
సాక్షి, అమరావతి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లోగా ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం అన్ని వివరాలను ఇవ్వాలని కమిషన్ కోరింది. 15రోజుల్లోగా నివేదిక రాకపోతే అధికారులు కోర్టుకు హాజరయ్యేలా సమన్లు ఇవ్వనన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment