
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెపై మంగళవారం కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పద్మశ్రీపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాగ్రహంతోనే ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమైందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మనుగడ కోసంనోరుపారేసుకుంటే గుణపాఠం చెబుతామన్నారు. ఇకనైన పద్మశ్రీ నోరు అదుపులో పెట్టుకోకుంటే చెప్పుల దండలతో సత్కరిస్తామంటూ మహిళా నేతలు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment