
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్సీ కమిషన్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. 'దళిత' పదం స్థానంలో 'అంబేడ్కర్' పదం చేర్చాలంటూ పిటిషర్ కోరాడు. విచారణ చేపట్టిని కమిషన్... దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం నోటీసులు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment