
ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ(పాత చిత్రం)
హనుమాన్ జంక్షన్ : టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కి దమ్ము ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సవాల్ విసిరారు. బుధవారం ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పోస్టర్‌ను సుంకర పద్మశ్రీ చించేశారు. అనంతరం 11 గంటలకు హనుమాన్ జంక్షన్‌కి వచ్చి దాడి చేయాలని సవాల్ చేశారు. సవాల్ విసిరినా పిరికిపందలా చింతమనేని రాలేదని దుమ్మెత్తిపోశారు.
చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని మండిపడ్డారు. అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అధికార మదంతో టీడీపీ నాయకులు పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.దాడి చేసిన చింతమనేని వదిలి పెట్టి పోలీసులు సామాన్య ప్రజలపై కేసులు నమోదు చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment