‘హరికృష్ణ, ఎన్టీఆర్‌లు ఎక్కడున్నారు’ | YSRCP Leader Sudhakar Babu Fire On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్ అభిమానులు ప్రతిరోజు ఏడుస్తున్నారు’

Published Sun, Mar 25 2018 6:10 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

YSRCP Leader Sudhakar Babu Fire On Chandrababu - Sakshi

సుధాకర్ బాబు, చంద్రబాబు నాయుడు

సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభిమానులు ప్రతిరోజు ఏడుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు కుట్రను ఎన్టీఆర్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోరని చెప్పారు. నేడు నందమూరి వారసులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు ఎక్కడున్నారని.. ఆ వంశం నుండి రాజకీయ వారసత్వం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఏపీ సీఎంతో రాజకీయ విలువలు ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలన్నారు. చంద్రబాబును దొంగ అన్న మాటలు ఎన్టీఆర్ వీడియోలో ఉన్నాయి. నందమూరి వారసులు ఏమయ్యారు, నారా లోకేశ్ టీడీపీకి వారసుడా అని ప్రశ్నించారు. మీకు విలువలు ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే నారా వారి పార్టీ అని పెట్టి రెండు సీట్లు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా తిమ్మినిబిమ్మిని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ఏపీని ఓ గుడ్డి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ దౌర్భాగ్యమన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఏపీ ప్రజలకు అర్థమయ్యాయి. ఆయన చేతిలో మళ్లీ మోస పోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఎన్డీఏతో భుజం భుజం కలిపి తిరిగింది ఏపీ ప్రజలు మరిచిపోరని, అందుకే ఎదుటివారిపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్వించారు. 

చంద్రబాబు చుట్టే ఆర్థిక నేరగాళ్లు
టీడీపీ నేతలు సుజనా చౌదరి, దీపక్‌రెడ్డి ఆర్థిక నేరగాళ్లు కాదా.. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారు. తెలంగాణ ఎమ్మెల్యేకి రేవంత్ రెడ్డి ఇవ్వబోయిన రూ.50 లక్షలు ఎవరివి
అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, చంద్రబాబుకు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటో తెలియడం లేదన్నారు. రాజకీయ విలువల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏ విలువలు నేర్చుకోవాలి, కేసీఆర్‌తో కుమ్మక్కైన రాజకీయాలు చేర్చుకోవాలా అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement