అధికారపార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. పాత బస్టాండ్ వద్ద చలానా రాస్తున్న ఏలూరు ట్రాఫిక్ పోలీసులపై చిందులు వేశారు. చలాన్లు ఎందుకు రాస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చలాన్లు చెల్లించడానికి వచ్చిన ప్రజలను చింతమనేని అక్కడి నుంచి పంపించారు.