సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వ విద్యాలయంలో న్యాయ విద్య (ఎల్ ఎల్‌ఎం) మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇలా అయితే ఎ లా?’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురి తమైన కథనంపై ఆయన స్పందించారు. విచారణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు. పొరపాటుకు బాధ్యులైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసు పంపించినట్లు వెల్లడించారు. అలాగే ఒక అభ్యర్థికి సంబంధించిన జవాబు పత్రా లను మరో అభ్యర్థికి సంబంధించిన చిరు నామా కలిగిన కవర్‌లో పెట్టి పంపిం చారని (ఫొటో కాపీ కోసం రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే) పేర్కొ న్నారు. మూల్యాంకనం సమయంలో జవాబుపత్రంపై జవాబుల పక్కన మార్కులు వేయమని వెల్లడించారు.
వీటిపై స్పష్టత ఏదీ?
అయితే, సదరు పేపరుకు సంబంధించిన మార్కుల స్లిప్‌లో మాత్రం మార్కులను కచ్చితంగా వేయాల్సి ఉన్నప్పటికీ మా ర్కులను వేయలేదు. ఎల్‌ఎల్‌ఎం సెకండ్ సెమిస్టర్ నాలుగో పేపరుకు సంబంధిం చి అభ్యర్థికి ఇచ్చిన ఫొటో కాపీలో మా ర్కులనే వేయకుండా ఇచ్చారు. ఫలితాల్లో మాత్రం అతనికి 23 మార్కులు వచ్చిన ట్లు ఇచ్చారు. కానీ మార్కుల స్లిప్‌లో ఎక్కడా వాటిని చూపించలేదు. పైగా ఎల్‌ఎల్‌ఎం థర్డ్ సెమిస్టర్ ఐదో పేపరుకు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థికి ఎల్ ఎల్‌బీ థర్డ్ సెమిస్టర్ మార్కుల స్లిప్‌ను ఇచ్చారు. అందులో 33 మార్కులు వచ్చి నట్లు చూపించారు. కానీ ఫలితాల్లో అవి లేనేలేవు. పైగా జవాబు పత్రాల ఫొటో కాపీ కూడా ఎల్‌ఎల్‌బీ విద్యార్థిదే ఎల్‌ఎల్ ఎం విద్యార్థికి ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment