
సాక్షి,విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇంటర్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. రెండు ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఓ విద్యార్థిని విషయంలో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. పరీక్షకు ముందు ఎగ్జామ్ సెంటర్ సమీపంలోని జిరాక్స్ సెంటర్ వద్ద ఓ కాలేజీ విద్యార్థినితో చిన్న వాగ్వాదం జరిగింది. అది చిలికి చిలికి.. కూల్ డ్రింక్ బాటిళ్లతో తలల పగలగొట్టేంత ఘర్షణకు దారి తీసింది.
స్థానికులు వద్దని వారిస్తున్నా వినని విద్యార్థులు షాపుల్లో ఉన్న కూల్‌డ్రింక్ బాటిళ్లతో దాడులకు దిగడంతో భీతావాహ పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment