enquiry committee
-
మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్డీఎస్ఏ ప్రకటించింది. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది. చదవండి: మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్యలేవీ? -
శ్రీచైతన్య విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వెరీ కమిటీ రిపోర్టు
-
కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో విచారణ కమిటిని నియమించింది. చంద్రబాబు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. ఇందులో కందుకురులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ ఘటనలపై జస్టిస్ శేషశయన రెడ్డి కమిషన్ విచారించనుంది. -
స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ రామచంద్రస్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖవేనని విచారణ కమిటీ నిగ్గుతేల్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో వెలుగుచూసిన ఈ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని నిర్ణయించిన సర్కారు.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూముల్లో వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, పరిశ్రమలు పుట్టుకొచ్చినట్లు గుర్తించింది. అలాగే, కొంతమంది సాగు కూడా చేసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించి 1,350 ఎకరాలు దేవాదాయశాఖకే చెందుతాయని కమిటీ తేల్చింది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ భూముల్లో తిష్టవేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీతారామస్వామి... సీతారామరెడ్డి అయ్యాడు! దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. నిజాం హయాంలో ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని వితరణ చేశారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిటే ఉంది. ఈ భూములన్నీ 55 నుంచి 63, 639–641, 656, 657, 660–682, 686–718, 736 సర్వే నంబర్లలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామరెడ్డి, సీతారామారావు, సీతారామయ్య, సీతారాములుగా.. మారిపోయి కబ్జాదారుల పేర్లు రికార్డులకెక్కాయి. ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. రికార్డులు స్పష్టంగా ఉన్నా... ఆ భూముల్లోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్ ఉంది. మరో 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటుపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళుతోంది? అసలా భూములన్నీ దేవుడి మాన్యమేనని పాత రెవెన్యూ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా ఇన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయి? వీటన్నింటికీ జవాబు ఒకటే... పలువురు నేతలు, అధికారులు కుమ్మక్కై దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు. ఈ భూములను తమ అధీనంలో ఉంచుకున్న వారు ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమార్కులకు క్లీన్చిట్.. పదోన్నతులు ఈ భూములను ’కబ్జా’లో ఉన్నవారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కింద దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ, దీనిపై నియమించిన జస్టిస్ వెంకటరామిరెడ్డి కమిషన్ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి.. ఆలయ మేనేజర్ చంద్రమోహన్, సహాయ కమిషనర్ రాఘవాచార్యులు, మాజీ డిప్యూటీ కమిషనర్ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని నివే దికలో పేర్కొంది. విజిలెన్స్, ఏసీబీ కూడా వీరితోపాటు నాటి దేవాదాయ కమిషనర్ వెంకటేశ్వర్లు, ముఖ్యకార్యదర్శి జేపీ మూర్తి, సంయుక్త కమిషనర్ రామకృష్ణకుమార్, ఉపకమిషనర్ మోహనాచారిని కూడా బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేశాయి. కానీ, అప్పటి ప్రభుత్వం వారికి క్లీన్చిట్ ఇచ్చింది. ఆపై పదోన్నతులు కూడా కల్పించిందన్న ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్ శివారులోని ఈ 1,350 ఎక రాలు దేవాదాయ శాఖవేనని కమిటీ తేల్చ డంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌సహా వారి బంధువుల భూములు ఉన్నాయన్న నేపధ్యంలో కక్ష సాధింపునకే ప్రభుత్వం విచారణ చేపట్టిందని పలువురు విమర్శించారు. -
ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
వాష్టింగ్టన్: వచ్చే అధ్యక్ష(2024) ఎన్నికల కోసం ముందు నుంచే ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. క్యాపిటల్ హిల్ దాడి వ్యవహారంలో ట్రంప్ చుట్టు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఆగ్రహంతో ఉన్న గుంపుతో తాను కూడా చేరాలని ట్రంప్ భావించారని, ఈ మేరకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తాజాగా ఆ దాడిపై విచారణ చేపట్టిన కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు మరింత అప్డేట్ కోసం ఎదురు చూడండంటూ విచారణ కమిటీ సభ్యుడు ఆడమ్ కింజింగర్ తెలిపారు. 2021, జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడికి యత్నం జరగ్గా.. దాడికి కారణమైన ఆగ్రహ జ్వాలలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగదోశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు లిజ్ ఛెనీ ఈ మేరకు ఆ ఆరోపణలను ధృవీకరించారు కూడా. అంతేకాదు వాళ్లను నిలువరించే పరిస్థితి ఉన్నా.. ట్రంప్ ఆ పని చేయలేదన్నది ఆమె ఆరోపణ. ఇప్పటికే ఆయన హయాంలో పని చేసిన అధికారులతో సహా ఎంతో మంది ఆయనకు వ్యతిరేక సాక్ష్యం చెప్పారు. ఈ నెలలో ఈ వ్యవహారంపై మరో రెండు వాదనలు జరగనున్నాయి. తద్వారా ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలతో ట్రంప్ పాత్రను బలంగా చూపించి.. ఆయనకు పక్కాగా దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయబోతోంది కమిటీ. అంతేకాదు అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌లో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు గడిపిన చివరి రోజులను సైతం పరిశీలించనుంది. కీలకమైన డాక్యుమెంట్లను ఆయన నాశనం చేశారన్న ఆరోపణల మేరకే ఈ పని చేయబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ విచారణ మొత్తం రాజకీయ బూటకమని ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. మరోవైపు 2024లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా.. 2020 ఓటమితో సంబంధం లేకుండా బరిలోకి దిగుతానని ట్రంప్ చెప్తున్నారు. ఒకవేళ క్యాపిటల్ భవనం దాడి విషయంలో ఏదైనా ప్రతికూల తీర్పు వస్తే మాత్రం.. పోటీకి ఆయన అర్హత కోల్పోవడం మాత్రమే కాదు.. రాజద్రోహం కింద శిక్ష పడినా పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. -
ప్రధాని భద్రతా వైఫల్యం.. తప్పు ఎవరిదో తేలాల్సిందే!
దర్యాప్తు కన్నా ముందే తప్పెవరిదో చెప్పేసేటంతటి పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఇరువర్గాలు ఉంటే ఏం చేయాలి? పరస్పర నేరారోపణల నడుమ నిజానిజాలు ఎవరు తేల్చాలి? సాక్షాత్తూ దేశ ప్రధాని పంజాబ్ పర్యటన సందర్భంగా జనవరి 5న భద్రతా ఏర్పాట్లలో వైఫల్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధ భావాలతో, విడివిడిగా విచారణ చేపట్టేసరికి ఇలాంటి పరిస్థితే తలెత్తింది. చివరకు సర్వోన్నత న్యాయస్థానం ఆ రెండు వేర్వేరు విచారణలకూ బ్రేకులు వేయాల్సి వచ్చింది. ప్రధాని భద్రతలో తలెత్తిన వైఫల్యంపై విచారణకు గాను రిటైర్డ్ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా సారథ్యంలో మరో నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ సంఘాన్ని ఏర్పాటుచేసింది. సత్యాన్వేషకులు అందరూ స్వాగతించాల్సిన పరిణామం ఇది. జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో హుస్సేనీవాలా సమీపంలో ఓ వంతెన మీద ప్రధాని మోదీ తన కాన్వాయ్‌తో సహా 20 నిమిషాల సేపు ప్రదర్శనకారుల మధ్య ఉండిపోవాల్సి వచ్చిన ఘటన ఏ రకంగా చూసినా దిగ్భ్రాంతికరమే. పంజాబ్ ఎన్నికల వేళ ఇది ప్రచార విన్యాసమనే వాదన నుంచి ప్రధాని ప్రాణాలకే రక్షణ లేనంతటి రైతుల నిరసన ఏమిటనే విమర్శల దాకా రక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. దేనిలో నిజం ఎంతనేది పక్కనపెడితే, దేశంలోకెల్లా అత్యున్నత రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి భద్రతలో లోపమనేది సున్నితమైన అంశం. అందుకే, దాన్ని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న అటు కేంద్రం, ఇటు పంజాబ్ ప్రభుత్వాల ఏకపక్ష విచారణలకు వదిలేయడం సరికాదు. సరిగ్గా సుప్రీమ్ కూడా అదే అభిప్రాయపడింది. మాటల యుద్ధంతో పరిష్కారం రాదని కుండబద్దలు కొట్టింది. తనదైన స్వతంత్ర ప్యానెల్‌తో విచారణకు ఆదేశించింది. ఈ స్వతంత్ర ఉన్నత స్థాయి విచారణ సంఘం దేశ ప్రధాని భద్రతా వైఫల్యానికి కారణాలేమిటి, ఆ లోపానికి బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో వీవీఐపీల భద్రతలో లోపాలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి లాంటి వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. విచారణ ఫలితాలను కోర్టుకు రహస్య నివేదికగా అందించనుంది. ఈ విచారణ కమిటీలో జాతీయ దర్యాప్తు సంఘం (ఎన్ఐఏ) డీజీ, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ ఏడీజీపీ (సెక్యూరిటీ), పంజాబ్ – హరియాణా హైకోర్డ్ రిజిస్ట్రార్ జనరల్ లాంటి బాధ్యతాయుత పదవుల్లోని ఉన్నతాధికారులను సభ్యులుగా వేసింది కోర్టు. దాంతో విచారణ నిష్పాక్షికంగా, నిజాయతీగా సాగుతుందని సామా న్యులకు భరోసా! కేంద్ర, రాష్ట్ర సర్కార్లు రెండూ విచారణకు పూర్తిగా సహకరించడమే ఇక బాకీ! జరిగిన ఘటనలో జవాబు లేని ప్రశ్నలెన్నో. ఏటా రూ. 600 కోట్ల (2020 నాటికి) ఖర్చుతో, 3 వేల మందితో కూడిన ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ)దే ప్రధానమంత్రి భద్రత బాధ్యత. దానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, స్థానిక పోలీసులు, గూఢచర్యా విభాగం (ఐబీ) అండగా నిలుస్తాయి. ప్రధాని పర్యటనంటే తోడ్పడాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, కార్యనిర్వాహక వ్యవస్థలే. ప్రధాని ఏదైనా రాష్ట్రంలో పర్యటిస్తే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ లాంటి వారు స్వాగతించడం, రాజకీయేతర కార్యక్రమాలకు వెంట ఉండడం సర్వసాధారణం. కారణాలేమైనా, తాజా పంజాబ్ ఘటనలో వారెవరూ ఆయనతో లేరు. అలాగని నిరసనకారులు రోడ్డు మీద ప్రధానిని అడ్డగిస్తారనే సమాచారం వారి వద్ద ముందే ఉందని అనలేం. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శన చట్టబద్ధమే గనక రైతులను తప్పుపట్టలేం. కానీ, వారి నిరసన వల్ల ప్రధాని ప్రయాణానికి ఇబ్బంది తలెత్తే పరిస్థితి రాకుండా చూడాల్సింది పంజాబ్ ప్రభుత్వమే. ఆ బాధ్యత నుంచి అక్కడి పాలకులు తప్పించుకోలేరు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ఇలాంటి సంఘటనల్ని కూడా రాజకీయం చేయాలని ఎవరు ప్రయత్నించినా అది సరికాదు. సుప్రీమ్ తానే స్వతంత్ర విచారణకు దిగడానికి ముందు... కేంద్ర దర్యాప్తు బృందం అసలు విచారణైనా చేయకుండానే, ఏకంగా తప్పంతా రాష్ట్రప్రభుత్వ అధికారులదే అన్నట్టు వారికి నోటీసులివ్వడం విచిత్రం. ప్రధాని భద్రతా వైఫల్యానికి కారణాలు కనిపెట్టాల్సి ఉండగా, ఆ భద్రతకు బాధ్యుడైన ఎస్పీజీలోని సీనియర్ అధికారినే తీసుకెళ్ళి కేంద్రం దర్యాప్తు బృందంలో పెట్టడం మరీ విడ్డూరం. ఇక రాష్ట్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటైనా చేయక ముందే, తమ ప్రభుత్వాధికారుల తప్పేమీ లేదని ఘటన జరిగిననాడే పంజాబ్ సీఎం క్లీన్చిట్ ఇచ్చేసుకోవడం మరో వింత. ఇవి చాలదన్నట్టు ప్రతిపక్షాలు కావాలని ప్రధానికి హాని తలపెట్టాయన్నట్టుగా కేంద్రంలోని అధికార పార్టీ ప్రవర్తించడం విస్మయం రేపుతోంది. పంజాబ్, పొరుగునే ఉన్న యూపీ సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఈ ప్రవర్తనలన్నీ రాజకీయ కోణం నుంచి చూడాల్సిందే. అయితే, దేశ సరిహద్దుకు కిలోమీటర్ల దూరంలో, డ్రోన్ దాడులను కొట్టిపారేయలేని చోట... దేశనాయకుడికి జరగరానిది ఏదైనా జరిగితే ఏమిటన్నది ప్రశ్న. ఇరవై ఏళ్ళ క్రితం 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంపై తీవ్రవాదుల దాడి దృశ్యాల్ని మర్చిపోలేం. ఇక జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేళ ఘాతుకచర్యలకు పాల్పడతామంటూ తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నా యని వార్త. ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా పౌరులు, నేతలందరికీ దేశ సమైక్యత, సమగ్రతే ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే, ప్రధాని అంటే దేశమనే ఈ కుటుంబం అంతటికీ పెద్ద తలకాయేనని గుర్తించాలి, గౌరవించాలి. సుప్రీమ్ విచారణతో పంజాబ్ ఘటనలో తప్పెవరిదో తేలేదాకా ఆగాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. -
చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా!
China Ease of doing business index Scam: డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విషయంలో చైనా భారీ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు.. ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ర్యాంకింగ్‌లో పురోగతి అనేది దేశ ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రభావితం చేసే అంశం. అయితే అంతటి బలమైన వ్యవస్థను.. చైనా అంతతేలికగా ఎలా ప్రభావితం చేయగలిగిందన్నది ఇప్పుడు ప్రధానంగా వ్యక్తం అవుతున్న అనుమానం. ఇక ఈ ఆరోపణలు వెలుగుచూడడంతో.. డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విడుదలను నిలిపివేస్తూ(ఈ ఏడాదికి మాత్రమేనా? శాశ్వతంగానా?) ప్రపంచ బ్యాంక్ సంస్థ ప్రకటించడంతో అన్ని దేశాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. డబ్ల్యూటీవో రూల్స్‌ను కాలి కింద తొక్కిపట్టి మరీ.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే అత్యాశ ఇప్పుడు పాముగా మారి డ్రాగన్ మెడకు చుట్టుకుంటోంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో అవకతవకలు బయటపడడంతో అంతర్జాతీయ సమాజం చైనాపై దుమ్మెత్తిపోస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా.. చైనా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో పైరవీలు చేసి మెరుగైన ర్యాంకులు సంపాదించింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ ఫేక్ ర్యాంక్ దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు వెల్లడించిన అంశం. ఉన్నత పదవుల్లో అవినీతి, నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి వ్యవహారాలు చైనా ర్యాంక్‌ను ప్రభావితం చేశాయని దర్యాప్తు వెల్లడించింది. ఇవేకాదు.. అంతర్గతంగా విచారణ ద్వారా మరిన్ని నిజాల్ని నిగ్గు తేలుస్తామని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రకటించుకుంది కూడా. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే.. చైనాపై కొంతకాలం కఠిన ఆంక్షలు విధించడంతో పాటు విదేశీ పెట్టుబడులకు అనుమతుల నిరాకరణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో(ప్రస్తుతం కూడా) క్రిస్టలీనా జార్జియేవా.. ఒత్తిళ్ల మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన న్యాయసేవల సంస్థ విల్మర్హేల్ నిర్ధారించింది. పాక్ పాత్ర కూడా.. ప్రస్తుతం డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారంపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ పాత్రను కూడా గుర్తించినట్లు సమాచారం. పాక్ లాంటి దేశాల వెన్నుదన్నుతోనే చైనా ఫేక్ ర్యాంకింగ్‌తో డూయింగ్ బిజినెస్ లిస్ట్‌లో ఎగబాకగలిగిందని ఎథిక్స్ కమిటీ సమర్పించిన 16 పేజీల నోట్లో ఓ ముఖ్యాంశంగా ఉంది. చైనాను హైలీ ప్రమోట్ చేయడం ద్వారా పాక్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు అయ్యింది. అంతేకాదు గ్లోబల్ ఇన్వెస్టర్లను చైనాకు మళ్లించేలా ప్రభావితం చేయడంతో పాటు చైనాతో పరస్పర సహకారం భారీ ముడుపులు పాక్ అందుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనాతో ఆర్థిక లావాదేవీల కొనసాగింపు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఇస్లామాబాద్-ఫైసలాబాద్-కరాచీలలో భారీ పెట్టుబడుల హామీతోనే చైనాకు పాక్ మద్దతుగా నిలుస్తోందనేది ఆ నివేదికలోని సారాంశం. మరో విషయం ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ప్రభావితం చేస్తూ చైనా ఈ తతంగాన్ని నడిపించిందని. కావాలంటే ఎంక్వైరీ చేస్కోండి చైనా ఈ ఆరోపణలు తోసిపుచ్చుతోంది. ఇదంతా అమెరికా కుట్రలో భాగమని అంటోంది. అంతర్గత దర్యాప్తు కాదు.. అవసరమైతే నిఘా వర్గాలతోనూ దర్యాప్తు జరిపించుకోండంటూ ప్రపంచ బ్యాంకుకు సవాల్ విసురుతోంది. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ ఆరోపణలపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పని చేసిన జిమ్ కిమ్ సైతం ఆరోపణల్ని తోసిపుచ్చారు. వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోంది. సెప్టెంబర్ 15న ‘ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డేటా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ డూయింగ్ బిజినెస్ 2018 అండ్ డూయింగ్స్ బిజినెస్ 2020.. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అండ్ రిపోర్ట్ టు ది బోర్డ్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్’ పేరుతో 16 పేజీల రిపోర్ట్‌ను తయారు చేసింది ఎథిక్స్ కమిటీ. . అవుట్‌డేటెడ్ మల్టీలాటెరల్ స్ట్రక్చర్స్, అవినీతి లాంటి చైనా ప్రయత్నాలపై ఈ నివేదిక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవైపు ఆర్థికంగా వరుస దెబ్బలు.. తాజాగా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆరోపణలు చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: డూయింగ్ బిజినెస్ నివేదిక నిలిపివేత -
విశాఖ: HPCLలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ
-
ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: దిశ హత్యాచారం ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రతిపాదించింది. బాధ్యులైన పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఘటనపై దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని, ఇదివరకే ఈ కోర్టు జారీచేసిన 16 మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని న్యాయవాదులు జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం, ముకేశ్‌కుమార్ శర్మ దాఖలు చేసిన మరో ప్రజాహిత వ్యాజ్యం బుధవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద విచారించాల్సిన కేసుల జాబితాలో నమోదయ్యాయి. అయితే మధ్యాహ్న భోజన సమయంలో ఈ పిటిషన్లను సంబంధిత న్యాయవాదులు ప్రస్తావించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ.బాబ్డే తొలుత స్పందిస్తూ.. ‘ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం మాకు తెలుసు. ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించేందుకు ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్నాం. రిటైర్డ్ న్యాయమూర్తి ఇక్కడి (ఢిల్లీ) నుంచే దర్యాప్తు ప్రక్రియ చేపడతారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డిని ఈ విషయమై సంప్రదించాం. అయితే ఆయన సుముఖత చూపలేదు. ఈ విధి నిర్వహణకు మరో రిటైర్డ్ న్యాయమూర్తిని సంప్రదిస్తాం..’అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘పీయూసీఎల్ కేసులో 2014లో ఈ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉత్తర్వులు జారీచేసే ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినాలి..’అని నివేదించారు. సలహాలు, సూచనలుంటే చెప్పొచ్చన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదావేసింది. ఈ సందర్భంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ గోడా రఘురాం నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఎన్కౌంటర్లపై ఇచ్చిన తీర్పును కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ.బాబ్డే ప్రస్తావించారు. -
అమెరికా ఎన్నికల్లో కుట్ర లేదు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గొప్ప ఊరట లభించింది. 2016లో ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని విచారణ కమిటీ తేల్చింది. సుమారు రెండేళ్లుగా ట్రంప్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించిన ఈ వ్యవహారంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ముల్లర్ సమర్పించిన నివేదికను సమీక్షించిన అటార్నీ జనరల్ విలియం బార్ అందులోని సారాంశంతో నాలుగు పేజీల లేఖను ఆదివారం అమెరికా కాంగ్రెస్ ముందుకు తెచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నాలు, విచారణకు ట్రంప్ అడ్డుపడ్డారా? లాంటి విషయాలను బార్ ప్రముఖంగా ప్రస్తావించారు. ట్రంప్ ప్రచారానికి సాయం చేస్తామని రష్యా నుంచి పలు వ్యక్తిగత ప్రతిపాదనలు వచ్చినా, ఎన్నికల్లో ఎలాంటి కుట్ర జరగలేదని ముల్లర్ విచారణలో తేలిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిపై ఇలాంటి విచారణ జరగడం సిగ్గుచేటని ట్రంప్ పేర్కొన్నారు. ముల్లర్ నివేదికను సంపూర్ణంగా బహిర్గతం చేయాలని విపక్ష డెమొక్రాట్లు డిమాండ్ చేశారు. ఇన్నాళ్లుగా ట్రంప్ చెబుతున్నదే నిజమని రుజువైందని శ్వేతసౌధం వ్యాఖ్యానించింది. ముల్లర్ నివేదికను బహిర్గతం చేసినా ట్రంప్‌కు ఎలాంటి సమస్య ఉండదని తెలిపింది. ముల్లర్ విచారణ ముగిసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము జోక్యం చేసుకున్నామన్న ఆరోపణల్ని రష్యా మరోసారి తోసిపుచ్చింది. ఆ నిర్ణయాలు ‘అడ్డగింత’తో సమానమా? ట్రంప్ ప్రచార బృందం లేదా సంబంధిత వ్యక్తులు 2016 ఎన్నికల సమయంలో రష్యాతో కలసి పనిచేశారనడానికి, కుట్రకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ముల్లర్ నివేదిక పేర్కొన్నట్లు బార్ తన లేఖలో కాంగ్రెస్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ట్రంప్ చట్టవిరుద్ధంగా విచారణ ప్రక్రియకు అడ్డుతగిలారా? లేదా? అన్న విషయంలో ముల్లర్ ఓ నిర్ధారణకు రాలేకపోయారని తెలిపారు. ట్రంప్ న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించారని నివేదిక తేల్చకపోయినా, ఈ వ్యవహారంలో ఆయన్ని నిర్దోషిగా ప్రకటించలేదని వెల్లడించారు. విచారణ సమయంలో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు న్యాయ ప్రక్రియను అడ్డుకోవడంతో సమానమా? లాంటివి చాలా క్లిష్టమైన అంశాలని, కాబట్టి వాటి జోలికి పోకూడదని ముల్లర్ నిర్ణయించినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని తొలగించడంతో పాటు ట్రంప్ తీసుకున్న ఇతర నిర్ణయాలు విచారణపై పలు సందేహాలకు తావిచ్చాయి. ముల్లర్ విచారణ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలని డెమొక్రాట్లు యోచిస్తున్నారు. రష్యాతో ట్రంప్ కుమ్మక్కయినట్లు తేలితే, ఆయనను అభిశంసించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణల నుంచి తనకు సంపూర్ణ విముక్తి లభించిందని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. బార్ లేఖతో ఎన్ని సమాధానాలు లభించాయో అంతే సంఖ్యలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని డెమొక్రాట్లు ఆరోపించారు. తాను నిర్దోషినని ప్రకటించుకున్న ట్రంప్ వ్యాఖ్యలు ముల్లర్ నివేదికకు విరుద్ధంగా ఉన్నాయని, కాబట్టి ఆయన మాటల్ని విశ్వసించరాదని పేర్కొన్నారు. ముల్లర్ పూర్తి నివేదికను పరిశీలించాలని బార్‌కు సూచించారు. -
జయలలిత చికిత్స వీడియోలు లేవు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు తమ ఆస్పత్రిలో చికిత్సచేసినపుడు చిత్రీకరించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం లేవని, అవి చెరిగిపోయాయని చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేసిన విషయం తాజాగా వెల్లడైంది. జయ మరణంపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డు జడ్జి ఆర్ముగస్వామి చైర్మన్‌గా విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ విచారణ కమిషన్‌కు ఈనెల 11న ఆస్పత్రి యాజమాన్యం రాసిన లేఖ బుధవారం బహిర్గతమైంది. సీసీటీవీల్లో రికార్డయిన వీడియోలు నెలరోజులకు మించి ఉండవని, తాజా దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, జయ చికిత్స దృశ్యాలు సైతం ఇలాగే చెరిగిపోయాయని లేఖలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. దీంతో ఆస్పత్రిలోని సర్వర్లను పరిశీలించి నిపుణుల బృందం సాయంతో చెరిగిపోయిన దృశ్యాలను రాబట్టాలని కమిషన్ నిర్ణయించింది. -
మెస్ బిల్.. గుండె గుబేల్!
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో ఇష్టారాజ్యంగా మెస్ బిల్లులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు హాస్టల్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండా పర్చేజ్ కమిటీ అనామతుగా బిల్లలు చెల్లిస్తుండడంతో విద్యార్థులకు బిల్లుల భారం పెరుగుతోంది. ఏడాదికి అదనంగా రూ.15 లక్షలు అదనపు భారం పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటి వరకు హాస్టళ్లకు సంబంధించి ప్రొవిజన్స్, కూరగాయలు, పాలు తదితర వాటికి ఎలాంటి టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం మెస్ నిర్వహణ కోసం 15 రోజులకు సరిపడా వస్తువులను కొనుగోలు చేశారు. టెండర్ల ఊసే లేదు.. విశ్వవిద్యాలయంలో మూడు మెన్స్ హాస్టళ్లు, రెండు ఉమెన్స్ హాస్టళ్లున్నాయి. గతేడాది 330 మంది అబ్బాయిలు, 335 మంది అమ్మాయిలు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రొవిజన్లకు సంబంధించి 2016 టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా ఒక నెలకు మాత్రమే అని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు ఎవరైతే టెండర్లలో దక్కించుకున్నారో వారినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక కూరగాయలు, పాలు, నీటి సరఫరాకు సంబంధించి వర్సిటీ ఏర్పటి నుంచి అయిన వారికే అప్పగిస్తున్నారు. ఇందులో వర్సిటీ కీలక అధికారులకు పర్సెంటేజీలు అందుతుండటంతో టెండర్లు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. విద్యార్థులపై భారం.. వర్సిటీలోని ఆరు హాస్టళ్లలో 665 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.2000 నుంచి రూ.2500 వరకు మెస్ బిల్లు వస్తుంది. అయితే స్కాలర్షిప్ కోర్సు, కేటగిరిని బట్టి ఏడాదికి రూ.5400 నుంచి రూ. 7000 వరకు వస్తుంది. మిగతాది విద్యార్థులు చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరలకు కోట్ చేసినవారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్ బిల్లుల బారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నివేదిక ఇవ్వని విచారణ కమిటీ గత విద్యా సంవత్సరం హాస్టళ్ల ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని దానిపై విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్యూ ఈసీ మెంబర్ ప్రొఫెసర్ సంజీవరావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డితో కమిటీ నియమించారు. అయితే ఈ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నివేదిక సమర్పించలేదు. త్వరలో టెండర్లు పిలుస్తాం హాస్టల్స్‌కు ప్రొవిజన్స్, కూరగాయలు సరఫరా చేయడానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేస్తాం. ఉన్నవారితోనే మార్కెట్ ధరలకు అనుగుణంగా వస్తువులను సరఫరా చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి వస్తువులను సరఫరా చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ సారి పర్చేజ్ కమిటీతో పాటు, విద్యార్థుల సమక్షంలోనే టెండర్లు ఓపెన్ చేస్తాం. – ప్రొఫెసర్ అమర్నాథ్, రిజిస్ట్రార్ -
వారణాసి ఫ్లైఓవర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
వారణాసి : వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో యూపీ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ప్రమాద కారణాలను విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఓ కమిటీని నియమించింది. బుధవారం ఉదయం కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కమిటీలో సభ్యునిగా ఉన్న రాజ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. విచారణ పూర్తి కానిదే ఏ విషయం చెప్పలేమని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరపకుండా ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. కాగా ఘటన స్థలంలోని శిథిలాల తొలగింపు పక్రియ పూర్తికావచ్చింది. -
జయ స్పృహలో ఉండే సంతకం చేశారు!
టీ.నగర్: తమిళనాడులో 3 నియోజకవర్గాల ఉపఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో జయలలిత స్పృహలో ఉండగానే సంతకం చేసినట్లు ఆమె మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ వెల్లడించింది. ఆమె అపోలో ఆసుపత్రిలో ఉన్నకాలంలో రాష్ట్రంలో 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. రెండాకుల చిహ్నం కేటాయింపునకు సంబంధించిన బీ ఫారంలో జయలలిత వేలిముద్ర ఉంది. వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయ స్పృహలోనే ఉన్నట్లు వైద్యుడు బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. బాలాజీ వాంగ్మూలం వాస్తవమేనని విచారణ కమిషన్ తాజాగా నిర్ధారించింది. ఆసుపత్రి గదిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్నది నిజమేనని, తర్వాత ఆమె వేలికి అంటుకున్న సిరాను బాలాజీ తుడిచేందుకు ప్రయత్నించగా ఆయన్ని అడ్డుకుని శశికళ సిరాను తుడిచినట్లు తెలిపింది. -
మూల్యాంకన లోపాలపై విచారణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వ విద్యాలయంలో న్యాయ విద్య (ఎల్ ఎల్ఎం) మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇలా అయితే ఎ లా?’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురి తమైన కథనంపై ఆయన స్పందించారు. విచారణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు. పొరపాటుకు బాధ్యులైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసు పంపించినట్లు వెల్లడించారు. అలాగే ఒక అభ్యర్థికి సంబంధించిన జవాబు పత్రా లను మరో అభ్యర్థికి సంబంధించిన చిరు నామా కలిగిన కవర్లో పెట్టి పంపిం చారని (ఫొటో కాపీ కోసం రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే) పేర్కొ న్నారు. మూల్యాంకనం సమయంలో జవాబుపత్రంపై జవాబుల పక్కన మార్కులు వేయమని వెల్లడించారు. వీటిపై స్పష్టత ఏదీ? అయితే, సదరు పేపరుకు సంబంధించిన మార్కుల స్లిప్‌లో మాత్రం మార్కులను కచ్చితంగా వేయాల్సి ఉన్నప్పటికీ మా ర్కులను వేయలేదు. ఎల్ఎల్ఎం సెకండ్ సెమిస్టర్ నాలుగో పేపరుకు సంబంధిం చి అభ్యర్థికి ఇచ్చిన ఫొటో కాపీలో మా ర్కులనే వేయకుండా ఇచ్చారు. ఫలితాల్లో మాత్రం అతనికి 23 మార్కులు వచ్చిన ట్లు ఇచ్చారు. కానీ మార్కుల స్లిప్‌లో ఎక్కడా వాటిని చూపించలేదు. పైగా ఎల్ఎల్ఎం థర్డ్ సెమిస్టర్ ఐదో పేపరుకు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థికి ఎల్ ఎల్బీ థర్డ్ సెమిస్టర్ మార్కుల స్లిప్‌ను ఇచ్చారు. అందులో 33 మార్కులు వచ్చి నట్లు చూపించారు. కానీ ఫలితాల్లో అవి లేనేలేవు. పైగా జవాబు పత్రాల ఫొటో కాపీ కూడా ఎల్ఎల్బీ విద్యార్థిదే ఎల్ఎల్ ఎం విద్యార్థికి ఇవ్వడం గమనార్హం. -
మృత్యు ఘోష.. కదిలిన గుజరాత్ ప్రభుత్వం
అహ్మదాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు తీవ్ర విమర్శలకు దారితీయటంతో ప్రభుత్వం కదిలింది. ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఘటనపై దర్యాప్తునకు నియమించినట్లు గుజరాత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆస్పత్రిగా పేరున్న అహ్మదాబాద్ ప్రభుత్వాసుప్రతిలో వరుసగా పిల్లలు చనిపోతుండటం కలకలమే రేపింది. అశర్వాలోని ఈ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా సుమారు 20 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కేవలం 24 గంటల వ్యవధిలో(శనివారం) 9 మంది చిన్నారులు మృతి చెందటం.. ఆపై మీడియా వరుస కథనాల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మరణాలకు ఆసుపత్రి వైఫల్యం, చికిత్సలో లోపం కారణం కాదని గుజరాత్ ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటించారు. వివిధ రకాల సమస్యలతో వారంతా మరణించారని ఆయన వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్నట్లుగా ఆసుపత్రిలో మందుల కొరత కానీ, పరికరాల కొరత కానీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నియమించిన కమిటీ ఒకటి లేదా రెండు రోజుల్లేనే నివేదిక సమర్పించనుంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యంమంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. -
జయ మరణం: మూడు నెలల్లో కమిటీ నివేదిక
సాక్షి,చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. గత ఏడాది జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలింపునకు దారితీసిన పరిస్థితులు, మరణించేవరకూ అక్కడ ఆమెకు అందించిన చికిత్స వివరాలపై విచారణ కమిషన్ దృష్టిసారిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఏఐఏడీఎంకే గ్రూపుల విలీనం సందర్భంగా మాజీ సీఎం పన్నీర్ సెల్వం జయ మృతిపై విచారణను ప్రధాన డిమాండ్‌గా ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన పళని, పన్నీర్ సెల్వం గ్రూపులు గత నెల 21న ఏకమయ్యాయి. జయలలిత మరణంపై పార్టీ నేతలతో పాటు పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ అమ్మ మరణంపై విచారణ చేపట్టాలని పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరారు. -
జయ మృతిపై విచారణ కమిషన్
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుముగసామి నేతృత్వంలోని విచారణ కమిషన్ జయ మృతిపై విచారణ చేపట్టి నివేదికను సమర్పించ నుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. విషమంగా నటరాజన్ ఆరోగ్యం అక్రమ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత వారం అనారోగ్య సమస్యలతో హెల్త్ సిటీలో నటరాజన్‌ను చేర్పించారు. ఆయనకు కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు. -
విచారణకు హాజరైన బాంజ్ దేవ్
పార్వతీపురం: కుల వివాదం కేసు విచారణలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు మాజీ ఎమ్మెల్యే బాంజ్‌దేవ్ శుక్రవారం విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. బాంజ్ దేవ్ ఎస్టీ అని చెప్పుకుంటూ ఎన్నికల్లో పోటీ చేశారని, ఆయన ఎన్నిక అక్రమమంటూ రాజన్నదొర సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ నిమిత్తం సర్వోన్నత న్యాయస్థానం ఐటీడీఏ పీవో ప్రసన్న వెంకటేశ్ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సభ్యులు శుక్రవారం పార్వతీపురంలోని ఐటీడీఏ పీవో కార్యాలయంలో చేపట్టిన విచారణకు బాంజ్ దేవ్ హాజరై తన వాదనలను వినిపించారు. బాంజ్‌దేవ్ విజ్ఞాపన మేరకు తదుపురి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేశారు. -
వనజాక్షిపై దాడి ఘటనపై విచారణ కమిటీ
హైదరాబాద్: ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు తెలిపారు. ఓ మహిళా అధికారిపై దాడి జరగటం దురదృష్టకరమని చంద్రబాబు అన్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులపై దాడి చేస్తే ఎలా పని చేస్తామని ముఖ్యమంత్రిని అడిగామని బొప్పరాజు తెలిపారు. ఎమ్మెల్యే దాడి చేసిన వివరాలను చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. కాగా సీఎం హామీతో రెవెన్యూ ఉద్యోగులు సమ్మె విరమించారు. కాగా దాడి ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎమ్మార్వో వనజాక్షి డిమాండ్ చేశారు. విచారణ కమిటీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.