![Congress Disciplinary Committee Notices To Sunkara Padma Shri And Rakesh Reddy](/styles/webp/s3/article_images/2024/06/26/CongressParty.jpg.webp?itok=WyzfcA64)
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్‌లో వార్ ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. షర్మిళ, మాణిక్యం ఠాకూర్ అవినీతికి పాల్పడ్డారని పద్మశ్రీ, రాకేష్‌రెడ్డి ఆరోపించారు. వాళ్లు చేసిన ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.
నోటిసులకు సమాధానం ఇచ్చిన పద్మశ్రీ, రాకేష్ రెడ్డి.. 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారని తెలిపారు. అన్ని కమిటీలు రద్దు చేసినప్పుడు క్రమ శిక్షణ కమిటీ కూడా రద్దవుతుందని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న విధంగా వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న ఎవరికి ఇవ్వాలో అయోమయంలో ఉన్నామని నేతలు అంటున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment