
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుముగసామి నేతృత్వంలోని విచారణ కమిషన్ జయ మృతిపై విచారణ చేపట్టి నివేదికను సమర్పించ నుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
విషమంగా నటరాజన్ ఆరోగ్యం
అక్రమ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత వారం అనారోగ్య సమస్యలతో హెల్త్ సిటీలో నటరాజన్‌ను చేర్పించారు. ఆయనకు కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు.