టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్
ఏలూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సైపై దౌర్జన్యం చేసిన కేసులో ఆయను పెదవేగి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు డబ్బలు పంచుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రభాకర్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి తన అనుచరుల్ని అక్రమంగా విడిపించుకునిపోయారు. ఈ సంఘటనపై పెదవేగి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.