హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి | Dalit Couple Daughter Tied To Tree Thrashed And Sexually Harassed In Punjab | Sakshi
Sakshi News home page

హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి

Published Mon, Aug 30 2021 7:23 PM | Last Updated on Mon, Aug 30 2021 8:28 PM

Dalit Couple Daughter Tied To Tree Thrashed And Sexually Harassed In Punjab - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లో​ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది గ్రామస్తులు దళిత దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సదరు కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మైనర్‌ బాలికను, ఆమె తల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, పంజాబ్‌లోని ఫాజిల్కా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

ఈ అమానుషాన్ని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ (ఎన్‌సీఎస్‌సీ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించి, నిందితులను పట్టుకోవాలని పంజాబ్‌ పోలీసు అధికారులను ఆదేశించింది. కాగా,  విచారణ వివరాలను మెయిల్‌ ద్వారా తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ కేసుపై పోలీసు అధికారులు జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యా​ప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పంజాబ్‌ పోలీసులు తెలిపారు. 

చదవండి: మైనర్‌ను ట్రాప్‌ చేసి పెళ్లి చేసుకున్న యువతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement