వనజాక్షిపై దాడి ఘటనపై విచారణ కమిటీ
హైదరాబాద్: ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు తెలిపారు. ఓ మహిళా అధికారిపై దాడి జరగటం దురదృష్టకరమని చంద్రబాబు అన్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగులపై దాడి చేస్తే ఎలా పని చేస్తామని ముఖ్యమంత్రిని అడిగామని బొప్పరాజు తెలిపారు. ఎమ్మెల్యే దాడి చేసిన వివరాలను చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. కాగా సీఎం హామీతో రెవెన్యూ ఉద్యోగులు సమ్మె విరమించారు. కాగా దాడి ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎమ్మార్వో వనజాక్షి డిమాండ్ చేశారు. విచారణ కమిటీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.