పెన్షన్ కోసం వచ్చిన వృద్ధుడిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్ బాబు అన్నారు. చింతమనేని ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లను టీడీపీ నేతలు చులకనగా చూస్తున్నారని విమర్శించారు. పెన్షన్ కోసం వస్తే ఒక ఎమ్మెల్యే దాడి చేయమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఉండాల్సిన లక్షణాలు చింతమనేనికి లేవన్నారు.