రార్ సుధాకర్ బాబు ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చారు. ► ఇంజినీరింగ్ సెక్షన్లో వీసీ ఆదేశాలు లేకుండానే నేరుగా ఒకరికి ఉద్యోగం కల్పించారు. స్టడీ సెంటర్ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఇన్‌క్లూజన్ విభాగంలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. ► ఒక సూపరింటెండెంట్‌కు వీసీ ముందస్తు అనుమతి లేకుండా రూ.5 లక్షలు, రూ.2 లక్షలు, అడ్వాన్స్ రూపంలో కట్టబెట్టారు. అదే విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌కు అడ్వాన్స్ రూపంలో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు విస్మరించారు. కంప్యూటర్ సైన్స్‌లో మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవరాజును సస్పెండ్ చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాలేదని గతంలో మూడు మెమోలు ఇచ్చారు. మూడు దఫాలు మెమో ఇస్తే సస్పెండ్ చేయాలని నిబంధన ఉండడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఒకరికి షోకాజ్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జె.ఖెజియారాణికి సోమవారం షోకాజ్ నోటీసు అందచేశారు. ఆన్లైన్ తరగతులు తీసుకోకపోవడం, స్కాలర్లతో ఆన్లైన్ తరగతులు ఇప్పించిన సంగతి డిసెంబర్ 15న వీసీ ఆకస్మిక తనిఖీలో నిర్ధారణ అయ్యింది. డిసెంబర్ 16 వరకు 20 రోజుల పాటు చైల్డ్‌కేర్ సెలవులు తీసుకోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. చైల్డ్‌కేర్ సెలవులు తీసుకోవడానికి నిబంధనలు ఏవీ లేకపోవడంతో ఎలా వినియోగించారో తెలపాలని వివరణ కోరారు. కెమిస్ట్రీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ పి.వెంకటరమణ కెమిస్ట్రీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ కె.సుధాకర్‌బాబును సస్పెండ్ చేయడంతో ఆ స్థానంలో రిజిస్ట్రార్ పి.వెంకటరమణకు బాధ్యతలు చేపట్టారు. క్యాంపస్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.శంకర్‌నాయక్.. ప్రొఫెసర్ పి.వెంకటరమణకు బాధ్యతలు ఇచ్చారు. -
ముఖ్యమంత్రి మతంపై పిటిషన్
సాక్షి, అమరావతి: తగిన ఆధారాలు, సమాచారం లేకుండా కోర్టులను ఆశ్రయించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము ఆధారాలు అడిగిన తరువాత సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటామని పిటిషనర్లు పేర్కొనడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మతం గురించి ఎలా మాట్లాడతారని పిటిషనర్ ఆలోకం సుధాకర్‌బాబును హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా ఈ కేసులో ముందుకెళ్లలేమని తేల్చి చెప్పింది. తన మతం ఏమిటో బహిర్గతం చేసేలా ముఖ్యమంత్రినే ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మీరు పిటిషన్ దాఖలు చేస్తే, ముఖ్యమంత్రి ఎందుకు ఆధారాలు చూపాలని ప్రశ్నించింది.ఈ వాజ్యంలో గవర్నర్‌ను ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రకటిస్తూ ఈ కేసు విచారణను ఈ నెల 22వతేదీకి వాయిదా వేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. డిక్లరేషన్ పై టీవీ చానళ్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య ప్రస్తావించగా ‘టీవీ చానళ్ల గురించి అసలు చెప్పొద్దు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
డాక్టర్ ఈసీ గంగిరెడ్డికి ఘన నివాళి
సాక్షి, తాడేపల్లి: పేదల వైద్యుడిగా పేరుగాంచిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణించడం బాధాకరమని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. డాక్టర్ గానే కాకుండా రైతాంగం కోసం పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయనను కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, గంగిరెడ్డి గారి కుటుంబాలకు ప్రజలతో ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. ఇవ్వాల తాడేపల్లిలోని వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు అక్క చెల్లెమ్మలపై అభిమానం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా అక్క చెల్లెమ్మలపై ఆయనకు ఉన్న అభిమానం చాటుకున్నారన్నారు. రేపు వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభం కానుందని తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు వైఎస్సార్ జలకళ పథకం ఒక వరంగా పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా.. రూ.6వేల కోట్లతో గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ( సీఎం జగన్‌కు దళితులంటే గౌరవం) చంద్రబాబుది కుట్రపూరిత వైఖరి: ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ‘‘చంద్రబాబుది కుట్రపూరిత వైఖరి. బడుగుబలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్నది చంద్రబాబు కాదా? అప్పుడెందుకు హర్షకుమార్ రౌండ్‌టేబుల్ సమావేశం పెట్టలేదు?’’ -
చంద్రబాబుది కుట్రపూరిత వైఖరి
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు తీర్చడానికే..
సాక్షి,అమరావతి: పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్ ప్రారంభించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్)ను సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని తెలిపారు. శుక్రవారం వారు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడారు. ► గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ చంద్రబాబు బంధువు భాస్కర్ నాయుడు చేతిలో ఉండేవి.రూ.లక్షలకు అమ్ముకున్నారు. 50 మంది చేయాల్సిన పనిని 30 మందితో చేయించి.. మిగిలిన జీతాల్ని కాంట్రాక్టర్లే తీసుకునేవారు. ► అవినీతికి పాల్పడ్డ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే తప్పా? ఆయన దోచుకున్న సొమ్ములో చంద్రబాబు, లోకేశ్‌లకు వాటా ఉంది. ► బలహీన వర్గాల నేతగా ఎదుగుతున్న మోకా భాస్కర్ రావును హత్య చేయించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భాస్కర్ రావు హ త్యకు కుట్ర జరిగిందని అనుమానం ఉంది. కొల్లు రవీంద్రను వెంటనే అరెస్టు చేయాలి. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పనితీరు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోతు న్నాయని అన్నారు. దేవినేని ఉమా పనికిమాలిన మాటలు మాట్లాడు తున్నా డని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. -
దళితుల ఆత్మగౌరవాన్ని బాబు దెబ్బతీశారు
-
డాక్టర్ సుధాకర్‌తో మాట్లాడినట్లు నిరూపిస్తారా?
సాక్షి, మార్కాపురం (ప్రకాశం) : అనస్తీషియా వైద్యుడు సుధాకర్ బాబు వ్యవహారంపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ చేస్తున్న రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో దీనిని మేనేజ్ చేయడానికి తాను రంగంలోకి దిగినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య చేస్తున్న ఆరోపణలను ఖండించారు. (స్థానికులే చేతులు కట్టేశారు) డాక్టర్ సుధాకర్‌తో గాని, వాళ్ల అమ్మతో గాని నేను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని, నిరూపించడానికి మీరు సిద్దమా? అని మంత్రి సవాల్ విసిరారు. మేనేజ్ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకు బాగా వర్తిసుందన్నారు. ఎందుకంటే వారు దేనినైనా, ఎవరినైనా మేనేజ్ చేయగలరని విమర్శించారు. వర్ల రామయ్య, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళిత జాతికి క్షమాపణ చెప్పించాలంటూ డిమాండ్ చేశారు. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!) టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. జగనన్న నాయకత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని, దళిత జాతికి ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తున్నారో అందరికీ తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు అనస్తీషియా డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. (డాక్టర్ సుధాకర్ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్) -
డాక్టర్ సుధాకర్ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్
సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితుల్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి 151 సీట్లు ఇచ్చినా ఇంకా చంద్రబాబుకు బుద్ధి రాలేదని అన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, మోసం చేయటం ఆయన పేటెంట్ హక్కు అని మండిపడ్డారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ బాబు టీడీపీకి చెందిన వ్యక్తి అని ఆయన అన్నారు. గతంలో సుధాకర్ బాబు టీడీపీ సీటును ఆశించిన వ్యక్తి అని అన్నారు. (అనస్థీషియా వైద్యుడి వీరంగం) ఎంపీ నందిగం సురేష్ ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘దళితుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కుల రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. దళితులకు విలువ లేకుండా చేయాలన్నదే ఆయన ఆలోచన. వారిని నాశనం చేసింది కూడా చంద్రబాబే. డాక్టర్ సుధాకర్ బాబు 2019లోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. (చంద్రబాబు డైరెక్షన్లో.. డాక్టర్ సుధాకర్) వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం దళితుడిని బలి చేస్తున్నారు. సుధాకర్ బాబుని బట్టలు లేకుండా రోడ్డుపైన పడేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం దళితులకు ఇళ్లస్థలాలు ఇస్తానంటే కోర్టుకెళ్లి దాన్ని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. దళితులకు ప్రయోజనం కలిగించే ఇంగ్లీష్ మీడియం కూడా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు ముందు దళితుల అందరికీ క్షమాపణ చెప్పాలి. పేదల పొట్ట కొట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడు. సుధాకర్ బాబు ఎప్పటికైనా తనను చంద్రబాబు ఎలా వాడుకుంటున్నారు ఆలోచించాలి’ అని హితవు పలికారు. (‘బాబు చేతిలో ఆ డాక్టర్ కీలు బొమ్మ’) -
‘బాబును దళిత సమాజం ఏనాడు క్షమించదు’
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లాలో జరిగిన ట్రాక్టర్ రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే సుధాకర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ట్రాక్టర్ ప్రమాదం జరిగిన 24 గంటలులోపే బాధిత కుటుంబాలకు సీఎం జగన్ ఎక్స్ గ్రేషియా అందించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు 15వ తేదీ పత్రిక ప్రకటన జారీ చేసి డాక్టర్ సుధాకర్ ఎలా మాట్లాడాలో ముందే స్క్రిప్ట్ రచించారని ఆయన మండిపడ్డారు.16వ తేదీన సంఘటన జరిగితే ఒక రోజు ముందే పత్రిక ప్రకటన చేశారని దుయ్యబట్టారు. దళిత సమాజము పట్ల మొదటి నుంచి చంద్రబాబుకు చిన్నచూపే ఉందని, చంద్రబాబు దళిత అనే పదం వాడటం మానుకోవాలని అన్నారని సుధాకర్‌బాబు ఫైర్ అయ్యారు. మతి స్థిమితంలేని డాక్టర్ సుధాకర్ ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు. ('ఎల్లో ఛానల్స్‌లో చూసుకున్నాకే నిద్రపోతాడు') చంద్రబాబు దళితుల్ని ప్రలోభాలకు గురిచేసి తప్పుదారి పట్టించిన వ్యక్తి అని, అదేవిధంగా డాక్టర్ సుధాకర్‌ను కూడా తప్పుదారి పట్టించారని అని తెలిపారు. నక్క ఆనందబాబు నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారని, దళితులల్లో ఎవరైనా పుడతారా అంటూ చంద్రబాబు వ్యాఖ్యాలు చేసినప్పుడే నక్క ఆనంద బాబు రాజీనామా చేసి ఉండాలన్నారు. ఆనాడు దళితులుపై ప్రేమ ఎందుకు లేదని, దళిత సమాజంలో చంద్రబాబును కోరుకునే వారే లేరని సుధాకర్‌బాబు విరుచుకపడ్డారు. ఆంగ్ల విద్య విధానం దూరం చేసి దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయంలో దళితులు ఊచకోతకు గురయ్యారు, ఆ కుటుంబాలను ఎప్పుడు అడిగినా బాబు దారుణాల గురించి చెబుతారని ఆయన అన్నారు. నక్క ఆనందబాబు దొంగదీక్ష ఎలా చేస్తారని, ఆనాడు దళితుల్ని అవమానించినపుడు ఆయన ఏమయ్యారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దళితవాడల్లోకి చంద్రబాబు వస్తే తాము నిలదీస్తామన్నారు. ఎందుకు ఆంగ్ల విద్య దూరం చేశారని ప్రశ్నిస్తామన్నారు. తమ బిడ్డలు చదువుకునే స్కూల్స్ అన్ని బాగుండాలని సీఎం జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబును దళిత సమాజం ఏనాడు క్షమించదని ఆయన మండిపడ్డారు. -
అట్టడుగు వర్గాలు, నిరుపేదలకు కనీవినీ ఎరగని ఇక్కట్లు
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అట్టడుగు వర్గాలను, నిరుపేదలను దారుణంగా దెబ్బతీసిందనడంలో సందేహమే లేదు. సమాజం ఏమాత్రం సిద్ధం కాకముందే ముందుజాగ్రత్త చర్యగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్తంభింపచేశారు. జాతీయ విపత్తులు, ఆకస్మిక ఘటనలు ఎదురైన సమయంలో ఆర్థిక అంతరాయాలు కలిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పనిచేస్తూ వచ్చింది కానీ లాక్డౌన్ మనం కనీవినీ ఎరుగనంత స్థాయిలో వచ్చిపడింది. పెద్ద నోట్ల రద్దు సృష్టించిన ప్రకంపనల సమయంలో కానీ, జీఎస్టీ విధింపుతో వచ్చిన అంతరాయాల సమయంలో కానీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యక్తిగత గృహరుణాలు అత్యంత అధిక స్థాయికి చేరుకున్నాయి. పొదుపులు కూడా దారుణంగా పడిపోయాయి. నాలుగు కారణాల వల్ల అట్టడుగు వర్గాలు లాక్డౌన్ నేపథ్యంలో దారుణంగా దెబ్బతిన్నాయి. 1. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పేదప్రజలు తమ స్వస్థలాలకు తరలి వెళ్లలేకపోయారు. 2. అన్ని రంగాలపై ఒకే సమయంలో లాక్డౌన్ ప్రకటిం చారు. 3. సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగడంతో దిగువ తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే రుణ పరపతి మార్గాలు మూసుకుపోయాయి. 4. నిత్యావసర వస్తువులు పేదవారికి అందుబాటులో లేకుండా పోయాయి. ధరలు పెరిగి పోయాయి. దేశవ్యాప్తంగా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలపై ఒకే సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల దేశందేశమే స్తంభించిపోయింది. దీంతో పనికోసం వెతుక్కుంటూ వలసపోయే అవకాశం ప్రజలకు ఏమాత్రం లేకుండా పోయింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లాగా కాకుండా, అసంఘటిత రంగానికి సంబంధించి వాస్తవ గణాంకాలు మనకు అందుబాటులో ఉండవు. తాజా నివేదిక ప్రకారం దేశంలో హోటల్, పర్యాటక సంబంధిత రంగాల్లో ఏడు కోట్లమంది కార్మికులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారని తెలుస్తోంది. 85 శాతం కార్మికులు సంఘటిత రంగానికి వెలుపలే ఉండటంతో వీరి వేతనాలు, కూలీలు చెల్లించకుండా నిలిపివేశారు. మామూలు సందర్భాల్లో అయితే అట్టడుగువర్గాల ప్రజలు తమ పొరుగునే ఉన్న కిరాణా దుకాణాలు, ఇతర షాపుల్లో రుణం ప్రాతిపదికన లేదా నెల చివరలో చెల్లిస్తామనే ఒడంబడికతో నిత్యావసర వస్తువులు కొనుక్కునేవారు. అయితే నిత్యావసర సరుకుల రవాణా స్తంభించిపోవడంతో సరఫరాకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడినందున మొదట్లో కొద్ది రోజులు తప్ప చాలా ప్రాంతాల్లో అప్పుకు సరుకులు ఇచ్చే వెసులుబాటు లేకుండాపోయింది. ఇలా ఆదాయాలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో అట్టడుగు వర్గాల ప్రజలను లాక్డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపుగా సంఘటిత రంగంపై ఆధారపడటం, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే సామాజిక భద్రత లేకపోవడం వల్ల వీరికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ కారణం వల్లే పేద వర్గాలపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. అందుకే ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం నడిచిపోతున్న వలస కార్మికులకు సంబంధించిన దిగ్భ్రాంతి కరమైన దృశ్యాలను దేశం చూడాల్సి వస్తోంది. దేశంలోని విభిన్న వర్గాల ప్రజలపై ఈ సంక్షోభం ప్రభావం పూర్తి భిన్నంగా ఉంటోంది. రబీ పంట కోతల సమయంలో వలస కూలీలు ప్రయాణించడానికే వీలు లేకపోవడంతో గ్రామీణ వ్యవసాయ వేతనాలు పెరిగాయి. కూలీలు దొరక్కపోవడంతో లేబర్ ఖర్చు బాగా పెరిగింది. ఈ సంక్షోభంలో చిన్న స్థాయి వ్యాపారులు, అత్యవసరం కాని సేవారంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా దెబ్బతినిపోయారు. అట్టడుగువర్గాల నుంచి వచ్చిన కార్మికుల్లో ఎక్కువమంది వ్యవసాయ కూలీలుగానూ లేక వ్యవసాయేతర పరిశ్రమల్లో కార్మికులుగానూ ఉంటున్నారు. వీరిపైనే చాలా వరకు సంక్షోభ ప్రభావం కనిపిస్తుంది. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతినిపోయిన వారి సహాయార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘటిత బ్యాంకింగ్ రంగం నుంచి రుణాలను కనీసం రీ షెడ్యూల్ చేస్తే అట్టడుగు వర్గాలవారిని కాస్తయినా ఆదుకోవచ్చు. ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు ఒకేసారి రూ.10,000 మొత్తం కానీ లేక వడ్డీ లేని రుణాలు కాని ఇస్తే పేదవర్గాలు కొంతమేరకైనా కోలుకుంటాయి. అలాగే కరోనా ప్రభావం గురించిన జాగరూకతను ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంది. భౌతికదూరం, వ్యక్తిగత పారిశుధ్యం పాటించడం తప్పనిసరి. డా.ఎస్. సుధాకర్‌బాబు వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం హైదరాబాద్ యూనివర్సిటీ మొబైల్ : 94404 59464 -
డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలు అవాస్తవం
-
చంద్రబాబు ఆటలు కొనసాగవు
-
చంద్రబాబు చౌకబారు రాజకీయాలు మానుకోవాలి
-
టీడీపీకి సుధాకర్‌బాబు రాజీనామా
సాక్షి, కర్నూలు : కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి చిల్లర నాయకుడిని చూడలేదన్నారు. తన పబ్బం గడుపుకునేందుకు మతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని విమర్శించారు. క్రైస్తవులు తలకాయలు తీసే టెర్రరిస్టులు కాదని హితవు చెప్పారు. రాజకీయం కోసం మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచి పరిణామం కాదని సుధాకర్‌బాబు అన్నారు. -
శరవేగంగా పోలవరం పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం), జలవిద్యుత్ కేంద్రం పనులకు శుక్రవారం భూమి పూజ చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ శనివారం పనులు ప్రారంభించింది. శరవేగంగా పనులు పూర్తి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, 24 గంటలూ పనులు చేయడం ద్వారా రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ సంస్థ ప్రణాళిక రచించింది. భారీగా యంత్ర సామగ్రిని ప్రాజెక్టు వద్దకు తరలించింది. పోలవరం సీఈ సుధాకర్‌బాబు పర్యవేక్షణలో మేఘా ఇంజనీర్లు, కార్మికులు పనులు ప్రారంభించారు. గోదావరికి ఇటీవల వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పాడైన అప్రోచ్ రోడ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేస్తున్నారు. భారీ యంత్రాలు 24 గంటలూ రాకపోకలు సాగించడానికి వీలుగా రహదారులను పటిష్టంగా నిర్మిస్తున్నారు. నదిలో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తొలుత స్పిల్ వే పనులను చేపట్టాలని కాంట్రాక్టు సంస్థకు అధికారులు దిశానిర్దేశం చేశారు. దాంతో స్పిల్ వే పనులకు శ్రీకారం చుట్టిన మేఘా.. స్పిల్ వే, స్పిల్ చానల్ సమీపంలో నిల్వ ఉన్న నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క గోదావరిలో వరద తగ్గే కొద్దీ పనుల వేగం పెంచేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. స్పిల్ వే, స్పిల్ చానల్ పనులకు సమాంతరంగా వరద తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, జలవిద్యుత్ కేంద్రం పనులను చేపట్టి.. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని మేఘా పేర్కొంది. -
ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది
-
‘లోకేష్‌ను కన్నందుకు బాబు బాధపడుతున్నాడు’
సాక్షి, తాడేపల్లి: రాజశేఖర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు, లోకేష్‌ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించులేకపోయాడు. ఇలాంటి కొడుకు పుట్టినందుకు చంద్రబాబు మథనపడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చర్రితలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏడాది ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించబోతున్నారని తెలిపారు. రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. మాట తప్పారని ఆరోపించారు. జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల దెబ్బలకు చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రజాదరణ కార్యక్రమం అయినా ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు సుధాకర్ బాబు. చంద్రబాబు విద్యను అమ్ముకునే వాడిని విద్యాశాఖ మంత్రిగా చేస్తే.. జగన్ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు సుధాకర్ బాబు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్ అవుతుందన్నారు. ఏనాడైతో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడే.. నాటి నుంచే టీడీపీ కనుమరుగవడం ప్రారంభించిందన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో మిగిలిన వేలాది కోట్ల రూపాయలు చంద్రబాబుకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన పాపాలను కడుక్కొడానికి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలని ఆయన సూచించారు. కాకపోతే.. చంద్రబాబు గంగానదిలో దిగితే అది కూడా కలుషితమవుతుందన్నారు సుధాకర్ బాబు. జగన్ పాలన గురించి బుద్ధిలేని బుద్ధా వెంకన్న కూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. దుర్గ గుడిలో కొబ్బరి చిప్పల దొంగ బుద్ధా వెంకన్న.. రాయడం, చదవడం రాని వెంకన్న కూడా ట్విటర్లో పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బుద్ధా వెంకన్నకు ట్విటర్లో పోస్ట్ చేయడం, కామెంట్ చేయడం వచ్చా అని ప్రశ్నించారు. -
కొబ్బరి చిప్పల దొంగ బుద్ధా వెంకన్న
-
‘చంద్రబాబు డీఎన్ఏలోనే నాయకత్వ లోపం ఉంది’
సాక్షి, తాడేపల్లి : వినాయకుడి పూజకు వెళ్లిన దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నేతలు కులం పేరుతో దూషించడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ నేతలు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కుల దూషణలో చంద్రబాబే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా దళితులపై దాడులే జరిగాయన్నారు. దళితులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చుట్టాలుగా మారుతున్నారని వారిపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో దళిత మహిళలను వివస్త్రను చేసి దాడులు చేశారన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయనకు రాజ్యాంగంపై గౌరవం లేదని నాగార్జున ఆరోపించారు. (చదవండి : దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం) టీడీపీ యాంటీ దళిత పార్టీ : సుధాకర్ బాబు రాజధాని ప్రాతంలో దళిత మహిళ ఎమ్మెల్యే శ్రీదేవిపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు. దళితులను అవమానించిన చంద్రబాబును ఆపార్టీ దళిత నేతలు నిలదీయకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ యాంటీ దళిత పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డీఎన్ఏలోనే నాయకత్వ లోపం ఉందన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న పనులకు రాష్ట్రం సిగ్గుతో తలదించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిని సీఎం జగన్ బయటపెడుతుంటే తట్టుకోలేకనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. -
23 ఎల్లో స్నేక్స్ తప్పించుకున్నాయి
-
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
-
ఐటిగ్రిడ్ అశోక్‌కు లోకేష్‌కు సంబంధం ఏమిటి?
-
కొందరివాడు బీఎన్.. అందరివాడు టీజేఆర్
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తరపున టీజేఆర్ సుధాకర్‌బాబు, టీడీపీ తరపున బీఎన్.విజయ్‌కుమార్ ప్రధానంగా పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇరుపార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గణాంకాలను పరిశీలించినట్లయితే సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నట్లు విధితమవుతుంది. నామినేషన్లను వేసినప్పటి నుంచి నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం వైఎస్సార్సీపీ వైపే గాలివాటం ఉన్నట్లు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇరుపార్టీలు, అభ్యర్థుల బలాబలాలను అంచాని వేసినట్లయితే ఈవిధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సమస్యల మీద అలుపెరుగని పోరాటం .. ♦ కొత్తగా పోటీచేస్తుండటం వలన నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేక ఓటు ప్రభావం లేకపోవడం కలిసొచ్చే అంశం. ♦ 9 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే జనాభిప్రాయం అభ్యర్థికి బలాన్నిస్తుంది. ♦ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని రకాల ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ♦ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎలాంటి అసమ్మతి వర్గాలు లేకపోవడం శుభపరిణామం ♦ టిక్కెట్టు ఖరారు కాకుముందే సమన్వయకర్తగా ఏడాదికి పైగా నియోజకవర్గంలో తిరుగుతూ గ్రామాల్లో పట్టు సాధించటం అనుకూలం. ♦ సుధాకర్‌బాబు వాగ్దాటి కలిగిన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించటం. ♦ నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న బూచేపల్లి కుటుంబం అండదండలు సుధాకర్‌బాబుకు పుష్కలంగా లభించటం మరో ప్రధాన బలంగా చెప్పవచ్చు ♦ నాలుగు మండలాల కన్వీనర్లు, ప్రధాన నాయకులతో పాటు గ్రామస్థాయి నాయకులతో చొరవగా కలుపుగోలుగా కలిసిపోవడం మరింత బలం. ♦ స్థానిక సమస్యలను ఎక్కువుగా ప్రజలలోకి తీసుకుపోయేందుకు తగిన సమయం లేకపోవడం ప్రతికూలతలుగా చెప్పుకోవచ్చు. వ్యతిరేక వర్గంతో ఉక్కిరిబిక్కిరి.. ♦ నియోజకవర్గంలో పదేళ్ల నుంచి పనిచేస్తున్నందున దానికి సంబంధించిన అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది ♦ ఎస్సీ, బీసీలను ఆకట్టుకున్నా ఓసీ సామాజికవర్గంలో వ్యతిరేకత ఉంది. ♦ ఐదేళ్ల పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ప్రభావం అభ్యర్థిపై చూపడం ప్రతికూలాంశం. ♦ ఆది నుంచి అసమ్మతి నాయకుల తారస్థాయి వ్యతిరేక ప్రచారం అభ్యర్థికి ఇబ్బందికరంగా మారటం. ♦ కలిసిపోయినట్లు నటిస్తున్న అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం. ♦ పదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉపయోగపడినా ఐదేళ్ల క్రితం నుంచి ఇన్చార్జిగా పనిచేసినా అధికార పార్టీలోనే వ్యతిరేక పవనాలు ఆందోళన కలిగించే అంశం. -
చంద్రబాబుది రక్తచరిత్ర
సాక్షి, అమరావతి: నమ్ముకుంటే పేదలను కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చేది వైఎస్ కుటుంబమేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. విజయవాడ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యే, నందిగం సురేష్‌కు లోక్‌సభ..ఇలా ఎంతోమంది పేదవారికి టికెట్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబుది రక్తచరిత్ర అని, ఎన్నికలొస్తుండడంతో ఆయన నిజస్వరూపం బట్టబయలౌతోందని విమర్శించారు. తన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొనలేక హత్యారాజకీయాలకు చంద్రబాబు తెరలేపారని ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ఆయన తండ్రి రాజారెడ్డిని హత్య చేయించారన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి చేసుకోబోతున్న తరుణంలో ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయించారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేని చంద్రబాబునాయుడు ఘెరంగా వైఫల్యం చెందాడని అన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా చంద్రబాబు, ఆయన గ్యాంగ్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తన అక్రమాలకు అడ్డుగా ఉన్నారని అప్పట్లో వంగవీటి రంగా, పింగళి దశరథరామ్, ఇటీవల చెరుకులపాడు నారాయణరెడ్డి తదితరులను హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. జగన్ సుపరిపాలన రాబోతోంది.. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సుపరిపాలన రాబోతోందని, మాజీ ఎంపీ హర్షకుమార్ కళ్లు తెరిచి మాట్లాడాలని సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయంటూ గతంలో ఆయనే ధ్వజమెత్తిన విషయాన్ని మరచిపోయినట్లు ఉన్నాడని తెలిపారు. వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేసి..టీడీపీ నుంచి సీటు తెచ్చుకునే కుసంస్కృతి ఆయనకే చెల్లుతుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ చనిపోతున్నాడని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం హర్షకుమార్కు భావ్యం కాదని సుధాకర్‌బాబు హితవు పలికారు. -
చంద్రబాబు చరిత్ర అంతా రక్తసిక్తం: సుధాకర్‌బాబు
-
హిందూజా భూ వ్యవహారంలో చర్చకు సిద్ధమా!
సాక్షి, హైదరాబాద్: హిందూజా సంస్థ తన డబ్బుతో 11 ఎకరాల్ని జగన్ పరం చేసిందన్న ఆరోపణపై బహిరంగ చర్చకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు సవాల్ విసిరారు. చంద్రబాబు నిజంగా నారావారిపల్లెలో పుట్టి ఉంటే చర్చకు సిద్ధపడాలన్నారు. ఈ విషయంలో జగన్ ప్రమేయం ఉందని, ఆ భూమిని అనుభవిస్తున్నారని, ఆయన పేరు మీద రిజిస్టర్ అయినట్టుగా నిరూపించే సాక్ష్యాధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు చూపనిపక్షంలో చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా చంద్రబాబు వ్యవహారం తయారైందన్నారు. హిందూజా సంస్థకు భూములకు సంబంధించి ఎల్లో మీడియా వండి వార్చిన కథనం గురించి చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడు తున్నారని, ఎల్లో మీడియాను నమ్ముకుని ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని మండిప డ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని విమర్శించారు. మరో 26 రోజుల్లో చంద్రబాబు చెంప పగులగొట్టే తీర్పును ఏపీ ప్రజలు ఇవ్వబోతు న్నారని, అయినా ఆయనకు సిగ్గురావట్లేదన్నారు. -
20 రోజుల్లో చంద్రబాబు చెంప పగిలే తీర్పు
-
చంద్రబాబు గజదొంగ.. లోకేష్ డేటా దొంగ
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మరణశాసనం తప్పదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నమ్ముకున్న జేబు మీడియా సంస్థల ద్వారా చంద్రబాబు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు లేనిపోని నిందలు ఆపాదిస్తున్నారని, జగన్ స్థాయిని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో వైఎస్ జగన్‌కు ఆకాశమంత విశ్వసనీయత ఉందని, దాన్ని ఎవరు చెరపలేరన్నారు. హిందుజా భూ వ్యవహారంలో ఎలాంటి చర్చకైనా తమ పార్టీ సిద్ధమని సవాల్ విసిరారు. 20 రోజుల్లో చంద్రబాబుకు చెంప పగులకొట్టే తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. చంద్రబాబు పాలనలో దోపిడీ, అవినీతి విచ్చలవిడిగా జరిగిందని, జన్మభూమి కమిటీలు దోపిడీ కమిటీలుగా మారాయన్నారు. వైఎస్ జగన్‌పై నిందలు వేయడం దారుణమని, అవినీతి చక్రవర్తి చంద్రబాబేనని దుయ్యబట్టారు. చంద్రబాబు గజదొంగైతే.. లోకేష్ డేటా దొంగని విమర్శించారు. డేటా దొంగతనం జరిగితే.. ఐటీ మంత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంలేదని, పెడితే దొరికిపోతాడా? అని ప్రశ్నించారు. ఐటీ మంత్రి బదులు పెయిడ్ ఆర్టిస్ట్, సినిమాలు లేనివాడితో మాట్లాడిస్తున్నారేందని ఎద్దేవా చేశారు. ఏ ఎన్నికల్లో సూటిగా గెలవలేని దద్దమ్మ చంద్రబాబని, వచ్చే 30 రోజుల్లో రాజన్న రాజ్యం కచ్చితంగా వస్తుందని సుధాకర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబు వీధి రౌడీలను ప్రోత్సహిస్తున్నారు
-
‘పెన్షన్ కోసం వస్తే దాడి చేయడం దారుణం’
సాక్షి, విజయవాడ : పెన్షన్ కోసం వచ్చిన వృద్ధుడిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత సుధాకర్ బాబు అన్నారు. చింతమనేని ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లను టీడీపీ నేతలు చులకనగా చూస్తున్నారని విమర్శించారు. పెన్షన్ కోసం వస్తే ఒక ఎమ్మెల్యే దాడి చేయమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఉండాల్సిన లక్షణాలు చింతమనేనికి లేవన్నారు. టీడీపీ నేతలు ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిచారు కాబట్టే.. ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారన్నారు. (మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. వృద్ధుడిపై వీరంగం) నోటిఫికేషన్ వస్తే చెక్కులు చెల్లుతాయా? డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పలుమార్లు వైఎస్ జగన్ అసెంబ్లీలో కోరినప్పటికీ.. ఇంతవరకు ఒక్క పైసా కూడా చంద్రబాబు మాఫీ చేయలేదని సుధాకర్ బాబు విమర్శించారు. రుణమాఫి చేయకుండా ఎన్నికల వేళ రూ. 10వేలు ఇస్తామంటూ చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రూ.10వేలు పెట్టుబడి కింద ఇస్తున్నారో లేక రుణమాఫీ కింద ఇస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ చెక్కులు చెల్లుతాయా అని ప్రశ్నించారు. పోస్ట్‌డేటెడ్ చెక్కులు ఇస్తూ మహిళలను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే దొచుకున్న ధనం ప్రజలకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ది ఉంటే నారావారిపల్లి, సింగపూర్‌లో దాచుకున్న ధనాన్ని ప్రజలకు ఇవ్వాలని సుధాకర్ బాబు సవాల్ చేశారు. మంత్రులు దోచుకున్న వేల కోట్ల రూపాయలను ప్రజలకు పంచాలన్నారు. ఢిల్లీ నడివీధుల్లో చంద్రబాబు నిజస్వరూపాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారన్నారు. చంద్రబాబు దొంగతనం బయటపడింది కాబట్టే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. -
‘చింతమనేని ఒక విధీ రౌడీలా వ్యవహరిస్తున్నారు’
-
ఆ నిర్ణయం వైఎస్సార్ సీపీ విజయం: సుధాకర్ బాబు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న పింఛన్ పెంపు నిర్ణయం వైఎస్సార్ సీపీ విజయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు ఇసుక, మట్టి, భూ మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దళిత, పీడిత జనానికి మనో ధైర్యం నింపిందని చెప్పారు. ఇచ్ఛాపురం ముగింపు సభతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. వైఎస్సార్ సీపీకి భయపడి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని పార్టీ టీడీపీ అంటూ మండిపడ్డారు. పోలవరంలో అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ సమిట్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. -
గాంధీ- నెహ్రూల వారసత్వం ఇంతకు దిగజారుతుందా?
సాక్షి, విజయవాడ : దొంగల ముఠాతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో స్నేహం చేయడం ద్వారా రాహుల్ రాజకీయంగా మరణించినట్లేనని ఘాటుగా విమర్శించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ నేతలే చార్జిషీట్ విడుదల చేశారని, అటువంటి వ్యక్తితో ఇప్పుడు ఎలా జతకడతారని ప్రశ్నించారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను చెరో పక్క కూర్చోబెట్టుకున్న రాహుల్‌కు తమ నాయకులపై విమర్శలు చేసే అర్హత లేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మనుమడు ఇంత దౌర్భాగ్యపు వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని, గాంధీ- నెహ్రూల వారసత్వం ఇంతకు దిగజారుతుందనుకోలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబం గురించి జాగ్రత్తగా మాట్లాడాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు. ఈ సందర్భంగా కొన్ని దొంగ పత్రికల ద్వారా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సీబీఐ అంటే మీ పార్ట్నర్కు భయం.. తమ పార్టీకి నిజంగా బీజేపీతో సంబంధాలు ఉండి ఉంటే తమ నాయకుడిపై కేసులు ఉండేవా సుధాకర్ బాబు అని ప్రశ్నించారు. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ పైకి సీబీఐని ఉసిగొల్పినా ఆయన భయపడలేదని అన్నారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతే వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబాలను ఓదార్చారని గుర్తు చేశారు. మీ పార్ట్నర్ చంద్రబాబుకే సీబీఐ అంటే భయమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 33వేల ఎకరాల రైతుల భూములు కాజేసిన చంద్రబాబు ని పక్కనబెట్టుకున్న రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణ ఘనత వైఎస్సార్‌దేనని, ఈ విషయంపై అనుమానాలు ఉంటే మీ తల్లి సోనియా గాంధీని అడగాలని సూచించారు. -
‘ఆ విషయంలో చంద్రబాబు విజయం సాధించారు’
సాక్షి, హైదరాబాద్: పేదవారిని మోసం చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని, పేదవాడికి చదువును కూడా అందని ద్రాక్షగా చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. విద్యావ్యవస్థను చైతన్య, నారాయణ సంస్థలకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో కులాలవారీగా వందల హామీలిచ్చారని, చంద్రబాబు రాజ్యాంగంపై ప్రమాణం చేసి అబద్ధపు పాలన చేశారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ప్రతి ఒక్కరిని నిలువునా ముంచేశారని, నాలుగున్నరేళ్లలో భూములను ఏ సంస్థలకు ఇచ్చారో.. ఎంత లాభం పొందారో ప్రజలకు చెప్పాలన్నారు. దళితుల పేరుతో నిధులు, భూములు కొల్లగొట్టారని, సబ్‌ప్లాన్ పేరుతో కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని మండిపడ్డారు. ఇసుక దోపిడి వివరాలు, భూములు లీజులు గడువు వివరాలు వెల్లడించాలన్నారు. గిరిజన ఎమ్మెల్యే హత్య వెనుక మూలాలు చంద్రబాబు వద్దే ఉన్నాయని, దళితులు, బడుగుల్లో ఒక్కరికైనా మైనింగ్ లీజులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణకు సహకరించడానికి సిద్దంగా ఉన్నామని, కానీ డీజీపీ ప్రకటనపై వివరణ కావాలన్నారు. వైఎస్ జగన్‌కు ప్రజలే రక్షణగా ఉండాలని ఈ సందర్భంగా సుధాకర్ బాబు విజ్ఞప్తి చేశారు. -
‘ఆ విషయంలో చంద్రబాబు విజయం సాధించారు’
-
అనైతిక రాజకీయాలకు భయపడేది లేదు
-
‘వైఎస్సార్ మరణం వెనుక కుట్రలు ఉన్నాయేమో’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు. రాజేంద్రప్రసాద్ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పడానికి రాజ్రేంద్రప్రసాద్కు సిగ్గుండాలన్నారు. దమ్ముంటే ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. వైఎస్ జగన్ ప్రచారం కోసమే దాడి చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేసున్నారని విమర్శించారు. కుట్రపూరితమైన రాజకీయ లక్ష్యంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు పథకాలు రచించారని ఆరోపించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఇదంతా చూస్తుంటే వైస్సార్ మరణం వెనుక కూడా కుట్రలు ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని ఆరోపించారు. శివాజీని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు.శివాజీని విచారిస్తే ఎక్కడ నిజాలు బటటపడుతాయోనని చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పాదయాత్రను ఆపడం కోసమే చంద్రబాబు కుట్ర పన్నారని దానిలో ఒక ఎస్సీ యువకుడిని భాగం చేశారన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయని సుధాకర్ బాబు పేర్కొన్నారు. -
‘తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం’
సాక్షి, విజయవాడ : తిత్లీ తుపాను కారణంగా అల్లకల్లోమైన ప్రాంతాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు విమర్శించారు. తుపాను బాధితులను వైఎస్సార్సీపీ ఆదుకుంటోందని, సహాయక చర్యల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఆపదలోనూ చంద్రబాబు అవకాశాలను వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి లేదంటే అనావృష్టి వస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. తిండి, నీరు లేక అవస్థలు పడుతుంటే.. అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి బాధితులకు నరకయాతనగా మారిందని అన్నారు. తప్పుడు లెక్కలు, పన్నులు ఎగ్గొట్టినా ఐటీ సోదాలు జరుగుతాయని, సీఎం రమేష్ మాటలు ఎవరూ నమ్మరని, ఓటుకు కోట్లు కేసులో రూ. 50లక్షలు ఎక్కడివని ప్రశ్నించారు. మిగిలిన నాలున్నర కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. -
బాబు హయంలో అతివృష్టి లేదా అనావృష్టి
-
వైఎస్ జగన్‌పై ఎవరు కుట్ర పన్నారో చెప్పాలి
-
వైఎస్ జగన్‌పై దాడికి ఎవరు కుట్ర పన్నారు?
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎవరు కుట్ర పన్నారో చెప్పాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నటుడు శివాజి టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని మండిపడ్డారు. గుంటూరులో తమ అధినేతపై రెక్కి జరిగిందన్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. మళ్లీ దాడి జరగబోతుందని తెలిపాడని, ఈ పెయిడ్ ఆర్టిస్ట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. 2010 ఉపఎన్నికల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నాందేడ్ ప్రాంతంలో పర్యటించారని, అప్పుడు చేసిన ధర్నాపై కేసు నమోదు అయిందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఆడిన మహా డ్రామాపై.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇది కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసని, బెయిల్ తీసుకుంటే ఇది కేసే కాదన్నారు. కానీ ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎదో జరిగినట్లు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. గరుడ ఆపరేషన్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారో ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చెప్పాలన్నారు. ప్రతిసారి రాష్ట్రంపై కుట్ర జరుగుతుందని చెబుతుంటే నిఘా వర్గాలు ఏమి చేస్తున్నాయని సుధాకర్ బాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వెన్నుపోటు దారుడని విమర్శించారు. జాతీయ మీడియా సర్వేలో 43 శాతం మంది వైఎస్ జగనే సీఎం అని చెబుతుంటే దానిని నుంచి ప్రజలను దృష్టిని మళ్ళించడానికే ఈ పెయిడ్ అర్టిస్టు హడావుడని తెలిపారు. ఐటీని చంద్రబాబే అభివృద్ధి చేశారని చెబుతున్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. ఈ విషయం హైదరాబాద్‌లో చెబితే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు ప్రతినెల అమెరికా వెళ్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ కులగజ్జి అని, ఇలా ప్రవర్తిస్తేనే సొంత ఊరునుంచి తరిమికొట్టారని మండిపడ్డారు. -
ప్రజల చెవ్వుల్లో పూలు పెడుతున్నారు
-
‘సింగపూర్ పర్యటన కాదు.. దొంగపూర్ పర్యటన’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యేలు ఓటమి భయంతోనే వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుది సింగపూర్ పర్యటన కాదు.. దొంగపూర్ పర్యటన అని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. అంతేకాక టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాపై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘బోడె ప్రసాద్ వాజమ్మలా మాట్లాడాడు. బోడె ప్రసాద్ ఇసుక దొంగ అని చిన్న పిల్లలు కూడా చెబుతారు. బోడె మిత్రుడు శ్రీకాంత్ కాల్‌మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు. ఈ విషయం అప్పటి సీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా చెప్పారు. బోడె నీ ఇంట్లో ఆడవాళ్ళు ఐనా నీ ప్రెస్‌మీట్ చూడగలరా? నోటి కొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం కాదు. వీధి రౌడీలా, గూండాలా మాట్లాడుతావా? పెనమాలూరులోని ఇసుక దోపిడీని నిరూపిస్తాం. బోడె నీకు ఇంక 5,6 నెలల కాలమే ఉంది, గుర్తుంచుకో. బోడె ఇంటర్ పరీక్షల్లో వేరే వారితో దొంగ పరీక్ష రాయించిన ఘనుడువని ధ్వజమెత్తారు. సెక్స్, కాల్‌మనీ పనులు ఆపండి. బోడిమాటలు మాట్లాడటం ఆపు బోడె ప్రసాద్. ఓపెన్ టెన్త్ పరీక్షలో అడ్డంగా దొరికిపోయావు. శాసన సభ్యుడిగా కొనసాగే అర్హత బోడె ప్రసాద్‌కు లేదు. రోజాపై ఒక్క చెప్పు పడితే.. మీ నాయకుడిపై లక్షల చెప్పులు పడతాయి. దమ్ముంటే ఎమ్మెల్యే రోజా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారు. 52 నెలల పాలనలో 24 సార్లు విదేశాలకు వెళ్లారు. కనీసం 24 కోట్ల రూపాయల పెట్టుబడులైనా తీసుకొచ్చారా? చంద్రబాబు నీ దొంగపూర్ పర్యటనల పేరుతో రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశావని’ వైఎస్సార్సీపీ నేత సుధాకర్ బాబు విమర్శించారు. -
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి
విజయవాడ సిటీ: తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్నను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిలదీసిన ఎమ్మెల్యే రోజాపై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. తమ ఎమ్మెల్యే రోజాపై కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు. అదే జరిగితే చంద్రబాబు ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ తామూ కోడిగుడ్లతో దాడి చేస్తామని హెచ్చరించారు. బుద్దా వెంకన్న సభ్యతా సంస్కారాలతో వ్యవహరించాలని హితవుపలికారు. ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే రోజా చేసిన పోరాటంతో సీఎం చంద్రబాబు సైతం ఆ బాలికను పరామర్శించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని నిలదీశారని ఎమ్మెల్యే రోజాపై అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. బుద్దా వెంకన్న చంద్రబాబు పాఠశాలలో చేరినప్పటి నుంచి రాజకీయ హుందాతనం లేకుండా మాట్లాడు తున్నాడని మండిపడ్డారు. మీ నాయకుడు లోకేష్ విదేశాల్లో మహిళలతో విచ్చలవిడిగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయని, ఇంట్లో పనమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. -
దళితులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది..
సాక్షి, విజయవాడ : నాలుగేళ్లుగా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, చంద్రబాబులాంటి వ్యక్తులు దళితులను కించపరుస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని, దీనికోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు గతంలో...దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారని, రాష్ట్రవ్యాప్తంగా దళితుల భూములను టీడీపీ నేతలు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మార్చొద్దని, దళితులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. -
నీకు రాజకీయ విలువలున్నాయా బాబూ?
విజయవాడ సిటీ: రాజకీయ విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని, ఆయన్నుంచి విలువలు నేర్చుకోవాల్సిన గతి తమ పార్టీకి పట్టలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబుకు నిజంగా రాజకీయ విలువలుంటే.. వైఎస్సార్సీపీ నుంచి దొంగిలించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేసి తిరిగి గెలిపించుకోవాలన్నారు. విజయవాడ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తీవ్రత తగ్గించే చర్యలకు సీఎం పాల్పడుతున్నారని మండిపడ్డారు. హోదా ఉద్యమంలో టీడీపీ పాత్ర, కుట్రపూరిత శైలి ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఒకవైపు ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే.. నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీతో అంటకాగి, ఇప్పుడు చంద్రబాబు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ‘ఆర్థిక నేరగాళ్లంటూ పదేపదే ఆరోపిస్తున్న సీఎంకు తన వెంటే ఉండే సుజనాచౌదరి బ్యాంకులను మోసగించిన విషయం కనిపించలేదా? వాకాటి నారాయణరెడ్డి, పీలా గోవింద్, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్ వంటివారు నేరస్తులుగా కనిపించట్లేదా? అని ప్రశ్నించారు.‘‘నీ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రాజకీయ శూన్యత కల్పించిందెవరు? ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ?’’ అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. టీడీపీని నారావారి పల్లెలో స్థాపించారా? లోకేష్ టీడీపీ రాజకీయ వారసత్వ నాయకుడిగా ఎలా మారాడు? టీడీపీలో నందమూరి వారసుల పాత్ర ఏమిటో వంటి ప్రశ్నలకు జవాబులు చెబితే చంద్రబాబు రాజకీయ విలువలు తెలుసుకుని తాము నేర్చుకుంటామన్నారు. చంద్రబాబుకు నిజంగా విలువలనేవి ఉంటే నారా వారి టీడీపీ అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. -
‘హరికృష్ణ, ఎన్టీఆర్‌లు ఎక్కడున్నారు’
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభిమానులు ప్రతిరోజు ఏడుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు కుట్రను ఎన్టీఆర్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోరని చెప్పారు. నేడు నందమూరి వారసులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు ఎక్కడున్నారని.. ఆ వంశం నుండి రాజకీయ వారసత్వం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఏపీ సీఎంతో రాజకీయ విలువలు ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలన్నారు. చంద్రబాబును దొంగ అన్న మాటలు ఎన్టీఆర్ వీడియోలో ఉన్నాయి. నందమూరి వారసులు ఏమయ్యారు, నారా లోకేశ్ టీడీపీకి వారసుడా అని ప్రశ్నించారు. మీకు విలువలు ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే నారా వారి పార్టీ అని పెట్టి రెండు సీట్లు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా తిమ్మినిబిమ్మిని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ఏపీని ఓ గుడ్డి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ దౌర్భాగ్యమన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఏపీ ప్రజలకు అర్థమయ్యాయి. ఆయన చేతిలో మళ్లీ మోస పోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఎన్డీఏతో భుజం భుజం కలిపి తిరిగింది ఏపీ ప్రజలు మరిచిపోరని, అందుకే ఎదుటివారిపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్వించారు. చంద్రబాబు చుట్టే ఆర్థిక నేరగాళ్లు టీడీపీ నేతలు సుజనా చౌదరి, దీపక్‌రెడ్డి ఆర్థిక నేరగాళ్లు కాదా.. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారు. తెలంగాణ ఎమ్మెల్యేకి రేవంత్ రెడ్డి ఇవ్వబోయిన రూ.50 లక్షలు ఎవరివి అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, చంద్రబాబుకు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటో తెలియడం లేదన్నారు. రాజకీయ విలువల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏ విలువలు నేర్చుకోవాలి, కేసీఆర్‌తో కుమ్మక్కైన రాజకీయాలు చేర్చుకోవాలా అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. -
లోకేష్ టీడీపీ రాజకీయ వారసత్వ నాయకుడిగా ఎలా మారాడు?
-
‘ఉమా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో’
సాక్షి, విజయవాడ : టీడీపీ పాలనలో ప్రజలకే కాదని, చివరికి అమ్మవారికి కూడా భద్రత కరువైందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా మళ్లీ విచారణ కమిటీ ఏమిటని సుధాకర్ బాబు సూటిగా ప్రశ్నించారు. వీడియో క్లిప్పింగ్స్ స్పష్టంగా ఉంటే విచారణ కమిటీనా అని అన్నారు. ‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ పూజలు లోకేష్ కి రాజయోగం కోసం చేయించారు అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం ఎందుకు నోరు మెదపలేదు. ఇది మీ ఇంట్లో విషయం కాదు, కోట్లాది మంది హిందువుల మత విశ్వాసం దెబ్బతింది. గుళ్లో జరిగిన విషయాలు అన్ని ప్రజలకు వివరించాలి. అమ్మ వారి నగలు నిజమైనవేనా అన్న అనుమానం వస్తుంది. మీరు నియమించిన కమిటీకి విలువ లేదు. దేవినేని ఉమా మీరు సూటిగా సమాధానం చెప్పండి, ఒక స్థానిక ఎంపీని మాట్లాడనీయరా, చిత్రవతికి మీ హయాం లో ఇచ్చిన నిధులు ఎన్ని?. ఉమా నోరు అదుపులో పెట్టుకో. అడ్డగోలుగా విమర్శించద్దు. నీ అవినీతి విజయవాడలో, మైలవరం లో ఎవరిని అడిగినా చెబుతారు. పులివెందులకి నీళ్లు ఇచ్చే విషయంలో మీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో, వైఎస్ఆర్ హయాంలో ఎంత పెట్టారో లెక్కలు బయటపెట్టండి.’ అని డిమాండ్ చేశారు. -
బార్అసోసియేషన్ కాదు... బ్యారేజ్ దగ్గరికి రా...
-
బార్అసోసియేషన్ కాదు.. బ్యారేజ్ దగ్గరికి రా..
సాక్షి, విజయవాడ : ‘‘మీరు నిజంగా టీడీపీకి చెందినవారైతే.. మాట మీద నిలబడే దమ్ముంటే.. జనవరి 1న ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రండి! ‘బిట్ కాయిన్’తోపాటు 100 అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరిని తెచ్చుకుంటారో మీ ఇష్టం. కానీ చర్చకు రావాల్సిందే. శాంతిభద్రతల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మాది తప్పని తేలితే బేషరతుగా క్షమాపణలు చెబుతాం. మీరు తప్పని తేలితే, వైఎస్ జగన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసింనందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు.. అధికార పార్టీ నేతలకు సవాలు విసిరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమిటి వివాదం? : సైతం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి బిట్ కాయిన్ ఇండియా సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనే సంస్థను నెలకొల్పి, సుమారు రూ.200 కోట్ల డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డారు. ఆయనకు వైఎస్సార్సీపీతో సంబంధాలున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శిస్తూ.. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని ప్రకటించారు. కాగా, అక్రమాలకు పాల్పడిన రామకృష్ణారెడ్డి నిజానికి చంద్రబాబు మనిషేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు జవాబిచ్చారు. అన్ని అంశాలపై వర్ల రామయ్య చెప్పినట్లు బార్ అసోసియేషన్ ఆఫీసులో కాకుండా ప్రకాశం బ్యారేజీ దగ్గరే పబ్లిక్‌గా చర్చిద్దామని అన్నారు. మిస్టర్ వర్ల రామయ్యా.. రా : సైతం రామకృష్ణారెడ్డి గతంలో సేవాదళ్‌లో పనిచేసిన మాట వాస్తవమైనా, అక్రమార్కుడన్న సంగతి తెలిసి పార్టీ నుంచి గెంటేశామని, మాటవినకుంటే వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున లీగల్ నోటీసులు కూడా పంపామని సుధాకర్‌బాబు తెలిపారు. వైఎస్సార్సీపీతో తనకు సంబంధంలేదని రామకృష్ణారెడ్డి పత్రికాముఖంగా పేర్కొన్న విషయాన్ని సైతం గుర్తుచేశారు. వాస్తవం ఇలా ఉంటే, వర్ల రామయ్య మాత్రం ప్రతిపక్షనేతపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. ‘‘మిస్టర్ వర్ల రామయ్యా.. దమ్ముంటే జనవరి 1న, ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రా.. చర్చకు భయపడి పారిపోకు. ‘బిట్ కాయిన్’ రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు ఫొటోలతో సంస్థకు పబ్లిసిటీ ఇచ్చుకున్న విషయం, ఆయన కుంభకోణంలో బాబుకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు వాటాలున్న విషయం అన్నింటిపైనా మాట్లాడుదాం. ఇదొక్కటేకాదు.. గతంలో ముఖ్యమంత్రి సైతం ప్రతిపక్షనేతను ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడారు. తీరా ఆధారాలు చూపమంటే తోకముడిచి పారిపోయారు. వాటన్నింటికీ సమాధానాలు చెప్పాలి’’ అని సవాలు చేశారు. -
రాజమౌళి, స్పిల్ బర్గ్ సూచనలు తీసుకున్నా సరే..
సాక్షి, విజయవాడ : ప్రపంచస్థాయి నిర్మాణాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకనైనా చంద్రబాబు ఊహాలోకం నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, సినిమా సెట్టింగ్స్, విహార యాత్రలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘ అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు ఖరారు అవుతున్నాయని మంత్రి నారాయణ ప్రకటించడం సంతోషం. ఈ నిర్మాణాలు గ్రాఫిక్స్‌పై ఉండాలని మాత్రం కోరుకోవడం లేదు. ప్రధానమంత్రిని తీసుకువచ్చి, శంఖుస్థాపన చేయించిన ప్రాంతంలో ఇప్పుడు మట్టికుప్ప మాత్రమే ఉంది. దర్శకుడు రాజమౌళిని తీసుకువచ్చారు. ఏపీలో ఏ ఇంజనీర్ మీకు నచ్చలేదా?. రాజమౌళి, స్పిల్ బర్గ్‌ల సలహాలు తీసుకున్నా ఫరవాలేదు. కానీ రాజధానిని సినిమా చేయకండి. వాస్తవిక చర్యలు చేపట్టండి. లేకపోతే ఆంధ్రుల ఆత్మగౌరవం అపహాస్యం పాలవుతుంది. ఓ వైపు ఆర్థికమంత్రి జీతాలు ఇవ్వలేక పోతున్నామని చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ స్థాయి నిర్మాణాలు అంటూ సీఎం రోజుకో గ్రాఫిక్స్‌ను చూపిస్తున్నారు. 600 విదేశీ పర్యటనలు చేశారు. 23 దేశాలు తిరిగారు. 1300 రహస్య జీవోలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేశారు. ఏదీ ప్రపంచ స్థాయి రాజధాని?. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంను అటకెక్కించారు. పోలవంరపై నాకే పూర్తి అవగాహన లేదు. ఇక పవన్ కల్యాణ్‌కు ఏం తెలుస్తుందని సీఎం చెబుతున్నారు. అనుభవం లేని పవన్‌తో సీఎం చేస్తున్న తెర వెనుక మంతనాలు ఏమిటో వెల్లడించాలి. 2014-15లో 15 దేశాలు.. ప్రత్యేక విమానాల్లో చేసిన పర్యటనకు అయిన ఖర్చు ఎంత?. అనేక దేశాలు తిరిగి చివరకు రాజమౌళిని ఆశ్రయించారు. రాజధాని నిర్మాణపై ఇదేనా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి. సీఎం స్థానంలో ఓ సర్పంచ్ ఉన్నా... మూడేళ్లలో రాజధాని భవనాలు నిర్మించేవారు. సినిమా పిచ్చితో రాజధాని భవనాల నిర్మాణాలను గాలికి వదలకండి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఉసురు సీఎంకు తగులుతుంది. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే..మీరు కట్టలేకపోతే..ఇక్కడే మేం రాజధాని నిర్మిస్తాం.’ అని అన్నారు.