వారణాసి ఫ్లైఓవర్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం | UP Government Appointed A Enquiry Committee On Varanasi Flyover Collapse | Sakshi
Sakshi News home page

వారణాసి ఫ్లైఓవర్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Published Wed, May 16 2018 8:31 AM | Last Updated on Tue, Oct 2 2018 8:13 PM

UP Government Appointed A Enquiry Committee On Varanasi Flyover Collapse - Sakshi

వారణాసి : వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో యూపీ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది.

ప్రమాద కారణాలను విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఓ కమిటీని నియమించింది. బుధవారం ఉదయం కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కమిటీలో సభ్యునిగా ఉన్న రాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. విచారణ పూర్తి కానిదే ఏ విషయం చెప్పలేమని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరపకుండా ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. కాగా ఘటన స్థలంలోని శిథిలాల తొలగింపు పక్రియ పూర్తికావచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement