తలలు నరికి.. మెడలో వేసుకుని.. | Two women brutally murdered in Krishna District | Sakshi
Sakshi News home page

తలలు నరికి.. మెడలో వేసుకుని..

Published Fri, Jun 6 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

తలలు నరికి.. మెడలో వేసుకుని..

తలలు నరికి.. మెడలో వేసుకుని..

* తల్లీకూతుళ్లను నరికిచంపిన కిరాతకుడు
* కృష్ణా జిల్లాలో దారుణం
* వివాహేతర సంబంధమే కారణమా!

 
హనుమాన్ జంక్షన్, న్యూస్‌లైన్: తల్లీ  కూతుళ్లను దారుణంగా నరికి చం పాడో కిరాతకుడు. వారి తలలను ఒకటిగా చేసి మెడలో వేసుకుని భయానక వాతావరణం సృష్టించాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చంద్రమ్మ(53)కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మల్లెల రేణుక, రెండో కుమార్తె పల్లపు చిన్ని(23) గ్రామంలోనే ఉంటుండగా, చిన్న కుమార్తె చల్లా శివ పోలసానిపల్లెలో నివసిస్తోంది. చిన్నిభర్త చనిపోవడంతో మూడేళ్లుగా కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది.
 
 ఆగిరిపల్లి మండలం కృష్ణవరానికి చెందిన అరటిపళ్ల వ్యాపారి పోట్రు శివనాగరాజు(25) తరచూ మల్లవల్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం మూడో కుమార్తె శివతో కలసి చంద్రమ్మ చిన్ని ఇంటికి వచ్చింది. రాత్రి ఏడు గంటల సమయంలో చిన్ని ఇంటికి శివనాగరాజు వచ్చి ఆమెతో ఘర్షణ పడ్డట్లు సమాచారం.  గతంలోనూ ఆమెతో శివయ్య అసభ్యంగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. రాత్రి 11గంటలకు మరోసారి రావడంతో వారి మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఉదయం అరటి చెట్లునరికే రెండు కత్తులతో శివనాగరాజు చిన్ని ఇంటికి వచ్చాడు. వంట చేస్తున్న చిన్ని మెడపై ఒక్కసారిగా కత్తితో వేటువేశాడు. రెండో కత్తితో మెడ నరకడంతో మొండెం నుంచి తల వేరుపడింది. తల్లి చంద్రమ్మ అడ్డువెళ్లగా ఆమెను కూడా తల, మొండెం వేరయ్యేలా నరికేశాడు. అనంతరం తల్లీకూతుళ్ల తలలు మెడలో వేలాడదీసుకుని సమీపంలో వున్న రాయిపై కూర్చున్నాడు. తర్వాత వాటిని రోడ్డుపై పడేసి వెనుతిరిగాడు. కాగా, వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించడం వల్లే తమ సోదరి, తల్లిని శివయ్య హత్య చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement