
విజయవాడ: బ్యూటీషియన్ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. హత్యాయత్నానికి గురైన పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది. నిందితుడు నూతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజుల క్రితం నూతన్ కుమార్‌తో పద్మగొడవపడినట్లు సమాచారం. వివాహేతర సంబంధం వికటించడం వల్లే హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ, హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. కుటుంబకలహాలతో భర్త సూర్యనారాయణతో వేరుగా ఉంటుంది. ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో తారకరామ కాలనీలో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నూతన్ కుమార్, పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కాళ్లూ, చేతులూ కట్టేసి కత్తితో రెండు చేతులూ నరికేసి హింసించినట్లు తెలుస్తోంది. అనంతరం నూతన్ కుమార్ పరారయ్యాడు.
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment