Hanuman Junction
-
స్థల వివాదంలో తన్నుకున్న జన సైనికులు
సాక్షి, కృష్ణా జిల్లా: హనుమాన్ జంక్షన్లో జన సైనికులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దుపై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. స్థల వివాదం సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. కొట్టుకునేందుకు సమయం చెప్పి ఇరువర్గాలు ఘర్షణకు సిద్ధమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. ఒక వర్గానికి నాయకత్వం వహించారు. ఆయన వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. -
టీడీపీ మహిళా రాష్ట్రప్రధాన కార్యదర్శి ముల్పూరి కళ్యాణి అరెస్ట్
-
పేకాడుతూ పట్టుబడిన తెలుగు తమ్ముళ్లు !
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): ఓ పేకాట శిబిరంపై పోలీసులు చేసిన మెరుపుదాడిలో తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ బాపులపాడు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ సమీపంలోని పామాయిల్ తోటల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మికంగా దాడి చేశారు. దీంతో టీడీపీ నాయకులు, నిర్వాహకులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుతో పాటు గా మేడికొండ రామకృష్ణ, కనకమేడల సుదర్శనరావు, తోట శ్రీరామ్, పత్రివట కృష్ణమోహన్ (గుడివాడ), యల మంచిలి వెంకటేశ్వరరావు, అల్లాడిశెట్టి రాఘవరావు, కనకమేడల వెం కటేశ్వరరావు, యలమంచిలి రవీంద్రకుమార్ పట్టుబడ్డారు. వారి వద్ద రూ.10,500 స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నగదు బదులుగా కాయిన్లతో పేకాట నిర్వహిస్తుండడంతో ఘటనాస్థలంలో దొరికిన కాయిన్ల ఆధారంగా రూ.లక్షల్లోనే పందేలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాయిన్లను స్వాధీనం చేసుకుని ఆ దిశగా విచారణ చేపట్టారు. పోలీసుల వైఖరిపై అనుమానాలు.. టీడీపీ గన్నవరం ఇన్చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రధాన అనుచరులైన అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు పట్టుబడటంతో పోలీసులపై కేసు మాఫీ చేసేందుకు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. పేకాట శిబిరంపై దాడి చేసి టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న తర్వాత వివరాలు బహిర్గతం చేయకుండా పోలీసులు తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పేకాట శిబిరం వద్ద పెద్ద మొత్తంలో డబ్బు దొరికినప్పటికీ కేవలం రూ.10 వేలు మాత్రమే కేసులో చూపించారనే ఆరోపణలు పోలీసులపై వస్తున్నాయి క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు! హనుమాన్‌జంక్షన్ సమీపంలో పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుకు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు జంక్షన్ ప్రాంతం నుంచి పలువురిని గోవా, నేపాల్, బ్యాంకాక్, హాంకాంగ్‌కు జూదం ఆడించేందుకు వీళ్లు పలువురిని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. -
930 మద్యం సీసాలు స్వాధీనం
హనుమాన్ జంక్షన్ రూరల్: ప్రభుత్వ వైన్ షాపు ఉద్యోగి అక్రమార్కులతో చేతులు కలిపి భారీ మొత్తంలో మద్యం సీసాలు తరలిస్తుండగా హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు చెప్పారు. స్థానిక గుడివాడ రోడ్డులోని వేగిరెడ్డి థియేటర్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్‌షాపు నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను కారులో తరలిస్తున్నట్లుగా సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలిలో సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గుడివాడ నుంచి నూజివీడు వైపు వెళ్తున్న మారుతీ కారులో రూ.1,39,500 విలువ చేసే 930 మద్యం బాటిళ్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించటంతో సరైన సమాచారం చెప్పకుండా వారు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైన్‌షాపులో సూపర్వైజర్గా పనిచేస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడు గ్రామానికి చెందిన మద్దాల రమేష్ కొంతకాలంగా హనుమాన్జంక్షన్కు చెందిన మొవ్వ ప్రసాద్‌తో చేతులు కలిపి అడ్డదారిలో మద్యం సీసాలు తరలిస్తున్నట్లు నిర్థారించారు. వీరి నుంచి 930 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటంతో పాటుగా నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం నూజివీడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి, సహకరించిన కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు అందించేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. -
లారీ కింద పడి వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
-
ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, కృష్ణా జిల్లా: హనుమాన్ జంక్షన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న లారీ కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడిని ప్రముఖ వస్త్ర వ్యాపారి రమేష్‌గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: పెద్దపల్లి హత్యలు: సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్ -
ఊరు ఉంది.. పేరు లేదు
పెదపాడు: పట్టణ స్థాయికి ఎదిగిన హనుమాన్‌జంక్షన్ అంటే అందరికీ తెలుసు. కానీ ఆ పేరు ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా లేదు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా కల్లూరు టు మచిలీపట్నం రహదారి ఉంది. ఈ రహదారి లోని జంక్షన్లో పెదపాడు మండంలోని అప్పన వీడు, ఏపూరు.. కృష్ణా జిల్లా బాపులపాడును కలుపుకుని హనుమాన్ జంక్షన్‌గా పిలుస్తారు. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఈ జంక్షన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. మూడు మేజరు గ్రామ పంచాయతీల కలయిక అని మాత్రం ఎక్కువమందికి తెలియదు. (చదవండి: సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు) అంతర్మథనం: గోడ మీద టీడీపీ తమ్ముళ్లు..! -
నకిలీ ఐఏఎస్ అరెస్ట్
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): నకిలీ ఐఏఎస్ అధికారి అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న పెద్దాడ విజయలక్ష్మి అనే ఓ కిలాడీ లేడి కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్‌నంటూ వసూళ్లు చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం విలేకరులకు వెల్లడించారు. రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావుగా నమ్మించి... గుంటూరు జిల్లా మంగళగిరిలోని మన్యం వారి వీధికి చెందిన పెద్దాడ విజయలక్ష్మి... పద్మభూషణ్ కేఎల్ రావు కుమార్తె, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.సుజాతరావు పేరుతో పలువురిని నమ్మించి కేఎల్ రావు విగ్రహ ఏర్పాటు పేరుతో వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఎలా చిక్కిందంటే.. హనుమాన్‌జంక్షన్‌లోని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావుకు చెందిన సీతామహాలక్ష్మి నర్సింగ్ హోంకు ఈ నెల 8వ తేదీన ఓ కారులో వచ్చిన విజయలక్ష్మి తాను ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ సుజాతరావునని, తాను తిరుపతి వెళుతున్నానని, పూజల కోసం రూ.3,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానించిన రామచంద్రరావు తనయుడు రవిశంకర్ నేరుగా కె.సుజాతరావుకు ఫోన్ చేయగా, తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ఆమె చెప్పారు. నకిలీ అధికారి ఫోటోలు తీసేందుకు యత్నించటంతో వెంటనే పరారయ్యారు. ఆ తర్వాత ఎస్పీ రవీంద్రబాబుకు కె.సుజాతరావు ఫోన్ చేసి నకిలీ అధికారిని పట్టుకోవాలని కోరారు. రవిశంకర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి ఆమెను విజయవాడలో పట్టుకున్నారు. టీడీపీతో కిలాడీ లేడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో దిగిన ఫోటో ఆమె వద్ద పోలీసులకు లభించింది. -
‘బాబు బుద్ది మారాలని ప్రార్థిస్తున్నా..!’
సాక్షి, పశ్చిమగోదావరి : ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం అద్భుతంగా సాగిందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రసంగం ఉందని చెప్పారు. ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలో, ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తామో ప్రసంగంలో ప్రస్ఫుటమైందన్నారు. నిజాయితీ, విశ్వసనీయతకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ విధాలున్నాయన్నారు. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని, రాట్నామ్మ అమ్మవారిని మంత్రి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనతోపాటు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పర్యాటకంగానూ అభివృద్ది చేస్తాం. చంద్రబాబు తీరు ఇప్పటికీ మారలేదు. ఆయన బుద్ది మారాలని ప్రార్ధిస్తున్నా. గత ఐదేళ్లలో పర్యాటకం అభివృద్ది చెందలేదు. తీర ప్రాంతాన్ని, ద్వారకా తిరుమల క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తాం. ఆద్యాత్మిక పర్యాటకాన్ని కూడా అభివృద్ది చేస్తాం. ఇతర రాష్ట్రాలమాదిరిగా విజయవాడ, విశాఖ, తిరుపతిలో విదేశీ పర్యాటకుల కోసం వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తాం. కొల్లేరుకు విదేశీ యాత్రీకులు వచ్చేలా తగు సౌకర్యాలు కల్పిస్తాం’ అన్నారు. -
చక్కెర..ఓ చేదు నిజం
సాక్షి,గన్నవరం : జిల్లా వాసులకు హనుమాన్‌జంక్షన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మొదట ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం కాగా రెండవది అంతే పేరున్న షుగర్ ఫ్యాక్టరీ. నిజంగా ఈ ప్రాంత ప్రజలకు చక్కెర కార్మాగారంతో అంత అవినాభవ సంబంధం ఉంది. జంక్షన్ పరిసరాల ప్రాంతాల్లో వేలాది మంది చెరకు రైతులు, కూలీలు, వందలాది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్నారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీకి 2017 అక్టోబర్‌లో లాకౌట్ ప్రకటించడం జంక్షన్ వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఫ్యాక్టరీపై ఆధారపడిన దాదాపు 10 వేల మంది చెరకు రైతులు, 400 మందికిపైగా కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హనుమాన్జంక్షన్కు ఓ తలమానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కనుమగురు కానుందనే చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన షుగర్ ఫ్యాక్టరీ ప్రస్థానం.. హనుమాన్ జంక్షన్, నూజివీడు, గన్నవరం ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో గతంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన చిన్న, చిన్న ఖండసారి చక్కెర మిల్లులు ఆరేడు ఉండేవి. క్రమేణా చెరకు సాగు విస్తీర్ణం పెరగటంతో వీటి సామర్థ్యం సరిపోకపోవటంతో 1977లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి బీజం పడింది. అప్పటి నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్ అప్పారావు సారధ్యంలో ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విశేష కృషి చేశారు. చంద్రబాబు పాలనలోనే ప్రైవేట్‌పరం.. షుగర్స్ ఫ్యాక్టరీలో 1982–83 సీజన్లో ప్రారంభమైన చెరకు క్రషింగ్ 17 ఏళ్లు పాటు సహకార రంగంలో కొనసాగింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీ నష్టాలను సాకుగా చూపి వేలం ద్వారా హనుమాన్ కోఆపరేటివ్ షుగర్స్‌ను లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గోకరాజు గంగరాజుకు రూ.11.40 కోట్లకు విక్రయించేశారు. అప్పట్లో సుమారు రూ. 300 కోట్లు విలువ చేసే సహకార రంగంలోని ఫ్యాక్టరీని, 90 ఎకరాల విలువైన భూమిని కారుచౌకగా తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించటం రైతుల ఆగ్రహానికి కారణమైంది. కనీసం సహకార చెక్కర కార్మాగారంలో రైతుల 49 శాతం షేర్ వాటాను కూడా ఆనాటి సీఎం చంద్రబాబు చెల్లించకుండా మొండిచేయి చూపించారు. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సారధ్యంలో ‘డెల్టా షుగర్స్’గా రూపాంతరం చెంది 2001–02 సీజన్లో రోజుకు 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైంది. 2015–16 నాటికి ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం 3500 టన్నులు కాగా, లక్షన్నర టన్నుల చెరకును క్రషింగ్ చేసి చక్కెర ఉత్పిత్తి చేశారు. ఫ్యాక్టరీ మూసివేత వ్యూహాత్మకమేనా? మూడేళ్లుగా డెల్టా షుగర్స్ యాజమాన్య వైఖరి పరిశీలిస్తే వ్యూహాత్మకంగానే మూసివేతకు ప్రణాళికతో ఉన్నారనిపిస్తోంది. చెరకు సాగు విస్తీర్ణంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవటం, రైతులకు సకాలంలో చెరకు తోలిన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయటం వంటి ఆంశాలు యాజమాన్యం తీరుపై పలు అనుమానాలను రేకేత్తించాయి. జాతీయ రహదారికి ఆనుకుని 100 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ ఉండటంతో ఇతరత్రా వ్యాపార అవసరాలకు స్థలం వినియోగించుకునే దురుద్దేశంతోనే లాకౌట్ దిశగా అడుగులు వేశారని ప్రచారం. విలువైన స్థలంపై యాజమాన్యం దృష్టి పెట్టడంతోనే క్రమంగా ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్తత
-
బ్యూటీషియన్‌పై దాడి కేసు; నిందితుడి ఆత్మహత్య
-
బ్యూటీషియన్‌పై దాడి కేసు; నిందితుడి ఆత్మహత్య
విజయవాడ: బ్యూటీషియన్ పిల్లి పద్మ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యూటీషియన్‌పై దాడి చేసిన తర్వాత పరారైన నూతన్ కుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు-నరసరావు పేట మధ్య రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం నూతన్ మృతదేహం లభించింది. బ్యూటీషియన్‌పై దాడి అనంతరం నూతన్ కుమార్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. నూతన్ కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ఆరంభించిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మత్తు ఇంజక్షన్ ఇవ్వటం వల్లే.. చేతులు నరికి.. మెడపై కోసి అమానుషం.. -
చేతులు నరికి.. మెడపై కోసి
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఓ వివాహితపై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. ఒంటిపై దుస్తులు తొలగించి.. కాళ్లు కట్టేసి, చేతులు నరికి, మెడపై కోసి పాశవికంగా హింసించారు. తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉన్న ఆమెను భర్త గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సూర్యనారాయణతో విభేదించి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్ విక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ స్థానిక తారకరామ కాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. రెండు రోజుల కిందట పద్మ, నూతన్‌కుమార్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ తర్వాత పద్మ ఫోన్ స్విచాఫ్ రావటంతో అనుమానం వచ్చిన ఆమె కుమార్తె.. తండ్రి సూర్యనారాయణకు ఈ విషయం చెప్పింది. దీంతో శనివారం ఉదయం సూర్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లాడు. బయట నుంచి పిలవగా ఎవరూ పలకపోవడం, తలుపులు తీసి ఉండటంతో ఇంటి లోపలికి వెళ్లిన సూర్యనారాయణ అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. కాళ్లు కట్టేసి, రెండు చేతులు తెగిపోయి, ఒంటిపై బట్టలు లేకుండా పద్మ పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే హనుమాన్ జంక్షన్ పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మను 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో ప్రియుడు నూతన్‌కుమార్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
దళితులపై తెలుగుదేశం దౌర్జన్యం
హనుమాన్‌జంక్షన్ రూరల్ : దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యకాండపై కేసు నమోదు చేయకపోగా.. బాధితులైన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. ఈ ఘటనకు నిరసనగా కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది కార్యకర్తలు బుధవారం ఉదయం 11 గంటలకు పోలీస్‌స్టేషన్ ఎదుట చేపట్టిన ధర్నా ఏకధాటిగా రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఈ నెల 24న బాపులపాడు మండలం కె.సీతారామపురంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారు. రచ్చబండ ముగించుకుని తిరిగి వెళ్లుతున్న యార్లగడ్డ వెంకట్రావు వాహానాన్ని అడ్డగించి ఘర్షణకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం కాశీ విశ్వనాథ్ తల పగలుకొట్టడమే కాకుండా ఎస్సీలను కులం పేరుతో దుర్భషలాడారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీకి చెందిన దళితులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంశీమోహన్, తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు, మరికొందరు టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినప్పటికీ హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేయ్యలేదు. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఈ ఘర్షణతో సంబంధం లేని ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను మంగళవారం అర్ధరాత్రి సమయంలో పెనమలూరు, గన్నవరం పోలీసులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటంతో వివాదం మరింత ముదిరింది. కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని, దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులు, ప్రోత్సహించిన ఎమ్మెల్యే వంశీమోహాన్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలపై కేసు నమోదు చేయబోమని హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఎస్ఐ వి.సతీష్‌లు ఖరాఖండిగా చెప్పడంతో వివాదం ముదిరింది. పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారటం దారుణం: పార్థసారధి, కారుమూరి అధికార టీడీపీకి పోలీసులు పూర్తిగా తొత్తులుగా మారిపోయారని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన అందోళనకు వారు మద్దతు పలికారు. బాధ్యతయుతమైన హోదాలో ఉన్న సీఐ వైవిఎల్ నాయుడు నిజాయతీగా వ్యవహారించకుండా, టీడీపీ నేతలకు భయపడి పోలీసు వ్యవస్థ పరువును తీస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇది దళితులను, దళిత చట్టాలను అగౌరవపర్చమేనని మండిపడ్డారు. చివరకు దాడులకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసు నమోదుకు హామీ ఇవ్వడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. ధర్నాలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీ సభ్యులు మంగళఈ కమిటీ డీజీపీకి అర్హత గల వారి జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.పాటి కమలకుమారి, బేతాళ ప్రమీలారాణి పాల్గొన్నారు. -
చింతమనేని బాధితుడికి ఆళ్లనాని పరామర్శ
సాక్షి, ఏలూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన గరికపాటి నాగేశ్వరరావును గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షడు కోటగిరి శ్రీధర్‌లతో కలిసి పరామర్శించారు. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో ఉన్న నాగేశ్వరావును కలిసిన ఆళ్లనాని ఆ రోజు జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. చింతమనేని వ్యవహారాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధితులకు అండగా ఉండాలని ఆయన ఆదేశించారని తెలిపారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. నాగేశ్వరరావుతో పాటు మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులు తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని, విప్ పదవితో పాటు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. నాగేశ్వరరావును పరామర్శించిన వారిలో కొఠారు రామచంద్ర రావు, అప్పన ప్రసాద్, కమ్మ శివరామకృష్ణ తదితరులు ఉన్నారు. -
చింతమనేని దమ్ముంటే నాపై దాడిచెయ్..!
హనుమాన్ జంక్షన్ : టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కి దమ్ము ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సవాల్ విసిరారు. బుధవారం ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పోస్టర్‌ను సుంకర పద్మశ్రీ చించేశారు. అనంతరం 11 గంటలకు హనుమాన్ జంక్షన్‌కి వచ్చి దాడి చేయాలని సవాల్ చేశారు. సవాల్ విసిరినా పిరికిపందలా చింతమనేని రాలేదని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని మండిపడ్డారు. అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అధికార మదంతో టీడీపీ నాయకులు పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.దాడి చేసిన చింతమనేని వదిలి పెట్టి పోలీసులు సామాన్య ప్రజలపై కేసులు నమోదు చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు. -
సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా..!
సాక్షి, హనుమాన్‌జంక్షన్ (గన్నవరం): జైలు శిక్షపడినా కూడా టీడీపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరు ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బస్సుపై ఉన్న చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ డ్రైవర్, కండక్టర్లను నడిరోడ్డుపైనే దుర్భాషలాడుతూ చిందులు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాలు.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది. అయితే ఆ బస్సుపై అతికించిన ప్రభుత్వ ప్రచార పోస్టర్‌లోని సీఎం ఫొటో కాస్త చిరిగి ఉండటంతో చింతమనేని వెంటనే తన మనుషులను పంపించి బస్సును అడ్డగించారు. డ్రైవర్ వడ్డి శేఖర్, కండక్టర్ తోట వాసుబాబును కిందకు దించి.. వారిపై చింతమనేని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా.. అంటూ తిట్లపురాణం అందుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు(చంటి) ప్రభుత్వ ఉద్యోగులతో ఇదేం వైఖరి అంటూ చింతమనేనిని ప్రశ్నించాడు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయి.. నాగేశ్వరరావుపై ఏడాపెడా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ప్రధాన కూడలికి చేరుకొని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. చింతమనేనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి కాపు సంఘం, వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వి.సతీశ్ ఘటనాస్థలికి చేరుకుని సర్ది చెప్పడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఎన్ని ఆగడాలో.. సాక్షి, అమరావతి: బండ బూతులు తిట్టడం.. దాడి చేసి కొట్టడం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి పరిపాటిగా మారింది. సామన్యుడి నుంచి ప్రభుత్వ అధికారుల వరకు ఆయన వాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హనుమాన్ జంక్షన్లో మంగళవారం ఆర్టీసీ సిబ్బందిని నడిరోడ్డుపై దుర్బాషలాడి.. స్థానికులపై దాడికి తెగబడిన చింతమనేని తీరు మరోమారు ప్రజాగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వట్టి వసంత్‌కుమార్‌పై బహిరంగ సభలో ప్రజల సమక్షంలోనే దాడి చేసిన ఘటన ఆయన దుందుడుకు చర్యలకు పరాకాష్ట అని అప్పట్లో ప్రజలు దుమ్మెత్తిపోశారు. అదే కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో చింతమనేనికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకొచ్చారు. ఇక తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని చేసిన దౌర్జన్యకాండ గురించి అందరికీ తెలిసిందే. ఆ వ్యవహారంలో వనజాక్షినే తప్పుబట్టి సీఎం చింతమనేనినే కాపాడుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన చింతమనేని ఏలూరులో అంగన్వాడీ మహిళలను దుర్భాషలాడి కొట్టినంత పనిచేశారు. కొల్లేరు ప్రాంతంలో నిబంధనలకు విరుద్దంగా వేస్తున్న రోడ్డును అడ్డుకున్న ఫారెస్టు అధికారిని కొట్టారు. చింతమనేని విషయంలో చంద్రబాబు తీరు వల్ల పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ కార్యకర్తలే బాహాటంగా చెబుతున్నారు. -
కృష్ణాజిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
తప్పిన పెను ప్రమాదం
హనుమాన్‌జంక్షన్: కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీ కృష్ణా ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆటో, కిరాణా దుకాణం మీదకు వెళ్లడంతో ఆటో ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హనుమాన్ సాక్షిగా.. టీడీపీలో లుకలుకల రట్టు
దేవస్థాన చైర్మన్‌గా రామారావు ప్రమాణం ముఖం చాటేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తూతూమంత్రంగా కార్యక్రమం=స్థానిక విభేదాలే కారణం! హనుమాన్‌జంక్షన్ రూరల్: హనుమాన్ జంక్షన్‌లోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బట్టబయలు అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడుకు చెందిన టీడీపీ నేత పావులూరి రామారావును పాలకమండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించగా, సోమవారం ప్రమాణ స్వీకారోత్సవానికి భారీఖర్చుతో ఏర్పాట్లు చేశారు. రామారావు వర్గీయులు పట్టణ ప్రధాన రహదారుల్లో పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు కట్టి హడావుడి చేశారు. రామారావుకు మద్దతుగా దెందులూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వస్తున్నారని జోరుగా ప్రచారం చేశారు. హాజరైన కొనకళ్ల, వల్లభనేని ఇక కృష్ణాజిల్లా కోటాలో బాపులపాడుకు చెందిన మేడేపూడి రామ్మోహనరావుకు దేవస్థానం డెరైక్టర్ పదవి రావటంతో ఆయనకు అభినందనలు తెలిపేందుకు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వచ్చారు. బాపులపాడు టీడీపీ కార్యలయం నుంచి ఆలయానికి ర్యాలీగా వెళ్లి ఆలయ నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. అయితే విప్ చింతమనేని రాలేదు. దీంతో వేదికపై జరగాల్సిన బహిరంగ ప్రమాణ స్వీకారం లేకుండానే కార్యక్రమాన్ని మమ అనిపించారు. అప్పనవీడు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాల వల్లే చింతమనేని ముఖం చాటేశారని, రామారావుకు పదవినివ్వడం ఆయనకు ఇష్టం లేదని ప్రచారం. ఎమ్మెల్యే గైర్హాజరుతో పావులూరి రామారావు వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. వైభవంగా జరుగుతుందనుకున్న కార్యక్రమం కాస్తా వర్గ రాజకీయాలతో చిన్నబోయింది. దసరా రద్దీపై ఆర్టీసీ ఆర్ఎం సమీక్ష విజయవాడ (బస్‌స్టేషన్): దసరా రద్దీలో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కృష్ణా రీజనల్ మేనేజర్ పీవీ రామారావు సిబ్బందికి సూచించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆయన సోమవారం పర్యటించారు. దసరా సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 11, 12 తేదీల్లో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. 11వ తేదీన 102 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయనతోపాటు సీటీఏం శ్రీరాములు, జాన్‌సుకుమార్, ఏటీఏం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
హనుమాన్‌జంక్షన్ రూరల్ : బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్లే వ్యక్తులను నమ్మించి వారి వద్ద ఉన్న డబ్బులు అపహరించే ముఠా సభ్యులు నలుగురిని హనుమాన్‌జంక్షన్lపోలీసులు బుధవారం అరెస్టుచేశారు. ఎస్ఐ తులసీధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపులపాడు మండలం కోడూరుపాడుకు చెందిన ఇరదల వెంకటరత్నం గత నెల 17న విజయవాడ రోడ్డులోని కేడీసీసీ బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళుతుండగా ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ‘బైక్ పడిపోతుంది.. పట్టుకోండి’ అని కోరాడు. అతను బైక్‌ను పట్టుకుంటుండగానే ఆయన జేబులోని రూ. 50 వేలను అపహరించి పరారయ్యాడు. ఈ ఘటనపై నమోదైన కేసును ఎస్ఐ తులసీధర్ దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన నక్కా రాజేష్, నక్కా రాజు, ఆకివీడుకు చెందిన మేకల ఏసు, నక్కా విగ్నేష్‌లు ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న వయస్సులోనే వ్యసనాలు, ఈజీ మనీకి అలవాటు పడిన ఈ యువకులు బైక్‌పై వెళుతూ బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడుతుంటారు. వీరిపై బంటుమిల్లి పోలీస్‌స్టేçÙన్‌లోనూ కేసు ఉంది. -
హనుమాన్ జంక్షన్లో భారీ చోరీ
* రూ. 16 లక్షల సొత్తు అపహరణ * హనుమాన్‌జంక్షన్ రూరల్ తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు చాకచాక్యంగా చొరబడి రూ. 16 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన సంఘటన గురువారం హనుమాన్ జంక్షన్లో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. స్థానిక గుడివాడ రోడ్డులో నివాసం ఉంటున్న కామినేని ఉషా వసుంధరాదేవి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులూ విదేశాల్లో స్ధిరపడటంతో ఇక్కడ నివసిస్తోంది. గురువారం ఉదయం బంధువుల ఇంట్లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వసుంధరాదేవి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన మహిళ ఇంట్లో సామన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. కిటీకీలు ధ్వంసమై, బీరువాలు పగులగొట్టినట్లు గుర్తించి తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లి చూసి ఇంట్లో భద్రపర్చిన 40 కాసుల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఎస్.ఐ బి.తులసీధర్, ఏఎస్ఐలు బాలాజీ, వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వచ్చి సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు చోరీకి ఉపయోగించిన పలుగులు ఇంట్లోనే వదిలిపెట్టి ఉడాయించటంతో వాటిపై వేలిముద్రలు ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పక్కా ప్రణాళికతో చోరీ... ఇంటి ప్రధాన ద్వారానికి ప్రక్కనే ఉన్న కిటికీ తలుపులను తొలగించి దుండగులు లోపలికి వెళ్లినట్లు ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. తొలగించిన కిటికీ ఇనుప చువ్వను బయట ఉంచితే .. ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించిన దుండగులు దాన్ని ఇంటి పక్కన సందులో భద్రపరిచారు. పోలీసులు కేసును ఛేదించాల్సిఉంది. -
వాహనాల దొంగ అరెస్ట్
వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీసులు ఓ వాహనాల దొంగను అరెస్ట్ చేశారు. జిల్లాలోని గుర్రప్పాడుకు చెందిన పల్లకొండ దేవేందర్ వరంగల్‌కు వస్తుండగా మంగళవారం ఉదయం ములుగు క్రాస్‌రోడ్డులో హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగతనం చేసిన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
హనుమాన్ జంక్షన్లో పోలీసుల తనిఖీలు
హనుమాన్‌జంక్షన్: కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో శనివారం ఉదయం స్థానిక పోలీసులు కార్డాన్‌సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఇల్లిల్లూ సోదా చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయటంతోపాటు పది మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం వారిని స్టేషన్‌కు తరలించారు. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మహిళ మృతి
నల్గొండ : ప్రమాదవశాత్తూ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన రమాదేవిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
27 నుంచి చతురాయతన మహాసౌరయాగం
దేశంలోనే మొదటిసారి వరంగల్: వరంగల్ ములుగు రోడ్ హనుమాన్ జంక్షన్ సమీపంలోని శ్రీ రమాసత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు చతురాయతన మహాసౌరయాగం నిర్వహించనున్నట్లు పండితుడు జాగర్లపూడి వీరభద్రశర్మ తెలిపారు. ఈ మేరకు ఆలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా మహాసౌరయాగం నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 మంది బ్రాహ్మణులతో త్రిచ, సౌర, అరుణ కేతుక సహిత సూర్య నమస్కారాలు చేస్తారని వివరించారు. చివరి రోజు పూర్ణాహూతి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన యూగానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
గుండె నిండా ఆశ..దారిలో ఆగిన శ్వాస
ప్రత్తిపాడు : కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ మండలం వీరపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ప్రత్తిపాడు మండలంలో వేర్వేరు గ్రామాల్లోని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు మూడేళ్ల క్రితం ప్రత్తిపాడు మండలం పెద్దిపాలేనికి చెందిన బంధం లోవరాజు, వేములపాలేనికి చెందిన తుట్టా నాగభూషణం కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో ఇడ్లీలు అమ్ముకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాగభూషణం స్థానిక బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రుణ మాఫీ కోసం ఆధార్, రేషన్ కార్డు తీసుకురమ్మని చెప్పడంతో నాగభూషణం తన భార్య నాగమణితో కలిసి స్వగ్రామానికి బయలుదేరాడు. పెద్దిపాలేనికి చెందిన బంధం లోవరాజు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు భార్య కాసులమ్మతో కలిసి వస్తున్నాడు. మరి కొంతమందితో కలిసి ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో ఉన్న వ్యాన్‌లో వారు ప్రయాణిస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బంధం లోవరాజు (46), తుట్టా నాగభూషణం (45), నాగమణి (40) అక్కడికక్కడే మరణించగా, కాసులమ్మ తీవ్రంగా గాయపడింది. రెండు గ్రామాల్లో విషాదఛాయలు ఈ ప్రమాదం కారణంగా పెద్దిపాలెం, వేములపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఊళ్లో పనులు లేకపోవడంతో.. నాలుగు రూకలు కూడబెడదామని మూడేళ్ల క్రితం ఆయా కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి.లోవరాజు, కాసులమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె లక్ష్మికి వివాహం చేసి, అత్తారింటికి పంపించారు. ఇద్దరు కుమారులు 21 ఏళ్ల రాంబాబు, 19 ఏళ్ల శివ వారి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం కుమారులిద్దరికీ వ్యాపారాన్ని అప్పగించి, బంధువుల ఇంట జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు వారు బయలుదేరారు. పమాదంలో కుటుంబ పెద్ద లోవరాజు మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటయింది. హైదరాబాద్‌కు వలస వెళ్లిన నాగభూషణం, నాగమణి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు రమణ వారి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రెండో కుమారుడు మల్లేషు, కుమార్తె దుర్గ స్వగ్రామమైన వేములపాలెంలో పెద తండ్రి సూర్యనారాయణ సంరక్షణలో ఉంటున్నారు. గతంలో తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో, ఆధార్, రేషన్ కార్డును బ్యాంకులో అందజేసేందుకు వారు పయనమయ్యారు. వ్యాపారాన్ని పెద్ద కుమారుడికి అప్పగించి, భార్యాభర్తలు బయలుదేరాడు. తల్లిదండ్రుల మరణవార్త విని వారి కుమారుడు రమణ, కుమార్తె దుర్గ కుప్పకూలిపోయారు. చాలాకాలం తర్వాత వస్తున్న తల్లిదండ్రులను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా, వారు ఇక లేరన్న కబురు అందడంతో వారు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి, బోరున విలపిస్తున్న తీరు చూపరులును కంటతడి పెట్టించింది. డ్రైవర్ అజాగ్రత్తే కారణం విజయవాడ సిటీ/వీరవల్లి (హనుమాన్ జంక్షన్ రూరల్) : ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో వస్తూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పాటు డ్రైవర్ అజాగ్రత్తగా వ్యాన్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుకు లోనైన డ్రైవరు ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టు వివరించారు. వ్యానులోని కెమికల్ పీపాలు పగిలి ఆవిర్లతో కూడిన పొగ దట్టంగా వ్యాపించింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు రక్షించేందుకు వెళ్లగా, కళ్లలో మంటలు రావడంతో భయభ్రాంతులకు గురై వెనుదిరిగారు. -
నకిలీ మావోయిస్టు అరెస్టు
‘పుట్టగుంట’కు బెదిరింపు కాల్స్ కేసులో వీడిన మిస్టరీ నిందితుడు కరీంనగర్ జిల్లా వాసి నూజివీడు డీఎస్పీ సీతారామస్వామి వెల్లడి హనుమాన్‌జంక్షన్ : పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్‌ను సొమ్ము డిమాండ్ చేసిన నకిలీ మావోయిస్టును హనుమాన్‌జంక్షన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ జె.సీతారామస్వామి ఈ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన నిందితుడు పత్తి శ్రీనివాసరెడ్డి(31)ని ఈ సందర్భంగా మీడియాకు చూపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో సతీష్‌కుమార్‌కు ఇటీవల వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీ ప్లీనరీ కోసం చందాలు ఇవ్వాలంటూ ఫోన్‌కాల్స్ చేసిన వ్యక్తి రెండు బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చాడు. దీనిపై సతీష్‌కుమార్ ఈనెల 22న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.రమణ, ఎస్సై ఐ.వి.నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మావోల కదలికలు, ప్రభావం అధికంగా ఉండే కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడి నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. నిందితుడి ఫోన్‌కాల్స్ జాబితా, అతడు ఇచ్చిన బ్యాంక్ అకౌంటు నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. నిందితుడు తెలిపిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆంధ్రాబ్యాంకు బ్రాంచిలో అకౌంటు అక్కడి రిటైర్డ్ పోస్టుమాస్టర్ పేరిట ఉండటంతో జంక్షన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కొన్నిరోజుల కిందట తన అకౌంటు నంబరు అడిగితే ఇచ్చినట్లు రిటైర్డ్ పొస్టుమాస్టర్ తెలిపాడు. శ్రీనివాసరెడ్డి తాను ఉపయోగించే సిమ్‌కార్డు, బ్యాంకు అకౌంట్లు తన పేరిట లేకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహితులు, బంధువులు డబ్బులు పంపుతారని చెప్పి ఇరుగుపొరుగు వాళ్ల బ్యాంకు అకౌంటు నంబర్లను తీసుకుని ఈ తరహా బెదిరింపు వసూళ్ల కోసం వాడుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో కరీంనగర్ పోలీసుల సహకారంతో శ్రీనివాసరెడ్డిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రీయాశీలకంగా వ్యవహరించిన సీఐ వై.వి.రమణ, ఎస్సై నాగేంద్రకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్. శివాజీ గణేష్, కె.పెద్దిరాజులు, కానిస్టేబుళ్లు బి.వి.రామతులసీరావు, ఎ.హరిబాబులను ఆయన అభినందించారు. కేసును త్వరగా ఛేదించేందుకు కృషి చేసిన ఎస్పీ, దర్యాప్తు బృందానికి ‘పుట్టగుంట’ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఈజీ మనీ కోసం అడ్డదారిలో.. శ్రీనివాసరెడ్డిపై ఇప్పటి వరకు పదికిపైగా ఈ తరహా కేసులు నమోదైనట్లు డీఎస్పీ సీతారామస్వామి చెప్పారు. అతడి స్వస్థలం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావటంతో దాన్ని ఆసరా చేసుకుని ధనికులకు ఫోన్లు చేసి మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేసేవాడని తెలిపారు. రాష్ట్రవాప్తంగా చాలామంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇతడి చేతిలో మోసపోయారని తేలిందన్నారు. శ్రీనివాసరెడ్డి 2011లో వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ సోషియాలజీ పూర్తి చేశాడన్నారు. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడన్నారు. జమ్మికుంటలో దూరవిద్యా కేంద్రం ఏర్పాటు చేసి ఆర్థికంగా దెబ్బతిన్నాడన్నారు. దీంతో ఈజీ మనీకోసం మావోల పేరుతో తొలుత పరిసర గ్రామాల రాజకీయ నాయకులను బెదిరించాడన్నారు. క్రమంగా ఇంటర్నెట్ సహాయంతో ఇతర ప్రాంతాల వారి ఫోన్ నంబర్లు కూడా సేకరించి మావోయిస్టు పేరుతో చందాలు వసూలు చేశాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకుల యాజమానుల ఫోన్‌నంబర్లను నెట్లో సేకరించి వారిని ఫోన్ చేసి బెదిరించేవాడని డీఎస్పీ తెలిపారు. ఈక్రమంలోనే పుట్టగుం టకు ఫోన్‌కాల్స్ చేశాడని పేర్కొన్నారు. వీణవంక పోలీస్‌స్టేషన్‌లో అతడిపై రౌడీషీట్ ఉందన్నారు. జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, హన్మకొండ స్టేషన్లో ఒక కేసు ఇతనిపై ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. మూడెకరాల ఆసామి అయిన శ్రీనివాసరెడ్డికి అక్కడి పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు జంక్షన్ పోలీసులు గుర్తించి నివ్వెరపోయారు. -
‘పుట్టగుంట’ కేసు దర్యాప్తు వేగవంతం
హనుమాన్‌జంక్షన్ : హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్ట్ పార్టీ నేతల పేరుతో వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్‌పై పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. మావోయిస్టు నేతగా చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, అతను ఇచ్చిన బ్యాంకు అకౌంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాల్‌డేటాను సేకరించిన పోలీసులకు వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నట్లు నిర్ధారణ కావటంతో ఇప్పటికే ఒక టీంను అక్కడకు పంపారు. ఈ కేసుపై అధికార పార్టీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి పెరగటంతో దర్యాప్తు వేగవంతం చేశారు. పార్టీ ఫ్లీనరీ కోసం విరాళం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ నేతల నుంచి నాలుగైదు రోజులుగా వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్ పరంపర సోమవారం కూడా కొనసాగింది. ఫలించని పోలీసు వ్యూహం... మావోయిస్టు పార్టీ నేత గణపతి పేరుతో ఫోన్‌కాల్స్ చేస్తున్న వ్యక్తి డబ్బులు జమ చేసేందుకు పుట్టగుంట సతీష్‌కుమార్‌కు రెండు బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చాడు. వీటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు సోమవారం పోలీసులు వేసిన వ్యూహం విఫలమైంది. వరంగల్‌కు 50 కి.మీ దూరంలో జమ్మిగుంట పట్టణానికి చెందిన ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్‌ను మావోయిస్టులు ఇవ్వటంతో దానిపై నిఘా పెట్టారు. ఆ బ్యాంకు బ్రాంచి మేనేజర్ కాశీ విశ్వేశ్వరరెడ్డి, జమ్మిగుంట సీఐతో హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ, ఎస్.ఐ నాగేంద్రకుమార్ మాట్లాడారు. మావోయిస్టు బెదిరింపు ఫోన్‌కాల్స్ కేసు వివరాలను పూర్తిగా వారికి వివరించి నిందితులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకునేందుకు ప్రణాళిక రచించారు. మావోయిస్టులు తెలిపిన బ్యాంకు అకౌంట్ జమ్మిగుంటకు సమీపంలోకి కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతి నర్సయ్య పేరిట ఉందని విచారణలో వెల్లడైంది. ఏటీయం సదుపాయం లేకపోవటంతో ఖచ్చితంగా బ్యాంకుకు వచ్చి నగదు డ్రా చేసుకుని వెళ్లాల్సిందేనని మేనేజర్ వెల్లడించారు. దీంతో వ్యూహం ప్రకారం ముందస్తుగా బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులను నిఘా పెట్టించి మావోయిస్టు నేతకు పుట్టగుంటతో ఆంధ్రాబ్యాంకు అకౌంట్లో తొలి విడతగా రూ.20 వేలు నగదు జమ చేసినట్లుగా ఫోన్ చేయించారు. ఈ నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకు వద్దకు వస్తే నిందితుడు తమ చేతికి చిక్కినట్లేననే పోలీసులు భావించారు. కానీ బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులు రోజంతా పడిగాపులు పడినా ఆ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసేందుకు ఎవరూ రాకపోవటంతో నిరాశ చెందారు. సదరు బ్యాంకులో ఖాతా తెరిచేందుకు తెల్పిన ఆడ్రస్సు, పాస్‌పోర్టు సైజు ఫొటో ఆధారంగా చేసుకుని నిందితుని ఆచూకీకోసం ఆరా తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఖాతాదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ తెలిపారు. -
హామీలపై నిలదీస్తారనే భయంతో సభను పక్కదారి పట్టిస్తున్నారు
హనుమాన్ జంక్షన్ రూరల్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై చర్చకు వస్తే ఇరుకున పడతామనే భయంతోనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు శాసనసభను పక్కదారి పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, ఈ కుట్రను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. మూడు నెలలుగా ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన 11 హత్యలపై విచారణ చేపట్టాలని, హత్యకు గురైన వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్మోహన్రెడ్డి సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒక వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హత్యకు గురవడం విచారకరమన్నారు. ఇంత జరగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమర్థించాలని అధికారులకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. వంగవీటి మోహనరంగా హత్య అనంతరం వేలాది మంది కాపులపై దాడులు చేసి హత్యలకు పాల్పడటంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైన విషయం వాస్తవం కాదా.. అని దుట్టా ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే హత్యలపై కేసులు నమోదుచేసి విచారించే అవకాశం ఉన్నప్పుడు అనవసర రాద్దాంతం చేయడం ఎందుకుని నిలదీశారు. గొట్టుముక్కలలో ఆలోకం కృష్ణారావు హత్య ఉదంతం వెనుకు మంత్రి దేవినేని ఉమ హస్తం ఉందని ఆరోపించారు. పోలీసులు కూడా ఆ కేసు విచారణలో మీనమేషాలు లెక్కించడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే హక్కు కల్పించకపోవడంతోనే వాకౌట్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి హత్యలపై విచారణ చేపట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని దుట్టా రామచంద్రరావు కోరారు. -
మొదట్లో మహాస్ట్రిక్ట్.. ఇప్పుడు అవినీతి మరక
హనుమాన్ జంక్షన్(కృష్ణా) :అకుంఠత దీక్ష, కృషి, పట్టుదలతో పోలీసుశాఖకు ఎంపికైన హనుమాన్ జంక్షన్ ఎస్సై బి.ప్రభాకరరావు అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కడం ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఆయన శనివారం రాత్రి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 2009 బ్యాచ్‌కు చెందిన ప్రభాకరరావు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హనుమాన్‌జంక్షన్ పోలీస్ సర్కిల్ పరిధిలోనే ఆయన పనిచేశారు. విధి నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గని అధికారిగా తొలినాళ్లలో మంచి పేరు సంపాదించారు. వీరవల్లి ఎస్సైగా పని చేస్తున్నప్పుడు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహించటంతో ఆటో డ్రైవర్లు మొదలుకుని రాజకీయ నాయకుల వరకు ‘బాబోయ్.. ఈ ఎస్సై మాకొద్దు’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా పలుమార్లు పోలీస్ స్టేషన్ ఎదుట అందోళనలు నిర్వహించిన ఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత హనుమాన్‌జంక్షన్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. మొదట్లో ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సమదూరం పాటిస్తూ వచ్చారు. ఆయన ప్రవర్తనలో క్రమేణా మార్పు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి అడపదడపా ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరుగొలనుకు చెందిన కొండపావులూరి శాస్త్రీజీ(నాని) తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ మహిళ గత జనవరిలో జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై ప్రభాకరరావు చేపట్టిన విచారణలో అది తప్పుడు ఫిర్యాదు అని నిర్ధారణ అయింది. రూ. 20 వేలు ఇస్తే కేసు ఎత్తివేస్తానని నానిని ప్రభాకరరావు డిమాండ్ చేశారు. దీంతో నాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పథకం ప్రకారం తొలుత నానికి డబ్బులిచ్చి ఎస్సై దగ్గరకు పంపారు. ఆ సొమ్ము తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ప్రభాకరరావు ఇప్పుడు తీవ్ర అవమాన భారంతో తలదించుకునే పరిస్ధితికి చేరాడు. సబ్‌జైలుకు తరలింపు ప్రభాకరరావును ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హజరుపర్చారు. న్యాయమూర్తి ఆయనకు 12 రోజుల రిమాండ్ విధించటంతో విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. -
యమపాశాలు
విద్యుత్ తీగలు తెగిపడి షాక్‌కు గురై ఇద్దరి మృతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మృతులిద్దరూ మేనత్త, మేనల్లుడు జంక్షన్లో ఘోర ప్రమాదం విద్యుత్ తీగలు యమపాశాలై రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో స్తంభం కూలిపోయింది. తీగలు తెగి ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అతడిని కాపాడేందుకు తల్లి, మేనత్త యత్నించారు. ఈ ఘటనలో బాలుడితోపాటు అతడి మేనత్త మరణించారు. తల్లి షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పొందుతోంది. హనుమాన్‌జంక్షన్‌లో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. హనుమాన్‌జంక్షన్ : విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్‌కు గురై బాలుడు, అతడి మేనత్త మృతిచెందారు. జంక్షన్లో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బాలుడి తల్లి కూడా షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలిలా ఉన్నాయి... స్థానిక కె.ఎస్.టాకీస్ ప్రాంతంలో సరిపల్లి రాజు కుటుంబం నివాసం ఉంటోంది. రాజు పంచాయతీ వాటర్‌వర్క్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగి. అతడి ఇంటి సమీపంలో ఉన్న చెట్టు కొమ్మ బుధవారం విరిగి విద్యుత్ తీగలపై పడింది. దీంతో బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభం విరిగి కింద పడిపోయింది. తీగలు తెగి రాజు ఇంటి బయట ఆడుకుంటున్న అతడి కుమారుడు అఖిల్‌బాబు(2)పై పడ్డాయి. సమీపంలో దుస్తులు ఉతుకుతున్న బాలుడి మేనత్త కాటి రాజ్యలక్ష్మి(28), తల్లి దేవమాత విద్యుత్ తీగల్లో చిక్కుకున్న అఖిల్‌ను కాపాడేందుకు యత్నించి, షాక్‌కు గురయ్యారు. దీనిని చూసిన రాజు కుటుంబసభ్యులు, స్థానికులు కూడా వారిని రక్షించేందుకు యత్నించారు. స్థానికంగా ఉంటున్న కానిస్టేబుల్ రవి వారిని అడ్డుకున్నారు. మరికొందరు విద్యుత్‌షాక్‌కు గురవకుండా అప్రమత్తం చేసి పెనుముప్పును నివారించాడు. షాక్‌కు గురైన ముగ్గురిని స్థానికులు హుటాహుటిన స్థాని కంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. వైద్యులు పరీక్షించి అఖిల్, రాజ్యలక్ష్మి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దేవమాతకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. జంక్షన్ సీఐ వై.వి.రమ ణ, ఎస్సై బి.ప్రభాకరరావు, ఏఎస్సై కె.వి.పాండురంగారావు, విద్యుత్‌శాఖ ఏడీఈ డి.జగన్మోహనరావు, ఏఈ జె.ఎస్.నాగభూషణం ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆ కుటుంబంలోని మిగతావారు రోదిస్తుండటం స్థానికులను కలచి వేసింది. కొన్ని నెలల కిందట కుమారుడిని ప్రసవించిన రాజ్యలక్ష్మిని సారెతో ఏలూరులోని అత్తారింటికి గురువారం పంపించేందుకు కుటుంబసభ్యులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఫోన్లో భర్తకు సంతోషంగా చెప్పిన రాజ్యలక్ష్మి.. బుధవారం నాటి దుర్ఘటనలో అకాల మరణం చెం దింది. ఆమెకు పసికందుతోపాటు మరో కుమార్తె ఉన్నారు. తల్లి మరణించిందన్న విషయం గ్రహించలేని నెలల పసికందు ఘటనాస్థలికి వచ్చిన వారిని అమాయకంగా చూస్తుండటం స్థాని కులను ఆవేదనకు గురిచేసింది. గన్నవరం ఎమ్మెల్యే వి.వంశీమోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు తదితర నేతలు మృతుల కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. న్యాయం కోసం ఆందోళన ఈ ఘటనకు సంబంధించి న్యాయం చేయాలంటూ రెండు మృతదేహాలతో సరిపల్లి రాజు కుటుంబసభ్యులు, గ్రామస్తులు విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు దుట్టా శివన్నారాయణ, దయాల విజయనాయుడు, కైలే అనిల్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, సర్పంచ్ కాకాని అరుణ, ఉప సర్పంచ్ కాకాని వెంకటేశ్వరరావు(బాబు), స్రవంతి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్, టీడీపీ నాయకులు దయాల రాజేశ్వరరావు తదితర నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశీమోహన్ అక్కడకు వచ్చి విద్యుత్ ఏడీఈ జగన్‌మోహనహనరావు, తహశీల్ధార్ గోపాలకృష్ణ, సీఐ వై.వి.రమణతో చర్చలు జరిపారు. రాజ్యలక్ష్మి కుటుంబానికి రూ.2 లక్షలు, అఖిల్ కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లిందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నుండి మౌఖికంగా హామీ లభించింది. దీంతో ఎమ్మెల్యే సూచనల మేరకు వారు అందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఏలూరే రాజధాని కావాలి
* ‘పశ్చిమ’లో పెరుగుతున్న డిమాండ్ సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ - గుంటూరు మధ్య మంగళగిరి లేదా అమరావతిలో రాజధాని.. కాకినాడ తీర ప్రాంతంలో పెట్రో కెమికల్స్ కారిడార్.. విశాఖకు రైల్వే జోన్.. మరి వీటి మధ్యన అన్ని సహజ, శక్తి వనరులు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు ఏంటి..? అధికార పక్షానికి 15 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన జిల్లాకు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదు! ఇది ‘పశ్చిమ’ ప్రజల నుంచి పెల్లుబుకుతున్న అసంతప్తి. తమ జిల్లాకు ఒక్క ప్రాజెక్టూ వచ్చేలా కనిపించడం లేదంటూ రగిలిపోతున్న జిల్లావాసులు ఇప్పుడు ఏకంగా ఏలూరు(హేలాపురి)నే రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన వ్యాపార, వాణిజ్య వర్గాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఏలూరును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని గళం విప్పుతున్నారు. భారతదేశ ధాన్యాగారంగా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా, దేశంలోనే సేంద్రియ వ్యవసాయ పథకం అమలు చేస్తున్న ఏకైక జిల్లాగా, రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ప్రత్యేకతలున్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును రాజధానిగా చేయాలని కోరుతున్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, సహజ, శక్తివనరులు ఉన్నాయని వాదిస్తున్నారు. ఏలూరు - హనుమాన్‌జంక్షన్ ప్రాంతం రాష్ట్ర రాజధానికి అన్ని విధాలుగా అనువైనదని వివరిస్తున్నారు. ఇక్కడలక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో పాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చు. కృష్ణా - గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో నీటి లభ్యత ఎక్కువగా ఉంది. తాగునీటికి ఇబ్బంది ఉండదు. మచిలీపట్నం, కాకినాడ పోర్టుల మధ్య ప్రాంతం కావడం వల్ల పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు, అభివద్ధికి, జల రవాణాకు అనుకూలం. గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల మధ్య ఉండడం.. 16న నంబరు జాతీయ రహదారి పాస్ అవుతుండడం, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అతి సమీపంలో ఉండడంతో పాటు బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఉండడం వల్ల ఈ ప్రాంతం రవాణా వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉంది. ఈ ప్రాంతంలో సహజవాయువు నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల అదనంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానుంది. అన్నింటికీ మించి భౌగోళికంగా ఏలూరు - హనుమాన్‌జంక్షన్ సీమాంధ్రకు నడిబొడ్డున ఉంది. రాజధాని ఏర్పాటైతే ఈ ప్రాంతంలో అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుంది. -
చెరుకు రైతు చేదు సాగు!
విద్యుత్ కోతలు సాగునీటి సంక్షోభం ఎండిపోతున్న పంట హనుమాన్‌జంక్షన్ : ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు సాగునీటి సంక్షోభం వెరసి చెరుకు రైతును ఆందోళనకు గురిచేస్తున్నాయి.బాపులపాడు మండలంలో విద్యుత్ బోరు బావులు, వర్షాధారంపైనా ఆధారపడి చెరకు సాగు చేస్తున్నారు. వర్షాలు కురుస్తాయని, ఈ లోగా విద్యుత్ బోరు బావులతో నీరు అందించవచ్చన్న ఆశతో రైతులు చెరుకు నాట్లు వేశారు. కానీ సకాలంలో తొలకరి వర్షాలు కురవకపోవడం, తీవ్రమైన విద్యుత్ కోతలవల్ల బోరుబావులనుంచి నీరందించలేకపోవడంతో పాటు విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతలతో మొక్క, గెడలు కట్టే దశలో ఉన్న చెరుకు తోటలు ఎండిపోతున్నాయి. హనుమాన్‌జంక్షన్ శివారులో ఉన్న డెల్టా చక్కెర కార్మాగారం పరిధిలో సుమారు 8600 ఎకరాల్లో చెరుకు పంట సాగులో ఉంది. ఇప్పటికే 5100 ఎకరాల్లో పిలక తోటలు సాగులో ఉండగా, ఈ ఏడాది మరో 3500 ఎకరాల్లో మొక్క తోటలు వేశారు. బాపులపాడు మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. మునుపెన్నడూ లేని విధంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరగటంతో మొక్కతోటలు ఎండిపోతున్నాయి. మరో పక్క గెడలు కట్టే దశలో ఉన్న పిలక తోటలకు సైతం సకాలంలో సరిపడినంత నీరందక ఎండిపోతుండడం రైతన్నకు అందోళన కలిగిస్తుంది. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో కోత విధిస్తుండటంతో నీరందక చెరకు తోటలు ఎండిపోతున్నాయి. రోజుకు కనీసం మూడు, నాలుగు గంటలు కుడా విద్యుత్ సరఫరా లేకపోవటంతో మెట్టప్రాంత భూముల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది. దిగుబడిపై ప్రభావం... అధిక ఉష్ణోగ్రతలు, సాగునీరు ఎద్దడి, వాతావరణ పరిస్థితులు చెరుకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు, చక్కెర కార్మగారం యాజమాన్యం అభిప్రాయపడుతుంది. సాధారణంగా చెరుకు పంట సగటు దిగుబడి ఎకరాకు 30 టన్నులు కాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎకరాకు 22- 25 టన్నులకు మించి దిగుబడి రావటం కష్టమని చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లో డెల్టా చక్కెర కార్మాగారం సుమారు 2.50 లక్షల టన్నుల చెరుకు దిగుబడిని ఆశిస్తుండగా, అది కాస్త 2 లక్షల టన్నులకు మించకపోవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఓ పక్క చెరుకు పంటకు సరైన గిట్టుబాటు ధరలు లభించక నష్టాలను ఎదుర్కొంటున్న రైతాంగానికి ఈ పరిస్థితులు ములిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైంది. తొలకరి వర్షాలు కురుస్తాయన్న గంపెడాశతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. -
దారి దోపిడీ ముఠా అరెస్టు
హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం ఆరుగొలను వద్ద ఎంఎన్కే రహాదారిపై ఐదు రోజుల క్రితం బీభత్సం సృష్టించి, ఆ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేసిన దారి దోపిడీ ముఠా సభ్యులను హనుమాన్‌జంక్షన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం దోపిడీముఠా అరెస్ట్ వివరాలను సీఐ వై.వి.రమణ వెల్లడించారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలను అడ్డగించి చోరీలకు పాల్పడడం, డబ్బులు ఇవ్వకపోతే వాహనచోదకులను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదటం, బ్లేడులతో శరీరాన్ని పైశాచికంగా కోయడం ఈ ముఠా నైజమని తెలిపారు. 9వ తేదీ అర్ధరాత్రి ఆరుగొలను వద్ద మాటు చేసి నాలుగు లారీలకు అడ్డుకుని దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఓ లారీ అద్దాలను పగులకొట్టి డబ్బులు ఇవ్వాలని డ్రైవర్, క్లీనర్లను బెదిరించారని, ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచారని సీఐ వివరించారు. లోకల్ లారీలు కావడంతో డ్రైవర్ల దగ్గర వాస్తవానికి పెద్దగా డబ్బు లేకపోవటంతో ప్యూహం బెడిసికొట్టిందనే ఆక్కసుతో వారిని క్రూరంగా కొట్టారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి హనుమాన్‌జంక్షన్ పోలీసులకు రెండు ఫిర్యాదులు అందటంతో కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. శనివారం నిందితులను రంగయ్యప్పారావు పేట రోడ్డు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఈ దోపిడీ ముఠా ప్రధాన నాయకుడు తలారి మల్లయ్య అలియాస్ ఏసుతో పాటు ముఠా సభ్యులు అన్నవరపు సాంబశివరావు అలియాస్ శివ, గోరిపర్తి అరవింద్‌కుమార్‌ను అరె స్టు చేశామని తెలిపారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన ఏసు కొంతకాలంగా గుడివాడలో నివాసముంటున్నాడు. అక్కడే అడపాదడపా దొంగతనాలకు పాల్పడే శివ, అరవింద్‌తో పరిచయం ఏర్పడటంతో ముగ్గురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారని సీఐ వై.వి.రమణ తెలిపారు. హనుమాన్‌జంక్షన్, వీరవల్లి, గుడివాడ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల వీరు దారిదోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాపై మొత్తం తొమ్మిది దోపిడీ కేసులు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు. ఆరుగొలను ఘటనలో లోకల్ లారీలు కావడంతో స్వల్ప మొత్తంలోనే నగదు దోపిడీ జరిగిందని, నిందితుల నుంచి రూ.1620 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.. ముగ్గురు నిందితులను అరెస్టుచేసి నూజివీడు కోర్టులో హజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. గతమంతా నేరాలమయమే... ముగ్గురు నిందితులు పాతికేళ్లలోపు వయస్సు వాళ్లే, ఐనా నేరాలు మాత్రం చాంతాడంత ఉన్నాయి. తొలుత అర్ధరాత్రి వేళ్లల్లో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీల్లో డ్రైవర్లను బెదిరించి దోపిడీలకు పాల్పడిన ముఠా సభ్యులు క్రమంగా రూటు మార్చారు. కొంతకాలంగా దారి దోపిడీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 7వ తేదీన గుడివాడ బైపాస్ రోడ్డులో చోటు చేసుకున్న దారి దోపిడీ ఈ ముఠా ఘనతేనని పోలీసుల విచారణలో తేలింది. రెండు వాహనాలను అడ్డగించి దాదాపు రూ.18 వేలు అపహరించారు. దీంతో పాటు 2011లో బొమ్ములూరు సమీపంలోని సంవేద ఎలైట్ వద్ద ఆపి ఉన్న లారీలో డ్రైవర్‌ను బెదిరించి రూ.6500, వీరవల్లి శివారులోని ఓ హోటల్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీలో డ్రైవర్ నుంచి రూ. 18 వేలు దొంగిలించారు. 2013లో బొమ్ములూరు శివారులోని హోటల్ వద్ద ఆపిన లారీలోకి చోరబడి నిద్రిస్తున్న డ్రైవర్ జేబు కోసి రూ.13 వేలు అపహరించారు. అంతేకాక శివ, అరవింద్ గుడివాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ, ఏసు వీరవల్లి, హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులే.కాగా చాకచక్యంగా నిందితులను పట్టుకున్న హనుమాన్‌జంక్షన్ ఎస్ఐలు నాగేంద్రకుమార్, ప్రభాకరరావు, కానిస్టేబుల్ హరిబాబు, ఇతర సిబ్బందిని సీఐ అభినందించారు. -
తలలు నరికి.. మెడలో వేసుకుని..
* తల్లీకూతుళ్లను నరికిచంపిన కిరాతకుడు * కృష్ణా జిల్లాలో దారుణం * వివాహేతర సంబంధమే కారణమా! హనుమాన్ జంక్షన్, న్యూస్‌లైన్: తల్లీ కూతుళ్లను దారుణంగా నరికి చం పాడో కిరాతకుడు. వారి తలలను ఒకటిగా చేసి మెడలో వేసుకుని భయానక వాతావరణం సృష్టించాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చంద్రమ్మ(53)కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మల్లెల రేణుక, రెండో కుమార్తె పల్లపు చిన్ని(23) గ్రామంలోనే ఉంటుండగా, చిన్న కుమార్తె చల్లా శివ పోలసానిపల్లెలో నివసిస్తోంది. చిన్నిభర్త చనిపోవడంతో మూడేళ్లుగా కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. ఆగిరిపల్లి మండలం కృష్ణవరానికి చెందిన అరటిపళ్ల వ్యాపారి పోట్రు శివనాగరాజు(25) తరచూ మల్లవల్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం మూడో కుమార్తె శివతో కలసి చంద్రమ్మ చిన్ని ఇంటికి వచ్చింది. రాత్రి ఏడు గంటల సమయంలో చిన్ని ఇంటికి శివనాగరాజు వచ్చి ఆమెతో ఘర్షణ పడ్డట్లు సమాచారం. గతంలోనూ ఆమెతో శివయ్య అసభ్యంగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. రాత్రి 11గంటలకు మరోసారి రావడంతో వారి మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఉదయం అరటి చెట్లునరికే రెండు కత్తులతో శివనాగరాజు చిన్ని ఇంటికి వచ్చాడు. వంట చేస్తున్న చిన్ని మెడపై ఒక్కసారిగా కత్తితో వేటువేశాడు. రెండో కత్తితో మెడ నరకడంతో మొండెం నుంచి తల వేరుపడింది. తల్లి చంద్రమ్మ అడ్డువెళ్లగా ఆమెను కూడా తల, మొండెం వేరయ్యేలా నరికేశాడు. అనంతరం తల్లీకూతుళ్ల తలలు మెడలో వేలాడదీసుకుని సమీపంలో వున్న రాయిపై కూర్చున్నాడు. తర్వాత వాటిని రోడ్డుపై పడేసి వెనుతిరిగాడు. కాగా, వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించడం వల్లే తమ సోదరి, తల్లిని శివయ్య హత్య చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, 10మందికి గాయాలు
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మరణించగా, పదిమంది గాయపడ్డారు. హైదరాబాదు నుంచి పిఠాపురం వెళుతున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉన్న సిమెంట్ లోడు లారీని బలంగా ఢీకొంది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నారు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు కాగా అద్దాలు పగిలిపోయి ప్రయాణికులకు గుచ్చుకున్నాయి. లారీ వెనుకభాగం దెబ్బతింది. బస్సు ముందు సీటులో కూర్చున్న చెత్యర్థి పెద్దిరాజు (45) మరణించాడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన కొబ్బరిబొండాల వ్యాపారి. హైదరాబాదులో స్థిరపడిన పెద్దిరాజు స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. 108 అంబులెన్స్ సిబ్బంది ప్రయాణికులను బస్సు కిటికీల్లోనుంచి బయటకు తీశారు. రాజమండ్రికి చెందిన పైడిమళ్ల ప్రసాద్, రాజవరపు ప్రసన్న, రాజవరపు అనంతలక్ష్మి, పెద్దాపురానికి చెందిన పెద్దిరాజు అనంతలక్ష్మి, కాకినాడకు చెందిన తాళాల శివ, జగ్గంపేటకు చెందిన మంగి సుబ్రమణ్యం, మరికొందరు గాయపడ్డారు. 108, హైవే అంబులెన్స్, ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో లారీలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జాతీయ రహదారిపై మార్జిన్‌కు అవతల నిలిపి ఉన్న లారీని మితిమీరిన వేగంతో బస్సు ఢీకొంది. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం లేదా నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. -
ఆశల ‘జంక్షన్’
రాజధానికి అనువుగా ఏలూరు-హనుమాన్ జంక్షన్ పరిసరాలు కృష్ణా, ‘పశ్చిమ’ వాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్న పురపాలక శాఖ నివేదిక సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏలూరు ప్రాంతం అన్నివిధాలా అనువుగా ఉందని నిపుణుల కమిటీ తేల్చడం జిల్లా వాసుల్లో ఆశలు రేపుతోంది. హనుమాన్ జంక్షన్-ఏ లూరు మధ్య రాజధాని నిర్మాణానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాజధాని ఏర్పాటుపై ఏర్పడిన నిపుణుల కమిటీకి పురపాలక శాఖ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పెద్దఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడ-గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు నగరాల్లో రాజధానిని ఏర్పాటు చే యాలని ఆయా ప్రాంతాల రాజకీయ నాయకులు, ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, నగరాల్లో కాకుండా ఖాళీ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ొత్త రాజధానిని ఏర్పాటు చేయూలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో భూములు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఇతర ప్రాంతాలను పరిశీలించారు. చివరకు ఆ ప్రాంతాల్లో రాజధానికి అవసరమైన అన్ని వనరులు లేవని తేల్చారు. ఖాళీ భూములు అందుబాటులో ఉండటంతోపాటు అన్ని వనరులన్న హనుమాన్ జంక్షన్-ఏలూరు మధ్య ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలున్నట్టు తేలడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అన్నీ అనుకూలతలే కృష్ణా జిల్లా పరిధిలోని హనుమాన్ జంక్షన్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని కలపర్రు సమీపంలో ఏలూరు రోడ్డు వరకూ ఉన్న ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని పురపాలక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా దీనిపై అధ్యయనం చేసి ఒక అంచనాకు వచ్చారు. ఈ ప్రాంతంలో జాతీయ రహదారికి ఇరువైపులా వేలాది ఎకరాల ఖాళీ భూములున్నాయి. వీటిలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు, రైలు మార్గాలు అనుసంధానమైన ఉండే ప్రాంతం రాజధానికి అనువుగా ఉంటుంది. ఐదో నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా హనుమాన్ జంక్షన్-ఏలూరు ప్రాంతాలు ఉండటంతోపాటు ఆంధ్రాకు ఇది నడిబొడ్డున ఉంది. బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఈ ప్రాంతాన్ని ఆనుకుని వెళుతోంది. అన్నిటికీ మించి 20 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు ఉండటం, దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు విస్తార అవకాశాలు ఉండటం ఈ ప్రాంతానికి కలిసి వచ్చే అంశం. జలమార్గాలు కూడా ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నాయి. విశాఖపట్నం, నిజాంపట్నం పోర్టులకు మధ్యన ఏలూరు ప్రాంతం ఉండటంతో ఇక్కడి నుంచి సరుకు రవాణా చేయడం చాలా తేలిక. మరోవైపు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కృష్ణా, ఏలూరు, పోలవరం కుడికాలువల ద్వారా అవసరమైనంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉం టుంది. రాజధానికి అవసరమైన ఇలాంటి అన్ని వనరులు ఏలూరు పరిసరాల్లో పూర్తిగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ ఏలూరు-విజయవాడ మధ్య రాజధానికి అవకాశాలున్నాయని తేల్చి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి దీనిపై విజ్ఞాపన చేశారు. ఐఏఎస్ అధికారిగా మహారాష్ట్రలో సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రశేఖర్ అర్బన్ ఎకాలజీలో డాక్టరేట్ పొందారు. మహారాష్ట్రలో అర్బన్ ప్లానర్‌గా ఆయనకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి రాజధాని అవకాశాలు ఉన్నాయని ఎలుగెత్తి చాటడం గమనార్హం. రాజకీయాలను పక్కనపెడితే ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సూచనలు బాగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
హనుమాన్ జంక్షన్ లేదా సాగర్!
-
హనుమాన్ జంక్షన్ లేదా సాగర్!
సీమాంధ్ర రాజధానికి అనువైన ప్రాంతాలు పురపాలక శాఖ నివేదిక కొత్త రాజధాని మౌలిక సదుపాయాల కమిటీకి ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర రాజధానిగా కృష్ణా జిల్లాలోని హనుమాన్‌జంక్షన్ లేదా గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతాలు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని పురపాలక శాఖ వ్యక్తం చేస్తోంది. రవాణా, సమాచార వ్యవస్థ, ప్రభుత్వ భూములు, విమానాశ్రయం, తాగునీటి సౌకర్యం అన్నీ కలగలిసిన ప్రాంతం.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు వరకూ గల ప్రాంతం.. అలాగే గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ తీరం.. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని పురపాలక శాఖలోని డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికార యంత్రాంగం రూపొందించిన నివేదిక సూచిస్తోంది. కర్నూలు, దొనకొండ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి పలు సమస్యలు ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. కొత్త రాజధానికి సంబంధించి వినిపిస్తున్న పలు ప్రాంతాల గురించి అధికారులు అధ్యయనం చేశారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి నేతృత్వంలో కొత్త రాజధాని మౌలిక సదుపాయాల అంశంపై ఏర్పాటైన కమిటీకి డీటీసీపీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో ప్రాంతం గురించి అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్‌లోని ముఖ్యాంశాలు... కర్నూలు - శ్రీశెలం డ్యామ్ బ్యాక్‌వాటర్ వల్ల, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం. - తాగునీటికి సమస్య ఉంటుంది. సరైన సమాచార, రవాణా వ్యవస్థ లేదు. దొనకొండ - ప్రకాశం జిల్లాలోని దొనకొండ పరిసరాల్లో ఎర్రబాలెం, గంగదొనకొండ, వబ్బాపురం, పశ్చిమ గంగవరం, అబ్బయ్యపాలెంలను కొత్త రాజధానిలో చేర్చవచ్చు. మూసివేసిన రన్‌వే, విమానాశ్రయం ఉంది. - ఈ ప్రాంతానికి సరైన రవాణా, సమాచార వ్యవస్థ లేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం తాగునీటి సమస్య కూడా ఉంది. ఈ ప్రాంతంలో ప్రతికూల అంశాల వల్ల రాజధానికి పనికిరాదు. గుంటూరు - గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ సరిహద్దులోని ప్రాంతం అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది. - దీని చుట్టూరా మాచర్ల, కొత్తపల్లి, చింతాల తండ, రాయవరం, రాచమల్లిపాడు, కంభంపాడు, తదితర ప్రాంతాలను రాజధానిలో చేర్చవచ్చు. - మూతపడిన రన్‌వే, పురాతన విమానాశ్రయం మంచి కండిషన్లో ఉంది. - ఈ ప్రాంతానికి సరైన రవాణా, సమాచార వ్యవస్థ సదుపాయం ఉంది. - నగర పెరుగుదలకు అవసరమైన తాగునీటి లభ్యత కూడా ఉంది. - వాతావరణ పరిస్థితులు, రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్ల రాజధానికి ఉత్తమైన ప్రాంతం. హనుమాన్ జంక్షన్ - ఏలూరు రోడ్డు - కృష్ణా జిల్లాలోని ఈ ప్రాంతంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు పెద్ద పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. - ఈ ప్రాంత సరిహద్దుల్లో నూజివీడు, కొత్తపల్లి, బిల్లనపల్లి, వేంపాడు, కొక్కిరపాడు, పల్లెర్లమూడి, సీతారామాపురం తదితర ప్రాంతాలను కొత్త రాజధానిలో చేర్చవచ్చు. - గన్నవరం విమానాశ్రయం ఈ ప్రాంతానికి 20, 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీనిని రాజధాని విమానాశ్రయంగా వినియోగించవచ్చు. - ఈ ప్రాంతం మంచి రైల్వే, రోడ్డు, రవాణా సౌకర్యాలతోపాటు సమాచార వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంది. - రాజధాని నగరానికి అవసరమైన నీటి లభ్యత కూడా ఉంది. పోలవరం కాలువతో నీటి సౌకర్యం కల్పించవచ్చు. - ఈ ప్రాంతం రాజధాని కోసం స్థల, వాతావరణ పరంగా ఉత్తమమైన ప్రాంతం. -
చక్కెర ఫ్యాక్టరీలకు చే(టు)దు కాలం
అమ్మకం ధర టన్ను రూ.2,600 ఉత్పత్తి వ్యయం రూ.3,400 ధరలేక పేరుకుపోతున్న నిల్వలు గడ్డు స్థితిలో చక్కెర ఫ్యాక్టరీలు మార్కెట్లో పంచదార ధర రోజురోజుకూ ఎప్పుడూ లేనంతగా తగ్గిపోతోంది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున దేశీయ చక్కెర మార్కెట్లోకి దిగుమతి అవుతుండటంతో ఇక్కడి పంచదారకు డిమాండ్ తగ్గింది. క్రమంగా ధర క్షీణిస్తూ కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా లక్షలాది టన్నుల పంచదార కర్మాగారాల గిడ్డంగుల్లో మగ్గిపోతోంది. చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని లక్ష్మీపురం, ఉయ్యూరు, హనుమాన్‌జంక్షన్ చక్కెర కర్మాగారాల్లో పంచదార నిల్వలు గిడ్డంగులలో మూలుగుతున్నాయి. ఈ సీజన్లో ఉత్పత్తి అయిన పంచదారతో పాటు పాత నిల్వలు కూడా పేరుకుపోయాయి. లక్ష్మీపురం కర్మాగారంలో 1.18 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడి 8.5 శాతం, ఉయ్యూరులో 2.60 లక్షల టన్నులకు 9.5 శాతం, హనుమాన్‌జంక్షన్‌లో 1.16 లక్షల టన్నులకు 9 శాతం సగటు రికవరీ సాధించారు. దీంతో ఆయా ఫ్యాక్టరీల ద్వారా ఈ సీజన్లో వరుసగా 1.03 లక్షల టన్నులు, 2.47 లక్షల టన్నులు, 1.04 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయ్యి గోడౌన్లకు చేరింది. 2013 జూన్‌లో పంచదార ధర క్వింటాకు రూ.3,200 ఉండగా ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ జనవరి నాటికి రూ.2,600కు దిగజారింది. చలి ఎక్కువగా ఉంటే చక్కెర దిగుబడి బాగుంటుందని ఆశించి రికవరీపై గంపెడాశతో గత నవంబర్ మూడు, నాలుగో వారాల్లో క్రషింగ్ ప్రారంభించిన చక్కెర ప్యాక్టరీలకు నిరాశే మిగిలింది. చలి తగ్గిపోవటం వల్ల అనుకున్నంత రికవరీ రావటంలేదు. తగ్గిన ధరలతో చక్కెర కర్మాగారాలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయి. దిగుబడీ అంతంతే... ఈ ఏడాది చెరుకు దిగుబడీ ఆశాజనకంగా లేదు. క్రషింగ్ ప్రారంభానికి ముందే హెలెన్, లెహర్ తుపాన్ల వల్ల కురిసిన భారీ వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపాయి. ఈ ఏడాది లక్ష్మీపురం ఫ్యాక్టరీ 3 లక్షల టన్నులు, ఉయ్యూరు 8 లక్షల టన్నులు, హనుమాన్‌జంక్షన్ ఫ్యాక్టరీ 2.40 లక్షల టన్నులు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు మూడింట ఒక వంతు మాత్రమే పూర్తయింది. ఆశించినమేర రికవరీ రాకపోవటంతో క్వింటా పంచదార తయారీకి రూ.3,200 నుంచి రూ.3,400 వరకు ఖర్చవుతోంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటా పంచదార ధర రూ.2,600గా ఉంది. దీనినిబట్టి చూస్తే అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కంటే తయారీపై అయ్యే ఉత్పత్తి ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ అదనపు భారంతో ఫ్యాక్టరీలు నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం ఒక్క ఫ్యాక్టరీ పైనే కాదని, రైతులకు ఇచ్చే మద్దతు ధరపై కూడా పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి చక్కెర కర్మాగారాలు ఎలా నిలదొక్కుకుని బయటపడతాయో వేచిచూడాలి. పూర్తి బాధ్యత పాలకవర్గం, యాజమాన్యానిదే? ఫ్యాక్టరీలలో నిల్వలు పేరుకుపోవటానికి పూర్తి బాధ్యత పాలకవర్గం, యాజమాన్యానిదేననేది రైతుల వాదన. ప్రతి మూడేళ్లు లేదా నాలుగేళ్లకోసారి చక్కెర మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని చెబుతున్నారు. ఇది తెలిసినా ధర పతనమవుతున్న తొలినాళ్లలోనే పంచదారను అమ్మకుండా గిడ్డంగులలో నిల్వ ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది ఫ్యాక్టరీ యంత్రాంగం వైఫల్యమని విమర్శిస్తున్నారు. -
పందెంకోళ్లు కత్తులు దూశాయ్!
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా సరిహద్దుల్లో కోడిపందేలు రెండు రోజులుగా జోరుగా సాగుతున్నాయి. హనుమాన్‌జంక్షన్ సమీపంలో.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి వద్ద, కృత్తివెన్ను పల్లెపాలెం సమీపంలోని లోసరి వద్ద భారీఎత్తున పందేలు వేశారు. లోసరిలో నిర్వహించిన కోడిపందేల శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు రెండు రోజులపాటు సందర్శించారు. జిల్లాలో కోడిపందేలు, పేకాట జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పోలీసులు చేసిన హెచ్చరికలు అభాసుపాలయ్యాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు ప్రకటించినా..ఈ అవరోధాలన్నింటినీ దాటి పందెంరాయుళ్లు తమ పంతం నెగ్గించుకున్నారు. మొవ్వ మండలం కోసూరు, పామర్రు మండలం జమిగొల్వేపల్లిలో కోతముక్క జోరుగా సాగింది. ఒకవైపు పోలీసులు దాడి చేస్తున్నా.. మరో వైపు పందెగాళ్లు సెల్ఫోన్ల ద్వారా సమాచారం పంపుతూ ఎక్కడికక్కడే పందేలు నిర్వహించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలకు అనుమతులు లేకపోవడంతో ఆ ప్రాంతంవారంతా జిల్లాలోని పలుచోట్లకు తరలివెళ్లి పండగను సరదాతీర్చుకున్నారు. రెండు రోజులుగా జిల్లాలో కోడిపందేలు, పేకాటల రూపంలో రూ. 50 కోట్లకు పైగానే చేతులు మారినట్లు సమాచారం. పందేలు జరిగిన తీరిదీ.. కైకలూరు మండలం భుజబలపట్నం, కలిదిండి మండలం పులపర్రు, చింతలపాడులో శిబిరాలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ మంత్రి మాగంటి బాబు స్వయంగా పోటీలను ప్రారంభించారు. ఇక్కడ రెండు రోజుల పాటు యథేచ్ఛగా పందేలు జరిగాయి. గుడివాడ పట్టణం, మండలం సరిహద్దుల్లో రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా రెండు శిబిరాలు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు ప్రాంతాల్లో కోడిపందేలకు అడ్డు, అదుపు లేకుండాపోయింది. మైలవరంలోని దేవుడు చెరువు, సూరిబాబుపేట, పోరాటనగర్, కనిమెర్లతండా, పుట్లూరు తదితర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాల సరిహద్దులో కరకట్ట పక్కనే పెద్ద ఎత్తున కోడిపందేల శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం రేవు వద్ద పందెంరాయుళ్ల రాకతో తిరునాళ్లను తలిపించింది. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేల శిబిరాన్ని మంత్రి పార్థసారథి రెండు రోజులూ వచ్చి సందర్శించారు. బల్లిపర్రు, పామర్రు, కురుమద్దాలి, పెరిసేపల్లి, యలకుర్రు తదితర ప్రాంతాల్లో జోరుగా పేకాట, కోడిపందేలు సాగాయి. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం పెందుర్రులో భారీగా కోడిపందేల బరిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పగలు సమయంలో కోడిపందేలు, రాత్రి సమయంలో కోతముక్క జోరుగా సాగాయి. నాగేశ్వరరావుపేట, అర్తమూరు, చెరుకుమిల్లి తదితర ప్రాంతాల్లో కోడిపందేలు ఇష్టారాజ్యంగా సాగాయి. కృత్తివెన్ను మండలం పల్లెపాలెం సమీపంలో పశ్చిమగోదావరి జిల్లాలోని లోసరి వంతెనకు సమీపంలో పంటపొలాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు సందర్శించటం గమనార్హం. గూడూరు మండలంలోని పిండివానిపాలెం, గూడూరు, పెడన మండలం తోటమూల, కట్లపల్లి, ఉప్పలకలవగుంట తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. బందరు మండలంలోని పోలాటితిప్ప, కోన, చిన్నాపురం, కానూరు తదితర ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా సాగాయి. -
పాల పోటీల్లో మండపేట భళా
జంక్షన్లో ముగిసిన పోటీలు పశుపోషకులకు బహుమతుల ప్రదానం హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : రాష్ట్రస్థాయి పాల పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా మండపేట పశువులు హవా ప్రదర్శించాయి. మూడు విభాగాల బహుమతుల్లో సింహభాగాన్ని దక్కించుకున్నాయి. ఏపీ పశు గణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్‌జంక్షన్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పాల పోటీలు ఆదివారంతో ముగిశాయి. పోటాపోటీగా తలపడిన పశువుల చివరి వరకు ఉత్కంఠను రేపాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అరుదైన పశుజాతిని చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్సాహం చూపారు. పోటీల ప్రాంగణం తిరునాళ్లను తలపించింది. ఆదివారం ఉదయం మూడో విడత పాల సేకరణ చేసిన అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు విజేతలను ప్రకటించారు. ఏపీ పశు గణాభివృద్ధి సంస్థ సీఈవో కొండలరావు, కృష్ణావేణి మిల్క్ యూనియన్ చైర్మన్ దేవభక్తుని రామకృష్ణాప్రసాద్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్ చేతుల మీదుగా పశుపోషకులులకు షీల్డ్‌తో పాటు నగదు బహుమతులను అందజేశారు. ముర్రా జాతి గేదెలు, ఒంగోలు, సంకర జాతి ఆవులవిభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులుగా సుమారు రూ. 4 లక్షల మొత్తాన్ని అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ సభలో సీఈవో కొండలరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల పెంపకంపై ఆసక్తి, అవహగాన పెంచేందుకు పాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముర్రాజాతి విభాగంలో .... మండపేటకు చెందిన వల్లూరి సత్యనారాయణ చౌదరి (టాక్టర్ సత్తిబాబు), బాపులపాడు మం డలం వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్ కు చెందిన గేదెల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. స్వల్ప వ్యత్యాసంతో సత్తిబాబుకు చెందిన గేదె సగటున రోజుకు 20. 503 లీటర్ల పాల ఉత్పత్తిని అందించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆయన షీల్డ్‌తో పాటు రూ. 70 వేల నగదు బహుమతిని అందుకున్నారు. చిలకపాటి రాజీవ్ గేదె 19.787 లీటర్లుతో ద్వితీయ స్ధానం, మండపేటకు చెం దిన వల్లూరి శ్రీనివాస్ గేదె 19.566 లీటర్లుతో తృతీయ స్థానం దక్కించుకున్నాయి. మండపేట వాసి ముత్యాల సత్యనారాయణకు చెందిన గేదె 18.950 లీటర్లతో ప్రోత్సాహక బహుమతిని సొంతం చేసుకుంది. ఒంగోలు ఆవుల విభాగంలో... మండపేటకు చెందిన చుండ్రు సుబ్బారావు ఆవు 10.060 లీటర్లతో అగ్రస్థానంలో నిలిచి షీల్డ్, రూ. 50 వేల నగదు కైవసం చేసుకుంది. బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఇపర్ల వెంకటేశ్వర్లు ఆవు 10.050 లీటర్లు, గుమ్మిలేరుకు చెందిన కోరా వీరభద్రరావు ఆవు 9.997 లీటర్లుతో ద్వితీయ, తృతీయ బహుమతులను పొందాయి. మండపేట వాసి వల్లూరి సతీష్‌కుమార్‌కు చెందిన ఆవు 9.597 లీటర్లు ఇచ్చి ప్రోత్సాహక బహుమతిని దక్కించుకుంది. సంకర జాతి ఆవుల విభాగంలో... బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్‌కు చెందిన ఆవు 29.457 లీటర్లు పాలు దిగుబడితో ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. మండపేటకు చెందిన వల్లూరి సత్యనారాయణ చౌదరి ఆవు 29.260 లీటర్లు, విశాఖపట్టణం జిల్లా పాయకారావు పేటకు చెందిన చిట్లూరి నరసింహరావు ఆవు 23.023 లీటర్ల పాల దిగుబడితో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరుకు చెందిన రెడ్డి అఖిలకు చెందిన ఆవు 14.693 లీటర్ల పాలను ఇచ్చి ప్రోత్సాహక బహుమతిని పొందింది. పాల పోటీల అనంతంర జరిగిన ముర్రా జాతి పాల పళ్ల దూడల అందాల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిలకపాటి రాజీవ్, చుండ్రు సుబ్బారావు దూడలు ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నాయి. పశుసంవర్ధక శాఖ జేడీ దామెదర నాయుడు, ఏడీ డాక్టర్ యం.ఎస్.ఎ.దివాకర్, పలువురు పశు వైద్యులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా రాష్ట్రస్థాయి పాల పోటీలు
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : పాల పోటీలు రెండో రోజు ఆసక్తికరంగా సాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముర్రా జాతి గేదెలు, ఒంగోలు, సంకర జాతి ఆవులు మధ్య విభాగాల్లో పోటీలు శనివారం జరిగాయి. ముర్రా జాతి విభాగంలో 14 గేదెలు, ఒంగోలు జాతి విభాగంలో 12 ఆవులు, సంకర జాతి విభాగంలో నాలుగు ఆవులు పోటీలకు అర్హతగా సాధించి, తుదిపోరులో తలపడుతున్నాయి. పోటీల్లో పాల్గొంటున్న పశువుల నుంచి శనివారం ఉదయం, సాయంత్రం పశు సంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో పాలు తీశారు. ఆదివారం ఉదయం మూడో విడత పాల సేకరణ జరిగిన తర్వాత సగటు పాల ఉత్పత్తిని నిర్ధారించి విజేతను ప్రకటించనున్నారు. ముర్రాజాతి గేదెల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట (నెంబరు.9), బాపులపాడు మండలం వీరవల్లి(నెంబరు.2)కి చెందిన పశువుల మధ్య పోటీ నెలకొంది. శనివారం నాటి పోటీల్లో రెండు గేదెలు సుమారు 22 లీటర్ల పాలను ఇచ్చాయి. దీంతో ఆదివారం వీటి మధ్య పోటీ ఉంటుంది. సంకర జాతి విభాగంలో నాలుగో నంబరుతో బరిలోకి దిగిన ఆవు పోటీలో ముందుకు దూసుకువెళ్లుతోంది. ఆదివారం జరిగే బహుమతి ప్రదానోత్సవానికి ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో కొండలరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పశు సంవర్ధక శాఖ జేడీ దామోదర నాయుడు, ఏడీ దివాకర్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం
హనుమాన్ జంక్షన్ రూరల్, న్యూస్‌లైన్ : ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఓ వృద్ధుడు సజీవ దహనమైన ఘటన బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తలుపుల రామకోటయ్య (85) పాఠశాలలో వాచ్‌మెన్‌గా చేసి రిటైరయ్యారు. కుటుంబ సభ్యులుండే ఇంటికి సమీపంలో రేకుల షెడ్డు గదిలో ఒంటరిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చుట్ట వెలిగించుకోబోతుండగా, ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల మంచంపైన పడి, దుప్పటికి, మంచానికి ఉన్న ప్లాస్టిక్ వైరుకు మంటలు అంటుకున్నాయి. కదలలేని స్థితిలో ఉన్న కోటయ్య మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసే లోగానే అగ్నికి ఆహుతైపోయాడు. హనుమాన్ జంక్షన్ సీఐ వైవీ రమణ, ట్రైనీ డీఎస్పీ అనిల్‌కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర ్వహించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఈ వ్యవసాయం.. వినూత్నం..
కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్నారు పెద్దలు. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి సమస్యనైనా సునాయూసంగా ఎదుర్కోవచ్చనేది దీని సారాంశం. ఇటీవల సంభవించిన వరుస తుపాన్లకు జిల్లాలోని కొందరు రైతన్నలు కోలుకోలేని దెబ్బతింటే.. మరికొందరు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని ఎదుర్కొనే దిశగా అడుగులు వేశారు. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి లాభాల సిరులు పండించారు. నేడు (సోమవారం) జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన రైతులపై ‘న్యూస్‌లైన్’ సక్సెస్ స్టోరీ.. హనుమాన్ జంక్షన్ : మూసధోరణి, కాలం చెల్లిన పద్ధతులతో పంటలు సాగుచేస్తూ ఒడుదుడుకులు ఎదుర్కొనే రైతులు కొందరైతే.. వీటికి భిన్నంగా ఆలోచిస్తూ వినూత్న ప్రయోగాలతో అధిక దిగుబడులు సాధించి నలుగురికి ఆదర్శంగా నిలిచే వారు మరికొందరు. సరిగ్గా ఈ రెండో కోవకే చెందుతారు బాపులపాడు మండలంలోని బిళ్లనపల్లికి చెందిన యెదురువాడ నాగేశ్వరరావు. కొత్తరకం పద్ధతుల్లో వరి పంటను సాగుచేసి అధిక దిగుబడులు సాధించటమే కాక ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు. ఒకే పంటలో, ఒకే సీజన్లో మూడు కొత్త పద్ధతులను అమలుచేశారు. పామాయిల్ తోటలో అంతర పంటగా వరి మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటలను పామాయిల్ తోటలో అంతర పంటలుగా సాగుచేయటం సాధారణమే. కానీ, తొలిసారిగా పామాయిల్ తోటలో ప్రయోగాత్మకంగా వరిసాగును అంతర పంటగా చేపట్టి విజయం సాధించారు నాగేశ్వరరావు. బిళ్లనపల్లిలో నాలుగు ఎకరాల పొలంలో ఏడాది కిందట పామాయిల్ మొక్కలు వేశారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో ఆయనకో ఆలోచన వచ్చింది. పామాయిల్ తోటలో వరి సాగుచేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. అనుకుని వెంటనే ఆచరణలో పెట్టారు. బిందు సేద్యంతో వరిసాగు సాగునీటి కొరతతో సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయరంగానికి నాగేశ్వరరావు కొత్తమార్గం చూపించారు. వరి పంటలో తొలిసారి బిందు సేద్యం విధానాన్ని అవలంబించి మంచి రాబడి సాధించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. నీటి వృథా తగ్గుతుంది. మొక్కకు నేరుగా సాగునీరు, ఎరువులు అందుతాయి. నేరుగా విత్తనాలు.. సాధారణంగా వరిసాగు చేసేందుకు ముందుగా నారుమడి పోసి ఆ తర్వాత పొలం మొత్తం నాట్లు వేస్తారు. రెండుసార్లు పొలం దుక్కడం, నాలుగుసార్లు దమ్ము చేయించటం, వరినాట్లు చేసేందుకు కూలీలు దొరక్కపోవటంతో విసుగు చెందుతున్న రైతాంగానికి సరికొత్త పద్ధతిని పరిచయం చేశారు. నేరుగా పొలం మొత్తం విత్తనాలు చల్లి పంట సాగు చేశారు. ట్రాక్టర్‌తో ఒక్కసారి దుక్కి చేయించి, తరువాత యంత్రాల సాయంతో పొలంలో విత్తనాలు చల్లించారు. దీనివల్ల ఎకరాకు దాదాపు రూ.5వేల వరకు పెట్టుబడి మిగులుతుందని నాగేశ్వరరావు తెలిపారు. ఇబ్బందులు ఎదుర్కొనేందుకే.. మెట్ట ప్రాంతంలో వర్షాలు సరిగ్గా ఉండవు, విద్యుత్ మోటార్ల మీద ఆధారపడి సాగు చేయాలి. విద్యుత్ కొరత, మరోపక్క సాగునీటి కొరతను తట్టుకునేందుకు బిందు సేద్యం ద్వారా వరిసాగు చేపట్టాను. గతంలో కూలీలు పొలంలో ఎంత లోతు బురద ఉన్నా లెక్క చేయకుండా వరినాట్లు వేసేవారు. ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువైంది. దీంతో నేరుగా విత్తనాలు చల్లి పంటసాగు చేశాను. దీనివల్ల పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. - యెదురువాడ నాగేశ్వరరావు రాబోయే కాలంలో బిందు సేద్యానికే పెద్దపీట రాబోయే రోజుల్లో బిందు సేద్యానికే రైతులు పెద్దపీట వేయనున్నారు. డెల్టాలో నాలుగు ఎకరాలకు వినియోగించే నీటిని డ్రిప్ ఇరిగేషన్లో వరిసాగుకు నాగేశ్వరరావు వాడారు. పొలం ఆరుతడిగా ఉండటంతో ఆక్సిజన్ మొక్కలకు చేరి ఆశించిన మేరకు దిగుబడులు వచ్చాయి. పొలానికి కావలసిన స్థాయిలో నీరు ఉండటంతో తుపాన్ల బారిన పడకుండా చేను నిలబడింది. నీటి యాజమాన్య సంస్థ వారు ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా బిందు సేద్యానికి భారీగానే సబ్సిడీలు ఇస్తున్నారు. - ఎన్సీహెచ్ బాలూనాయక్, జిల్లా వ్యవసాయ జాయింట్ డెరైక్టర్ రైతుబంధు చరణ్‌సింగ్ ఉత్తరప్రదేశ్‌లో జమిందారీ వ్యవస్థ, భూస్వాములపై తిరుగుబాటు చేసి రైతుల పక్షాన పొరాడి రైతుబంధుగా పేరొందిన భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతినే జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకొంటారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో 1902 డిసెంబరు 23న జన్మించారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన అనేక భూపోరాటాలు చేశారు. జైకిసాన్ నినాదంతో రైతులను ఏకంచేసి ఉద్యమాలు నడిపారు. రైతుల దుస్థితి, సమస్యలు, పరిష్కార మార్గాలు, సంస్కరణలపై పలు రచనలు చేవారు. 1960లో ఉత్తరప్రదేశ్ సీఎంగా చరణ్‌సింగ్ దేశంలోనే తొలిసారిగా భూసంస్కరణలు, లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1979లో మొరార్జీ దేశాయ్ తర్వాత దేశ ప్రధానమంత్రిగా ఆరు నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. రైతు శ్రేయస్సు కోసం ఆయన చేసిన ఉద్యమాలు, చట్టాలు, రచనలను స్మరించుకుంటూ ఆయన మరణించిన తర్వాత ఏటా రైతుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 115 రోజుల్లోనే పంట వరుస తుపాన్ల వల్ల తన పంటకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుకున్నారు కౌతవరానికి చెందిన రైతు చాపరాల జగన్మోహనరావు. వెదజల్లే పద్ధతిని అనుసరించి కేవలం 115 రోజులకే పంట సాధించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. జగిత్యాల (20171, 18047) రకాల వరి వంగడాలు నా పొలంలో వేశాను. జులై ఐదో తేదీన వెదజల్లే పద్ధతి ద్వారా విత్తనాలు వేశాను. దీంతో 130 రోజులకు చేతికి రావలసిన పంట 115 రోజులకే వచ్చింది. అక్టోబరు 25వ తేదీన వరి కోతలు పూర్తయ్యాయి. ప్రయోగ పద్ధతిలో 20171, 18047 రకాల్ని కొద్ది పొలంలోనే సాగుచేశా. ఈసారి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తా. బీపీటీని పోలిన ఈ రకం వంగడాల ద్వారా వర్షాల్లో కంకులపై చినుకుపడితే మొలక వచ్చే ప్రమాదం ఉంది. వరుసగా వచ్చిన తుపాన్లకు ముందుగానే పంటను కోసేయటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడినట్లే... అని చెప్పారు. వైపరీత్యాలకు ఒరిగిపోలేదు.. తన పొలంలో వేసిన ఎంటీయూ 1112 రకం వరి వంగడం తుపాన్లకు తట్టుకుని దృఢంగా నిలబడిందని గుడ్లవల్లేరుకు చెందిన వల్లభనేని నరసింహారావు చెప్పారు. ఆయన తన పంట గురించి చెబుతూ... 1112 వరి వంగడాన్ని నా ఐదెకరాల్లో సాగు చేశాను. దోమపోటు, ఎండు తెగులును తట్టుకోవడమే కాకుండా వరుస తుపాన్లకు చేను పడకుండా నిలబడింది. ఈ విత్తనం 35 బస్తాల దిగుబడి ఇచ్చింది. ఇది 150 రోజుల పంట. ఈ ధాన్యం సన్నాలుగా తెలుపు రంగులో ఉంటుంది. ధాన్యానికి మూడు వారాల నిద్రావస్థ ఉండటంతో వర్షాల్లో మొలక రాలేదు. పల్లపు ప్రాంతంలో ముంపు బారిన పడినా 7-10 రోజుల వరకు నష్టం వాటిల్లలేదు. ఈ రకాన్ని కనుగొన్న మారుటేరు ఏపీ వరి పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యనారాయణరావు నా పొలాన్ని సందర్శించి దిగుబడులు చూసి మెచ్చుకున్నారు.. అని పేర్కొన్నారు. తక్కువ కాలపరిమితికే పంట వరుస తుపాన్ల బారిన పడకుండా తక్కువ కాలపరిమితితో కూడిన పంటను వేసి విజయం సాధించారు అంగలూరుకు చెందిన రైతు, మాజీ ఏడీఏ త్రిపురనేని రత్నకుమార్ చౌదరి. తన అనుభవంతో తుపాన్లకు సవాల్ విసిరారు. ఈ విశేషాలు చెబుతూ.. పీఎన్ఆర్ 2458 వరి రకాన్ని నా పొలంలో వాడాను. తుపాన్ల ముందే.. అంటే నవంబరు మొదటి వారంలో వరికోతలు పూర్తయ్యాయి. ఇది 135 రోజుల పంట. ఈ రకాన్ని హైదరాబాద్ రాజేంద్రనగర్ నుంచి తెచ్చా. రెండున్నర ఎకరాల్లో ఈరకం సాగుచేశా. ఇది ముతకలు కాదు, సన్నాలు కాదు. ఎకరానికి 34 బస్తాల పంటనిచ్చింది. తక్కువ కాలపరిమితితో దిగుబడులు సాధించడంతో అందరూ మెచ్చుకున్నారు.. అని వివరించారు. -
చెరుకు రైతుకు మిగిలేది చేదే!
= పెరిగిన పెట్టుబడి వ్యయం = దక్కని గిట్టుబాటు ధర = ప్రకటించింది టన్నుకు రూ.2,400 = రూ.3,500 ఇవ్వాలని రైతుల డిమాండ్ హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : చెరుకు సాగు రైతన్నకు చేదును మిగుల్చుతోంది. గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నారు. ఏటా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతున్నా చక్కెర కర్మాగారాలు చెరుకు ధరలను పెంచకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హనుమాన్‌జంక్షన్‌లోని డెల్టా షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న బాపులపాడు, గన్నవరం, నూజివీడు, మైలవరం, చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి, పెదపాడు మండలాల్లో సుమారు 8,600 ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. ఈ ఏడాది 2.40 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ను ఫ్యాక్టరీ లక్ష్యంగా పెట్టుకుంది. తేలని గిట్టుబాటు ధర... మరో నెల రోజుల్లో చెరుకు క్రషింగ్ ప్రారంభం కానుంది. డెల్టా షుగర్స్ పరిధిలో 2013-14 సీజన్లో నాలుగు వేల ఎకరాల్లో మొక్క చెరుకు, మరో 4,600 ఎకరాల్లో పిలక చెరుకు సాగులో ఉంది. జిల్లాలోని కేసీపీ కర్మాగారం టన్ను చెరుకు ధర రూ.2,400గా ప్రకటించటంతో డెల్టా షుగర్స్ రైతులు అయోమయంలో పడ్డారు. గత సీజన్లో డెల్టా యాజమాన్యం టన్ను చెరుకు ధర సబ్సిడీ పోను రూ.2,200 అందజేసింది. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఉత్పత్తి వ్యయం అవుతుండగా, దిగుబడి మాత్రం 30 టన్నులకు మించటం లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లోనైనా డెల్టా యాజమాన్యం సరైన గిట్టుబాటు ధర ప్రకటిస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. తగ్గుతున్న సాగు విస్తీర్ణం... చెరుకు పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, పామాయిల్ సాగుకు రైతులు మొగ్గుచూపటంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యం సుమారు 25 లక్షల టన్నులు కాగా 2012-13 సీజన్లో 12 లక్షల టన్నులు మాత్రమే క్రషింగ్ కావటం దీనికి నిదర్శనం. డెల్టా ఫ్యాక్టరీ పరిధిలో గతంలో 12 వేల ఎకరాలకు పైబడి చెరుకు సాగులో ఉండగా 2011-12 సీజన్లో తొమ్మిదివేల ఎకరాలకు, 2012-13 సీజన్లో 8,600 ఎకరాలకు, ప్రస్తుతం 8,400 ఎకరాలకు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గటం ఆందోళన కలిగిస్తోంది. రెట్టింపైన పెట్టుబడి వ్యయం.. ఏటా చెరుకు ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో గిట్టుబాటు ధరలు పెరగకపోవటంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అడ్డగోలుగా పెరిగిన డీజిల్, ఎరువుల ధరలు, కూలీల కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోపక్క కూలిరేట్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గత సీజన్లో ఎలుకల బెడద చెరుకు రైతును కోలుకోలేని దెబ్బ తీసింది. ఈసారి దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా ధర ఏమాత్రం అందుతుందో వేచి చూడాల్సిందే. టన్నుకు రూ.3500 ఇవ్వాలి పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో టన్ను చెరుకు ధర రూ.3500 ప్రకటించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎకరాకు సుమారు లక్షన్నర రూపాయల వ్యయం అవుతోంది. చెరుకు రైతుల ద్వారా ఫ్యాక్టరీలకు లాభాలు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం భారీగా వస్తున్నా ఆరుగాలం కష్టించే రైతు మాత్రం నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. న్యాయమైన ధర ప్రకటించి చెరుకు సాగును నిలబెట్టుకోకపోతే భవిష్యత్‌లో గడ్డుకాలం ఎదుర్కోక తప్పదు. - నండూరు సత్య వెంకటేశ్వర శర్మ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి -
మృత్యుశకటమైన కారు
=హనుమాన్‌జంక్షన్‌లో ట్రక్ ఆటోను ఢీకొన్న వైనం.. =ఒకరి మృతి.. నలుగురికి గాయాలు =మూడు దూడలు గాయాలపాలు.. హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : పట్టణంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రంగా, మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సం బంధించి వివరాలిలా ఉన్నాయి. కంకిపాడు మం డలం పునాదిపాడుకు చెందిన ముసుబోయిన రామకృష్ణ(50) తన దూడలు మూడింటిని ట్రక్ ఆటోలో ఎక్కించి, జంక్షన్‌లోని పశువుల సంతకు బయలుదేరాడు. స్థానిక విజయవాడ రోడ్డులోని టాటా కంపెనీ సమీపంలో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి ట్రక్ ఆటోను ఢీకొట్టింది. దీంతో అది మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. పోరంకికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ పకీర్ అహ్మద్, క్యాబిన్లో ఉన్న మరో ప్రయాణికుడు సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ట్రక్ ఆటోలోని మూడు దూడలు తీవ్రంగా గాయపడ్డాయి. కారు నడుపుతున్న వెంకట రమణ, అందులో ఉన్న మహిళ స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ, ఎస్సై బి.ప్రభాకరరావు సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రక్తపు మడుగులో పడి ఉన్న రామకృష్ణ మృతదేహాన్ని, గాయపడిన దూడలను చూసి స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. -
రైతన్న కన్నెర్ర
సాక్షి, హనుమాన్‌జంక్షన్ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా హనుమాన్‌జంక్షన్ వేదికగా నిర్వహించిన రైతు గర్జన సభ విజయవంతమైంది. రాష్ట్ర విభజనతో రైతులకు జరిగే నష్టాన్ని వివరించేందుకు జిల్లా జేఏసీ చేసిన కృషి పలించింది. రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ విద్యుత్, సాగునీరు వంటి రంగాల నిపుణులు పాల్గొని రాష్ట్ర విభజన జరిగితే జరిగే నష్టాలను వివరించి రైతులకు అవగాహన కల్పించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సారథులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి దిశనిర్దేశం చేశారు. రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారేయాలని సభ స్పష్టం చేసింది. సమైక్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహిస్తున్న ఉద్యోగులకు అవసరమైతే రైతులే జోలిపట్టి జీతాలు ఇస్తారని పలువురు రైతు ప్రతినిధులు ప్రకటించడం విశేషం. అందరికీ అన్నంపెట్టే రైతు జోలి పట్టకూడదని.. తమ జీతాలు రాకపోయినా, జీవితాలు ఫణంగాపెట్టి అయినా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామంటూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ రైతు గర్జన సభా వేదిక నుంచే రైతులు రంగంలోకి దిగి ఉద్యమాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లాతో పాటు రాష్ట్రస్థాయికి రైతు కమిటీలను ఏర్పాటు చేసుకుని సమైక్య ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పలువురు పిలుపునిచ్చారు. రైతు రోడ్డెక్కితే పాలకుల జాతకాలు తిరగబడతాయని, సమైక్యపోరుకు రైతు గర్జనతో ఇప్పుడు నిండుతనం వచ్చిందని పలువురు కితాబిచ్చారు. రాజీనామా చేయని నేతలు ద్రోహులే... తమ పదవులకు రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ద్రోహులుగా తేల్చిన సభ వారికి 2014 ఎన్నికల్లో ఓటు అనే బుల్లెట్‌తో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చింది. వారి పదవులకు రాజీనామా చేసేలా ఒత్తిడి పెంచాలని, వారి ఇళ్ల వద్ద మరోమారు ఆందోళనలు నిర్వహించాలని రైతు గర్జన సభ నిర్ణయించింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించుకోవడమా? ఆమోదించుకునేలా తాము రంగంలోకి దిగడమా? అనే రెండు ఆప్షన్లు ఇస్తున్నట్టు రైతు గర్జన సభ అల్టిమేటం ఇచ్చింది. పదవుల కోసం ఢిల్లీ అధిష్టానం చాటున నక్కిన కేంద్ర మంత్రులు, ఎంపీలను స్థానిక నియోజకవర్గాల్లో తిరగనీయకుండా అడ్డుకోవాలని రైతు గర్జన సభ పిలుపునిచ్చింది. రాహుల్ కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టే కాంగ్రెస్ ఆటలు సాగనిచ్చేది లేదని పలువురు వక్తలు హెచ్చరించారు. సమైక్యం కట్టుబడిన నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్.. ఎన్టీఆర్, వైఎస్సార్ సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డారని పలువురు ప్రతినిధులు కితాబిచ్చారు. కృష్ణా-గోదావరి డెల్టా ఏడారి కాకూడదన్న ఆశయంతో వైఎస్ జలయజ్ఞం చేపట్టారని, దాన్ని అడ్డుకుని కొందరు మనకు అన్యాయం చేస్తున్నారంటూ జలవనరుల నిపుణులు ఉదాహరణలతో వివరించారు. రాష్ట్రం విడిపోతే కృష్ణా-గోదావరి డెల్టా ఏడారిగా మారిపోతుందని, జలయుద్ధాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ పరుచూరి అశోక్‌బాబును పలువురు అభినందనలతో ముంచెత్తారు. కేసీఆర్ కాంగ్రెస్ తయారుచేసిన కలియుగ హంస అని, అందుకే పాలునీళ్లులా కలిసున్న సీమాంధ్ర, తెలంగాణను వేరుచేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ అశోక్‌బాబు చెప్పిన కథ అందర్నీ ఆకట్టుకుంది. ఆకట్టుకున్న నినాదాలు.. సభా ప్రాంగణానికి ఆచార్య ఎన్జీరంగా ప్రాంగణంగా నామకరణం చేశారు. సభా వేదికకు సర్ ఆర్ధర్ కాటన్ వేదికగా తీర్చిదిద్దారు. సభా ప్రాంగణంలో జై సమైక్యాంధ్ర, గ్రామ స్వరాజ్యం, జై జవాన్ జైకిసాన్, దేశానికి వెనుముక రైతన్న అనే నినాదాలను ఏర్పాటు చేశారు. ఈ సభలో విద్యార్థులు ప్రదర్శించిన సమైక్యాంధ్ర సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రైతు గర్జనలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబుతోపాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు కలగ కమలాకరశర్మ, జలవనరుల నిపుణుడు పీఏ రామకృష్ణంరాజు, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రప్రసాద్, కిసాన్ సేవా అధ్యక్షులు అక్కినేని భవాని ప్రసాద్, రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, మాదిగ దండోరా నాయకుడు వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ తదితరులు రైతులను ఉత్తేజం చేసేలా ప్రసంగించారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ ఉపాధ్యక్షుడు ఎం.సత్యానందం, నీటి సంఘాల అధ్యక్షుల రాష్ట్ర నాయకులు ఆళ్ల వెంకటగోపాలకృష్ణ, రుద్రరాజు పండురాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉత్తమరైతు గొర్రిపర్తి నరసింహారాజు యాదవ్, జిల్లా జేఏసీ అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, జాయింట్ కన్వీనర్ చలసాని ఆంజనేయులు, ఎం.వెంకటేశ్వర్లు, ఎన్ఎస్వీ శర్మ, ఎండీ ప్రసాద్, పి.సత్యనారాయణ, సుంకర సుబాష్‌చంద్రబోస్, గుంపపనేని ఉమా వరప్రసాద్, జి.వెంకటేశ్వరరావు, పీవీ రమణమూర్తి, బి.వెంకటేశ్వరావు, వీరమాచినేని సత్యప్రసాద్, త్రిపురనేని బాబూరావు, మత్తి కమాలకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒకటే లక్ష్యం...ఒకటే గమ్యం
ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. అదే సమైక్యాంధ్ర.. అంటూ సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుకోవడం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. జిల్లాలో 58వ రోజు కూడా వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ మున్సిపాలిటీలో ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు. సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం జిల్లాలో వినూత్న నిరసనలతో హోరెత్తుతోంది. 58వ రోజైన గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. విజయవాడలోని అన్ని రైతుబజార్ల సిబ్బంది, రైతులు కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. కూరగాయల దండలు ధరించి ప్రదర్శన జరిపారు. మైలవరంలోని విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు ప్రధాన రహదారిలో మూడోరోజు ధర్నా నిర్వహించారు. కలిదిండిలో సర్పంచ్ నజీమా ఆధ్వర్యంలో ముస్లింలు రిలే దీక్షలు చేశారు. ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో ఆర్ఎంపీ వైద్యులు రిలేదీక్షలు చేశారు. ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు.. పెనుగంచిప్రోలులో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై బతుకమ్మ ఆటలు, తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు అందించారు. గుడివాడ స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షల్లో గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చేపల మార్కెట్లో పనిచేసేవారు రోడ్డుపైనే చేపలు తోమి తమ నిరసన తెలిపారు. పామర్రులో జేఏసీ నాయకులు రహదారుల వెంట భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో కొత్తపేట, రామకోటిపురం రైతులు దీక్ష చేపట్టారు. నాగాయలంకలో రైతులు దీక్ష చేపట్టి, ఎడ్లబళ్లతో నిరసన తెలిపారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో ఆ మండలంలోని రైతులు ట్రాక్టర్లను నిలిపి రహదారులను దిగ్బంధించారు. 2న హనుమాన్‌జంక్షన్‌లో రైతు మహాగర్జన.. రైతుల సమస్యలను వివరించేందుకు హనుమాన్‌జంక్షన్‌లో అక్టోబర్ రెండున రైతు మహాగర్జన నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ నేత విద్యాసాగర్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 18వ వార్డు మహిళలు కూర్చున్నారు. తోట్లవల్లూరులో పొలిటికల్ జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. కూచిపూడిలో హోలీ స్పిరిట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు జేఏసీ నేతలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలతో భిక్షాటన చేశారు. నూజివీడు మండలం మర్రిబంధంలో ఉపాధ్యాయులు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. మచిలీపట్నంలో జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 31వ రోజుకు చేరాయి. కంచికచర్లలో ఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు స్థానిక జాతీయ రహదారిపై ప్రదర్శన, మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక నెహ్రూ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. నందిగామ శివారు అనాసాగరం సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. పలువురు ఉద్యోగులు రోడ్డుపై పడుకుని సమైక్య నినాదాలతో నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై వచ్చే ప్రైవేట్ బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టారు. కోత మిషన్ల యజమానుల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కనకతప్పెట్ల మేళాలతో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో కొనసాగింది. గాంధీ సెంటర్లో మానవహారం ఏర్పాటుచేశారు. జార్జి అనే వృత్తిదారుడు సమైక్యాంధ్రకు మద్దతుగా గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. 30 నుంచి సమ్మెలోకి ఇంజనీర్లు.. ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి పులిచింతల ప్రాజెక్టు, ఎన్ఎస్పీల ఇంజనీర్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. జగ్గయ్యపేటలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాల మహిళా జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడలతో నిరసన తెలిపారు. పలువురికి చేతులపై గోరింటాకుతో జై సమైక్యాంధ్ర అని చిత్రీకరించి మహిళలు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో తెలుగు ప్రజల సంృ్కతిలో భాగమైన బతుకమ్మను ఏర్పాటుచేసి, దానికి సమైక్యాంధ్ర జెండాను ఉంచి స్థానిక పాత సినిమా హాల్ సెంటర్లో పాటలు పాడారు. వత్సవాయి జేఏసీ నాయకులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. మక్కపేట గ్రామంలో విద్యార్థులు, గ్రామస్తులు కలిసి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవిలో జాతీయ రహదారిపై కార్పెంటర్లు వడ్రంగి పనులు చేపట్టి నిరసన తెలిపారు. వెంకటాపురంలో ప్రధాన రహదారిపై మహిళలు, పిల్లలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. వెంకటాపురం 11వ నంబర్ కాలువలో జలదీక్ష చేపట్టి రైతులు నిరసన తెలిపారు. ఇంజనీర్ల రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నారు. -
జంక్షన్లో ఉద్యమించిన మహిళాశక్తి
సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో మహిళలు కదంతొక్కారు. వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి స్ఫూర్తితో మేము సైతం.. అంటూ సమైక్య శంఖం పూరించారు. తాము తలచుకుంటే ఏమైనా సాధిస్తామని.. సత్తాచాటుతామని విభజనవాదులను హెచ్చరించారు. హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం రెండువేల మందికి పైగా మహిళలు భారీ ర్యాలీ చేశారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. దాదాపు ప్రతి ఊళ్లోనూ నారీమణులు ముందువరుసలో నిలిచారు.. సమైక్య సమరభేరి మోగించారు. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. మానవహారాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్యక్రమాలతో శుక్రవారం అన్ని ప్రాంతాలు అట్టుడికాయి. హనుమాన్‌జంక్షన్‌లో రెండు వేల మంది మహిళలు సమైక్య మహిళా శంఖారావం పేరిట భారీ ర్యాలీ చేశారు. కాకాని భవన్ నుంచి మొదలైన ర్యాలీ సెంటర్ వరకు సాగింది. అక్కడ భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మానవహారం నిర్మించారు. జగయ్యపేట నియోజకవర్గంలోని పేట, పెనుగంచిప్రోలు మండలాల్లో జేఏసీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పాత మున్సిపల్ సెంటర్లో పండ్ల వ్యాపారులు రిలే నిరహారదీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడో రోజు కొనసాగాయి. మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో గ్రామస్తులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ సంఘీభావం తెలిపింది. మైలవరం సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. గుడివాడలో జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న రిలేదీక్షలో స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగులు, టీచర్లు వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. పామర్రు నాలుగు రోడ్ల సెంటర్లో రాపర్ల గ్రామ సర్పంచి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 31వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్లో ఎన్జీవోల దీక్షలు 24వ రోజుకు చేరాయి. వీరికి మద్దతుగా బార్ అసోసియేషన్ సభ్యులు రిలే దీక్షలు చేశారు. శిబిరం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూజివీడులో ఆర్టీసీ, గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లిలో జేఏసీ నేతలు రహదారులు శుభ్రం చేసి నిరసన తెలిపారు. చల్లపల్లిలో ఎయిడెడ్ పాఠశాల సిబ్బంది విధులు బహిష్కరించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలంటూ అవనిగడ్డలో జరిగిన సర్వమత ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. కోడూరులో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఘంటసాలలో డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. బెజవాడలో.. విజయవాడలోని కెనాల్ గెస్ట్‌హౌస్ సమీపంలో పలు ఉద్యోగ సంఘాలు సర్వమత ప్రార్థనలు నిర్వహించాయి. వన్‌టౌన్‌లో బీసీ సంఘాలు చేపట్టిన రిలే నిరహారదీక్షల్లో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. చిట్టినగర్‌లో రాజకీయ జేఏసీ తలపెట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వన్‌టౌన్ నెహ్రూబొమ్మ సెంటర్లో క్రీడాకారుడు రవికిరణ్, సింగ్‌నగర్‌లో వైఎస్సార్ సీపీ నాయకుడు సరగడ శ్రీనివాసరెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. పాత బస్టాండ్ వద్ద దేవాదాయ శాఖ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. శ్రీ దుర్గా మలేశ్వరస్వామి దేవస్థానం ఆల్క్యాడర్ ఎంప్లాయిస్ యూనియన్ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగాయి. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సబ్ కలెక్టర్ కార్యాలం వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.