విచారణకు హాజరైన బాంజ్ దేవ్
Published Fri, Jul 15 2016 3:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM
పార్వతీపురం: కుల వివాదం కేసు విచారణలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు మాజీ ఎమ్మెల్యే బాంజ్‌దేవ్ శుక్రవారం విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. బాంజ్ దేవ్ ఎస్టీ అని చెప్పుకుంటూ ఎన్నికల్లో పోటీ చేశారని, ఆయన ఎన్నిక అక్రమమంటూ రాజన్నదొర సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ నిమిత్తం సర్వోన్నత న్యాయస్థానం ఐటీడీఏ పీవో ప్రసన్న వెంకటేశ్ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సభ్యులు శుక్రవారం పార్వతీపురంలోని ఐటీడీఏ పీవో కార్యాలయంలో చేపట్టిన విచారణకు బాంజ్ దేవ్ హాజరై తన వాదనలను వినిపించారు. బాంజ్‌దేవ్ విజ్ఞాపన మేరకు తదుపురి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేశారు.
Advertisement
Advertisement