
మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని ఏలూరు జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
ఏలూరు టౌన్: మాజీ ఎమ్మెల్యే చింతమనేని మూడోసారి అరెస్టు అయ్యారు. జిల్లా జైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈనెల 11న అరెస్టులో న్యాయమూర్తి విధించిన 14 రోజుల రిమాండ్ బుధవారంతో ముగియనుంది. దీంతోపాటు మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్‌పై పోలీసులు న్యాయస్థానం ముం దు హాజరుపరిచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చింతమనేనిని జైలు నుంచి కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా చింతమనేని తన నోటి దురుసు ప్రదర్శించారు. బుధవారం జైలు నుంచి బయటకు వస్తోన్న సమయంలోనూ, కోర్టు ఆవరణలోనూ చింతమనేని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అబాసుపాలయ్యారు.
బందోబస్తు నిర్వహిస్తోన్న పోలీసు అధి కారులు, సిబ్బందిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలపాలవుతున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి న్యాయమూర్తి చింతమనేనికి అక్టోబర్ 9 వరకు, మరో కేసులో అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించారు. ఆయా కేసుల్లో అరెస్టు అవుతూ జైలులో ఉంటున్న చింతమనేని తన తీరు మార్చుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో పోలీసులతో అనుచిత వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోర్టు నుంచి బయటకు తరలిస్తోన్న సమయంలో చేయిపట్టుకునేందుకు ప్రయత్నించిన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావుపై దుర్భాషలాడారు.