Sunkara Padma shri
-
ఏపీ కాంగ్రెస్‌లో ముదురుతున్న వార్
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్‌లో వార్ ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. షర్మిళ, మాణిక్యం ఠాకూర్ అవినీతికి పాల్పడ్డారని పద్మశ్రీ, రాకేష్‌రెడ్డి ఆరోపించారు. వాళ్లు చేసిన ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.నోటిసులకు సమాధానం ఇచ్చిన పద్మశ్రీ, రాకేష్ రెడ్డి.. 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారని తెలిపారు. అన్ని కమిటీలు రద్దు చేసినప్పుడు క్రమ శిక్షణ కమిటీ కూడా రద్దవుతుందని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న విధంగా వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న ఎవరికి ఇవ్వాలో అయోమయంలో ఉన్నామని నేతలు అంటున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. -
పద్మశ్రీ నోరు అదుపులో పెట్టుకో, లేదంటే..!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెపై మంగళవారం కృష్ణలంక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పద్మశ్రీపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాగ్రహంతోనే ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమైందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మనుగడ కోసంనోరుపారేసుకుంటే గుణపాఠం చెబుతామన్నారు. ఇకనైన పద్మశ్రీ నోరు అదుపులో పెట్టుకోకుంటే చెప్పుల దండలతో సత్కరిస్తామంటూ మహిళా నేతలు హెచ్చరించారు. -
ముదిరిన వల్లభనేని వంశీ,సుంకర పద్మశ్రీ వివాదం
-
అరాచకాలు బయటపెట్టినందుకే అక్రమ కేసులు
-
ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిపై కేసు
సాక్షి, ఉంగుటూరు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై కేసు నమోదయింది. తన కుమారుడు చెరువులో పడి మృతి చెందగా పరిహారంగా వచ్చిన డబ్బును కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఇవ్వడం లేదని పఠాన్ మరియంబీ అనే మహిళ ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో బాధితురాలు మరియంబీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకురాగా, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. రెండేళ్ల కిందట తన కుమారుడు ఓ డైరీలో ఫాంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ పక్కనున్న చెరువులో పడి చనిపోయాడని, డైరీ ఫాం యజమానిపై ఎటువంటి కేసు లేకుండా ఉండేందుకు గానూ సుంకర పద్మశ్రీ మధ్యవర్తిత్వం చేసి డబ్బుకు తీసుకున్నారని మరియంబీ తెలిపారు. యజమాని దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇవ్వకుండా కాజేశారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుంకర పద్మశ్రీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరాచకాలు బయటపెట్టినందుకే అక్రమ కేసులు: సుంకర పద్మశ్రీ తనపై కేసు పెట్టడంతో సుంకర పద్మశ్రీ స్పందించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చేస్తున్న అరాచకాలను బయట పెట్టినందుకు తనపై అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. చిక్కవరంలోని బ్రహ్మలింగయ్య చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో కోట్ల రూపాయలు దోచుకున్న విషయాన్ని బయటపెట్టినందుకు కక్ష గట్టారని తెలిపారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో పఠాన్ మరియంబీ అనే మహిళతో కేసు నమోదు చేయించారని వెల్లడించారు. అసలు ఆమెతో తనకు సంబంధం లేదని, తన కుమారుడు టీడీపీ నేత డైరీ ఫాంలో పడి మృతి చెందితే నాకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ తనకు విన్నవించుకున్నదని చెప్పారు. ఆమెకు న్యాయం చేయాలంటూ ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కు పంపిన సంగతి వాస్తవమన్నారు. వంశీమోహన్ నియోజకవర్గ పరిధిలో చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్నందుకు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేయించారని వివరించారు. -
చింతమనేని దమ్ముంటే నాపై దాడిచెయ్..!
హనుమాన్ జంక్షన్ : టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కి దమ్ము ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సవాల్ విసిరారు. బుధవారం ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పోస్టర్‌ను సుంకర పద్మశ్రీ చించేశారు. అనంతరం 11 గంటలకు హనుమాన్ జంక్షన్‌కి వచ్చి దాడి చేయాలని సవాల్ చేశారు. సవాల్ విసిరినా పిరికిపందలా చింతమనేని రాలేదని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని మండిపడ్డారు. అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అధికార మదంతో టీడీపీ నాయకులు పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.దాడి చేసిన చింతమనేని వదిలి పెట్టి పోలీసులు సామాన్య ప్రజలపై కేసులు నమోదు చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు. -
చంద్రబాబుకు అంత ధైర్యం లేదు: పద్మశ్రీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు నాయుడు.. నీతి ఆయోగ్ సమావేశంలో నిధుల కోసం ప్రాధేయపడటాన్ని దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. గడిచిన మూడేళ్లలో నాలుగు లక్షలమందికిపైగా కూలీలు వలసవెళ్లినా చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సోమవారం విజయవాడలోని పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 'ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈ మధ్య చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి. తప్పుడు మాటలతో పరిపాలన సాగిస్తోన్న ఆయనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే' అని పద్మశ్రీ అన్నారు. టీడీపీ సర్కారు ప్రాథమిక వైద్య కేంద్రాలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ధనేకుల మురళీ, మీసాల రాజేశ్వరరావు, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
ధరల పెరుగుదలతో దుర్భరం
పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆనందపేట (గుంటూరు)/గుంటూరు ఈస్ట్ : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుకుని సామాన్యుడి జీవితం దుర్భరంగా మారిందని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేజీ రూ.60 ఉన్న కందిపప్పు, నేడు రూ.150కు చేరడం తెలుగుదేశం పార్టీ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, మహిళ కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, వణుకూరి శ్రీనివాసరెడ్డి, సవరంరోహిత్, మొగలి శివకుమార్ పాల్గొన్నారు. పాలన దళారులకు అప్పజెప్పారు! గుంటూరు ఈస్ట్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్యుల సమస్యలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని టీడీపీ దళారులకు అప్పచెప్పారని పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ దుయ్యబట్టారు. గుంటూరులో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ దళారులు నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే ప్రభుత్వం చూసీచూడనట్టు పోతోందని విమర్శించారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మానస్, మాజీ ఎమ్యెల్యే మస్తాన్ వలీ తదితరులు మాట్లాడారు.