
బ్యూటీషియన్ పద్మ , నిందితుడు నూతన్ కుమార్
విజయవాడ: బ్యూటీషియన్ పిల్లి పద్మ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యూటీషియన్‌పై దాడి చేసిన తర్వాత పరారైన నూతన్ కుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు-నరసరావు పేట మధ్య రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం నూతన్ మృతదేహం లభించింది. బ్యూటీషియన్‌పై దాడి అనంతరం నూతన్ కుమార్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. నూతన్ కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ఆరంభించిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.