సాక్షి, కృష్ణా జిల్లా: హనుమాన్ జంక్షన్‌లో జన సైనికులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దుపై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. స్థల వివాదం సెటిల్‌మెంట్ చేస్తున్న సమయంలో ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. కొట్టుకునేందుకు సమయం చెప్పి ఇరువర్గాలు ఘర్షణకు సిద్ధమయ్యాయి.
గన్నవరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. ఒక వర్గానికి నాయకత్వం వహించారు. ఆయన వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment