
చింతమనేనిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి
పశ్చిమ గోదావరి ,పెదవేగి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పితృవియోగం కలిగింది. మండలంలోని దుగ్గిరాల్లోని ప్రభాకర్‌స్వగృహంలో ఆయన తండ్రి చింతమనేని కేశవరావు(86) మంగళవారం ఉదయం మృతిచెందారు. ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, సొసైటీ అధ్యక్షుడు వడ్లపట్ల శ్రీనివాసరావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం చింతమనేనిని పరామర్శించారు.