chinthamaneni prabhakar
-
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ
సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు టి. నిరంజన్‌రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్‌రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్.. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
-
దళితులపై పెత్తందారీ తోడేలు దొంగ ప్రేమ
రామోజీరావు: వేలాది దళిత కుటుంబాలను రోడ్డు మీదకు లాగి వారి ఆశలను చిదిమేసి హైదరాబాద్‌లో ఫిలిం సిటీని నిర్మించిన పెత్తందారీ కర్కోటకుడు. ఫిలిం సిటీ కోసం దళితుల నుంచి వందలాది ఎకరాల అసైన్డ్, భూదాన్ భూములను నిర్ధాక్షిణ్యంగా లాక్కున్న కబ్జాకోరు. గ్రామాలకు వెళ్లే రోడ్లను ఫిలిం సిటీలో కలిపేసుకుని గోడ గట్టి, ఆ గ్రామాల ప్రజలను నానా తిప్పలు పెట్టి, వారి ఉసురు తీసిన రక్త పిపాసి. వేలాది దళిత కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసి రాజసౌధాలను నిర్మించుకుని రాజులా చలామణి అవుతున్న ఆధునిక నరకాసురుడు. ఇప్పుడు వారిపై తనకు అమిత ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న తోడేలు. చంద్రబాబు: రాష్ట్రంలో పచ్చ ముఠాకు నాయకుడు. దళితులంటే అస్సలు పడని ఓ పెత్తందారు. ఆయన హయాంలో దళితులపై లెక్కలేనని దాడులు, అవమానాలు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి. ఈయనే కాదు.. ఈయన వెంట ఉన్న నేతలదీ అదే తీరు. దళితులకు రాజకీయాలెందుకురా అంటూ హుంకరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న ఆదినారాయణ రెడ్డి. వీళ్లే కాదు.. టీడీపీలో అనేక మంది నేతలది ఇదే తీరు. వీళ్లంతా రామోజీ నమ్మిన బంటు చంద్రబాబు బ్యాచ్. అందుకే దళితులపై వీళ్లెంతగా వీరంగం వేసిన రామోజీకి కనిపించదు, వినిపించదు. సీఎం వైఎస్ జగన్: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ దళితులను కుటుంబ సభ్యుల్లా అక్కున చేర్చుకున్న నాయకుడు. వారిని రాజకీయంగా, అన్ని రంగాల్లో ఉన్నత స్థితి కల్పిస్తూ, వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎవరినీ పైసా అడగాల్సిన పని లేకుండా ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి. వారిని సాధికారత వైపు నడిపించి, సమాజంలో గౌరవం కల్పించి, తలెత్తుకొని తిరిగేలా చేసిన నేత. దళితులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టే ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ఇటీవల ఆ వర్గానికి చెందిన నేత నందిగం సురేష్ తో విడుదల చేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల మనసు గెల్చుకున్న దళిత బంధువు. – సాక్షి, అమరావతి రామోజీ కపట నాటకం తానే స్వయంగా దళితుల భూములు లాక్కొని, వారి కంటి నుంచి రక్తం కారేలా ఏడిపించిన రామోజీ.. ఇప్పుడు దళితులపై ప్రేమ అంటూ కపట నాటకమాడుతున్నారు. జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు అంటిందంటూ ఈనాడులో రక్తపు రాతలు రాసి అక్కసును బయటపెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవం ఏ పాటిదో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది తమ ప్రభుత్వమని ప్రతి దళితుడూ చెప్పుకునే రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన ఒకట్రెండు ఘటనలను బూచిగా చూపి దళితుల నెత్తురు జగన్ చేతులకు అంటిందని నిస్సిగ్గుగా రాయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటి ప్రయత్నమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దళితులంటే అంటరాని వారనే ఆదిమ సమాజపు భావజాలంతో వారిని అడుగడుగునా అవమానిస్తున్న చంద్రబాబు బ్యాచ్‌కు మద్దతు పలికిన రామోజీరావు.. దళితులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై బురద జల్లేలా రాసిన రాతలను అసలు ఎవరైనా నమ్ముతారా? ఈ లాజిక్ రామోజీ బుర్రకు అందదు. ఎందుకంటే.. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలన్నదే ఆయన ఏకైక అజెండా. అందుకే తప్పుడు రాతలతో ప్రజలను పక్కదోవ పట్టంచాలని ప్రయత్నిస్తున్నారు. బాబు హయాంలో దారుణ దమనకాండ చంద్రబాబు హయాంలో దళితులపై దారుణమైన దమనకాండ జరిగినా అసలు ఏమీ జరగనట్లు దొంగ నిద్ర నటించాడు రామోజీ. సాక్షాత్తూ బాబు సీఎంగా ఉన్నప్పుడే వారి పుట్టుకనే అవమానç³రిచేలా అన్యాయమైన వ్యాఖ్యలు చేసినా కిమ్మనలేదు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బాబు అన్నప్పుడు దళిత సమాజం మొత్తం భగ్గుమంది. అప్పుడు రామోజీ వంత పలికింది దళితులకు కాదు.. బాబుకు. బాబు మంత్రివర్గ సభ్యుడు ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేసినప్పుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీచంగా తూలనాడినా రామోజీకి దళితులపై ప్రేమ పుట్టలేదు. 2017 డిసెంబర్లో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు ఓ దళిత మహిళపై దాడి చేసి, ఆమె బట్టలు చింపి పొలం నుంచి ఈడ్చిపడేసినా పట్టించుకునే నాథుడే లేడు. బాబు హయాంలో దళితులు నిత్యం భయంగా బతికే పరిస్థితులు ఉండేవి. తమపై దాడులు జరిగితే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యేవి కాదు. కేసు పెట్టడానికి దళితులు పోరాడాల్సివచ్చేది. బాబు హయాంలో ఎస్సీలపై నేరాల సంఖ్య పెరిగినట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలే చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు తగ్గిపోయాయి. దళితుల భద్రతకు పెద్దపీట వేయడంతోపాటు దళిత మహిళనే హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అలాంటి జగన్ చేతులు దళితుల రక్తం అంటిందంటూ అడ్డగోలు రాతలతో రామోజీ ఆక్రోశం వెనుక బాబును పీఠం ఎక్కించాలన్న తపన ఉందని మేధావులు అంటున్నారు. దళితుల గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన దారుణ వ్యాఖ్యలు ♦ ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు. కులాలను బట్టి ఓట్లు రావు. వాటితో ఎవడూ గెలవలేడు. మంద కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయాడు. - సీఎం హోదాలో 2016 ఫిబ్రవరి 9న చంద్రబాబు ♦ దళితులు శుభ్రంగా ఉండరు. వారి దగ్గర వాసన వస్తుంది. వాళ్లు సరిగా చదవరు. అయినా ఎస్పీలు అవుతారు. రిజర్వేషన్లు పదేళ్ల కోసం ఇస్తే 70 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పట్టాలిస్తే వాటిని నిలుపుకోరు. – 2017లో చంద్రబాబు మంత్రివర్గం సభ్యుడిగా ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి ♦రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చి –––––––––––––––– – 2019 ఫిబ్రవరి 20న టీడీపీకి చెందిన అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుడిపై దాడి చేసేది టీడీపీ నాయకులే రాష్ట్రంలో దాడులు చేసేది టీడీపీ నాయకులే. వారు అధికారంలో ఉన్నా, లేకపోయినా దళితులే లక్ష్యంగా దాడులు చేస్తుంటారు. దళిత నాయకుడినైన నాపై అంబేడ్కర్ జయంతి రోజున టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర తన అనుచరులతో దాడికి దిగారు. మా ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టి వీరంగం సృష్టించారు. ఇవి ఈనాడు రామోజీరావుకు కనిపించవు. దళిత ద్రోహి చంద్రబాబే. ఈ రోజు ఆయనకు మద్దతుగా ఈనాడులో తప్పుడు కథనాలు ఇవ్వడం దారుణం. టీడీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు రాయాలంటే పేపర్లు చాలవు. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం ఎవరు మేలు చేశారో తెలుసు దళితులకు సీఎం జగన్ పాలనలోనే మేలు జరిగింది. దళితులను అక్కున చేర్చుకొని, ఉన్నత స్థితికి చేర్చింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. ఎన్నికల వేళ ఈనాడు అధినేత రామోజీరావుకు మతి భ్రమించింది. ఎస్సీ సామాజిక వర్గం ఓట్ల కోసం తప్పుడు కథనాలు వండివార్చితే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఓటమి భయంతో నిత్యం కట్టు కథలు అల్లుతున్నారు. గత ఎన్నికల్లోనూ వారిది ఇదే ధోరణి. ప్రజలు ఎప్పుడూ వాస్తవాలనే స్వీకరిస్తారు. ప్రజలంతా బాబు అండ్‌కో ను ఛీ కొడుతుంటే ఎలాగైనా బాబును గద్దెనెక్కించాలని, తద్వారా కేసుల నుంచి తప్పించుకోవాలని రామోజీ తాపత్రయపడుతున్నారు. – రేగాన శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చంద్రబాబే దళితుల ద్రోహి దళితులంటే బాబుకు గిట్టదు. కేవలం ఓట్లు దండుకోవడానికే మాత్రమే బాబుకు ఎస్సీలు కావాలి. తర్వాత తన సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఎస్సీలపై ఆయన చేసిన దాడులన్నీ చెప్పుకుంటూ పోతే పుస్తకం రాయొచ్చు. ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని హేళన చేసింది చంద్రబాబే. ఇటీవల ఓ మైనారిటీ సమావేశంలో కూడా ఎస్సీలను చులకన చేసి మాట్లాడారు. క్రైస్తవులంతా ఎస్సీలని, అధికారంలోకి వస్తే వాళ్ల అంతు చూస్తామన్నట్లుగా బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. ఇటువంటివన్నీ పచ్చ పత్రికలు కప్పిపుచ్చి బాబును వెనకేసుకుని వస్తున్నాయి. దళితులకు సీఎం జగన్‌మాత్రమే మేలు చేస్తున్నారు. – ప్రసాద్, మాల మహానాడు అధ్యక్షుడు, చిత్తూరు పచ్చ పత్రిక విషపు రాతలు సీఎం జగన్, దళితులపై పచ్చ పత్రిక విషపు రాతలు రాసింది. సీఎం జగన్ బస్సు యాత్రకు తండోపతండాలుగా వస్తున్న వారిలో అధికంగా ఉండేది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలే. మరి ఈ పచ్చ రాతలు రాసే వాళ్లకు ఇలాంటి నిజమైన యాత్రలు కనిపించవా?. దళితులకు తీవ్ర అన్యాయం చేసింది బాబే. ఆయన దళిత ద్రోహి. గతంలో మాల, మాదిగలను విడదీసి గద్దెనెక్కిన బాబు దళిత జాతిని అవహేళనగా మాట్లాడుతూ దళిత విద్యార్థులపై కుట్ర పూరిత పాలన కొనసాగించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బయటికి కూడా రాని విధంగా చంద్రబాబు దళిత జాతి అణచివేతకు పెద్ద కుట్ర చేశాడు. – ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రబాబే దళిత ద్రోహి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే దళిత ద్రోహి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపైన దాడుల కేసులు 3400 పైగా నమోదయ్యాయి. నమోదవని ఇంకా చాలా ఉన్నాయి. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలు ఇప్పటికీ మేం మర్చిపోలేదు. చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తున్నాయి. దళితులపైన టీడీపీ నేతలు, ఆ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు ఎన్నో. లేనిపోని రాతలు రాసి జగనన్న ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే సహించేది లేదు. – మాస్టీల మంజు, ఎస్సీ నేత, ఏఎంసీ మాజీ అధ్యక్షురాలు, కంచిలి -
వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రమే సొంతమైన ‘యూజ్ అండ్ త్రో’ ఆటలో ఆ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే దిక్కు లేకుండాపోయింది. అధికారంలో ఉండగా ఈ నేతలకు సర్వాధికారాలూ ఇచ్చి, అక్రమ సంపాదనకు వారిని ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి టికెట్టు దక్కని పరిస్థితి కల్పించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరిపోయాక పక్కన పడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న నైపుణ్యం. సొంత కుటుంబం నుంచి పార్టీలో అనేక మంది నాయకుల వరకు చంద్రబాబు పాలసీకి బలైనవారే. తాజాగా ఆ కోటాలో టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు చేరిపోయారు. 2014–2019 మధ్య యధేచ్ఛగా అవినీతికి పాల్పడి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కి కప్పం గట్టిన వీరికి ఇప్పుడు సీట్లు లేకుండాపోయాయి. అప్పట్లో అధికారం తలకెక్కడంతో చంద్రబాబు చెప్పినట్లు చేసి తమ కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నే హింసించారు. తద్వారా కేడర్ వ్యతిరేకతను మోయలేనంతగా మూటగట్టుకున్న ఈ నేతలు ప్రజా క్షేత్రంలో బలం కోల్పోవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. ఈ నేతలను పూచికపుల్లల్లా తీసి పక్కన పడేశారు. జలవనరులను దోచి ఇచ్చినా ఉమాను పక్కన పెట్టిన బాబుఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు నిరాకరించడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చంద్రబాబుకు అత్యంత విధేయుడు, సుదీర్ఘకాలం కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్నా ఎవరూ ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టును దోపిడీకి ఉపయోగించుకున్నారు. ఇతర సాగు నీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతిని పారించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అందిన కాడికి దండుకుని వేల కోట్లు పోగేశారు. ఆ అక్రమ సంపాదనను చంద్రబాబు, లోకేశ్‌కి కట్టబెట్టి వారి మెప్పు పొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో అవినీతి పిచ్చిలో మునిగిపోయిన ఉమ తన కేడర్, నేతలను వదిలేశారు. జిల్లాలో ఇతర నాయకులు, సీనియర్లను కూడా ఇబ్బంది పెట్టారు. జిల్లా పార్టీలో తానే సర్వం అయ్యారు. పని మీద వెళ్లిన పార్టీ నేతలను అవమానించారు. దీంతో నియోజకవర్గం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో బాబు ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పట్లో తనకు ఎంత సహకరించినా, అవినీతి సొమ్ములో కమీషన్లు కట్టినా చంద్రబాబు కనికరించలేదు. గంటాతో భూకుంభకోణాలు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవకాశవాద రాజకీయానికి, అవినీతికి నిలువెత్తు రూపమైనా చంద్రబాబుకు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు. గంటా ద్వారా చంద్రబాబు విశాఖలో ఊహించని రీతిలో భూ దందాలు చేయించారు. విశాఖ జిల్లావ్యాప్తంగా నానా బీభత్సం సృష్టించారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిన ప్రతిచోటా గంటా పేరు వినిపించేది. దీంతో పార్టీలో, జనంలోనూ ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇక గంటాతో ఉపయోగం లేదనుకున్న చంద్రబాబు ఈసారి విశాఖలో సీటు లేదని కరాఖండిగా చెప్పారు. ఏకంగా జిల్లా దాటించి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించారు. దీంతో గంటా ఏమి చేయాలో పాలుపోక చింతిస్తున్నారు. అన్ని విధాలుగా వాడుకుని చింతమనేనికే ఎసరు టీడీపీలోని పాపులర్ నాయకుల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైపు చూసేందుకే నేతలు, ప్రజలు భయపడేవారు. పోలవరం కాలువ గట్లపై యధేచ్ఛగా మట్టిని తవ్వి అమ్మేసి డబ్బు దండుకున్నారు. తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తవ్వి కనీవినీ ఎరుగని రీతిలో సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన అనధికారిక మంత్రిగా వ్యవహరించారు. అంతటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడికి చింతమనేని క్రమం తప్పకుండా కప్పం కట్టారు. వారి అండ చూసుకుని చింతమనేని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను అల్పులుగా చూశారు. ఇసుకను అక్రమంగా తవ్వద్దని అడ్డపడినందుకు మహిళా తహసీల్దార్‌పైనే దాడి చేసిన ఘనుడు. దానికి చంద్రబాబు వంతపాడి తహశీల్దార్నే తప్పుపట్టి రాజీ చేశారు. ఇలా అనేక దౌర్జన్యాలకు పాల్పడిన చింతమనేనిపై 40కిపైగా కేసులున్నాయి. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా గొడవలకు వెళ్లడం, రౌడీయిజంతో భయపెట్టడంతో జనం ఆయన్ని 2019లో ఓడించి కసి తీర్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు సీటిస్తే పని చేసేది లేదని చెప్పడంతో చంద్రబాబూ ఆయన్ని వదిలించుకోవాలనుకున్నారు. దెందులూరు సీటు ఇవ్వనని చెప్పేశారు.యరపతినేనితో గనుల దోపిడీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ డాన్‌గా పేరుపొందారు. లోకేశ్ అండతో ఆయన అక్రమ మైనింగ్‌లో రికార్డులు సృష్టించారు. గనులను కొల్లగొట్టి ఆ సొమ్మును లోకేశ్, చంద్రబాబుకు పంచిపెట్టారు. సొంత పార్టీ నేతలే ఆయన అక్రమ మైనింగ్ చూసి నివ్వెరపోయారు. అధికారులను కూడా బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గుంటూరు జిల్లాలో తానే హోంశాఖ మంత్రి అనేలా పరిస్థితిని తయారు చేశారు. చంద్రబాబు ఇచ్చిన అధికార బలంతో పోలీసు అధికారులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. చివరికి ఆయన పాపం పండి అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇవన్నీ చూసి పార్టీ కేడరే విసుగెత్తిపోయింది. సొంత నియోజకవర్గంలో ప్రజలు, కేడర్ వ్యతిరేకం కావడంతో చంద్రబాబుకు యరపతినేని కరివేపాకు అయ్యారు. ఆయనకు సీటును డౌటులో పెట్టారు. టికెట్టు ఇస్తారో లేదో తెలియక యరపతినేని గందరగోళంలో ఉన్నారు. -
తీరు మార్చుకోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
-
సర్పంచ్ అభ్యర్థిపై చింతమనేని దాడి
ఏలూరు టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఏకంగా మహిళా సర్పంచ్ అభ్యర్థిపైన, ఆమె అనుచరులపైన దాడికి తెగబడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. చింతమనేనిని అరెస్ట్ చేశారు. పెదవేగి మండలం బి.సింగవరం సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభిమాని పరస సరస్వతి పోటీచేస్తున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో సరస్వతి ప్రచారం చేస్తుండగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో వచ్చి అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు బెజవాడ రాట్నాలు వీరాస్వామి, బెజవాడ కోదండరామయ్య, చిత్తూరు సత్యనారాయణ వారిపై దాడిచేశారు. చింతమనేని ప్రభాకర్ అభ్యర్థి సరస్వతి, ఆమె భర్త సాంబశివరావులపై దాడిచేసి కర్రతో తీవ్రంగా కొట్టారు. ఈ మేరకు బాధితులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చింతమనేనిని ఏ1 ముద్దాయిగా పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం చింతమనేనిని అరెస్టు చేసి ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
అచ్చెన్నాయుడు అరెస్టు; చింతమనేని హైడ్రామా
సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరు కలపర్రు చెక్ పోస్ట్ వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హైడ్రామా చేస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని, అతని అనుచరులు యత్నించారు. కరోనా నేపథ్యంలో అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమలో తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చింతమనేని, అనుచరులు ఆందోళన చేపట్టారు. హైడ్రామా నేపథ్యంలో చింతమనేని నిరసన కొనసాగుతోంది. (తప్పుచేసి.. బీసీ కార్డు వాడుకోవడం దారుణం) టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ -
చింతమనేని ప్రభాకర్‌కు పితృవియోగం
పశ్చిమ గోదావరి ,పెదవేగి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పితృవియోగం కలిగింది. మండలంలోని దుగ్గిరాల్లోని ప్రభాకర్స్వగృహంలో ఆయన తండ్రి చింతమనేని కేశవరావు(86) మంగళవారం ఉదయం మృతిచెందారు. ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, సొసైటీ అధ్యక్షుడు వడ్లపట్ల శ్రీనివాసరావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం చింతమనేనిని పరామర్శించారు. -
చంద్రబాబులో అభద్రతాభావం: అబ్బయ్యచౌదరి
సాక్షి, దెందులూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. చంద్రబాబు జిల్లాలోని మూడురోజుల పర్యటనలో మాట్లాడిన ప్రతిచోటా హావభావాలు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. గురువారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయ ఆవరణలో చంద్రబాబు మూడురోజుల జిల్లా పర్యటన, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వత్తాసు పలకటంపై ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విలేకరులతో మాట్లాడారు. చింతమనేనిని వెనకేసుకురావటానికే చంద్రబాబు సమయం మొత్తం కేటాయించారన్నారు. పార్టీ ఓటమికి కారణాలు, పరిస్థితులపై చర్చించకుండా చింతమనేనిని అమాయకుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు నానా తంటాలు పడిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా నిశితంగా పరిశీలించారన్నారు. దళితులను కించపరిచేలా చింతమనేని వ్యాఖ్యానించటం నిజం కాదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానం, వేగాన్ని చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా టీడీపీని వీడటం, కోర్టుల్లో సైతం స్టేలు ఎత్తివేయటంతో చంద్ర బాబులో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ఇసుకను మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ఇదంతా మరిచి స్వచ్ఛ పాలన అందిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు అతి కిరాతకంగా హత్య చేయించారని ఆరోపించారు. వాస్తవాలు ఇలా ఉంటే జిల్లాలో ప్రశాంతత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. జిల్లాలో రౌడీయిజాన్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. అయోధ్య తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా 30 యాక్టు అమలులో ఉంటే జిల్లాలోనే ఈ యాక్టు ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడటం విచారకరమని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. -
ఓడినా తగ్గని చింతమనేని అరాచకాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో తెలుగుదేశం నేతల్లో వణుకు మొదలైంది. వాటిని కప్పి పుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నారు. గత ఐదేళ్లలో దెందులూరులో రౌడీ రాజ్యాన్ని చూపించిన చింతమనేని ప్రభాకర్ జైలుకు వెళ్లగానే ఆయనకేదో అన్యాయం జరిగిపోయినట్లు తెలుగుదేశం నేతలు జిల్లాకు క్యూకట్టారు. ఏదో స్వాతంత్య్ర సమరయోధుడిని అరెస్టు చేసినట్టుగా బాధపడిపోతూ.. ఆయనను పరామర్శిస్తున్నారు. జైలుకు వెళ్లినా కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసు అధికారులతో చింతమనేని ఏ విధంగా వ్యవహరించారో, నోటికి వచ్చినట్లు ఎలా బూతులు తిట్టారో అందరూ చూశారు. తాజాగా మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు ఇతర నేతలు జైలుకు వెళ్లి చింతమనేనిని పరామర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. జిల్లా అధికారులపైనా ఆరోపణలకు దిగారు. చింతమనేని ప్రభాకర్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిం చడం తెలుగు తమ్ముళ్లకు నొప్పిని కలిగిస్తోంది. గత ఐదేళ్లలో ఆయనపై ఎన్ని కేసులు ఉన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటిని తప్పుడు కేసులు అంటూ తమ అనుకూలమైన అధికారులతో ఎత్తివేయించుకున్నప్పుడు పోలీసుల పక్షపాతం తెలుగుదేశం నాయకులకు కనపడలేదు. మరోవైపు చింతమనేనికి అన్యాయం జరిగిపోయిందని.. జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను సమీకరించి ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ వర్ల రామయ్య ప్రకటించారు. మరో అడుగు ముందుకు వేసి తమ ప్రభుత్వం వస్తే ఇంతకు రెండింతలు మీ కుటుంబాలను వేధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఓడినా తగ్గని చింతమనేని అరాచకాలు చింతమనేని ఎమ్మెల్యేగా ఓడిపోయినతర్వాత కూడా జానంపేట వద్ద రైతులు వేసుకున్న పైపులు ఎత్తుకుపోవడం, పినకడిమిలో దళితులపై దౌర్జన్యానికి దిగడం అందరికీ తెలిసిందే. చింతమనేనిని అరెస్టు చేసిన రోజున కూడా డీఎస్పీ స్థాయి అధికారిని పచ్చిబూతులు తిట్టారు. ఇన్ని చేసినా ఆయనపై కేసులు పెట్టకూడదట. కేసులు పెడితే ఆయనను వేధిస్తున్నట్లుగా తెలుగుదేశం నేతలు కలరింగ్ ఇస్తున్నారు. బడేటి బుజ్జి చిందులు ఏలూరులో ఆక్రమణల తొలగింపును మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అడ్డుకున్న సంగతి తెలిసిందే. సుబ్బమ్మదేవి స్కూల్ విషయంలో రికార్డులు తారుమారు చేశారని, మున్సిపల్ స్కూల్ గ్రౌండ్‌ను కైంకర్యం చేశారంటూ అఖిలపక్షం మూడేళ్లుగా ఉద్యమం చేస్తూ వచ్చింది. తాజాగా తప్పుడు సర్వే నంబర్లపై రిజిస్ట్రేషన్లు చేయించారని, ఆ భూమి మున్సిపాలిటీదేనని తేలిన తర్వాత కలెక్టర్ స్పందించి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ భూమిని స్వాధీనం చేసుకోగానే కలెక్టర్‌పై కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌తో ఎవరో కొనుక్కుని కట్టడాలు నిర్మిస్తుంటే దాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకుంటుంటే తన ప్రమేయం లేని మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి రంగంలోకి ఎందుకు వచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ భూ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మాధవనాయుడికీ భంగపాటు మరోవైపు నరసాపురంలో వ్యక్తిగత గొడవను పార్టీకి పులిమే యత్నం చేసి మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు భంగపడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన గొడవను రాజకీయం చేసేందుకు మాధవనాయుడు యత్నించారు. వైఎస్సార్ సీపీ అక్రమ అరెస్టులంటూ గగ్గోలు పెట్టారు. అయితే రెండురోజుల తర్వాత గొడవకు కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకులే మీడియా ముందుకు వచ్చి ఇది వ్యక్తిగతమైన గొడవ అని, దీనికి పార్టీలకు సంబంధం లేదంటూ ప్రకటించడంతో మాధవనాయుడి పరువు గంగలో కలిసింది. -
కోర్టులో పోలీసులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు
ఏలూరు టౌన్: మాజీ ఎమ్మెల్యే చింతమనేని మూడోసారి అరెస్టు అయ్యారు. జిల్లా జైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈనెల 11న అరెస్టులో న్యాయమూర్తి విధించిన 14 రోజుల రిమాండ్ బుధవారంతో ముగియనుంది. దీంతోపాటు మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్‌పై పోలీసులు న్యాయస్థానం ముం దు హాజరుపరిచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చింతమనేనిని జైలు నుంచి కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా చింతమనేని తన నోటి దురుసు ప్రదర్శించారు. బుధవారం జైలు నుంచి బయటకు వస్తోన్న సమయంలోనూ, కోర్టు ఆవరణలోనూ చింతమనేని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అబాసుపాలయ్యారు. బందోబస్తు నిర్వహిస్తోన్న పోలీసు అధి కారులు, సిబ్బందిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలపాలవుతున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి న్యాయమూర్తి చింతమనేనికి అక్టోబర్ 9 వరకు, మరో కేసులో అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించారు. ఆయా కేసుల్లో అరెస్టు అవుతూ జైలులో ఉంటున్న చింతమనేని తన తీరు మార్చుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో పోలీసులతో అనుచిత వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోర్టు నుంచి బయటకు తరలిస్తోన్న సమయంలో చేయిపట్టుకునేందుకు ప్రయత్నించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పారావుపై దుర్భాషలాడారు. -
మహిళా పోలీసులను నిర్భంధించిన చింతమనేని అనుచరులు
సాక్షి, ఏలూరు టౌన్ : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బుధవారం అరెస్ట్ చేసే సందర్భం లో చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిసు న్న మహిళా కానిస్టేబుళ్లను కొందరు నిర్బంధించి, విధులకు ఆటంకం కలిగించి, బెదిరిం పులకు పాల్పడ్డారు. దీనిపై మహిళా కానిస్టేబు ల్ గుమ్మడి మేరీ గ్రేస్ ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయ్యిం ది. ఈ కేసుకు సంబంధించి ఏలూరు డీఎస్పీ దిలిప్‌కిరణ్ ఆధ్వర్యంలో చింతమనేని వర్గీ యులు నలుగురిని త్రీటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు మహిళా పోలీసులను అక్కడ కొందరు చింతమనేని వర్గీయులు నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారని, గేటుకు తాళాలు వేసి, విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఈ సంఘటనపై సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఇంకా ఎవరైతే ఉంటారో వారందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో క్రైం నెంబర్ 291/19తో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. ఈ కేసులో జెడ్పీలో పనిచేస్తున్న దుగ్గిరాల గ్రామానికి చెందిన చింతమనేని విష్ణు, ధర్మాజీగూడెంకు చెందిన వేంపాటి ప్రసాద్, ఏలూరుకు చెందిన న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్, పెదవేగి మాజీ ఎంపీపీ దేవరపల్లి బక్కయ్యను అరెస్టు చేశారు. అనంతరం మధ్యాహ్నం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు హాజరుపరిచారు. వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ప్రజాప్రతినిధుల హడావుడి చింతమనేని అనుచరులు నలుగురుని అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు బడేటి కోటరామారావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను ఏలూరులోని త్రీటౌన్ స్టేషన్ వద్దకు వచ్చారు. అప్పటికే అరెస్టు కాబడి స్టేషన్లో ఉన్న వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదంటూ బీరాలు పలికారు. కార్యకర్తల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి వచ్చామని, ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. -
చింతమనేనికి ఇక చింతే...
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : ఇప్పటివరకూ జనాలను పీడించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఇక చింతలు మొదలైనట్టే. గత ఐదేళ్లలో ఆయన చేయని అక్రమాలు లేవు. దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని స్థాపించారు. ఏది చేసినా అంతా నా ఇష్టం.. అనే రీతిలో నియంతలా చట్టానికి అతీతుడిలా వ్యహరిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో ఏ ఊరు చూసినా అతని అరాచకాల బాధితులు ఉంటారు. తన ఇలాకాలో నోరెత్తితే.. ఇక వారి బాధలు వర్ణనాతీతమన్నట్టు.. తాను మాట్లాడిందే, చేసిందే చట్టంలా చింతమనేని వ్యవహరించారు. ఇళ్లు కూలగొట్టటం, భూములు ఆక్రమణ, న్యాయం కోసం వచ్చిన వారిపై దౌర్జన్యం, చివరికి వికలాంగులు, వృద్ధులను, కార్మికులనూ కొట్టిన సందర్భాలు కోకొల్లలు. ఈ రౌడీరాజ్యాన్ని భరించలేని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆయనకు ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పారు. కౌంట్‌డౌన్ మొదలు చింతమనేనికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఓడిపోయిన తర్వాత కూడా తన పంథా మార్చుకోని ఆయన అరాచకాలపై పోలీసుల్లో కదలిక వచ్చింది. కేసు నమోదు చేయగానే పరారైన చింతమనేని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతని అరాచకాల చిట్టాను బయటకు తీశారు. దెందులూరు నియోజకవర్గంలో అతను చేసిన అక్రమాలను వెలికితీస్తూ, బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇక చింతమనేని అండ చూసుకుని సామాన్య ప్రజలను అష్టకష్టాల పాల్జేసిన∙ఆయన అనుచరులు, వర్గీయులపైనా దృష్టి సారించారు. ఇసుక మాఫియా, మట్టి , గ్రావెల్‌ను అక్రమంగా దోచుకుతింటూనే.. భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు ఇలా అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు బాధితులకు న్యాయం చేసే దిశగా దూసుకుపోతున్నారు. చింతమనేని అనుచరుల అరెస్టుల పర్వం చింతమనేని అరాచకాల చిట్టా బయటపడుతోంది అతని అరాచకాల్లో భాగస్వాములైన అనుచరులను పోలీసులు వేటాడుతున్నారు. పలు కేసుల్లో చింతమనేనితోపాటు, భాగస్వాములైనవారిపై పోలీసులు గురిపెట్టారు. దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని అరెస్టు చేసేందుకు బుధవారం పోలీసులు భారీఎత్తున మోహరించారు. ఈ సందర్భంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను చింతమనేని అనుచరులు నిర్బంధించి, గేటుకు తాళాలు వేసి బెదిరించారు. దీనిపై మహిళా కానిస్టేబుల్ గుమ్మడి మేరీ గ్రేస్ ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో త్రీటౌన్ పోలీసులు నలుగురు చింతమనేని అనుచరులను అరెస్టు చేశారు. వీరిలో జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న దుగ్గిరాలకు చెందిన చింతమనేని విష్ణు, ధర్మాజీగూడెంకు చెందిన వేం పాటి ప్రసాద్, ఏలూరుకు చెందిన న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్, పెదవేగి మాజీ ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య ఉన్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు చింతమనేనిపై 1995లోనే ఏలూరులో రౌడీషీట్ ఓపెన్ చేశారు. అప్పటి నుంచీ సుమారు 62 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏలూరు త్రీటౌన్, టూటౌన్, వన్‌టౌన్, రూరల్‌తోపాటు, పెదవేగి, పెదపాడు, గన్నవరం, ముసునూరు, కైకలూరు పోలీసుస్టేషన్లలో సుమారు 40 కేసులు నమోదయ్యా యి. తాజాగా మరో 20 మందికిపైగా బాధితులు రోజూ ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలు స్తోంది. తాజాగా ఫిర్యాదు చేసిన బాధితులంతా గతంలో కేసులు పెట్టినా న్యాయం జరగకపోవటంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. -
‘చింత’ చచ్చినా..పులుపు చావలేదు ?
ఏలూరులో బుధవారం హైడ్రామా నడిచింది. నాటకీయ పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ నిమిత్తం జిల్లా జైలుకు పంపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు టౌన్) : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. పదకొండు రోజుల క్రితం చింతమనేని పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యారు. చింతమనేని ఆచూకీ కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటంతోపాటు, వలపన్ని మరీ బయటకు రప్పించారు. బుధవారం ఉదయం నుంచీ పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని చింతమనేని ఇంటివద్ద పోలీసు బలగాలు భారీఎత్తున మోహరించాయి. ఇక ఏలూరు, పరిసర ప్రాంతాలను సైతం పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం పోలీసులు చింతమనేని ఇంటిలోకి వెళ్ళేందుకు యత్నించగా ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. పోలీసులపైకి దూసుకువచ్చేందుకు యత్నించటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆరుగురు మహిళా పోలీసులను ఇంటి ప్రాంగణంలో చింతమనేని అనుచరులు నిర్బంధించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కారులో ఇంటివద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం 3.30గంటలకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు అక్కడి నుంచి సుమారు సాయంత్రం 4.40 గంటలకు జిల్లా కోర్టుకు తీసుకువెళ్ళి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించటంతో సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఏలూరులోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. పోలీసుల పహరాలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టుకు మంగళవారం రాత్రి 10 గంటల నుంచే పోలీసు అధికారులు ప్రణాళిక రచించారు. ఏలూరు, పరిసర ప్రాంతాలన్నిటినీ పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. జాతీయ రహదారిలోని ఆశ్రం ఆస్పత్రి సెంటర్, శనివారపుపేట నుంచి జాతీయ రహదారిపైకి వెళ్ళే రోడ్డు, కలపర్రు టోల్‌ప్లాజా, ఫైర్‌స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణం, జిల్లా కోర్టు వెలుపలా, లోపలా భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. చింతమనేని నేరుగా కోర్టుకు వస్తాడని, ఎస్పీ వద్ద లొంగిపోతాడని ప్రచారం జరిగినా అటువంటి అవకాశం ఇవ్వకుండానే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసాచారి, ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్, ఏలూరు సీసీఎస్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు, నగర సీఐలు ఆదిప్రసాద్, వైబీ రాజాజీ, సుబ్బారావు, ఎస్ఐలు, స్పెషల్‌పార్టీ సిబ్బంది, భారీ సంఖ్యలో హాజరయ్యారు. పోలీసుల అనూహ్య వ్యూహ రచన మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో చెరుకు జోసఫ్ అనే యువకుడిపై దాడి, దౌర్జన్యం, కులంపేరుతో దూషించిన కేసులో అరెస్టు చేస్తారని చింతమనేని వర్గీయులు భావించారు. ఈ కేసులో ఏం లోపాలు ఉన్నాయో పరిశీలించుకుని కోర్టు ముందు హాజరుపరిచితే బెయిల్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కానీ పోలీసులు మాత్రం అనూహ్యంగా పెదపాడు పోలీసుస్టేషన్లో నమోదైన క్రైం నెంబర్ 189/19లో చింతమనేనిని ఏ1 ముద్దాయిగా చూపించారు. పెదపాడు గ్రామానికి చెందిన కూసన వెంకటరత్నంను కిడ్నాప్ చేసి, కొట్టి, కులంపేరుతో దూషించిన కేసులో మరో ఐదుగురు నిందితులు కూడా ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చింతమనేనిని కోర్టు ముందు హాజరుపరిచే వరకూ అత్యంత పగడ్భందీగా కేసును బయటకు తెలియకుండా జాగ్రత్తలు పాటిస్తూ, చివరికి బెయిల్ రాకుండా షాకిచ్చారు. ‘చింత’ చచ్చినా..పులుపు చావలేదు ? చింతచచ్చినా పులుపు చావలేదనే పాతసామెతను గుర్తు చేస్తూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలిలో మార్పు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో చింతమనేని పోలీసు ఉన్నతాధికారులను ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ, తిట్లపురాణం మొదలెట్టినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులను తమ కార్యకర్తలు, అనుచరుల ముందు బూతులు తిడుతూ రెచ్చిపోయారని, నోటి దురుసుతోనే ఇలా కేసులో ఇరుక్కుంటున్నా.. పద్ధతిలో మాత్రం మార్పు రావటం లేదంటూ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ఇక కోర్టు ఆవరణలో సైతం పోలీసు అధికారుల పట్ల చులకన భావంతో మాట్లాడడం పట్ల పోలీసు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజ్ఞాతంలోంచి.. జైలుకు ఈనెల 1న దుగ్గిరాలలోని ఇంటివద్ద నుంచి పోలీసులు కళ్ళుగప్పి పరారైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని 11రోజుల అనంతరం పోలీసులకు దొరికిపోయారు. తానే పోలీసుల వద్దకు వచ్చానని బీరాలు పలుకుతున్న చింతమనేనిని పోలీసులు పక్కా స్కెచ్‌తోనే కలుగులోంచి బయటకు రప్పించారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో 11రోజుల అజ్ఞాతంలోంచి బయటకు వచ్చిన చింతమనేని అటునుంచి జైలుకు పంపటంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. చింతమనేని కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో గాలింపుచర్యలు చేపట్టారు. చింతమనేనిని ఎట్టి పరిస్ధితుల్లో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి నుంచే ఏలూరు నగరంతో పాటు దుగ్గిరాల గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. -
చింతమనేని అనుచరుల బెదిరింపులు
సాక్షి, ఏలూరు టౌన్ : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ చింతమనేని అనుచరులు తనను బెదిరిస్తున్నారంటూ చెరుకు జోసఫ్ ఏలూరు డీఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్‌కు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. తమ మాట వినకుంటే ఇబ్బందులు తప్పవని, తనను అంతం చేస్తామని బెదిరిస్తున్నారని, ఏవో సంభాషణలు సెల్ఫోన్లలో తాను వారితో మాట్లాడినట్లుగా రికార్డు చేసి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని భయపెడుతున్నారని వివరించారు. దెందులూరు గ్రామానికి చెందిన పెనుబోయిన మహేష్, మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తనను తరచూ బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కావాలంటూ డీఎస్పీకి విన్నవించారు. మహేష్ అనే వ్యక్తికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రోత్సాహం ఉండడం వల్లే తనను బెదిరిస్తున్నాడని, తాను అనని మాటలను అన్నట్లుగా రికార్డు చేసి, వాటిని టీడీపీ నేతలతో ప్రెస్‌మీట్ పెట్టించి, అబద్ధాలు చెప్పిస్తూ, తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడినైన తనకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు. అసలేం జరిగిందంటే.. పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరకు జోసఫ్‌పై చింతమనేని, అతని అనుచరులు కొందరు గత నెల 29న దాడికి పాల్పడ్డారు. దీంతో జోసఫ్ ఫిర్యాదు మేరకు పెదవేగి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో నాలుగు రోజులుగా పరారీలో ఉన్న చింతమనేని, అతని అనుచరులు బాధితులపై బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు డీఎస్పీని ఆశ్రయించారు. చింతమనేని అరెస్టు కావటం ఖాయమని తెలుసుకునే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బాధితుడి పక్షాన డీఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీకుమార్, నాయకులు దేవానంద్, జాలా రాజీవ్, భూస్వామి, కృష్ణా, కామిరెడ్డి నాని తదితరులు ఉన్నారు. -
‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవు’
సాక్షి, పశ్చిమగోదావరి : తమ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. దళితులపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గత పది ఏళ్లలో చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలోని ఇసుకను, పోలవరం మట్టితో పాటు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ చింతమనేని చేసిన అరచకాలపై కేసులు పెడితే 200 పైనే నమోదు అవుతాయన్నారు. ఇప్పటికే ఆయనపై 35 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని విమర్శించారు. దళితుల యువకులపై దాడి చేసినందుకు కేసు పెడిపెడితే అవి అక్రమ కేసులు అనడం సిగ్గు చేటన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తున్న దళితులపై చింతమనేని దారుణంగా దాడి చేశారన్నారు. చంద్రబాబు పాలనతో చింతమనేని అరాచకాలకు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయన్నారు. కానీ సీఎం జగన్ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవని హెచ్చరించారు. సెప్టెంబర్ 5నుంచి కొత్త ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా ఇసుక అందజేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ మైనింగ్ ఉండకూడదనే సీఎం జగన్ కొత్త విధానం తెచ్చారన్నారు. -
గొర్రెలనూ, బర్రెలనూ వదలని చింతమనేని
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆఖరికి గొర్రెలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా వదలలేదని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైథాన్ తుపాను సందర్భంగా తమ నియోజకవర్గంలో గొర్రెలు చనిపోయాయని, వాటి కోసం పశుసంవర్ధక శాఖ తయారు చేసిన లబ్ధిదారుల జాబితాలో మొదటిపేరు చింతమనేని భార్యది ఉండగా, రెండోపేరు ఆయన తండ్రి పేరు ఉందని మొత్తం జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకి గేదెలు అందలేదని, బినామీ పేర్లతో చింతమనేని తీసుకున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో చెట్టున్నపాడు గ్రామంలో కూడా గొర్రెలు పెద్ద సంఖ్యలో చనిపోయినా ఇంతవరకూ నష్టపరిహారం రాలేదని ఉంగుటూరు శాసనసభ్యుడు పుప్పాల వాసుబాబు చెప్పారు. హర్యానా నుంచి గేదెలను తేవడం వల్ల అవి ఈ వాతావరణానికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాయని, వేరే ప్రత్యామ్నాయం చూడాలని చింతలపూడి శాసనసభ్యులు వీఆర్ ఎలిజా కోరారు. -
టీడీపీ నేతల ‘నేర కథా చిత్రమ్’
అక్రమ సంపాదన కోసం మోసాలు... ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా... మాట వినకుంటే దౌర్జన్యం... అడ్డొస్తున్నారనుకుంటే దాడి... అయినా ఎదురుతిరిగితే హత్య... ...ఎవరిని అడిగినా ఇవన్నీ చట్ట విరుద్ధ కార్యకలాపాలని కరాఖండిగా చెబుతారు. ఇలాంటివాటికి పాల్పడే నాయకులు ఒక పార్టీలో పదుల సంఖ్యలో ఉంటే ఆ పార్టీని ఏమనాలి? బహుశా టీడీపీ అంటే సరిపోతుందేమో? అధికారం అండగా అంతగా అక్రమాలకు తెగించారు పచ్చ నేతలు. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబే తీవ్ర స్థాయి నేరాల్లో భాగస్వామి. అందుకేనేమో కింది స్థాయి వారు కూడా ఆయన చూపిన బాటలో నడుస్తూ ‘మేమేం తక్కువ తన్నలేదు... తినలేదు’ అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ‘ఘన నేర చరిత్ర’ను ఓసారి పరిశీలిస్తే నివ్వెరపోక తప్పదు. వంగి వంగి దండాలు పెడుతూ, నీతులు చెబుతూ ఎన్నికల్లో ఓట్లడుగుతున్న టీడీపీ నాయకుల్లో నేర చరితులుగా ముద్ర వేసుకున్నవారు లెక్కకు మిక్కిలి ఉన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరనుంచి మొదలయ్యే ఈ చిట్టా... చెబితే ఓ అంతులేని కథే. అయినా, తాము శుద్ధపూసలం అన్నట్లు బాబు జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తమ పార్టీ అభ్యర్థి ఒకరిపై ఏకంగా 26 కేసులున్న సంగతి మరిచి... కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్‌లలో వైఎస్సార్సీపీ నేత లపై కేసులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేయమని తమ కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలిస్తే ఎవరి చరిత్రేంటో అందరికీ తెలిసిపోతోంది. ఏకంగా 52 మంది టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు, ఐదుగురు ఎంపీ అభ్యర్థులు నేరారోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని ఈ అఫిడవిట్లు చాటుతున్నాయి. ఇందులో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదవగా, మిగిలినవారిపై మోసాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు తదితర నేరాలున్నాయి. కొందరిపై ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ కేసులుండటం... హద్దులు లేని టీడీపీ ఘన నేర చరిత్రకు అద్దంపడుతోంది. దొంగల బండి ‘స్టే’షన్ మాస్టర్ బాబు తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు రూ.కోట్లు ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో బాబు పాత్రపై దర్యాప్తు సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం ఐటీ గ్రిడ్స్ అనే సంస్థకు మళ్లించిన వ్యవహారంపైనా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇందులో బాబు, ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ పాత్ర తేలాల్సి ఉంది. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా ఏకంగా 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు తనపై ఒకే ఒక కేసు ఉన్నట్టు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిని దాచి పెట్టి... బాబ్లీ ప్రాజెక్టు విషయమై ఆందోళనలో నమోదైనట్లు పేర్కొన్న కేసునే ఆయన అఫిడవిట్లో చూపారు. తాను ప్రజా సమస్యలపై పోరాడితేనే కేసు పెట్టారని చెప్పుకొనే కుయుక్తి ఇందులో దాగుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ ఠాణాలో ఈ కేసు (67/2010) ఐపీసీ 353, 324, 332, 336, 337, 323, 504, 506, 309, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద నమోదైంది. ప్రస్తుతం ధర్మాబాద్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో నడుస్తోంది. అందరూ ఆ తాను ముక్కలే! టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నేరగాళ్ల చిట్టాలో ఉన్నారు. మంత్రి పి.నారాయణ తెలుగు అకాడమీ పుస్తకాల అక్రమ ప్రచురణలో సూత్రధారి. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాల కేసులతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఫిర్యాదులున్నాయి. సినీ నటుడు, సీఎం వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఇంట్లోనే నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గన్నవరం, విశాఖ విమానాశ్రయాల్లో సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనాథాశ్రమ నిర్వాహకులపై బెదిరింపులకు దిగారు. ‘కోడె’ల.. కేసుల బుస 1988లో నిరాహార దీక్షలో ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య మొదలు, 1999 ఎన్నికల సందర్భంగా తనకు చెందిన ఇంట్లో బాంబు పేలుడు సహా గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రాజకీయ ప్రస్థానం తీవ్ర వివాదాలు, నేరారోపణలమయం. ఆఖరుకు రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పోస్టులో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన ఆయన... ఈ పదవీ కాలంలోనూ తన తీరుతో వార్తల్లో నిలిచారు. తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై ప్రస్తుతం నాలుగు కేసులు ఉన్నట్టు కోడెల ప్రస్తావించారు. నరసరావుపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్లో క్రైమ్ నంబర్లు 202/2012, 203/2012, 30/2014తో మూడు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ సెషన్స్ జడ్జి కోర్టులో ప్రైవేటు కంప్లయింట్ కింద కేసు (సీసీ నంబరు 41/2018) నమోదైంది. ఇక 2014–19 మధ్య స్పీకర్ పదవిలో ఉన్న ఆయన టీడీపీ నాయకుడిగానే వ్యవహరించారు. బినామీ రమేశ్ కేవలం స్వల్ప కాలంలోనే రూ.వేల కోట్లకు పడగెత్తిన చంద్రబాబు మరో బినామీ సీఎం రమేష్‌పై ఒకవైపు విచారణ సాగుతోంది. కొన్ని నెలల క్రితం ఈయన సంస్థలపై ఐటీ దాడుల సందర్భంగా నానా యాగీ చేశారు. ఇప్పుడు సైతం తమ పార్టీ నేతలపై ఐటీ దాడులను అక్రమంగా అడ్డుకుంటున్నారు. బొండా గిరి అసెంబ్లీలోనే ‘ఏంట్రా... ఏంట్రరేయ్... రారా చూసుకుందాం’ అంటూ ఊగిపోయిన విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై రెండు కేసులున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపులో సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 9, 9ఏఏ ప్రకారం హైదరాబాద్ నాంపల్లిలోని ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టులో కేసు నం.17/2010 వీటిలో ఒకటి. కనకదుర్గ గుడి వద్ద ధర్నా నిర్వహించినందుకు కృష్ణలంక ఠాణాలో మరో కేసు (462/2006) నమోదైంది. ఉమాపై ఒక్కటేనట మైలవరం అభ్యర్థి దేవినేని ఉమా తనపై ఒకటే కేసు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. బాబ్లీ దగ్గర ధర్నాతో ధర్మాబాద్ స్టేషన్లో (ఎఫ్ఐఆర్ నం. ఓఎమ్సీఏ 27–2013 జేఎఫ్ఎమ్సీ లో 353, 324, 332, 336, 337, 323, 504, 506, 309 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లు) కేసు నమోదైందని చూపారు. ప.గో.లో పలువురిపై...: గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావుపై హత్యా యత్నం కేసుంది. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుపై ద్వారకా తిరుమల ఠాణాలో చీటింగ్ కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే ఈలి నానిపై పెంటపాడు పోలీసు స్టేషన్లో 188 ఐపీసీ కింద కేసుంది. అచ్చోసిన చింతమనేని తీవ్రమైన నోటి దురుసు, దుందుడుకుతనం, ప్రభుత్వ అధికారులపై దాడులు, అక్రమాలతో గత ఐదేళ్లలో తన పేరు చెబితేనే భయపడేలా వ్యవహ రించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక (26) కేసుల్లో నిందితుడిగా, మొత్తం టీడీపీకే సింబాలిక్ రౌడీ ఎమ్మెల్యే అన్నట్లుంటుంది ఆయన తీరు. చింతమనేనిపై ఇప్పటికీ ఏలూరు త్రీ టౌన్ ఠాణాలో రౌడీషీట్ ఉంది. 2011లో మంత్రిగా ఉన్న వట్టి వసంత్‌కుమార్‌పై ప్రభుత్వ కార్యక్రమంలోనే దాడి చేసిన కేసులో రెండేళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధిస్తూ భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు రెండు నెలల కిత్రమే తీర్పిచ్చింది. దీనిపై హైకోర్టు నుంచి తుది తీర్పు రావాల్సి ఉంది. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి, ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి, ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు, ఏలూరు టూటౌన్ ఠాణాపై దాడికి దిగినంత పని చేసి నిందితులను తీసుకెళ్లడం, అంగన్వాడీ కార్యకర్తలను దుర్భాషలాడటం, కానిస్టేబుల్ మధును చితక్కొట్టడం, అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపడం, కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపల వేటలో అప్పటి జిల్లా ఎస్పీపై నోరు పారేసు కోవడం, గతేడాది మేలో గుండుగొలను కూడలిలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీవోలపై దాడి చింతమనేని తీరును అందరికీ తెలిపింది. ‘సుజనా’త్మక ఎగమేత చంద్రబాబు పెద్ద బినామీగా పేరున్న సుజనా చౌదరికి చెందిన కంపెనీలు బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టిన ఉదంతంపై దర్యాప్తు సాగుతోంది. సుజనావి దాదాపు రూ.6 వేల కోట్ల ఆర్థిక లావాదేవీ అవకతవకలు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో కొద్ది రోజుల క్రితం ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంది. గంటను తట్టుకునేదెవరు? విశాఖపట్నంలో జరిగిన రూ.లక్ష కోట్ల భారీ భూ స్కామ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావుదే కీలకపాత్ర. గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తరం)పై అనకాపల్లి, కశింకోట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.15/2009, 3/2018, 4/2018 కింద కేసులున్నాయి. విజయవాడలో పీఆర్సీ 1/18 విజయవాడ స్పెషల్ కోర్టులో ట్రయల్‌లో ఉంది. ఈయనపై ఐపీసీ 147, 148, 332, 333, 307, 447, 188 రెడ్‌విత్ 149 కింద సెక్షన్లపై కేసులున్నాయి. పత్తి కుంభకోణంలో పాపం మూటగట్టుకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ భూములను మింగిన అనకొండల్లో ఒకరనేది అందరికీతెలిసిందే. మంత్రులు కాల్వ∙శ్రీనివాసులుపై రాయదుర్గంలో 3 కేసులు నమోదవగా, కె.అచ్చె న్నాయుడు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపైనా కేసులున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థులు నిమ్మల కిష్టప్ప (హిందూపురం), వేటుకూరి వెంకట శివరామరాజు (నర్సాపురం), మాగంటి బాబు (ఏలూరు)పై కేసులుండటం గమనార్హం. నేరాల చిట్టాలో మరెందరో టీడీపీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ సెక్స్ రాకెట్ నుంచి కబ్జాల వరకు టీడీపీ నేతల పేరు లేని కుంభకోణం లేదు. నందమూరి బాలకృష్ణ (అనంతపురం జిల్లా హిందూపురం)పై బుక్కరాయ సముద్రం స్టేషన్లో క్రైమ్ నం.10/09, గుత్తి పోలీసు స్టేషన్లో క్రైమ్ నం. 20/09 ఉన్నాయి. విజయవాడ స్పెషల్ కోర్టులో సీసీ 40/18, సీసీ 43/18 కేసులు ఉన్నాయి. విజయవాడ కోర్టులో అండర్ సెక్షన్ 188, 283 ఆఫ్ ఐపీ, అండర్ సెక్షన్ 188, 283 ఐపీసీ కేసులు ఉన్నాయి. కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం)పై అనంతపురం వన్‌టౌన్ ఠాణాలో క్రైమ్ నం.193/2013, బుక్కరాయసముద్రం ఠాణాలో క్రైమ్ నం.10/2009, గుత్తి ఠాణాలో క్రైమ్ నం.20/2009 కేసులున్నాయి. జి.సూర్యనారాయణ (ధర్మవరం)పై క్రైమ్ నం.48/2014 కేసును ధర్మవరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఇటీవలే విజయవాడలోని స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. ఉమామహేశ్వర నాయుడు(కళ్యాణదుర్గం)పై బెలుగుప్ప స్టేషన్లో క్రైమ్ నం.62/2019 కేసు, కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో పీవోఆర్ నెం:21/2016–17 కేసు ఉంది. పరిటాల శ్రీరామ్ (రాప్తాడు)పై రామగిరి స్టేషన్లో క్రైమ్ నంబర్ 57/2018 (సెక్షన్లు 363, 324, 384, 342, 307, 506, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ) కిడ్నాప్, హత్యాయత్నం నేరాలపై కేసులున్నాయి. పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)పై బుక్కరాయసముద్రం స్టేషన్లో క్రైమ్ నెంబర్ 10/2009 కేసుంది. ప్రస్తుతం ఇది అనంతపురం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి విజయవాడ స్పెషల్ కోర్టుకు బదిలీ అయింది. జితేంద్రగౌడ్ (గుంతకల్లు)పై వన్‌టౌన్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 99/2005 కేసుంది. కందికుంట వెంకటప్రసాద్ (కదిరి)పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో క్రైమ్ నంబర్ 2/2003, క్రైమ్ నెంబర్ 33/2007 కేసులు నడుస్తున్నాయి. బీకే పార్థసారధి (పెనుకొండ)పై అనంతపురం వన్‌టౌన్ ఠాణాలో క్రైమ్ నంబర్ 193/2013 కేసు సెక్షన్ 147, 148, 336, 427, 506, రెడ్‌విత్ 149 ఐపీసీ పెండింగ్‌లో ఉంది. అనంతపురం ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద సీసీ నం.88/ 2018 పెండింగ్‌లో ఉంది. కె.ఈరన్న (మడకశిర)పై స్థానిక ఠాణాలో క్రైమ్ నం. 76/2013, మడకశిర జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో సీసీ నం.91/2013 ఉన్న కేసు విజయవాడ స్పెషల్ కోర్టుకు బదిలీ అయింది. హత్యాయత్నం, దౌర్జన్యం, ఆర్థిక నేరాలతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన సహా వాసుపల్లి గణేష్‌కుమార్ (విశాఖ దక్షిణ)పై 9 కేసులున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై హైకోర్టులో కేసు నడుస్తోంది. పీలా గోవింద సత్యనారాయణ (అనకాపల్లి)పై ఎఫ్ఐఆర్ 19/2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదైంది. కేఏ నాయుడు (గజపతినగరం)పై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సీసీ 30/2018, సీసీ 31/2018 నంబర్లతో ఉన్న ఈ కేసులు విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో ట్రయల్‌లో ఉన్నాయి. కరణం బలరామకృష్ణమూర్తి (ప్రకా«శం జిల్లా చీరాల)పై మద్దిపాడు స్టేషన్లో క్రైం నంబరు 129/06, 131/06 కింద నమోదైన కేసులు విజయవాడ కోర్టులో 11/18, 10/18 విచారణ జరుగుతున్నాయి. దామచర్ల జనార్దన్ (ఒంగోలు)పై చెక్కుల పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, పోలింగ్ సమయంలో ఠాణా వద్ద వంద మీటర్లు నిబంధన ఉల్లంఘనకు గాను ఒంగోలు వన్‌టౌన్, హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి)పై మేదరమెట్ల స్టేషన్లో ఎఫ్ఐఆర్ నం.88/2015, విజయవాడ ఠాణాలో యూ/ఎస్ 143. 341, 188 రెండ్ విత్ ఐపీసీ సెక్షన్ల కింద, గుంటూరు ఠాణాలో 2015 అక్టోబరు 12న మరో కేసు నమోదైంది. ముత్తుముల అశోక్‌రెడ్డి (గిద్దలూరు)పై స్థానిక ఠాణాలో క్రైం నంబర్ 152/2014 కేసు నమోదైంది. పోలీసు జీపును తగులబెట్టారని ఈ కేసు పెట్టడం గమనార్హం. తనపై 35 కేసులు ఉన్నాయని 2014 అఫిడవిట్లో పేర్కొన్న శంకర్ యాదవ్ (చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే) ఈ ఎన్నికల్లో ఒక్క కేసు కూడా లేదని చెప్పడం గమనార్హం. తోట త్రిమూర్తులు (తూ.గో. జిల్లా రామచంద్రపురం)పై దళితుల శిరోముండనం కేసు రెండు దశాబ్దాలుగా నడుస్తోంది. పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి (నెల్లూరు జిల్లా కోవూరు)పై తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులున్నాయి. బొల్లినేని రామారావు (నెల్లూరు జిల్లా ఉదయగిరి)పై మహా రాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో మూడు కేసులున్నాయి. పి.తిక్కారెడ్డి(కర్నూలు జిల్లా మంత్రాలయం)పై హైదరాబాద్ 14వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు, చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టుల్లో రెండు చెక్ బౌన్స్ కేసులున్నాయి. బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు) శ్రీకాళ హస్తి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో 2017లో కేసు నమోదైంది. కోర్టుకు హాజరు కాకపోవడంతో పోలీసులు మరో కేసు పెట్టారు. ఒకే చెక్కు ఇద్దరికి ఇచ్చిన ఆరోపణపై ఎమ్మిగనూరు కోర్టులోనూ కేసుంది. గాలి భానుప్రకాశ్ (చిత్తూరు జిల్లా నగరి)పై బెంగళూరు సివిల్ కోర్టులో 2014 మార్చి 24న క్రైం నెంబర్ 124/2014 సెక్షన్ 3, 4 పీఎంఎల్ఏ యాక్ట్ 2002 కింద కేసు నమోదైంది. మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి (కడప జిల్లా జమ్మలమడుగు)పై జంట హత్యల కేసుతో పాటు మరో కేసు పెండింగ్‌లో ఉంది. సతీష్‌కుమార్‌రెడ్డి (పులివెందుల)పై ఒక కేసుంది. గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై విజయవాడలో రెండు కేసులున్నాయి. ఇలా కేసు కట్టనివి ఎన్నో... విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేసి ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసినా కేసు నమోదు కాలేదు. రాజధాని ప్రాంతంలోనే ఇలా చేస్తే... ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఇంకెన్ని కేసులు కాకుండా పోయాయో...? -
కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, పెదవేగి రూరల్/ఏలూరు(సెంట్రల్): మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం.. కొల్లేరు విషయంలో శాశ్వత పరిష్కారం చూపించేందుకు తిరిగి సర్వే చేయిస్తాం.. కొల్లేరువాసులు ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో కొల్లేరు ప్రజలు, మహిళలు, మత్స్యకారులతో ఏర్పాటుచేసిన ముఖాముఖీలో బుధవారం ఆమె మాట్లాడారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలు, కొల్లేరు సమస్యలపై ప్రజలు ఆమె వద్ద ఏకరువు పెట్టారు. డ్వాక్రా రుణాలు మాఫీకాకపోవడంతో వడ్డీకి అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లించామని, పసుపు–కుంకుమ సొమ్ములు వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఓ మహిళ తన బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందిస్తున్నారని షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మత్స్యకార అభివృద్ధి బోర్డు, రెగ్యులేటర్, ఎస్సీ సొసైటీలు, ఐదో కాంటూర్‌లో జిరాయితీ భూములు, నష్టపరిహారం, రీ సర్వే తదితర సమస్యలను కొల్లేరు గ్రామస్తులు షర్మిలకు వివరించారు. చింతమనేనికి ఓటుతో బుద్ధి చెప్పండి వైఎస్ షర్మిల మాట్లాడుతూ మహిళా తహసీల్డార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టిన సంఘటన తాను టీవీలో చూశానని.. చింతమనేని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే అతను మనిషా.. పశువా అని ప్రశ్నించారు. చింతమనేనికి పోయేకాలం వచ్చిందని అతడిపై 38కి పైగా కేసులు ఉన్నాయంటేనే అర్థమవుతుంది అతడు ఏలాంటి వాడో అని అన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే చింతమనేని రెచ్చిపోతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. ఇది అతడిని చంద్రబాబు ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌కు ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని అక్రమాలపై చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని, కొల్లేరు సమస్యను జగనన్న పరిష్కరిస్తారని, కొల్లేరును రీసర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారన్నారు. నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు జగనన్న నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని, పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని, డ్వాక్రా రుణమాఫీ చేసి ఆ సొమ్మును నేరుగా అక్క, చెల్లెమ్మలకు అందిస్తారని షర్మిల అన్నారు. వృద్ధులకు పెన్షన్ రూ.2 వేల నుంచి రూ.3 వేలు చేస్తారని, జగనన్నకి ఒక్కసారి అవకాశం ఇస్తే అందరి కష్టాలు తీరుస్తారన్నారు. పిల్లల చదువులకు ఎంత ఖర్చయినా ప్ర భుత్వమే భరించేలా జగనన్న చూస్తారన్నారు. దీంతో పాటు మెస్ ఛార్జీలకు రూ.20 వేలు ఇస్తారన్నారు. ప్రతి రైతుకు మే నెలలో రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తారని, రూ.3 వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని, కరువు, వరదలతో పంటలు నష్టపోతే ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో నిధి ఏ ర్పాటుచేస్తారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసీ టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామన్నారు. రాజన్నరాజ్యం జగనన్నతోనే సా ధ్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ ని యోజకవర్గ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ హామీతో సంతోషం: మండల కొండలరావు నా పేరు మండల కొండలరావు, మాది శ్రీపర్రు. కొల్లేరు చెరువులను చాలా వరకు ధ్వంసం చేయడంతో ఉపాధి కోల్పోతున్నాం. సుమారు లక్ష మంది వరకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. కొల్లేరు ప్రాంతాన్ని రీ సర్వే చేయాలని, సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్రెడ్డికి కొల్లేరు ప్రాంతంలో పాదయాత్ర చేసిన సమయంలో వినతిపత్రం ఇచ్చాం. మా సమస్యలు చట్టసభల్లో చెప్పేందుకు కొల్లేరు ప్రాంతానికి ఎమ్మెల్సీని ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం సంతోషం. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: వైఎస్ షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలోని ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. జగన్ ఇచ్చిన మాట తప్పరు. ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. చింతమనేని వేధింపులు ఎక్కువయ్యాయి: జీవమణి నాపేరు జీవమణి, మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలిని. మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్న నన్ను కాలపరిమితి ఉన్నా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కావాలనే పదవి నుంచి తొలగించారు. మానసికంగా వేధింపులకు దిగారు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారు. దీంతో నా ఆరోగ్యం కూడా క్షీణించింది. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే..: భలే జయలక్ష్మి నా పేరు భలే జయలక్ష్మి, గుడివాకలంక. ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వ సబ్సిడీ వస్తుంది కదా అని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. అయినా సబ్సిడీ రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. మొదట డ్వాక్రా రుణమాఫీ విషయంలో మోసపోయాం. ఇళ్ల సబ్సిడీ విషయంలో మరోసారి మోసపోయాం. కేసులన్నీ బయటకు తీస్తాం: వైఎస్ షర్మిల బాధ్యత గత ఎమ్మెల్యే పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఆడామగా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహిళా తహసీల్దార్‌పై దాడిచేశారు. చింతమనేని ప్రభాకర్ మనిషా లేక పశువా. 34 కేసులు ఉన్న ఈ రౌడీ ఎమ్మెల్యేకే సీఎం చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తి చట్టసభలకు వెళ్లడం అవసరమా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసులన్నీ బయటకు తీస్తాం. వలసలు పోవాల్సిన దుస్థితి: ఘంటసాల దుర్గ నా పేరు ఘంటసాల దుర్గ, మాది గుడిపాడు గ్రామం. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికల వస్తున్నాయని చెప్పి పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇస్తున్నారు. ఇవి వడ్డీలకు కూడా సరిపోవు. కొల్లేరు ప్రాంతంలోని చెరువులను కొట్టివేయడంతో ఉపాధి లేక వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా మంది ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఓట్ల కోసం మోసం చేస్తున్నారు: వైఎస్ షర్మిల గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు మరలా ఎన్నికలు వస్తున్నాయని పసుపు–కుంకుమ అంటూ డబ్బులు ఇస్తూ మభ్యపెడుతున్నారు. ఆ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోదు. ఓట్ల కోసం చంద్రబాబు మోసం చేస్తున్నారనే విషయాన్ని మహిళలంతా గుర్తించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చెరువులను స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే: తిరుపతిరావు నా పేరు సైదు తిరుపతిరావు, మాది ప్రత్తికోళ్లలంక గ్రామం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరు గ్రామాల్లోని చెరువులన్నీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వాధీనం చేసుకుని, చెరువుల్లో చేపలను అమ్ముకున్నారు. ఇలా మూడేళ్లుగా రూ.13 కోట్ల వరకు దోచుకున్నారు. ఐక్యంగా ఉండే గ్రామస్తుల మధ్య గొడవలు పెట్టి వర్గాలుగా తయారుచేయడంతో గ్రామాల్లో ఉండలేని పరిస్థితి. ఏడు నెలల నుంచి ఏలూరులో తలదాచుకుంటున్నా. ఎమ్మెల్యే చింతమనేని చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోగా తిరిగి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే..: వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు అలా ఉన్నారు కాబట్టే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, చింతమనేని ప్రభాకర్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలని ప్రచారం చేయండి. త్వరలో రాబోయే రాజన్న రాజ్యంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వే చేయిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. -
ఓటుతో 'చింత' తొలగిద్దాం..
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరుటౌన్: ఒకవైపు యువకుడు, విద్యావంతుడు.. మీకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన కొఠారు అబ్బయ్య చౌదరి... ఇంకో వైపు దుర్మార్గుడు, మహిళలను గౌరవించనివాడైన చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. బెదిరింపులకు లొంగిపోకుండా ఓటు అనే ఆయుధంతో ఆ దుర్మార్గునికి బుద్ధి చెప్పాలని వెఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కోరారు. దెందులూరు నియోజకవర్గంలో షర్మిల రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. విజయరాయిలో సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. తొలుత నడిపల్లి వద్ద మత్స్యకారులతో షర్మిల ముఖాముఖి మాట్లాడారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను, బాధలను, సమస్యలను ఏకరువుపెట్టారు. వారి కష్టాలు విన్న షర్మిల మీ ప్రతీ సమస్యనూ పరిష్కరిస్తామని, జగన్ అన్న ముఖ్యమంత్రిగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని భరోసా కల్పించారు. అనంతరం అక్కడ నుంచి రోడ్ షో నిర్వహిస్తూ విజయరాయి సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో భారీ జనసందోహం మధ్య టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ... సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతిపై విరుచుకుపడ్డారు. దుర్మార్గుడు, మహిళలను గౌరవించని వాడు. వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వోను జట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లినవాడు. మనిషా లేక పశువా. ఇంత దుర్మార్గుడు.. ఒక తల్లికి పుట్టినవాడు కాదా... తన భార్య మహిళ కాదా... అక్క చెల్లెళ్ళు లేరా... మహిళ అని చూడకుండా వ్యవహరించిన వాడు మృగం కాదా అంటూ చింతమనేనిపై నిప్పులు చెరిగారు. ఇసుక మాఫియా నుండి లిక్కర్ మాఫియా వరకు ప్రతి ప్రాజెక్టులో, కొల్లేరులో కమీషన్లు కొట్టేయడంలో చింతమనేని ఉన్నాడు. మీలో ఒక్కరైనా ప్రభాకర్ మంచివాడు ఒక మంచిపని చేశాడని చెప్పగలరా. అలాంటి దుర్మార్గుడు, అసెంబ్లీకి పోవడానికి అర్హుడా... ఐదేళ్లు దోచుకున్నాడు. ప్రజలను ఎంత హింస పెట్టాడో. ఏం చేశాడో తెలుసు. ఈ ఎన్నికలే మీ ఆయుధం. ఆయన బెదిరింపులకు భయపడవద్దు. మోసపోకండి.. డబ్బులకు లొంగిపోకండి.. తెలుగుదేశం ప్రభుత్వానికి, చింతమనేని ప్రభాకర్‌కి ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. ఇలాంటి వాడికి చంద్రబాబు టికెట్ ఇచ్చాడు అంటే చంద్రబాబు ఎంత దుర్మార్గుడో తెలుసుకోండి అన్నారు. చింతమనేనికి డిపాజిట్ కూడా రాకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరిని గొప్ప మెజార్టీతో గెలుపించుకోవాలన్నారు. ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ మీ మధ్య ఉంటున్నాడు. మీ సమస్యలు తెలుసుకుంటున్నాడు. కొల్లేరు అయినా ఇంకేదైనా అన్నింటికి పరిష్కారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. అందుకే మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని షర్మిల స్పష్టం చేశారు. రాజన్న రాజ్యం వస్తోంది రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు ఒక పండుగ అవుతుంది. మళ్ళీ రైతు రాజు అవుతాడు. ప్రతి రైతుకు మే నెలలో పెట్టుబడి ఏడాదికి రూ.12,500 ఇస్తారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రూ.4 వేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా అక్కచెల్లెళ్ళకు రుణం ఎంతైతే ఉందో నాలుగు దఫాలుగా æమాఫీ చేస్తూ మీ చేతుల్లోనే పెడతారు. వడ్డీలేని కొత్త రుణాలు ఇస్తారు. మీ పిల్లలు ఏం చదివినా డాక్టరైనా, ఇంజనీరైనా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా ఏ కోర్సు తీసుకున్నా మొత్తం ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. దానికి అదనంగా రూ.25 వేలు హాస్టల్, మెస్ ఫీజులకు ప్రతి విద్యార్థికి ఇస్తాం. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రులను చేర్చుతాం. అక్క చెల్లెళ్ళు పిల్లలను బడికి పంపడానికి సంవత్సరానికి రూ.15 వేలు ఆ అమ్మ చేతిలోనే పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళు దాటితే ఏడాదికి రూ.75 వేలు వైఎస్సార్ చేయూత కింద ఆర్థిక సహాయం చేస్తాం. ఇవన్నీ చేయాలంటే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని షర్మిల కోరారు. రోడ్ షో సాగిందిలా.. విజయరాయిలో భారీ సభ అనంతరం వేలాదిమంది వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో షర్మిల రోడ్ షో చింతలపాటివారి గూడెం, రాయన్నపాలెం, రాట్నాలగుంట, సూర్యారావుపేట, పెదవేగి, దిబ్బగూడెం, గార్లమడుగు, కవ్వగుంట, లక్ష్మీపురం, ఒంగూరు గ్రామాల మీదుగా సాగింది. మహిళలు హారతులు పడుతూ విజయం సాధించాలంటూ ఆశీర్వదించారు. భారీ సంఖ్యలో మోటారుసైకిల్ ర్యాలీ షర్మిల వెంట సాగింది. ఆయా గ్రామాలలో పెద్దసంఖ్యలో చేరిన ప్రజలు, మహిళలకు షర్మిల అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, మాజీ మంత్రి మరడాని రంగారావు, బొమ్మారెడ్డి చంద్రారెడ్డి, పర్వతనేని నాగయ్య, పీవీ రావు, మెండెం ఆనంద్, ఆళ్ళ సతీష్‌చౌదరి, కమ్మ శివరామకృష్ణ, వీరమాచినేని నాగబాబు, మట్టా గోపాలరావు, ముంగర సంజీవ్‌కుమార్, జానకిరెడ్డి, లేగల శివ, బొమ్మబోయిన నాని, మెట్లపల్లి సూరిబాబు, అప్పన ప్రసాద్, తేరా ఆనంద్, మాజీ ఎంపీపీ చల్లా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం: షర్మిల
సాక్షి, పశ్చిమగోదావరి : ఇసుక తనిఖీలకు వెళ్లిన ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌కు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం దారుణమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలో మత్స్యకారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చింతమనేని అక్రమాలతో పాటు కొల్లేరు సమస్యలను వైఎస్ షర్మిల వద్ద ఏకరువు పెట్టుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్‌కు గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. 38 రౌడీషీట్ కేసులున్న చింతమనేనిని ఓడిస్తే .. అతనికి బుద్ది వచ్చేట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తారన్నారు. చింతమనేని అక్రమాలకు చంద్రబాబే కారణం అని ఆరోపించారు. చింతమనేని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా చెబుతుంటే అతను మనిషేనా అని అనిపిస్తోందన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని అక్రమాలపై చర్యలు తీసుకునే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. యధారాజా తధాప్రజా అన్నట్లుగా చంద్రబాబు అలా ఉన్నాడు కాబట్టే చింతమనేని ఇలా రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి రౌడీలకు చంద్రబాబు టికెట్ ఇవ్వడం దారుణమన్నారు. కొల్లేరు సమస్యను జగనన్న పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. జగనన్న అధికారంలోకి వస్తే కొల్లేరును రీసర్వే చేసి మీకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వైఎస్ జగన్ నవరత్నాలతో అందరి జీవితాలలో వెలుగులు నింపుతారని హామీ ఇచ్చారు. పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి 15 వేలు జగనన్న ఇస్తారని భరోసా ఇచ్చారు. వృద్దుల పెన్షన్ ను రెండు వేల నుంచి మూడు వేలకి పెంచుతారన్నారు. ప్రతీ ఒక్కరి కష్టాలు తీరాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘అందుకే టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే స్థాయి మరచి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీని నేరగాళ్ల పార్టీ అంటున్న చంద్రబాబు.. తమ అభ్యర్థుల జాబితాలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ‘ చంద్రబాబు నువ్వు నేరగాడివి. నువ్వు, నీ కొడుకు కలిసి 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. మీ అభ్యర్థి చింతమనేని పుణ్య పురుషుడా. ఇక నిడదవోలు ఎమ్మెల్యే 400 కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా అమ్ముకున్నాడు. బోండా ఉమా కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఉన్నాడు. నారాయణ కాలేజీలో ఎంత మంది చనిపోయారు. దానిపై చర్చ ఎందుకు జరగడం లేదు’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. అభ్యర్థులు కూడా దొరకడం లేదు.. కోట్లు కుమ్మరించి అడ్డదారిలో టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ప్రశాంత్ కిషోర్‌ను బిహార్ గ్యాంగ్ అనడం దారుణం. సీఎం స్థానానికి చంద్రబాబు అనర్హుడు. ఆయనకు ఓటమి తప్పదని అర్థం అయ్యింది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరున్నా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు మానసిక స్థితి చూసి వాళ్ల పార్టీ అభ్యర్థులు పోటీకి దూరంగా ఉంటున్నారు’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు. -
చింతమనేనిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
సాక్షి, అమరావతి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లోగా ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం అన్ని వివరాలను ఇవ్వాలని కమిషన్ కోరింది. 15రోజుల్లోగా నివేదిక రాకపోతే అధికారులు కోర్టుకు హాజరయ్యేలా సమన్లు ఇవ్వనన్నట్లు పేర్కొంది. చదవండి: దళితులను తీవ్రంగా అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే -
చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి
-
‘చింతమనేని.. నోరు అదుపులో పెట్టుకో’
సాక్షి, ఏలూరు : దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ నాయకురాలు తానేటి వనిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు. దళితులపై ‘దేహి’ లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అధికారులపై సైతం చింతమనేని దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. కొవ్వూరు పోలీసు స్టేషన్లో చింతమనేని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకోలేదని ఆరోపించారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) చింతమని వ్యాఖ్యలు మార్ఫింగ్ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులను కేవలం ఓట్ల కోసమే చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు దళితులను హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం అన్నారు. దళితులపై అనుచిన వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు కోరడం సరికాదన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. బహిరంగంగా చింతమనేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దళితులంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలిపించాలని కోరారు. -
చింతమనేని వీడియో షేర్.. మరో కార్యకర్త అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా: దళితులను తీవ్రంగా అవమానించిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీడియో షేర్ చేసినందుకు గానూ మరో వైఎస్సార్సీపీ కార్యకర్త కామిరెడ్డి నానిని పశ్చిమ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త నానిని బలవంతంగా అరెస్ట్ చేసి ఏలూరు త్రీటౌన్కి పోలీసులు తరలించారు. నిన్న రాత్రే కామిరెడ్డి నానికి వివాహం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నాం దెందులూరు మండలం శ్రీరామవరంలోని సొంత ఇంటిలో రిసెప్షన్ జరిగింది. వివాహ రిసెప్షన్ ముగిసిన తర్వాత పోలీసులు నానిని అరెస్ట్ చేశారు. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవక ముందే నానిని అరెస్ట్ చేయడంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులను దూషించిన చింతమనేనిపై మాత్రం ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దళితులపై దూషణ పర్వానికి దిగిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గత నాలుగు రోజులుగా దళిత సంఘాలు ఆందోళనలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలి వీడియో షేర్ చేశారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చింతమనేని కేసును తప్పు దోవ పట్టించేలా పశ్చిమ పోలీసుల చర్యలు ఉన్నాయని, కామిరెడ్డి నాని అక్రమ అరెస్ట్‌ను దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ తీవ్రంగా ఖండించారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు: నాని తండ్రి తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చింతమనేని వీడియో షేరింగ్ కేసులో అరెస్టయిన కామిరెడ్డి నాని తండ్రి వాపోయారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చాలా సేపటి నుంచి ఉన్నా.. మమ్మల్ని పోలీస్‌స్టేషన్ లోపలికి రానివ్వడం లేదన్నారు. దళితులను తిట్టిన చింతమనేనిని వదిలేసి నా కుమారుడిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వీడియోని నా కుమారుడు అసలు షేర్ చేయలేదని, కేవలం వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతోనే అరెస్ట్ చేశారని చెప్పారు. -
పోలీసులా.. చింతమనేని ఏజెంట్లా?
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్): లా అండ్ ఆర్డర్ అమలులో తప్పు చేసిన చింతమనేని ప్రభాకర్‌ను వదిలేసి వెలుగులోకి తీసుకు వచ్చిన కత్తుల రవికుమార్‌జైన్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని? పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఇది పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేయటమే అన్నారు. పోలీసులు కత్తుల రవిపై పెట్టిన కేసును తక్షణం ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దూషించడం, అవమానించడం, కొట్టడం పరిపాటిగా మారిపోతోందని పేర్కొన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం మానేసి బాధితులపైన, వెలుగులోకి తీసుకు వచ్చిన వారిపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం అని వివరించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని, చట్టం తనపని తాను చేసుకు పోతుంది అంటే అధికారానికి దాసోహామనటమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఆర్థిక వెనుకబాటు తనం, నిస్సహాయతలను ఆసరా చేసుకుని ప్రభుత్వ విప్‌గా ఉన్న వ్యక్తి దళితులను చులకనగా, అవమానకరంగా మాట్లాడటం, ప్రవర్తించటం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కటమేనన్నారు. ఎమ్మెల్యే చింతమనేనిని అన్ని విధాలుగా కాపాడుతున్న ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా దోషే అవుతారన్నారు. తక్షణం చింతమనేనిని అరెస్టు చేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దళితులను అవమానించే ఇలాంటి వారందరికీ తగిన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. -
‘చింతమనేని నాలుక చీరేస్తాం’!..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చింతమనేని ప్రభాకర్ అనే పిచ్చికుక్కను విప్‌గా పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై తీవ్ర వ్యాఖ్యాలు చేసిన చింతమనేని నాలుక చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దళితుల మనోభావాలు దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వ్యాఖ్యలపై మాలలు, మాదిగలు అందరూ ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు కులం పేరుతో దూషిస్తున్నారని, దళిత సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. పధకం ప్రకారం జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, చింతమనేని ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితులని అవమానించారని, వారిని దళితులు చీపుర్లతో కొట్టే రోజు త్వరలోనే ఉందన్నారు. దళితులు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. -
‘అందుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయం’
సాక్షి, పశ్చిమ గోదావరి : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అచ్చు వేసిన ఆంబోతులా వదిలేసి తమపై అక్రమంగా కేసులు పెడతారా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల అవినీతి అందించాడు గనుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని వ్యాఖ్యలు దారుణమన్నారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దళిత కార్మికుడు రాచేటి జాన్‌ను గతంలో ఇంటికి పిలిచి మరీ కొట్టినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. చింతమనేని దళితులను బూతులు తిడితే ప్రభుత్వం కళ్లు మూసుకుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని మాట్లాడిన దానినే దళిత నేత కత్తుల రవి షేర్ చేస్తే మార్ఫింగ్ చేశారని తప్పుడు కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. దళితులకు అన్యాయం జరిగితే ఎస్సీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఏం చేస్తున్నారు.. దళితులంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని ఆవేదన వ్యక్తం చేశారు. 40 పేజీలపై సంతకాలు తీసుకుని రవిని భయపెట్టాలని చూశారన్నారు. రవిపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని, చింతమనేనిని అరెస్ట్ చేయకపోయినా.. రవిపై కేసులు ఎత్తివేయకపోయినా ఈ అన్యాయంపై రాష్ట్రంలోని ప్రతీ గడపా తడతామని తేల్చిచెప్పారు. చంద్రబాబు దళిత ద్రోహిగా మిగలబోతున్నాడన్నారు. ‘వంద కోట్ల రూపాయల అంబేద్కర్ స్మృతివనం ఏం చేశావు.. కారెం శివాజీ! చంద్రబాబు దగ్గర ఎస్సీ కమీషన్‌ను తాకట్టు పెట్టి నపుంసకుడిగా ఉండిపోయావ్’ అంటూ విమర్శించారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, పోలీసులు న్యాయం పక్షాన ఉండాలని చెప్పారు. కానీ ఏపీలో పోలీసులు చంద్రబాబు మనుషులుగా మారడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
దళితుల సత్తా చూపిస్తాం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలపై జిల్లాలో నిరసన పెల్లుబికింది. దళితులకు రాజకీయాలెందుకంటూ చింతమనేని వ్యాఖ్యలు చేయడాన్ని ఎస్సీ, ఎస్టీలతో పాటు మేధావులు, సామాజిక కార్యకర్తలు తప్పుబట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం లేనివారు ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావడం, వారిని టీడీపీ వెనుకేసుకురావడంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల సత్తా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అంబేడ్కర్ విగ్రహాలకు అభిషేకాలు చేసి నిరసన తెలిపారు. విజయనగరం, పాచిపెంట: దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సామాజిక కార్యకర్త మామిడి శ్రీనివాస కళాధర్ డిమాండ్ చేశారు. దళితులు పట్ల చింతమనేని మాటలను నిరసిస్తూ పాచిపెంట మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశవ్యాప్తంగా ఇంకా కుల వివక్ష తాండవిస్తోందన్నారు. దళితులుకు పదవులు ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కనే విషయాన్ని చింతమనేని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో యజ్జల రామస్వామి,గోవిందు,అజయ్,యువత తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలను తూలనాడేవారికి బుద్ధిచెబుతాం చీపురుపల్లి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల అణిచివేతకు చర్యలు చేపడుతున్న టీడీపీ సర్కారుకు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడడాన్ని నిరసిస్తూ గురువారం చీపురుపల్లిలో ఆందోళన చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు దళితులను హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారని, ఆయనేమైనా జమిందారీ ఇంట్లో పుట్టారా చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో 18 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలను తెలుగుదేశం ప్రభుత్వం హీనాతి హీనంగా చూసిందన్నారు. దళితులతో పెట్టుకుంటే ఏ రాజకీయ పార్టీలకైనా పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. తక్షణమే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుల అడ్డూరి రామకృష్ణ, రేగిడి రామకృష్ణ, డి.రాము, సిమ్మాల అప్పన్న, సిమ్మాల రామ్మూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాకేటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల హైడ్రామా.. వైఎస్సార్ సీపీపై కుట్ర
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఏలూరు టౌన్: ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనికి భిన్నంగా ఆయనను వెనకేసుకొచ్చారు. వైఎస్సార్ సీపీ వారే మార్ఫింగ్ చేసి వారే ప్రచారం చేస్తుంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పోలీసులు కదిలి ఈ కుట్ర మొత్తం వైఎస్సార్ సీపీకి ఆపాదించే పనిలో పడ్డారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దళితుల మనోభావాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో వైరల్ కావటంతో రాష్ట్ర వ్యాప్తంగాదళితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలోని పలు స్టేషన్లలో చింతమనేనిపై పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదులు చేసినా కదలని పోలీసులు ఈ వీడియోని పోస్టు చేసిన వైఎస్సార్ సీపీ దళిత నేత కత్తుల రవికుమార్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. పెదపాడులోని ఇంటిలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని పెదపాడు, ఏలూరు రూరల్, ఏలూరు త్రీటౌన్ స్టేషన్లకు తిప్పారు. రవికుమార్ అరెస్ట్‌లో పోలీసు అధికారుల హైడ్రామా విమర్శలకు తావిస్తోంది. ఉదయం రవికుమార్‌ను ఇంటివద్ద నుంచి మాట్లాడే పనుందంటూ తన బండిపై ఎక్కించుకుని వచ్చిన పెదపాడు పోలీసులు.. చివరికి సీఐతో మాట్లాడాలంటూ ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు.. అనంతరం త్రీటౌన్‌లో కేసు నమోదు చేశారంటూ ఏలూరు త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ రవికుమార్‌ను విచారించిన పోలీసులు ఈ నెపాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వేసేందుకు కుట్ర చేశారు. ఎవరు పోస్టు చేయమన్నారు? నీకు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? పోస్టు చేస్తే నీకు పార్టీ ఎంత డబ్బులు ఇస్తుందంటూ? ప్రశ్నలు వేశారు. పార్టీ ఆదేశాల మేరకే చింతమనేనికి సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడని, అది వైఎస్సార్ సీపీ చేయించిందనేలా దళితులను తప్పుదోవపట్టించేలా టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు కుట్రకు తెరతీశారు. పోలీసుల హైడ్రామా రవికుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ చేసిన పోలీసులు సాయంత్రం కోర్టుకు తీసుకువెళ్తామంటూ హాజరుపరిచారు. అనంతరం రవికుమార్‌ను ఎమ్మెల్యే చింతమనేని ఇంటివైపు కార్లను స్పీడుగా తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన వైఎస్సార్ సీపీ నేతలు, దళిత నేతలు పోలీసుల కార్లను వెంబడించారు. శనివారపుపేట గాలిగోపురం నుంచి మళ్లీ వెనక్కి తిప్పి నగరంలోని సందులు, గొందులు తిప్పారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ హైడ్రామాతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నేతలు, శ్రేణులు ఏమి జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు చివరికి కోర్టు వద్దకు తీసుకువచ్చి దింపివేశారు. న్యాయమూర్తి సెల్ఫ్బాండ్తో బెయిల్ పోలీసులు చెబుతున్నట్టు రవికుమార్ సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన వీడియో మార్ఫింగ్ చేసింది కాదు. ఎడిటింగ్ చేయలేదు. కేవలం వీడియోలోని ఒక భాగాన్ని కట్ చేసి పోస్టు చేశారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటువంటి కేసుల్లో పోలీసు స్టేషన్లోనే 41 సీఆర్పీ నోటీసు ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయాన్ని న్యాయమూర్తికి వివరించటంతో న్యాయమూర్తి సెల్ఫ్ బాండ్‌తో బెయిల్ ఇచ్చారు. రవికుమార్‌పై 505 క్లాజ్–2 రెడ్‌విత్ 34 ఐపీసీతో కేసు నమోదు చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.– న్యాయవాదులు లక్ష్మీకుమార్, శశిధర్‌రెడ్డి పోలీసు రాజ్యం నడుస్తోంది రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా పోలీసు రాజ్యం నడుస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. దళితులపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాన్ని పట్టించుకోని ప్రభుత్వం, పోలీసులు దళితుల ఆత్మగౌరవం కోసం వీడియోను పోస్టు చేస్తే కేసులు పెట్టడం అన్యాయం. ఆఖరికి సీఎం సైతం చింతమనేనిని వెనకేసుకురావటం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. దళితులపై దాడులు జరుగుతున్నా, హీనంగా చూస్తున్నా పట్టించుకోని దుస్థితి నెలకొంది. దళితుల మనోభావాలను దెబ్బతీసిన చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తాం. రాబోయే కాలంలో దళితులంతా ఐక్యంగా టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.– కొయ్యే మోషేన్‌రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
కత్తుల రవి విషయంలో పోలీసుల ఓవరాక్షన్
-
కత్తుల రవికి బెయిల్ మంజూరు
పశ్చిమగోదావరి : వైఎస్సార్సీపీ నేత కత్తుల రవికుమార్‌కు సొంత పూచీకత్తుపై ఏలూరు రెండవ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయకుండా ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైఎస్సార్సీపీ నేత రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అరెస్ట్ అనంతరం పొద్దున్నుంచి ఏలూరు వీధుల్లో, సందుల్లో తిప్పుతూ బెదిరింపులకు పాల్పడుతూ చివరికి ఏలూరు రెండవ అదనపు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి సొంతపూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవిని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి మరడాని రంగా రావు, కొఠారు రామచంద్రరావు, కొయ్యే మోషెన్ రాజు, దళిత సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు’ వినాశకాలే ‘విప్’రీత బుద్ధి -
‘నేను ఏ తప్పూ చేయలేదు’
పెదపాడు(పశ్చిమ గోదావరి జిల్లా): తాను ఏ తప్పూ చేయలేదని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్ తెలిపారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒత్తిడితోనే తనను అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పారు. చింతమనేని రోడ్‌షోలో మాట్లాడిన వీడియోని తాను ఎక్కడా మార్ఫింగ్ చేయలేదని చెప్పారు. చింతమనేని మాట్లాడిన దానిని ఉన్నది ఉన్నట్లుగానే వాట్సప్‌లో షేర్ చేసినట్లు వెల్లడించారు. చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరిచే విధంగా మాట్లాడితే అతనిని వదిలేసి, వీడియో అందరికీ తెలిసేలా షేర్ చేసిన తనపై కేసు పెట్టడం దారుణమన్నారు. ‘దళితులు.. మీకెందుకురా రాజకీయాలు.........కొడకల్లారా’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దళిత వర్గాన్ని తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించి వీడియో షేర్ చేసిన కత్తుల రవి అనే వైఎస్సార్‌సీపీనేతను హడావిడిగా అరెస్టు చేశారు. ఈ ఘటనతో పోలీసుల వైఖరిపట్ల దళిత సంఘాలు, వర్గాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చింతమనేని దిష్టిబొమ్మతో పాటు టీడీపీ జెండాలను దళితులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కోర్టుకు తీసుకెళ్లకుండా డ్రామాలాడుతున్న పోలీసులు కత్తుల రవిని ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి కోర్టుకు తరలించడంలో కూడా పోలీసులు హైడ్రామా నడుపుతున్నారు. పోలీసులు, రవిని జీపులో కోర్టుకు తీసుకెళ్లకుండా గంట సేపటి నుంచి ఊరంతా తిప్పుతున్నారు. మీడియా, వైఎస్సార్సీపీ నేతల కళ్లబడకుండా ఏలూరు వీధుల్లో, సందుల్లో నాటకీయంగా తిప్పుతూ టీడీపీకి అనుకూలంగా డ్రామాలాడుతున్నారు. పోలీసుల వైఖరితో రవి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. వినాశకాలే ‘విప్’రీత బుద్ధి చింతమనేని వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ.. చింతమనేనికి చంద్రబాబు మద్దతు! -
చింతమనేని కండకావరం తగ్గిస్తాం
యర్రగొండపాలెం: ‘‘చింతమనేని..నీకండకావరం తగ్గిస్తాం, ఆ రోజులు దగ్గరపడ్డాయి, దళితులంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నావు’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన తీవ్రవ్యాఖ్యలకు ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ ఆవేశపూరితంగా మాట్లాడారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. సమన్యాయం చేయాల్సిన సీఎం దళితులపట్ల చిన్నచూపు, అవమానకరంగా మాట్లాడుతుంటే తామేమీ తక్కువకాదని ఎమ్మెల్యేలు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. చింతమనేని గతంలో అనేక పర్యాయాలు ఇటువంటి చర్యలకు పాల్బడ్డారని, అయినా సీఎం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహశీల్దార్ వనజాక్షి జుట్టుపట్టుకొని ఈడ్చితే, చింతమనేనిపై సీఎం చర్యలు తీసుకోకుండా తహశీల్దార్తోనే క్షమాపణ చెప్పించారని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ పెద్దలు దళిత, బలహీన, మైనార్టీ వర్గాలపై మాయ ప్రేమ చూపిస్తూనే వారిని కించపరుస్తున్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే ఈ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో పేదల అభ్యున్నతికి ఏరోజూ వారు పాటు పడలేదని, ప్రజా కోర్టులో ఊడ్చుకొనిపోయే రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్రంలో టీడీపీకి నామరూపాలు లేకుండా చేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. చింతమనేని చేస్తున్న వ్యాఖ్యలకు టీడీపీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఎందుకు స్పందించడంలేదని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చింతమనేనిని ఎందుకు నిలదీయరని, సీఎం వద్దకు ఎందుకు వెళ్లలేరని ఆయన ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, ఎన్నికల ముందే కేసును ఒక తుదిరూపుకు తీసుకొని రావాలని సురేష్ డిమాండ్ చేశారు. చింతమనేనిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలని ఆయన ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. రాజ్యాంగాన్ని అపవిత్రం చేసినందుకు నిరసనగా బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమంలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర బీసీ, యువజన విభాగాల కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
చింతమనేనిని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి
చిత్తూరు అర్బన్: దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. గతనెలలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో చింతమనేని మాట్లాడుతూ ‘‘పదవులు మాకు.. రాజకీయాలు మాకు. మీకెందుకురా.. ఈ కొట్లాటలు’’ అంటూ తీవ్రంగా దూషించడంపై సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జిల్లాలోని పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని, ఆయన్ను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ♦ చింతమనేని అనుచిత వ్యాఖ్యలపై బంగారుపాళ్యంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బంగారుపాళ్యం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. చింతమనేనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ చింతమనేని అధికారులపై, ప్రజలపై దాడులకు పాల్పడ్డా తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబునాయుడు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. కాగా ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ♦ విజయపురం మండలం పన్నూరు సబ్ స్టేషన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె.రోజా మాట్లాడుతూ ప్రభాకర్ అసెంబ్లీలోనే తమపై దౌర్జన్యం చేసినా దిక్కులేదన్నారు. అ టవీ శాఖ అధికారులను కొట్టినా, తహసీల్దార్ వనజాక్షిని ధూషించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఇప్పుడు దళితులపై అనుచితంగా మాట్లాడుతున్నా సీఎం మౌనం వ హించడం సిగ్గుచేటమన్నారు. రోజాతో పాటు యువజన విభాగ నాయకులు శ్యామ్‌లాల్, రైతు నాయకులు లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు. ♦ పలమనేరులో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పార్టీ సీనియర్ నేత సివి.కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న దెందలూరు ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవడానికి టీడీపీ ఎందుకు భయపడుతోందన్నారు. కులహంకారంతో దిగజారుడు వ్యా«ఖ్యలు చేస్తున్న ఇతనిపై స్పీకర్ కల్పించుకోవాలని, వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ♦ తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేçశవులు ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్ ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. పేరూరు కూడలిలో చింతమనేని చిత్రపటాన్ని దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షుడు గోపి, నాయకులు జయచంద్ర, వాసు తదితరులు పాల్గొన్నారు. ♦ చింతమనేని వ్యాఖ్యలను నిరసిస్తూ బి.కొత్తకోటలో భారతీయ అంబేడ్కర్ సేవ (బాస్) కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దళితులను కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాస్ నాయకులు సచిన్, సింగన్న డిమాండ్ చేశారు. ♦ పుంగనూరు అంబేడ్కర్ కూడలిలో చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతో సహా ఆయన మంత్రి మండలిలోని పలువురు నేతలు దళితులపై తీవ్ర పదజాలం వాడుతూ దూషణలకు దిగుతున్నారన్నారు. వీరిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి, సీఐటీ యూ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఎంపీపీలు అంజిబాబు, నరసింహులు పాల్గొన్నారు. -
వినాశకాలే ‘విప్’రీత బుద్ధి
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్: ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులు, బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా దళితులు, బీసీ వర్గాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ చింతమనేని వ్యవహార శైలిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చింతమనేనిని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేయటంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. దళిత నేతలు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. చింతమనేని సిగ్గుసిగ్గు.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ నినాదాలు చేశారు. చింతమనేని దిష్టిబొమ్మలు దహనం చేయటంతోపాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో దళిత నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న చింతమనేని వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాలూ పోటీపడుతూ నినాదాలు చేశాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ దళిత నేతలను రెచ్చగొట్టేలా ప్రవర్తించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించినా ఫలితం లేకపోవటంతోముందుగా వైఎస్సార్ సీపీ దళిత నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులన్నీ టూటౌన్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ బైఠాయించాయి. తమ పార్టీ నేతలనే అరెస్టు చేయడంపై మండిపడ్డాయి. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా స్టేషన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు జిల్లా వ్యాప్తంగా దళితులు, బీసీ వర్గాలు నిరసనలు చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. హౌస్ అరెస్టులపై అభ్యంతరం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం వివాదానికి దారితీసింది. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరి ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా తన ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం ప్రదర్శనగా ఏలూరు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఈ నెల 22 నుంచి బీసీ సంఘం తరపున నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. మాదిగ మహాసేన దళిత బహుజన రిసోర్సు సెంటర్ (డీబీఆర్సీ) సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొవ్వలిలో మాలమహానాడు అధ్యక్షులు గొల్ల అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అక్కిరెడ్డిగూడెంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ♦ మార్టేరు సెంటర్లో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ æ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ♦ చింతమనేనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ నూకపెయ్యి సుధీర్ బాబు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్, ఎస్సీ సంఘాల నేతలు పళ్లెం ప్రసాద్, తేరా ఆనంద్, మున్నుల జాన్ గురునాథ్, మెండెం ఆనంద్ పాల్గొన్నారు. ♦ వైఎస్సార్ సీపీ గోపాలపురం సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో నిరసనలు నిర్వహించారు. ♦ చింతమనేనిని అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్, మహిళా కన్వీనర్ పాము సునీత, బోడ సంసోనులు భీమడోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ♦ చింతలపూడి సమన్వయకర్త వీఆర్ ఎలీజా ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, బోసు బొమ్మ సెంటరులో రాస్తారోకో చేసి, అనంతరం చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు. ♦ పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ♦ భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కులవివక్ష పోరాట సమితి, దళిత ఐక్యవేదిక నాయకులు చింతమనేనిపై ఫిర్యాదు చేశారు. వీరవాసరంలో జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ♦ ఆకివీడు, పాలకోడేరు మండలాల్లో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజారావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ♦ బుట్టాయిగూడెంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, ధర్నా నిర్వహించారు. ♦ ఉండ్రాజవరంలో వైఎస్సార్ సీపీ నిడదవోలు కన్వీనర్ జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యం లో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ♦ నిడదవోలు చర్చిపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆందోళనలు చేపట్టింది. ♦ నిడదవోలు మండలం మునిపల్లి గ్రామంలో బీజేపీ ఎస్సీ మండల అధ్యక్షుడు మందపాటి కిషోర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. -
చింతమనేని వ్యాఖ్యలను ఖండిస్తున్నా
-
చింతమనేనిని అరెస్ట్ చేయాలి!
-
అవినీతి ‘ముద్దర’
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆయన అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్త. అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే ఈయన, అనుచరులు రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా అర్థమవుతోంది.. ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ద్విచక్రవాహనాలకు కూడా దిక్కులేకపోగా నేడు ఖరీదైన కార్లలో దర్జాగా తిరుగుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు. ఆయనే నూజివీడు టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. పోలవరం మట్టి మాఫియా పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు, హనుమాన్‌జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది. ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే 8.30లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి రాగా అందులో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. క్యూబిక్‌మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో మట్టిని అమ్ముకున్నారు. ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు. కార్పొరేషన్ రుణాల్లోనూ కమీషన్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన రుణాలకు ఇచ్చే రాయితీని కూడా టీడీపీ నాయకులు వదిలిపెట్టలేదు. రుణాలు మంజూరు చేయాలంటే లబ్ధిదారులు టీడీపీ నాయకులకు కమిషన్ ముట్ట జెప్పాల్సిందే.. ముద్దరబోయిన అనుచరులు ఈదందా నడిపించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలో 50శాతం వరకు కమీషన్ వసూలు చేశారు. నూజివీడు పట్టణానికి చెందిన నాయకుడు ఒకరు పెద్ద ఎత్తున కమీషన్లు వసూలు చేయడం జరిగింది. అలాగే నూజివీడు మండలలోని ఒక ప్రజాప్రతినిధి సైతం కమీషన్లు బొక్కడం జరిగింది. కార్పొరేషన్ రుణాల మంజూరుకు ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు సైతం యూనిట్లు ఏర్పాటు చేయకుండానే లబ్ధిదారులకు బ్యాంకు రుణం ఇప్పించి సబ్సిడీలో సగం వసూలు చేస్తున్నారు. ముసునూరు మండలంలో రమణక్కపేటలో టీడీపీ నాయకుడు రంగు వెంకటేశ్వరరావు కొందరి పేర్లతో వారికి తెలియకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన కమీషన్ దాదాపు రూ.20లక్షల వరకు స్వాహా చేశాడు. రోడ్ల నిర్మాణంలో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్లో పనిచేసే పంచాయతీరాజ్ డీఈని నూజివీడు డివిజన్‌కు ఇన్చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో 10 శాతం కమీషన్ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. చింతమనేని హవా.. ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే ట్రాక్టర్లను సీజ్‌చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట, బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. మరుగుదొడ్లలో అవినీతి కంపు.. నూజివీడు మండలంలోని మరుగుదొడ్ల నిర్మాణాల్లో సైతం అవినీతి తారాస్థాయికి చేరింది. ముక్కొల్లుపాడు, సిద్ధార్థనగర్లలో నిర్మించిన మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉండటం, వాటికి సంబంధించిన నిధులను మాత్రం అధికార టీడీపీ నాయకులు పూర్తిగా డ్రాచేసుకుని జేబులో వేసుకోవడం జరిగిపోయింది. ముక్కొల్లుపాడును ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు దత్తత తీసుకోగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తన అనుచరుడితో 350 మరుగుదొడ్లు నిర్మించగా అందులో ఇంకా 150 మరుగుదొడ్లు వరకు అసంపూర్తిగానే ఉన్నాయి. కాని వాటికి సంబంధించిన నిధులను కూడా పూర్తిచేయకుండా బొక్కేశారు. అలాగే సిద్ధార్థనగర్‌లో కూడా 200వరకు మరుగుదొడ్లు మంజూరు కాగా గ్రామస్థాయి టీడీపీ నాయకుడు అందులో సగం మాత్రమే నిర్మించి, మిగిలిన వాటిని అసంపూర్తిగా నిర్మించేసి నిధులను మాత్రం తన జేబులో వేసేసుకున్నాడు. ఇలా అవకాశం లేని చోట కూడా అవకాశం కల్పించుకుని ప్రజాధనాన్ని స్వాహా చేశారు. నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనిలో పొక్లెయిన్‌కు లోడింగ్ ఖర్చు కింద క్యూబిక్ మీటర్‌కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్‌కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది. నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం. చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు. నూజివీడు మండలం సుంకొల్లు, కొన్నంగుంట తదితర గ్రామాల్లోని చెరువుల్లోని మట్టిని, గ్రావెల్‌ను టీడీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బాణావతు బద్రు, తలపంటి రాజశేఖర్ తదితరులు ట్రక్టు రూ.500 నుంచి రూ.1,000 వరకు రోడ్లనిర్మాణానికి, వెంచర్ల అభివృద్ధికి అమ్ముకున్నారు. నూజివీడు పట్టణంలోని టీడీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ నూజివీడు పెద్ద చెరువు, పోతురెడ్డిపల్లిలోని చెరువులలోను, ముసునూరు మండలంలోని చెరువులలోని మట్టిని ఇటుకబట్టీల వారికి, నివేశనస్థలాల వారికి, కాంట్రాక్టర్లకు విక్రయించి కోట్లు ఆర్జించారు. ముసునూరు మండలం లోపూడిలో కోమటి చెరువు, పెద్దచెరువు, కొత్తచెరువులలో నీరు చెట్టు పనులు చేసిన టీడీపీ నాయకులు వేంపాటి రామచంద్రరావు, వేంపా టి.శ్రీనివాసరావులు రూ.లక్షలు కొల్లగొట్టారు. కొత్తూరు చెరువులో అనుమతిలేకుండా గ్రావెల్ తవ్వుతుండగా విజిలెన్స్ అధికారులు సైతం యంత్రాలను సీజ్ చేయడం జరిగింది. టీడీపీ జిల్లా కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, చనుబండ పెద్ద చెరువులో నీరుచెట్టు పని నిర్వహించి, అందులో మట్టిని విక్రయించి రూ.30లక్షలు వరకు దోచుకున్నారు. ఇదే వ్యక్తి చేసిన సీసీ రోడ్లు సైతం నాసిరకంగా ఉండి అడ్డంగా బీటలు వారుతున్నాయి. కోటపాడు గ్రామంలో మంచిన పూర్ణచంద్రరావు అనే టీడీపీ నాయకుడు గ్రామంలోని నాలుగు చెరువుల్లో రూ.30లక్షలతో నీరుచెట్టు పనులు చేసి లక్షలు ఆర్జించాడు. ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను సరిచేసి నీరు–చెట్టులో దోచుకున్నారు. పోలవరం గ్రామంలో టీడీపీ వ్యక్తులు శ్మశానం స్థలాన్ని ఆక్రమించుకుని లైవ్‌ఫిష్ వ్యాపారం చేస్తున్నారు. ఈ గ్రామంలో రూ.40లక్షలతో నిర్వహిం చిన పనుల్లో మంత్రి దేవినేని ఉమా అనుచరుడని చెప్పుకునే తెలుగు యువత జిల్లా కార్యదర్శి మరిడి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించి మట్టిని కొల్లగొట్టారు. మండలంలోని పల్లెర్లమూడి వద్ద పోలవరం కాలువ తవ్వగా వచ్చిన మట్టిని సైతం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మింగేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ట్రాక్టర్లలో, లారీలలో తరలించి విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. -
చింతమనేని అనుచరుల వీరంగం
పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు స్థానిక మెయిన్ సెంటర్లో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టి, ఆర్టీసీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్న గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గణేష్ సెంటర్లో జంగారెడ్డిగూడెం వైపునకు వెళుతోంది. ఆ సమయంలో చింతమనేని అనుచరులు జీపులో వస్తూ బస్సుకు కుడివైపుగా ఓవర్ టేక్ చేస్తూ వేగంగా బస్సును ఢీకొట్టారు. వాహనం ఆపకపోగా కొద్ది దూరం వెళ్లడంతో సెంటర్లో ఇది గమనించిన యువకులు జీపును ఆపారు. యువకులకు, జీపులోని చింతమనేని అనుచరులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. చింతమనేని అనుచరులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై తమ జులుం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్టేక్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని బస్సుకు కలిగిన నష్టాన్ని భరించాలని ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు చింతమనేని అనుచరులకు చెప్పడంతో వారు ఘర్షణకు దిగారు. చెక్‌పోస్టు సెంటర్లోని కొందరు టీడీపీ నాయకులు చింతమనేని అనుచరులకు వత్తాసు పలకడంతో గొడవ తీవ్ర రూపం దాల్చి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు.చివరకు రెండు వర్గాల మధ్య రాజీ కుదరడంతో ఏ విధమైన కేసు నమోదు చేయలేదు. చింతమనేని అనుచరులకు అనుకూలంగా పై స్థాయి నుంచి ఫోన్ రావడంతో పాటు ఆర్టీసీ అధికారులు సైతం ప్రమాదానికి లోనైన బస్సు సిబ్బందితో చర్చించి గొడవను సర్దుబాటు చేసినట్లు తెలిసింది. -
‘పెన్షన్ కోసం వస్తే దాడి చేయడం దారుణం’
సాక్షి, విజయవాడ : పెన్షన్ కోసం వచ్చిన వృద్ధుడిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత సుధాకర్ బాబు అన్నారు. చింతమనేని ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లను టీడీపీ నేతలు చులకనగా చూస్తున్నారని విమర్శించారు. పెన్షన్ కోసం వస్తే ఒక ఎమ్మెల్యే దాడి చేయమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఉండాల్సిన లక్షణాలు చింతమనేనికి లేవన్నారు. టీడీపీ నేతలు ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిచారు కాబట్టే.. ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారన్నారు. (మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. వృద్ధుడిపై వీరంగం) నోటిఫికేషన్ వస్తే చెక్కులు చెల్లుతాయా? డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పలుమార్లు వైఎస్ జగన్ అసెంబ్లీలో కోరినప్పటికీ.. ఇంతవరకు ఒక్క పైసా కూడా చంద్రబాబు మాఫీ చేయలేదని సుధాకర్ బాబు విమర్శించారు. రుణమాఫి చేయకుండా ఎన్నికల వేళ రూ. 10వేలు ఇస్తామంటూ చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రూ.10వేలు పెట్టుబడి కింద ఇస్తున్నారో లేక రుణమాఫీ కింద ఇస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ చెక్కులు చెల్లుతాయా అని ప్రశ్నించారు. పోస్ట్‌డేటెడ్ చెక్కులు ఇస్తూ మహిళలను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే దొచుకున్న ధనం ప్రజలకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ది ఉంటే నారావారిపల్లి, సింగపూర్‌లో దాచుకున్న ధనాన్ని ప్రజలకు ఇవ్వాలని సుధాకర్ బాబు సవాల్ చేశారు. మంత్రులు దోచుకున్న వేల కోట్ల రూపాయలను ప్రజలకు పంచాలన్నారు. ఢిల్లీ నడివీధుల్లో చంద్రబాబు నిజస్వరూపాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారన్నారు. చంద్రబాబు దొంగతనం బయటపడింది కాబట్టే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. -
‘చింతమనేని ఒక విధీ రౌడీలా వ్యవహరిస్తున్నారు’
-
మరోసారి నోరు పారేసుకున్న చింతమనేని
-
ప్రత్తికోళ్లలంక ఉద్రిక్తం
పశ్చిమగోదావరి, ఏలూరు రూరల్: దెందులూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి రాక్షస క్రీడకు కొల్లేరు ప్రజలు బలి పశువులయ్యారు. దశాబ్దాల తరబడి కట్టుబాట్లతో కలిసి బతికిన వారు నేడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. తాజాగా గురువారం ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో ఘర్షణలు జరిగాయి. ఒక వర్గం ప్రజలు మరోవర్గంపై దాడులకు తెగబడ్డారు. కనబడిన వ్యక్తి ఆడమగా అని చూడకుండా ఇష్టానుసారం కొట్టారు. కర్రలు చేతబట్టి ఇళ్లల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్టు బాదారు. విలువైన ఫర్నిచర్, ఇళ్లను ధ్వంసం చేశారు. భీతిల్లిన ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీశారు. పక్కనే ఉన్న గుడివాకలంక ప్రజల వద్దకు వెళ్లి తమ బాధలను ఏకరువుపెట్టారు. తమ కుటుంబాలను కాపాడాలంటూ వేడుకున్నారు. మరికొందరు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఘర్షణలతో చుట్టుపక్కల కొల్లేరు గ్రామాలూ భీతిల్లాయి. ఏ నిమిషంఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు గ్రామానికి చేరుకున్నా.. ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ దుస్థితికి నాలుగేళ్ల కిందట అధికార దాహంతో కన్నుమిన్నూ కానని టీడీపీ ప్రజాప్రతినిధి వేసిన బీజమే కారణమనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. గతంలో సమైక్య జీవనం 2014 వరకూ ఈ గ్రామ ప్రజలు కలిసికట్టుగా చేపల సాగు చేసుకుని జీవించారు. కోట్ల రూపాయల మత్స్య సంపదను ప్రజలందరూ పంచుకుంటూ పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. వీరి ఐకమత్యం, ఆర్థికస్థితిని చూసి స్థానిక ప్రజాప్రతినిధికి కన్నుకుట్టింది. అంతే గ్రామాన్ని రెండు వర్గాలుగా విడదీశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా రెచ్చగొట్టారు. రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి ఏళ్ల తరబడి ప్రజలు సాగు చేస్తున్న చేపల చెరువులను అక్రమంగా తవ్వారంటూ నోటీసులు ఇప్పించారు. ఆదుకోమని వేడుకొనగా ఇరువర్గాలను కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆఖరికి ‘మీలో ఐకమత్యం లేదు. మీరు చేపల సాగు చేయలేరు.’ అంటూ ఆ చెరువులను టీడీపీ అనుయాయులు, తన అనుచరులకు లీజుకు కట్టబెట్టారు. పోనీలే కష్టపడి బతుకుదామని అనుకున్న ప్రజలకు న్యాయపరంగా ఇవ్వాల్సిన లీజు డబ్బు సుమారు రూ.15 కోట్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేశారు. ఆఖరికి ప్రజాప్రతినిధి మేక వన్నె పులి వేషాన్ని స్థానికులు గుర్తించారు. ‘మా లీజు డబ్బుతోపాటు మా భూములు మాకు పంచండి’ అంటూ 7 బంటాలు(ఒక్కొక్క బంటాలో 80 నుంచి 100 మంది ఉంటారు) పెద్దలు, ప్రజలు సదరు నేతను ఇటీవల జరిగిన అధికారిక కార్యక్రమంలో సైతం నిలదీశారు. పోలీసు అధికారులకూ ఫిర్యాదు చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి తమకు అండగా ఉండాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా మారారు. దీన్ని గుర్తించిన ప్రజాప్రతినిధి ప్రజలు ఎదురుతిరుగుతున్నారని గ్రహించి సమస్య పరిష్కరించండి అంటూ కొల్లేరు పెద్దలతోపాటు ఏలూరు పూర్వపు డీఎస్పీ ఈశ్వరరావుకు సూచించారు. దీంతో నాలుగు నెలల క్రితం పెద్దల సమక్షంలో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా మాజీ సర్పంచ్ ఘంటసాల మహాలక్ష్మీరాజుకు జరిగిన నష్టంతో పాటు గ్రామంలో చేపట్టిన ఖర్చులు చెల్లించారు. రెండో అంశంమైన 7 బంటాల ప్రజలకు అప్పగించాల్సిన భూముల పక్రియ ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు భూములు పంచే సమయం ఆసన్నమైంది. భూములు పంపకాలు జరిగితే ప్రజలు తన గుప్పెట్లో ఉండరని భావించారు. దీనికితోడు సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీ కట్టారు. ఈ రెండు ఘటనలను జీర్ణించుకోలేకపోయిన నియోజకవర్గ ప్రతినిధి గురువారం గ్రామంలో టీడీపీ నాయకులు, అనుచరులను రెచ్చగొట్టారు. ఉదయం 10 గంటలకు ఇతర బంటాల ప్రజలు గ్రామ కూడలి వద్దకు రావాలంటూ తన అనుచరులతో మైక్‌లో వినిపించారు. ఓ వర్గం వారిపై దాడులు చేయించారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితులను ఆదుకోవాలి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుట్ర వల్ల ప్రత్తికోళ్లలంక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 7 బంటాల ప్రజల కోరిక మేరకు వారి భూములు వారికి ఇవ్వాలి. దాడులతో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందించాలి. న్యాయంగా వారికి అందాల్సిన లీజు డబ్బులు అందించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తికోళ్లలంక ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటు. ప్రజలు కలిసిమెలిసి జీవించాలి.– కొఠారు అబ్బయ్యచౌదరి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు పరామర్శ ఏలూరు టౌన్: ప్రత్తికోళ్ళలంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కొట్లాటకు దారితీసింది. ఈ గొడవలో ఒక వర్గంపై మరో వర్గంపై దాడి చేసి, తీవ్రంగా కొట్టటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని బలే రాము ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులతోపాటు మరికొందరిని తీవ్రంగా కొట్టారు. గాయాలపాలైన వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఆయనతోపాటు వైఎస్సార్సీపీ రైతు విభాగం ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ సతీష్ చౌదరి, పార్టీ నేతలు మెండెం ఆనందరావు, శ్రీనివాసరావు, తిరుపతిరావు, ఎం.కొండలరావు తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడిన మహిళలను ఆయన పరామర్శించి, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అధికారులు వెంటనే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరుగురిపై కేసు నమోదు ప్రత్తికోళ్ళలంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య వివాదంలో బలే రాము ఇంటిపై దాడి చేయగా అతని ఫిర్యాదు మేరకు పలువురు వ్యక్తులపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘంటసాల చంద్రశేఖర్, ముంగర పోతురాజు, ఘంటసాల వెంకన్నబాబు, నారాయణస్వామి, బలే బూసిరాజు, ఘంటసాల కోటి రమేష్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. -
చింతమనేని మార్కు వేధింపులు
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు, పెదవేగి: దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా ఉన్న కొఠారు అబ్బయ్య చౌదరి కుటుంబంపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో కక్షసాధింపు చర్యలకు దిగారు. దీనికోసం ట్రాన్స్‌కోను అడ్డం పెట్టుకున్నారు. హైటెన్షన్ వైర్లను అబ్బయ్యచౌదరి ఇంటిమీదుగా తీసుకువెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. ఇంటి ముందు నుంచి వెళ్లడం వల్ల ప్రమాదమని, కేబుల్ వైరు వేయాలని అబ్బయ్యచౌదరి ట్రాన్స్‌కో సీఎండీతో మాట్లాడారు. ఆయన ఒప్పుకున్నా చింతమనేని ప్రభాకర్ అధికారులను ఇంటికి పిలిచి మరీ వార్నింగ్ ఇవ్వడంతో వారు చేతులెత్తేశారు. దీంతో పార్టీ అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ఆందోళనకు దిగడంతో పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆందోళన కొనసాగడంతో సాయంత్రం అధికారులు వెనుతిరిగారు. సంఘటనా స్థలంలో ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించేందుకు ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తనకు ఎదురుతిరిగిన వారిపై ఎస్సీఎస్టీ కేసులు పెట్టించడం చింతమనేనికిఅలవాటే. దీనిలో భాగంగా గతంలో కూడా తమ్మిలేరులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న సమయంలో కూడా ప్లొక్లయిన్ డ్రైవర్‌తో ఎస్సీఎస్టీ కేసు పెట్టించే ప్రయత్నం చేశారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో తాజాగా హైటెన్షన్ వైర్ల వ్యవహారాన్ని ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... మూడు నెలల క్రితం కొండలరావుపాలెంలోకి హెచ్‌టి విద్యుత్‌లైన్ తీసుకువెళ్లే నిమిత్తం కిలో మీటరు దూరం కొఠారు పొలం పక్క నుంచే వేసి ఆ తరువాత టేకు చెట్లు, కొఠారు ఇళ్లు అడ్డుగా ఉన్నాయన్న ఉద్దేశంతో విద్యుత్‌శాఖ సిబ్బంది రోడ్డుకు రెండవ వైపు విద్యుత్ స్తంభాలు పాతుకుంటూ వెళ్లారు. అదే సమయంలో గ్రామదర్శిని కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దీన్ని చూసి అధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు కొఠారు ఇంటిపై నుంచి వేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇళ్ల మీద హెచ్‌టీ లైన్ వేస్తే ఇబ్బంది వస్తుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈనెల 19న స్టే వెకేట్ చేయడంతో దానిపై రివ్యూ పిటీషన్ వేసారు. ఈలోగా పోలీస్ వారి సహాయంతో విద్యుత్‌శాఖ అధికారులు దౌర్జన్యంగా విద్యుత్ లైన్ వేయడానికి మూడు రోజుల క్రితం ప్రయత్నించారు. దీన్ని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు. కొఠారు ఈ విషయాన్ని ట్రాన్స్‌కో సీఎండీతో మాట్లాడగా ఇన్సులేటెడ్ కేబుల్ వేస్తామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. గ్రామానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతో 200 మీటర్లు ఇన్సులేటెడ్ కేబుల్ వేసేందుకు అధికారులతో మాట్లాడి ఒప్పించారు. మళ్లీ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చింతమనేని విద్యుత్ శాఖాధికారులను పిలిచి ఇన్సులేటెడ్ కేబుల్ కొఠారు ఇంటి వద్ద వేస్తే, నియోజకవర్గం మొత్తం వేయాలని ఒత్తిడి చేయడంతో చేసేది లేక అధికారులు కొఠారు ఇంటి ముందు వేసిన కేబుల్‌ను పోలీస్ సాయంతో తీసే ప్రయత్నం చేసారు. దీన్ని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావుతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇళ్ల మీద హెచ్‌టి లైన్ ప్రమాదకరమని చెప్పినా, బలవంతంగా మమ్మల్ని ఒప్పించి, వేసిన లైన్ మళ్లీ ఇప్పుడు తీయడం సరికాదని కొఠారు అన్నారు. సాయంత్రం వరకూ ఆందోళన కొనసాగించారు. చివరికి విద్యుత్ అధికారులు, పోలీసులు అక్కడ నుంచి వెనుదిరిగారు. -
రాయన్నపాలెంలో ఉద్రిక్తత
పెదవేగి: హైటన్షన్ వైర్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ కుటుంబంపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. ఖాళీ స్థలం ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ నేత కొఠారు రామచంద్రరావు ఇంటిపై నుంచి హైటెన్షన్ వైర్లు వేయాలంటూ విద్యుత్ అధికారులపై చింతమనేని ఒత్తిడి తేవడమే ఉద్రిక్తతకు కారణమైంది. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కొఠారు విజ్ఞప్తి చేసినా విద్యుత్ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ నేత కొఠారు రామచంద్రరావు, అధికారులను అడ్డుకుని అక్కడే ధర్నాకు దిగారు. దీంతో ప్రభుత్వం సంఘటనాస్థలానికి భారీగా పోలీసులను మోహరించింది. కొఠారు రామచంద్రరావుకు మద్ధతుగా రాయన్నపాలెంలోని ఆయన ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. -
సొంతపార్టీ నేతపైనే చింతమనేని దాడి
పెదపాడు: వరుస దాడులతో నిత్యం వార్తల్లో ఉండే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఈసారి సొంతపార్టీ నేతపైనే దాడికి దిగారు. పెదపాడు మండలం దాసరిగూడెం తాజా మాజీ సర్పంచ్ పామర్తి పెదరంగారావుపై ఎమ్మెల్యే దాడి చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, తెలుగుదేశం ఫ్లెక్సీలు తగులబెట్టడంతో పాటు.. చింతమనేనిని అడ్డుకుని క్షమాపణ చెప్పేవరకూ వదలేదిలేదంటూ నిర్బంధించారు. దీంతో చేసేదేంలేక చింతమనేని క్షమాపణ చెప్పి.. పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ వ్యక్తికి ఎవడు సిఫార్సు చేయమన్నాడ్రా.. ? పెదపాడు మండలం దాసరివారిగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శినికి ఎమ్మెల్యే చింతమనేని హాజరయ్యారు. ఒకరికి స్వయం ఉపాధి రుణం ఇవ్వడానికి పెదరంగారావు సిఫార్సు చేసిన విషయం ఎమ్మెల్యే దృష్టికొచ్చింది. ‘అసలా వ్యక్తికి ఎవడు సిఫార్సు చేయమన్నాడ్రా..? నాకు తెలియకుండా గ్రామంలో పింఛన్లు ఎందుకు ఇప్పించావ్’ అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై పెదరంగారావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే.. ఆ మాజీ సర్పంచ్‌పై చెయ్యిచేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన పెదరంగారావు అక్కడి నుంచి వచ్చేసి తన స్వగ్రామమైన వేంపాడు చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. వేంపాడు గ్రామంలో ఉన్న తెలుగుదేశం ఫ్లెక్సీలను చింపేసి తగులబెట్టారు. గ్రామదర్శిని కార్యక్రమం ముగించుకుని వస్తున్న చింతమనేనిని వారు అడ్డుకుని.. తమ సర్పంచ్‌ను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పెదరంగారావు తన తమ్ముడిలాంటి వాడని, మాట విననందుకు ఆగ్రహం వ్యక్తం చేశానంటూ సంజాయిషీ ఇచ్చారు. అయితే దీనికి గ్రామస్తులు సంతృప్తి చెందలేదు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని.. పెదరంగారావుకు 3 సార్లు క్షమాపణ చెప్పారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను తమ రక్షణ మధ్య అక్కడి నుంచి తీసుకెళ్లారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే తమపై దాడులు చేయడమేంటని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చింతమనేని పైశాచికత్వం
పశ్చిమగోదావరి, పెదవేగి రూరల్: చింతమనేని ప్రభాకర్ మరోసారి పైశాచికత్వం ప్రదర్శించారు. తన అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయించి ఇంటికి తీసుకువచ్చి మరీ దాడి చేశారు. ఈ వ్యవహారంలో గన్మెన్లు కూడా సహకరించడం చర్చనీయాంశంగా మారింది. హత్యాయత్నం చేయడమే కాకుండా బాధితునిపై తన అనుచరులతో తనదైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించే ప్రయత్నం చేశారు. దీన్ని వైఎస్సార్ సీపీ నేతలుఅడ్డుకున్నారు. చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పెదవేగి పోలీసు స్టేషన్ ఎదుట మూడు గంటలకుపైగా వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరి బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన అదనపు ఎస్పీ ఈశ్వరరావు చింతమనేని ప్రభాకర్‌తో పాటు దాడి చేసిన అనుచరులు, గన్మెన్లపై కేసు పెడుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 65 రోజుల క్రితం చింతమనేని దాడి చేసిన జాన్ అనే దళిత కార్మికుని విషయంలో హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చింతమనేనిపై కేసు నమోదు చేసినా ఏ కేసులోనూ పోలీసులు అరెస్టు చేయకపోవడంతో అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలేం జరిగింది.. దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత మేడికొండ సాంబశివ కృష్ణారావుపై గురువారం చింతమనేని అనుచరులు దాడికి దిగారు. పెదవేగి మండలం వంగూరు పంచాయతీ లక్ష్మీపురం పోలవరం కుడికాలువ గట్టు వద్ద ఈ ఘటన జరిగింది. పెదవేగి మాజీ సర్పంచ్ అయిన కృష్ణారావు గురువారం ఏలూరు నుంచి గార్లమడుగు వెళ్తుండగా లక్ష్మీపురం కాలువ గట్టును చింతమనేని అనుచరులు పొక్లెయిన్, టిప్పర్లతో మట్టిని తవ్వి తరలించడం చూశారు. దీనిపై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి వచ్చేలోగానే ఫిర్యాదు చేసిన సమాచారాన్ని ఎమ్మెల్యేకు అందించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతోనే మేడికొండ కృష్ణారావుకు ఫోన్ చేయించి ఘటనా స్థలానికి రప్పించారు. ఈలోగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు గద్దేకిషోర్, ఏలియా, మరో పది మందికిపైగా టిడిపి నేతలు వచ్చి ‘మా మీదే ఫిర్యాదు చేస్తావా’ అంటూ కృష్ణారావును విచక్షణారహితంగా కొట్టారు. తర్వాత వారు కృష్ణారావును కిడ్నాప్ చేసి దుగ్గిరాల గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే ‘ఏరా మన సామాజిక వర్గానికి చెందినవాడివై ఉండి మా మీదే ఫిర్యాదు చేస్తావా’ అంటూ బూటుకాలితో పొట్టలో, తలపై తన్నటంతో కృష్ణారావు కింద పడిపోయారు. కిందపడిన తర్వాత ఎమ్మెల్యే, అతని అనుచరులు మరోసారి కృష్ణారావుపై దాడి చేశారు. గన్మెన్లు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారని బాధితుడు చెబుతున్నారు. అనంతరం దాడిచేసిన వారే తనను పెదవేగి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లి అక్రమ కేసులు బనాయించేందుకు యత్నించారని కృష్ణారావు వివరించారు. వీధిరౌడీలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం : అబ్బయ్యచౌదరి చింతమనేని ప్రభాకర్ వీధిరౌడీలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని దెందులూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అబ్బయ్యచౌదరి హెచ్చరించారు. కృష్ణారావుపై జరిగిన హత్యాయత్నం సమాచారాన్ని తెలుసుకుని పెదవేగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ బైఠాయించారు. హత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేతలు, గన్మెన్లపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణారావుకు న్యాయం జరిగేంతవరకూ తాము పోరాడతామన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతానన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు.ఆందోళన తీవ్రతరం కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏఎస్పీ కె.ఈశ్వరరావు అబ్బయ్య చౌదరితో మాట్లాడి, ఎమ్మెల్యే, టీడీపీ నేతలు, గన్మెన్లపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ దెందులూరు కన్వీనర్ అబ్బయ్య చౌదరి, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, పలువురు మండల నేతలు పాల్గొన్నారు. పార్టీ లీగల్ అడ్వయిజర్ లక్ష్మీకుమార్ మాట్లాడుతూ చట్టపరంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గాయపడిన కృష్ణారావును ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యచికిత్స చేయిస్తున్నారు. చింతమనేనిపై కేసు మేడికొండ కృష్ణారావుపై హత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు, గన్మెన్లపై 248/18గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 341, 363, 323,324,379 రెడ్ విత్ 34 (కిడ్నాప్, దాడి చేసినట్లు)గా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసులో ఏ2గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు, ఏ1గా చింతమనేని ప్రధాన అనుచరుడు గద్దే కిషోర్ పేరు, ఏ3గా ఎమ్మెల్యే గన్మెన్ల పేర్లు నమోదు చేశారు. -
ఆగ్రహ పవనాలు..చింతమనేని మంటలు
-
చింతమనేని అనుచరుల హల్చల్
-
చింతమనేని అనుచరుల హల్చల్
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు హల్చల్ సృష్టించారు. నగరంలో గురువారం అర్థరాత్రి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చింతమనేని అనుచరులు దాడి చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను క్రాస్ చేసినందుకు వారిని కానిస్టేబుల్ ఆపేయత్నం చేశారు. దాంతో కారులోంచి దిగిన చింతమనేని అనుచరులు కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి దిగారు. ‘మా కారునే ఆపుతావా’ అంటూ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు. కారును పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాలని కానిస్టేబుల్ అనడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై గవర్నర్పేట్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన చింతమనేని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘పవన్ కల్యాణ్.. నా దగ్గర ట్యూషన్‌కి రా’
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తనపై చేసిన ఆరోపణలపై ఎన్ని కమిటీలు అయినా వేసుకొని నిరూపించాలని సవాల్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఓ గల్లీ నాయకుడి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను రాజ్యాంగయేతర శక్తిగా ఎదుగుతున్నానని చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. తానను రౌడీ షీటర్ అని పవన్ చెప్పాల్సిన అవసరం లేదని, తానేంటో దెందులూరు ప్రజలకు తెలుసన్నారు. నాణానికి ఒక వైపే చూస్తున్నారని రెండో వైపు చూస్తే పవన్ తట్టుకోలేరని హెచ్చరించారు. నియోజక వర్గం అభివృద్ధిపై ఒక్క కామెంట్ చేయలేకనే వ్యక్తిగతంగా విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పవన్ కల్యాణ్ మూడు రోజుల అన్నం తినడం మానేస్తాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు దమ్ముంటే దెందులూరులో తనపై పోటీ చేసి గెలవాలి సవాల్ చేశారు. తనపై పవన్ గెలిస్తే ఆయనకు సన్మానం చేసి ఆయనతో నడుస్తానన్నారు. ఓడిపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు ఉంటారంటూ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 18 ఏళ్ల వాడిని పోటీకి నిలబెడతాను అంటున్నారు. ఆ వయసులో అసెంబ్లీలో పోటీ చేసేఅవకాశం లేదని కూడా పవన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. రాజకీయ జ్ఞానం కోసం పవన్ తనతో ట్యూషన్ పెట్టించుకోవాలని ఎద్దేవా చేశారు. బుధవారం దెందులూరులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎమ్మెల్యే చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా .. రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. విదేశాల్లో అయితే పర్యవసనాలు తీవ్రంగా ఉండేవని వ్యాఖ్యానించారు. రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ : పవన్ -
చంద్రబాబుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు వల్లే అరకు ఎమ్మెల్యే హత్య జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరకు పాంత్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రజలు చేసిన ఫిర్యాదులను సీఎం పట్టించుకోకపోవడం వల్లే మావోయిస్టులు ఎమ్మెల్యేను హత్య చేశారన్నారు. బుధవారం ఆయన దెందులూరు బహిరంగ సభలో మాట్లాడుతూ.. రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ అని ఎల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విప్ పదవిలో ఉండి దౌర్జన్యం చేస్తుంటే సీఎం ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. 27 కేసులున్న దెందులూరు ఎమ్మెల్యేను చట్టసభల్లో కూర్చోబెట్టారని విమర్శించారు. కొల్లేరు భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వుకుంటూ అడ్డువచ్చిన వారిపై దాడులు చేయడం మానుకోవాలని పవన్ హెచ్చరించారు. చింతమనేని ఇన్ని దారుణాలు చేస్తుంటే జిల్లా కలెక్టర్, డీజీపీ, హోంమినిస్టర్, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లోకి వెళ్లకుండా జైల్లో కూర్చోవాల్సిన వారిని పెంచి పోషిస్తున్న టీడీపీకి తాను ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి, లోకేశ్‌కి చింతమనేని అంటే భయం అందుకే అతనిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చింతమనేని నీ అరాచకాలు మానుకోకపోతే నేనే దెందులూరు వస్తాను ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరిలో ప్రశాంతత లేకుండా చేశారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తిరగబడతామని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని చింతమనేనికి పవన్ వార్నింగ్ ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? లేక.. -
చింతమనేని సవాలును స్వీకరిస్తున్నా
పశ్చిమగోదావరి, దెందులూరు/పెదవేగి: నేను చేపట్టిన నిరాహార దీక్షకే భయపడిన చింతమనేని నాకు సవాల్ విసురుతారా? ఆయన గోపన్నపాలెంలో చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. తట్ట మట్టినీ తాను అమ్మలేదంటున్న ఆయనకు సీబీసీఐడీ విచారణకు అంగీకరించే దమ్ము, ధైర్యం ఉన్నాయా? ఆయన మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోలేదని క్లీన్‌చీట్ వస్తే తట్టాబుట్టా సర్దుకెళ్లిపోతాను’ అని వైఎస్సార్ సీపీ దెందులూరునియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దీక్ష విరమణ అనంతరం ర్యాలీగా గోపన్నపాలెం బస్టాండ్ సెంటర్‌కు చేరిన అబ్బయ్య చౌదరి, వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ బహిరంగ సభలో మాట్లాడారు. శనివారం చింతమనేని విసిరిన సవాల్‌కు దీటుగా స్పందించారు. అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోలేదని చింతమనేని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన అక్రమంగా మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోని గ్రామం లేదన్నారు. సూర్యారావుపేటలో పేద వ్యక్తి 30 ఏళ్లుగా నివసిస్తుంటే, హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. ఇంటిని జేసీబీతో తొలగించాలని యత్నిస్తున్న సమయంలో తాను, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నించినందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కేసులు పెట్టిస్తే భయపడబోమని, ఇక్కడ ఉన్నది కొఠారు అని పేర్కొన్నారు. కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగిస్తామన్నారు. చింతమనేనికి ప్రజా క్షేత్రంలోనే గుణపాఠం చెబుతామన్నారు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాలారా కోడిపందేలు, సారా దుకాణాలు, పేకాట నిర్వహించే వ్యక్తి కావాలా? విదేశాల్లో చదువుకున్న ఉన్నతమైన విలువలున్న వ్యక్తులు కావాలా అని ప్రశ్నించారు. తట్ట మట్టినీ తరలించలేదని, ఒకవేళ తరలించినట్లు తేలిస్తే చింతమనేని రాజకీయ సన్యాసం చేస్తానన్నారని, కానీ ఆయన రాజకీయ సన్యాసం చేయరని, తాము గెలిచి అతనిచేత రాజకీయ సన్యానం చేయిస్తామని పేర్కొన్నారు. చింతమనేని అరాచకాలు ఇంకా ఆరు నెలలేనని అన్నారు. పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరరావు బాబు, జిల్లా కార్యదర్శి తోట పద్మారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు వీరంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ జరిగింది. ఏలూరు పార్లమెంట్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ సతీష్ చౌదరి నాయకత్వంలో కన్వీనర్ నిరా హార దీక్షకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీక్షతో శ్రేణుల్లో ఉత్సాహం చింతమనేని అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అబ్బయ్యచౌదరి చేపట్టిన రెండు రోజుల నిరాహారదీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు అబ్బయ్య చౌదరికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతమనేని అక్రమాలపై పోరాటం ఆపేదిలేదనీ స్పష్టం చేశారు. అబ్బయ్య చౌదరి దీక్షకు నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. నాలుగేళ్లుగా ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యాలతో విసిగిన ప్రజలు అబ్బయ్య చౌదరికి మద్దతు తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు భారీగా వచ్చారు. మహిళలు బొట్టుపెట్టి మరీ అబ్బయ్య చౌదరిని ఆశీర్వదించారు. హారతులు పట్టారు. తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు దీక్షాశిబిరాన్ని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, తణుకు కన్వీనర్ కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, గన్నవరం కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావుతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు సందర్శించారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు, అరాచకాలపై ధ్వజ మెత్తారు. తెలుగుదేశం నేతలు ఆలీబాబా అందరూ దొంగలే అన్న చందాన ఉన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధిచెబుతా రని అన్నా రు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్సెక్రటరీ కామిరెడ్డి నాని, ఎస్సీ సెల్‌రాష్ట్ర ప్రధాన కార్యదిర్శ పల్లెం ప్రసాద్, జిల్లా కార్యదర్శి కొండే లాజరు, జిల్లా కమిటీ సభ్యులు యలమర్తి రామకృష్ణ, ఏలూరు పార్లమెంట్ కార్యదర్శి చల్లా మేరీరాజు, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్.సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మ శివరామకృష్ణ, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకుమార్, ఏలూ రు పార్లమెంటరీ కార్యనిర్వాహక సభ్యుడు చట్టుమాల మరియ దాసు, నేతలు సప్పా మోహనమురళి, వీరమాచినేని నాగబాబు, తోట పద్మారావు, కట్టా ఏసుబాబు,బట్టు జయరాజు పాల్గొన్నారు. -
చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్): ఐఎంఎల్ డిపో కార్మికుడు, దళితుడైన రాచీటి జాన్‌ను కొట్టి కులం పేరుతో దూషించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, హత్యాయత్నం కింద తక్షణం అరెస్టు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఏలూరు సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశంలో ఈమేరకు తీర్మానించారు. తనకు సంబంధం లేని కార్మికుల వివాదంలో జోక్యం చేసుకుని తన ఇంటికి పిలిపించి, దౌర్జన్యంగా కొట్టి, కింద పడేసి కాళ్లతో తన్ని , కులం గురించి హేళనగా మాట్లాడి అగ్రకుల అహంకారంతో వ్యవహరించిన చింతమనేని ప్రభాకర్‌ను కఠినంగా శిక్షించాలని సమావేశం డిమాండ్ చేసింది. దీనిపై గురువారం కలెక్టర్, ఎస్సీని కలిసి చర్చించాలని, 16 లోపు చింతమనేనిపై చర్య తీసుకోకపోతే 17న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో బాధితుడు జాన్ మాట్లాడుతూ తనను బండబూతులు తిట్టి, కింద పడేసి దొర్లించి మరీ కొట్టిన చింతమనేని, అతని గన్మెన్లు ముగ్గురిపైన, చింతమనేని అనుచరులు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావు, చుక్కా ఈశ్వరరావులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. చింతమనేని సాగిస్తున్న అరాచకాలను, దౌర్జన్యాలను సమావేశంలో ఖండించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తదితరులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన సఫాయి కర్మచారీస్ నేషనల్ కమిషన్ సభ్యుడు జగదీష్ హిర్మానీని కలెక్టరేట్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. సామాజిక న్యాయం చేయాలంటూ ఆయన్ను కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ తదితరులు, కాంగ్రెస్ నాయకుడు రాజనాల రామ్మోహన్రావు, వైఎస్సారసీపీ ఎస్సీ సెల్ నాయకుడు మున్నుల జాన్‌గురునా«థ్, జనసేన నాయకులు మత్తే బాబి, ఎమ్మార్పీఎస్ నాయకులు పలివెల చంటి తదితరులు, ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సీపీఎం నాయకుడు గుడిపాటి నరసింహరావు, సిఐటీయూ నాయకులు బి.సోమయ్య, పి.కిషోర్, బీకేఎంయూ నాయకులు బండి వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.నాని, కౌలు రైతు సంఘం నాయకులు కె.శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. -
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మరో అరాచకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వివాదాస్పద అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగిస్తున్న దౌర్జన్యాలకు ఇదో పరాకాష్ట. చింతమనేని ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం సూర్యారావుపేట గ్రామంలో రెండు రోజుల క్రితం అనుమతుల్లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాల పనులను వైఎస్సార్సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ అబ్బయ్య చౌదరి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, గ్రామస్తులు అడ్డుకుని నిలిపివేశారు. అక్రమ తవ్వకాలపై ఏలూరు ఆర్డీఓ చక్రధర్, మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నేరుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని రంగంలోకి దిగారు. తన అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసుల ఒప్పుకోకపోవడంతో తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్ డ్రైవర్ శ్రీరామ్జాన్కుమార్ని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి, తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. దీంతో వైస్సార్సీపీ నేతలు కొఠారు అబ్బయ్యచౌదరి, కొఠారు రామచంద్రరావు, మేడికొండ వెంకట సాంబశివకృష్ణారావు, బాలిన రాము, మేకా లక్ష్మణరావు, నెరుసు ధర్మరాజులపై సెక్షన్ 341, 323, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది? దెందులూరు నియోజకవర్గంలోని సూర్యారావుపేట పక్క నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ వెళ్తోంది. అక్కడికి దగ్గరలో కంకరగుట్ట ఉంది. ఇది చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు మధ్యలో ఉంది. ఇక్కడ చెరువు తవ్వితే భూగర్భ జలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానికులను ఒప్పించారు. పట్టిసీమ కుడికాలువ నుంచిగానీ, లేకపోతే చింతలపూడి కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా పైపులు వేసి చెరువును నింపుతామని పేర్కొన్నారు. కనీసం వంద ఎకరాల చెరువు ఉంటేగానీ కాలువ నుంచి అధికారికంగా లిఫ్ట్ ద్వారా నీటిని తరలించడం కుదరదని కలెక్టర్ తేల్చిచెప్పారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చి, చెరువు తవ్వడానికి ఒప్పించారు. దీనికోసం 60 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ భూమిని గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానికులకు డీ–ఫారం పట్టాలుగా ఇచ్చారు. ఎమ్మెల్యే చింతమనేని ఎకరాకు రూ.6 లక్షల చొప్పున ధర నిర్ణయించి, రైతులకు రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే ఇస్తానన్నారు. చెరువు పేరుతో ఏడాది కాలంగా 60 ఎకరాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కో టిప్పర్‌కు రూ.2,500, ట్రాక్టర్ లోడుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. నిత్యం 120 టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. 60 ఎకరాల్లో మట్టి అమ్మకాల ద్వారా రూ.50 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. రైతులకు నామమాత్రపు ధర చెల్లించి బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ చెరువు తవ్వకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలపై అధికార బలంతో కేసులు బనాయించిడం గమనార్హం. కేసులకు భయపడం ‘‘మాపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే చింతమనేని సాగిస్తున్న అక్రమాలను అడ్డుకుని తీరుతాం. అతడి దుర్మార్గాలను బయటపెడతాం. ఇక్కడ అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం’’ – అబ్బయ్యచౌదరి, దెందులూరు కన్వీనర్, వైఎస్సార్సీపీ -
చింతమనేని దమ్ముంటే నాపై దాడిచెయ్..!
హనుమాన్ జంక్షన్ : టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కి దమ్ము ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సవాల్ విసిరారు. బుధవారం ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పోస్టర్‌ను సుంకర పద్మశ్రీ చించేశారు. అనంతరం 11 గంటలకు హనుమాన్ జంక్షన్‌కి వచ్చి దాడి చేయాలని సవాల్ చేశారు. సవాల్ విసిరినా పిరికిపందలా చింతమనేని రాలేదని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని మండిపడ్డారు. అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అధికార మదంతో టీడీపీ నాయకులు పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.దాడి చేసిన చింతమనేని వదిలి పెట్టి పోలీసులు సామాన్య ప్రజలపై కేసులు నమోదు చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు. -
చింతమనేనికి వ్యతిరేకంగా నిరసన
సాక్షి, ఏలూరు : దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడికి వ్యతిరేకంగా దెందులూరు హనుమాన్ జంక్షన్ లో ప్రజలు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజల నిరసనకు వైఎస్సార్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, కటారి రామచంద్రరావు మద్ధతు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..గరికపాటి నాగేశ్వరరావు పై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకూ చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయని, చంద్రబాబు, లోకేష్ అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని విమర్శించారు. దాడులు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని, కోర్టులు చింతమనేనికి శిక్షలు వేసినా బుద్ది రాలేదని మండిపడ్డారు. గతంలో చింతమనేని, తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేశారని చెప్పారు. చింతమనేని దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, దాడికి పాల్పడ్డ చింతమనేనిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. కాగా వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే చింతమనేని ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బస్సుపై ఉన్న చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ డ్రైవర్, కండక్టర్లను నడిరోడ్డుపైనే దుర్భాషలాడుతూ చిందులు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో నిన్న తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాల్లోకి వెళఙతే.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది. అయితే ఆ బస్సుపై అతికించిన ప్రభుత్వ ప్రచార పోస్టర్‌లోని సీఎం ఫొటో కాస్త చిరిగి ఉండటంతో చింతమనేని వెంటనే తన మనుషులను పంపించి బస్సును అడ్డగించారు. డ్రైవర్ వడ్డి శేఖర్, కండక్టర్ తోట వాసుబాబును కిందకు దించి.. వారిపై చింతమనేని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా.. అంటూ తిట్లపురాణం అందుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు(చంటి) ప్రభుత్వ ఉద్యోగులతో ఇదేం వైఖరి అంటూ చింతమనేనిని ప్రశ్నించాడు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయి.. నాగేశ్వరరావుపై ఏడాపెడా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. విచిత్రమేమిటంటే ప్రభుత్వ విప్ చింతమనేని దాడి చేశారని ఫిర్యాదు చేసిన నాగేశ్వరరావు మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని దాడికి నిరసనగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేసినందుకు బాధితుడు నాగేశ్వర రావు సహా వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు 30 మందిపై కేసు నమోదు చేయడంతో ఆశ్చర్య పోవడం ప్రజల వంతైంది. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చింతమనేనికి చుక్కెదురు
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. భీమడోలు కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టివేయాలని ఏలూరులోని జిల్లా కోర్టులో చింతమనేని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. రెండేళ్ల శిక్షపై అప్పీల్ పిటిషన్ మాత్రం న్యాయస్థానం స్వీకరించింది. భీమడోలు కోర్టు విధి౦చిన శిక్షను రద్దు లేదా తొలగి౦చాలనే అభ్యర్థనను అ౦గీకరి౦చబోమని కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పుపైన స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జిల్లా కోర్టులోనూ ఊరట లభించకపోవడంతో హైకోర్టు తలుపుతట్టేందుకు చింతమనేని సిద్ధమవుతున్నారు. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 14న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. -
బడుగులపై చింతమనేని దాష్టీకం
-
కాళ్లపై పడ్డా కనికరించలేదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి జానెడు జాగాలో తలదాచుకుంటున్న బడుగులపై తన ప్రతాపం చూపించారు. ప్రభుత్వ స్థలంలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న పేదలపై దాడికి దిగి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పిల్లలకు అన్నం పెడుతున్న గిన్నెలను కూడా గిరాటేసి దాడికి పాల్పడ్డారు. గన్మెన్లతో వారి సామాన్లు బయట పడేయించారు. కాళ్లపై పడ్డా కనికరించలేదు దెందులూరులో శనివారం ఉదయం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కాశీకాలనీలోకి తన అనుచరులతో వెళ్లిన ఎమ్మెల్యే ప్రభాకర్ అక్కడ రెవెన్యూ సిబ్బంది పాతిన జెండాలను గమనించారు. అందులో తాము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నట్లు నిరుపేదలైన చుక్కా లక్ష్మీ, శ్రీను, చుక్కా లక్ష్మీదుర్గ, కొండలు ఎమ్మెల్యేకు తెలిపారు. అందుకు రుజువుగా వారి పేరు మీద ఉన్న కరెంటు బిల్లులతోపాటు తెలిసిన వారి దగ్గర కొనుగోలు చేసిన పట్టా కాగితాలు చూపారు. అయితే అవేమి పట్టించుకోని చింతమనేని వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారు కాళ్ల మీద పడినా కనికరించలేదు. రెండు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలను కొట్టారు. ఆ స్థలాల్లో ఉండటానికి వీల్లేదని హెచ్చరించారు. పిల్లలకు అన్నం పెడుతుంటే గిన్నెలను కాలితో తన్నేశారని, ఎమ్మెల్యే కొడుతుంటే ఆయన గన్మెన్లు గెంటేశారని బాధితురాలు చుక్కా లక్ష్మి కన్నీటిపర్యంతమైంది. ఎంతో కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని ఇలా అర్ధాంతరంగా లాగేసుకుంటే తాము ఎక్కడికి వెళ్లి బతకాలని ఆక్రోశించింది. తమ కాలనీలో టీడీపీకి చెందిన ఎంతో మంది భూమి కొనుగోలు నివసిస్తుంటే చింతమనేనికి తామే దొరికామా అంటూ రోదిస్తున్నారు. గన్మెన్లను దుర్వినియోగం చేస్తున్నారు: కొఠారు ఇదే ప్రాంతంలో తియ్యాల రామారావు, దుంగల రంగమ్మ, రేట్ల ఎర్రమ్మ, ఎఎన్ఎం నాగలక్ష్మీలకు చెందిన స్థలం ప్రహరీ గోడలను కూడా తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పేద కుటుంబాలు అప్పు చేసి చిన్నపాటి స్థలం కొనుక్కుని ఇళ్లు వేసుకుని జీవిస్తుంటే వారిపై చింతమనేని ప్రతాపం చూపించడం ఏమిటని కొఠారు రామచంద్రరావు నిలదీశారు. ఇకపై ఇలాంటివి సహించబోమని హెచ్చరించారు. ‘మీ పార్టీ కానివారిని కొడతారా? మీ పార్టీ కానివారి ఇళ్లను తొలగిస్తారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా ఇచ్చిన గన్మెన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్మెన్లు ఎమ్మెల్యే రక్షణ కోసం కాకుండా ప్రజలపై దాడులు చేయడం సరికాదన్నారు. అనంతరం ఆయన స్థానిక తహశీల్దార్‌ను కలిసి బాధితులు ఆధారాలు చూపేందుకు గడువు ఇవ్వాలని కోరారు. అక్రమణలో ఉందని కూల్చివేసిన గోడ -
రాజీనామా అస్త్రాన్ని సంధించిన చింతమనేని!
ఉదయమే పార్టీని పెడతానని ప్రకటన అమరావతి: మంత్రివర్గంలో తనకు చోటు కల్పించకపోవడంతో రగిలిపోతున్న టీడీపీ సీనియర్ నేత, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన పదవులకు రాజీనామా చేశారు. ఉదయమే మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన ఆయన.. సాయంత్రం తన పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం చింతమనేని రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని కోరి మరీ రాజీనామా లేఖలు అందించారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదనే ఆవేదనతో ఉన్న చింతమనేని ఉదయమే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతితో రగిలిపోతున్న ఆయనను పిలిపించి బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. -
అవసరమైతే కొత్త పార్టీ పెడతా
-
అవసరమైతే కొత్త పార్టీ పెడతా
అమరావతి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులు రాని టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అధికారంలో లేనపుడు పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు రాలేదని ధూళిపాళ్ల ఆవేదన చెందుతున్నారు. ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో చింతమనేని తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ కోసం కష్టపడినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తానని, అవసరమైతే కొత్త పార్టీ పెడతానని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని చింతమనేనిపై అనుచరులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కడాన్ని చింతమనేని జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. గౌతు శివాజీకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కూతురు శిరీష.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ వైఖరిపై అలకబూని గన్మెన్లను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు మరో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అలిగారు. పార్టీ కోసం పనిచేస్తున్నా మంత్రి పదవి ఇవ్వరా అని ఆక్రోశం వ్యక్తం చేశారు. -
మరోసారి చింతమనేని హల్ చల్
-
మరోసారి చింతమనేని హల్ చల్
ఏలూరు: అధికారపార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. పాత బస్టాండ్ వద్ద చలానా రాస్తున్న ఏలూరు ట్రాఫిక్ పోలీసులపై చిందులు వేశారు. చలాన్లు ఎందుకు రాస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చలాన్లు చెల్లించడానికి వచ్చిన ప్రజలను చింతమనేని అక్కడి నుంచి పంపించారు. గతంలోనూ ట్రాఫిక్ చలాన్లు రాయొద్దంటూ పోలీసులను చింతమనేని హెచ్చరించారు. విధులకు ఆటంకం కలిగించిన చింతమనేనిపై ట్రాఫిక్ పోలీసులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తరచూ విధులకు ఆటంకం కలిగిస్తే ఉద్యోగాలు చేయలేమంటూ ట్రాఫిక్ సిబ్బంధి వాపోయారు. -
దమ్ముంటే రారా.. తేల్చుకుందాం
- మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని - అటవీశాఖ ఏసీఎఫ్‌కు ఫోన్లో బెదిరింపులు కైకలూరు: అధికారపార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఓ అటవీ అధికారిపై ప్రతాపం చూపారు. ‘నీకు దమ్ముంటే రారా... కావాలంటే సిబ్బందిని తెచ్చుకోరా... నువ్వో.. నేనో ఇక్కడే తేల్చుకుందాం..’ అంటూ ఆయన అటవీశాఖ ఏసీఎఫ్ వినోద్‌కుమార్‌పై ఫోన్లో తిట్లపురాణానికి దిగారు. కృష్ణా జిల్లా మండవల్లి మండలం చింతపాడు వద్ద పశ్చిమగోదావరి జిల్లా పెదయాగనమిల్లి గ్రామవాసులు చింతమనేని సూచనలతో సోమవారం ఆందోళనకు దిగారు. చింతపాడు నుంచి తమ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి అటవీ అధికారులు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన చింతమనేని ఫోన్లో అటవీశాఖ ఏసీఎఫ్ను బెదిరిస్తూ పత్రికల్లో రాయలేనివిధంగా తిట్టారు. పూర్వాపరాలివీ.. చింతమనేని ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదయాగనమిల్లి నుంచి కొమటిలంక పరిధిలో ఇటీవల అక్రమ చేపల చెరువులు తవ్వారు. వీటికి మేత సరఫరా చేయడానికి కృష్ణా జిల్లా చింతపాడు నుంచి మార్గం దగ్గరవుతుందనే ఉద్దేశంతో రోడ్డు పనులు చేపట్టారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో కొత్త రోడ్లు వేయరాదు. ప్రజావసరాలు సాకుచూపుతూ అనుమతుల్లేకుండానే రోడ్డు పనులకు దిగారు. దీనికి చింతపాడు గ్రామస్తులు అభ్యంతరపెట్టారు. వారిని రెండు జిల్లాల్లోని టీడీపీ ప్రజాప్రతినిధులు నయానోభయానో ఒప్పించారు. అయితే అటవీశాఖ ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని మండిపడ్డారు. తన వర్గీయులతో సోమవారం చింతపాడు వద్ద ధర్నా చేయించారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన చింతమనేని అటవీశాఖ ఏసీఎఫ్పై ఫోన్లో చిందులు తొక్కారు. అసభ్యపదజాలంతో దూషించారు.రోడ్డు వేసుకోండి.. ఎవరడ్డు వస్తారో తాను చూసుకుంటానని పెదయాగనమిల్లి గ్రామస్తులతో అన్నారు. -
పోలీస్ స్టేషన్లో చింతమనేని హల్ చల్
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ప్రభుత్వ ఉద్యోగులపై తరచూ దాడులకు పాల్పడే ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం మరోసారి రెచ్చిపోయారు. ఏలూరు త్రీటౌన్ పీఎస్‌లో చింతమనేని హల్ చల్ చేశారు. అమ్మాయిలను ఎరగా చూపించి లక్షల రూపాయలను వసూలు చేసే ముఠాను ఏలూరు త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఓ న్యాయవాది, మరో మహిళ నిందితురాలిని రక్షించేందుకు చింతమనేని స్వయంగా రంగంలోకి దిగారు. కేసునుంచి వారిద్దరిని తప్పించాలంటూ త్రీటౌన్ పోలీసులపై ఒత్తిళ్లకు పాల్పడ్డారు. -
'నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా..'
కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో విచారణ నిమిత్తం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం సబ్ కలెక్టరేట్‌కు వచ్చారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో దాడి ఘటనపై జేసీ శర్మ కమిటీ విచారణ ప్రారంభించింది. ముందుగా వనజాక్షి ...త్రిసభ్య కమిటీ ఎదుట తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఘటనలో తన తప్పుందని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. వనజాక్షి సరిహద్దులు దాటి ఇసుక ర్యాంపులోకి వచ్చారని చింతమనేని అన్నారు. ఆమెపై తాను ఎటువంటి దాడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల పట్ల వనజాక్షి దురుసు ప్రవర్తనను కమిటీకి వివరించినట్లు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. తన పై తప్పుడు ప్రచారం చేయడం వెనుక చాలా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. -
పోలవరం కుడి కాలువకు భారీ గండి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రచార ఆర్భాటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన హడావుడి, తప్పుడు నిర్ణయాలవల్ల పోలవరం కుడికాలువకు భారీ గండి పడింది. కుడికాలువ నిర్మాణంలో భాగంగా పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్టు (అండర్ టన్నెల్ బ్రిడ్జి) శనివారం రాత్రి బద్దలైంది. 15నుంచి 20 అడుగుల మేర ధ్వంసమైంది.నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టడం వల్ల తాడిపూడి నీళ్లు, వర్షపు నీరు, పట్టిసీమనుంచి కేవలం ఒక్క పంపు ద్వారా విడుదలైన నీటికే ఆక్విడెక్ట్‌కు గండికొట్టేసింది. ఫలితంగా నీరు విడుదల చేసి 24గంటలు కాకముందే పట్టిసీమ మొదటి పంపును శనివారం రాత్రి మూసివేశారు. నాసిరకపు నిర్మాణం వల్లనే : పోలవరం కుడికాలువ మొత్తం 174 కిలో మీటర్లు కాగా వైఎస్ హయాంలో 140 కిలో మీటర్లు 80 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా లైనింగ్ పనులతో సహా పనులు పూర్తిచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పట్టిసీమనుంచి కుడి కాలువలోకి నీళ్లను మళ్లించాలనే పేరుతో మిగిలిన 29.25 కిలోమీటర్ల కాలువ పనులను హడావుడిగా చేయించారు. పనులు త్వరగా పూర్తయ్యేందుకు కాలువ వెడల్పును కొన్నిచోట్ల 40 మీటర్లకు, మరికొన్నిచోట్ల 20 మీటర్లకు కుదించారు.ఈ పనుల్లో నాణ్యత ఉండదని, కుడికాలువ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లు మొత్తుకున్నా పట్టించుకోలేదు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించిన పట్టిసీమ మొదటిపంపు సామర్థ్యం 354 క్యూసెక్కులు కాగా, దానికి వరదనీరు, తాడిపూడి లిఫ్ట్నీరు కలిసి మూడువేల క్యూసెక్కులకు చేరింది. ఈ నీటి ఒత్తిడి తట్టుకోలేక శనివారం ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక నేతలు పరిశీలిస్తుండగానే జానంపేట అక్విడెక్ట్‌కు గండి ఏర్పడింది. దీం తో సుమారు 3వేల క్యూసెక్కుల గోదావరి నీరు తమ్మిలేరు ద్వారా కొల్లేరులో కలిసిపోతోంది. ఈ నీటికే అక్విడెక్ట్ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందంటే పట్టిసీమ మొత్తం సామర్థ్యం 8,500 క్యూసెక్కుల నీరు విడుదలైతే జిల్లా కేంద్రమైన ఏలూరు మునిగిపోయే ప్రమాదం ఏర్పడేది. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాత్రం ఇది పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. -
'ఆమెకే అలా అయితే.. ఇక సాధారణ మహిళలు'
తిరుపతి:ఏపీ కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం దుర్మార్గం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చింతమనేనిని వెనకేసుకు రావడానికి తహశీల్దార్ వనజాక్షిని బలిపుశువును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మార్వోకే రక్షణ లేదంటే ఇక రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. వనజాక్షి తరుఫున రెవెన్యూ ఉద్యోగ సంఘాలు పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.ఆ పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. బుధవారం అయిన కేబినెట్ సమావేశం ఎమ్మార్వో వనజాక్షిదే తప్పని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆమె తన అధికార పరిధిని దాటి జోక్యం చేసుకున్నారని చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకొని వచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్‌పై విమర్శలు పెల్లుభుకుతున్నాయి. -
వనజాక్షిపై దాడి ఘటనపై విచారణ కమిటీ
హైదరాబాద్: ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు తెలిపారు. ఓ మహిళా అధికారిపై దాడి జరగటం దురదృష్టకరమని చంద్రబాబు అన్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులపై దాడి చేస్తే ఎలా పని చేస్తామని ముఖ్యమంత్రిని అడిగామని బొప్పరాజు తెలిపారు. ఎమ్మెల్యే దాడి చేసిన వివరాలను చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. కాగా సీఎం హామీతో రెవెన్యూ ఉద్యోగులు సమ్మె విరమించారు. కాగా దాడి ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎమ్మార్వో వనజాక్షి డిమాండ్ చేశారు. విచారణ కమిటీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. -
'కేసులు ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమమే'
ఏలూరు: ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలపై బనాయించిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని ఏపీఎన్జీవో నేతలు యోగానందం, శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని కోరితే తమపైనే కేసులు పెడతారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అక్రమ కేసులు వెంటనే ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా యోగానందం, శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
శిక్షించకుండా కాలం గడుపుతున్నారు
విజయవాడ: చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆర్టీఐ యాక్ట్ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. తహశీల్దారు వనజాక్షిపై దాడి విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణం అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థపై ఇది రాజకీయ దాడి అని అభివర్ణించారు. దాడి చేసిన వారిని శిక్షించకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు. -
'ప్రభుత్వం స్పందించక పోవటం దారుణం'
పశ్చిమ గోదావరి: ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణం అని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గూండా యాక్ట్ కింద చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసి ఆయనను విప్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను టీడీపీ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్.. వెంకయ్యనాయుడును ప్రశ్నించక పోవటం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్‌కు బాధ్యత ఉంటే సీపీఐతో కలిసి పోరాడవచ్చునని ఆయన సూచించారు. -
ఆయనకలా.. ఈయనకిలా..
హైదరాబాద్ : ఇద్దరూ ప్రజాప్రతినిధులు...వేర్వేరు జిల్లాలు..ఒకరిపైన పోలీసులను దూషించారని ఆరోపణ.. వెనువెంటనే అరెస్ట్.. రిమాండ్.. జైలుకు తరలింపు... ఆరోగ్యం బాగాలేదని నిమ్స్‌కు తరలించమంటే.. మీనమేషాలు.. వైద్యబృందంతో పరీక్షలు..చివరకి బెయిల్ వచ్చే వరకు తాత్సారం మరొకరు.. అదేస్ధాయి ప్రజాప్రతినిధి...ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై బూతుల దండకం అందుకొని దాడి చేసి... బెదిరింపులు.. ఒక్క ఎమ్మార్వోనే కాదు.. మిగతా రెవెన్యూ సిబ్బందిపై దాడి... పోలీసులు వచ్చి దాడి చేసిన వారిని బుజ్జగించి పంపేశారు.. దాడి విషయం బయటకు పొక్కి రభస జరుగుతుంటే అప్పుడు పోలీసులు అప్రమత్తమై ఇలా కేసులు బుక్ చేసి అలా వదిలేశారు. మొదటిది కర్నూలు జిల్లా.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తన కూతురు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పట్ల పోలీసులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నందుకు అడ్డు పడితే ఆగమేఘాలపై కేసు ..అరెస్ట్... రెండవది పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ అంశం. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రేవులో బుధవారం ... ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుక తవ్వకం జరుపుతున్నారు. ఆ విషయం తెలిసి స్థానిక ఎమ్మార్వో వనజాక్షి... తన సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇదేం పని అని ప్రశ్నించిన ఆమెపై ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరణగణం దాడి చేసింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం...రెవెన్యూ ఉద్యోగులు సమ్మెబాట పట్టినా, జిల్లా కలెక్టర్‌తో మొరపెట్టుకున్నా పోలీసుల నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. సరికదా డ్వాక్రా మహిళల ఫిర్యాదుతో బాధిత ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదురు కేసు పెట్టారు. ఒకవైపు ఇంత హడావిడి జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే తాపీగా విలేకరుల సమావేశం పెట్టి వనజాక్షి వ్యక్తిగత విషయాల పట్ల అసభ్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ' ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేస్తాం.. ఆత్మహత్య మినహా మరో మార్గంలేదు ' అని వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి సంఘటనలు చూస్తోంటే.. ప్రభుత్వ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల మాటేమిటీ అనే ప్రశ్నకు జవాబు మాత్రం దొరకదు. సోమవారం వరకు ప్రభాకర్‌పై చర్య తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అంటే పోలీసులకి సోమవారం వరకు వెసులు బాటు ఉందన్నమాట...చేసింది తప్పుకానే కాదని ఎమ్మెల్యే ప్రభాకర్ ధైర్యంగా ఉన్నట్టున్నారు. తన అనుయాయులతో రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పోటీ ధర్నాలు చేయిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై చింతమనేని యూత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇసుక అమ్ముకునే హక్కు కల్పించిన నాయకుడి పట్ల ఆ మాత్రం స్వామి భక్తి లేకపోతే ఎలా...అందుకే ఇసుకాసురులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఏ చిన్న విషయంపైన అయినా ఒంటి కాలిమీద లేచి నానా యాగి చేసే అధికారపార్టీ నాయకులు మాత్రం..ఈ విషయం పై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. 'బాస్ జపాన్ నుంచి వచ్చిన తర్వాతే చర్యలుంటాయి' అని లీకులు మాత్రం ఇస్తున్నారు. చర్యలంటే ప్రభాకర్‌ను అరెస్ట్ చేస్తారని ఆశపడటం తప్పేమో.. బహుశా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగినందుకు వనజాక్షిని ఏదో ఒక లూప్ లైన్ పోస్ట్‌కి బదిలీ చేస్తారేమో.. -
'చింతమనేని ప్రభాకర్‌ను సస్పెండ్ చేయండి'
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పెన్షన్‌దారులను ఉద్దేశించి ప్రభాకర్ అసభ్యంగా మాట్లాడారని కల్పన ఆరోపించారు. ప్రభాకర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక టీడీపీ విధానమా? అని ప్రశ్నించారు. ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్
ఏలూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సైపై దౌర్జన్యం చేసిన కేసులో ఆయను పెదవేగి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు డబ్బలు పంచుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రభాకర్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి తన అనుచరుల్ని అక్రమంగా విడిపించుకునిపోయారు. ఈ సంఘటనపై పెదవేగి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.