
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చింతమనేని ప్రభాకర్ అనే పిచ్చికుక్కను విప్‌గా పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై తీవ్ర వ్యాఖ్యాలు చేసిన చింతమనేని నాలుక చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దళితుల మనోభావాలు దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వ్యాఖ్యలపై మాలలు, మాదిగలు అందరూ ఆలోచించాలని సూచించారు.
చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు కులం పేరుతో దూషిస్తున్నారని, దళిత సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. పధకం ప్రకారం జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, చింతమనేని ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితులని అవమానించారని, వారిని దళితులు చీపుర్లతో కొట్టే రోజు త్వరలోనే ఉందన్నారు. దళితులు అందరూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment