మరోసారి చింతమనేని హల్ చల్ | Traffic police complaint on chinthamaneni prabhakar to sp | Sakshi
Sakshi News home page

మరోసారి చింతమనేని హల్ చల్

Published Mon, Oct 3 2016 12:33 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

మరోసారి చింతమనేని హల్ చల్

మరోసారి చింతమనేని హల్ చల్

ఏలూరు:
అధికారపార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. పాత బస్టాండ్ వద్ద చలానా రాస్తున్న ఏలూరు ట్రాఫిక్ పోలీసులపై చిందులు వేశారు. చలాన్లు ఎందుకు రాస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చలాన్లు చెల్లించడానికి వచ్చిన ప్రజలను చింతమనేని అక్కడి నుంచి పంపించారు.

గతంలోనూ ట్రాఫిక్ చలాన్లు రాయొద్దంటూ పోలీసులను చింతమనేని హెచ్చరించారు. విధులకు ఆటంకం కలిగించిన చింతమనేనిపై ట్రాఫిక్ పోలీసులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తరచూ విధులకు ఆటంకం కలిగిస్తే ఉద్యోగాలు చేయలేమంటూ ట్రాఫిక్ సిబ్బంధి వాపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement