వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత టీజే సుధాకర్‌బాబు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సుధాకర్‌బాబు తన అనుచరులతో కలిసి పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. సుధాకర్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుధాకర్‌బాబు గతంలో గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే.