Capitol Hill Attack: More Evidence Emerge Against Donald Trump - Sakshi
Sakshi News home page

Donald Trump: ట్రంప్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అదే జరిగితే అధ్యక్ష పోటీ ఆశలు గల్లంతు

Jul 4 2022 8:33 PM | Updated on Jul 4 2022 9:01 PM

Capitol Hill Attack: More Evidence Emerge Against Donald Trump - Sakshi

రాబోయే అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచే సిద్ధం కావాలని భావిస్తున్న ట్రంప్‌కు..

వాష్టింగ్టన్‌: వచ్చే అధ్యక్ష(2024) ఎన్నికల కోసం ముందు నుంచే ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. క్యాపిటల్‌ హిల్‌ దాడి వ్యవహారంలో ట్రంప్‌ చుట్టు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఆగ్రహంతో ఉన్న గుంపుతో తాను కూడా చేరాలని ట్రంప్‌  భావించారని, ఈ మేరకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తాజాగా ఆ దాడిపై విచారణ చేపట్టిన కమిటీ నిర్ధారించింది. 

ఈ మేరకు మరింత అప్‌డేట్‌ కోసం ఎదురు చూడండంటూ విచారణ కమిటీ సభ్యుడు ఆడమ్‌ కింజింగర్‌ తెలిపారు. 2021, జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై దాడికి యత్నం జరగ్గా..  దాడికి కారణమైన ఆగ్రహ జ్వాలలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగదోశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ సభ్యురాలు లిజ్‌ ఛెనీ ఈ మేరకు ఆ ఆరోపణలను ధృవీకరించారు కూడా. అంతేకాదు వాళ్లను నిలువరించే పరిస్థితి ఉన్నా.. ట్రంప్‌ ఆ పని చేయలేదన్నది ఆమె ఆరోపణ. ఇప్పటికే ఆయన హయాంలో పని చేసిన అధికారులతో సహా ఎంతో మంది ఆయనకు వ్యతిరేక సాక్ష్యం చెప్పారు.

ఈ నెలలో ఈ వ్యవహారంపై మరో రెండు వాదనలు జరగనున్నాయి. తద్వారా ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలతో ట్రంప్‌ పాత్రను బలంగా చూపించి.. ఆయనకు పక్కాగా దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయబోతోంది కమిటీ. అంతేకాదు అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌లో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు గడిపిన చివరి రోజులను సైతం పరిశీలించనుంది. కీలకమైన డాక్యుమెంట్లను ఆయన నాశనం చేశారన్న ఆరోపణల మేరకే ఈ పని చేయబోతోంది. 

ఇదిలా ఉంటే.. ఈ విచారణ మొత్తం రాజకీయ బూటకమని ట్రంప్‌ కొట్టిపారేస్తున్నారు. మరోవైపు 2024లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా.. 2020 ఓటమితో సంబంధం లేకుండా బరిలోకి దిగుతానని ట్రంప్‌ చెప్తున్నారు. ఒకవేళ క్యాపిటల్‌ భవనం దాడి విషయంలో ఏదైనా ప్రతికూల తీర్పు వస్తే మాత్రం.. పోటీకి ఆయన అర్హత కోల్పోవడం మాత్రమే కాదు.. రాజద్రోహం కింద శిక్ష పడినా పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement