National Commission for Scheduled Castes
-
బీజేపీ దళిత వ్యతిరేకి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌లో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తంచేశారు. దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడే బాధ్యత కలిగిన కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు కీలక పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే అధికార బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. దళితుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని గుర్తుచేశారు. కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చడం రాజ్యాంగంపై, దళితుల సామాజిక హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని, కమిషన్‌లో ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ అచేతనంగా మిగిలిపోతే దళితులు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదులపై ఎవరు స్పందించారని ప్రశ్నించారు. -
హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి
చండీగఢ్: పంజాబ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది గ్రామస్తులు దళిత దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సదరు కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను, ఆమె తల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, పంజాబ్‌లోని ఫాజిల్కా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ అమానుషాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (ఎన్సీఎస్సీ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించి, నిందితులను పట్టుకోవాలని పంజాబ్ పోలీసు అధికారులను ఆదేశించింది. కాగా, విచారణ వివరాలను మెయిల్ ద్వారా తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ కేసుపై పోలీసు అధికారులు జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
దళిత బంధుపై తెలంగాణ సర్కార్‌కు ఎస్సీ కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్సీ కమిషన్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. 'దళిత' పదం స్థానంలో 'అంబేడ్కర్' పదం చేర్చాలంటూ పిటిషర్ కోరాడు. విచారణ చేపట్టిని కమిషన్... దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం నోటీసులు ఇచ్చింది. -
మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలి
సాక్షి, హైదరాబాద్ : నగరలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలిక మహాలక్ష్మిపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌ను కఠిన శిక్షించాలని ఆల్ ఇండియా దళిత హక్కుల ఫోరం (ఏఐడీఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన షకీల్‌ను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. దళిత బాలికపై అత్యాచారాన్నితీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. గతంలో దిశపై అత్యాచారం చేసిన వాళ్ళను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, మరి దళిత బాలికకు అన్యాయం చేసిన వారిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదని ప్రశ్నించారు. (శిక్ష తప్పదు: సత్యవతి రాథోడ్) శనివారం కందుల ఆనందరావు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించాల్సిన అవసరం లేదు. వారికి నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేసేలా ప్రభుత్వం మీద పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇటీవల న్యాయస్థానాలు దళిత గిరిజనులు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడంతో మాకు న్యాయస్థానాల మీద నమ్మకం కూడా రోజు రోజుకి సడలిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్షను వేయాలి’ అని డిమాండ్ చేశారు. ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ.. తక్షణ పరిహారం అందించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. మరోవైపు బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇదివరకే స్పష్టం చేశారు. -
శిక్ష తప్పదు: సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆమె అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలుసుకున్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ.. తక్షణ పరిహారం అందించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. (చదవండి: మద్యం ఎక్కువ తాగాడని హత్య) -
చింతమనేనిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
సాక్షి, అమరావతి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లోగా ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం అన్ని వివరాలను ఇవ్వాలని కమిషన్ కోరింది. 15రోజుల్లోగా నివేదిక రాకపోతే అధికారులు కోర్టుకు హాజరయ్యేలా సమన్లు ఇవ్వనన్నట్లు పేర్కొంది. చదవండి: దళితులను తీవ్రంగా అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే -
'10 రోజుల్లో భూముల రికార్డులు అందజేయాలి'
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో దళితుల పట్ల వివక్షతపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ విచారణ చేపట్టారు. ల్యాండ్ పూలింగ్, లంక అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను 10 రోజుల్లోగా అందజేయాలని సీఆర్డీఏ కమిషన్ శ్రీధర్, గుంటూర్ జేసీ శుక్లాలను కమలమ్మ ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, గుంటూర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుక్లా హాజరుకాగా, హాజరుకాని రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ అదికారులపై కమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతులపై ఎందుకు వివక్షత చూపుతున్నారంటూ అధికారులను ఆమె ప్రశ్నించారు. కమిషన్ సభ్యురాలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేదని సమాచారం. ప్రజల కోసం రాజధాని నిర్మించాలని, అప్పుడే అది ప్రజా రాజధాని అవుతుందని అధికారులకు కమలమ్మ సూచించారు. -
'10 రోజుల్లో భూముల రికార్డులు అందజేయాలి'