chandighar
-
మరో ఆప్ నేత నివాసంలో ఈడీ సోదాలు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) నేత దీపక్ సింఘ్లా నివాసంతో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. పలువురు ఆప్ నేతల సన్నిహితుల నివాసాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. తాజాగా ఈడీ పంజాబ్‌పై కూడా పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో చండీగడ్‌లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ రాడార్‌లో మరో ఆప్ నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ కక్షలతో బీజేపీ తమపై ఈడీ దాడులు చేయిస్తుందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. #WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Delhi and NCR among places including the residence of AAP leader Deepak Singla: Sources pic.twitter.com/Q1pJ34Ms7r — ANI (@ANI) March 27, 2024 ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరీంగ్ కేసులో సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆప్ నేతలపై తాజాగా జరుగుతున్న ఈడీ సోదాలతో లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
బీజేపీ దొంగిలిస్తే.. మేం తిరిగి గెలిచాం: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించింది. సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించిన తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విటర్ ) వేదికగా సుప్రీం కోర్టు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇటువంటి కఠిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు’అని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్షాల ‘ఇండియా ఇండియా’తొలి విజయమని అన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నిరంకుశత్వంతో దొడ్డిదారిలో గెలుపొందాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. Thank you SC for saving democracy in these difficult times! #ChandigarhMayorPolls — Arvind Kejriwal (@ArvindKejriwal) February 20, 2024 ఎన్నికల్లో ముందు బీజేపీ దొంగమార్గంలో గెలిచింది.. కానీ మేము మళ్లీ గెలిచి మేయర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాం. ఇది ఇండియా కూటమికి అతిపెద్ద విజయం. బీజేపీని ఓడించలేమనేవారు.. తెలుసుకోవాలి ఓడిస్తామని. ఇండియా కూటమి భాగస్వామ్య నేతలకు ధన్యవాదాలు. ఇది చండీగడ్ ప్రజల విజయం’అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. చదవండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
చంఢీగఢ్ మేయర్ ఎన్నికలు: సుప్రీం కోర్టు సీరియస్
చంఢీగఢ్: చంఢీగఢ్‌లో మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్ మనోజ్ సోంకర్ చేతిలో ఓటమి పాలైన ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ ధరోర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన బాలెట్ పేపర్లు, ఒరిజినల్ రికార్డులు, వీడియో ఫుటేజీని పంజాబ్, హర్యానా కోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బాలెట్ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా తెలుస్తోంది? ఈ చర్యతో అతను ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటానికి ప్రయత్నించారా? అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తాము అనుమతించమని సుప్రీంకోర్టు పేర్కొంది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొంది. ఇక.. ఫిబ్రవరి 7న జరగాల్సిన చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు తిరిగి ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్‌లో మొత్తం 36 ఓట్లు ఉండగా.. బీజేపీ మేయర్ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 మంది ఆప్-కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఈ ఫలితాలపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని మండిపడింది. -
ఆలా లారీ లో రాహుల్
-
దయచేసి ఆ వీడియోలు షేర్ చేయొద్దు.. సోనూసూద్ విజ్ఞప్తి
పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దయచేసి ఎవరూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం వారికి పూర్తి అండగా నిలవాలని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ కోరారు. 'చండీగఢ్ యూనివర్శిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ కష్ట సమయంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయంలో మన సిస్టర్స్‌కు అండగా నిలుద్దాం. దయచేసి ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు షేర్ చేయొద్దు. ఇది మనందరికీ పరీక్ష సమయం. బాధ్యత గల పౌరులుగా మన బాధితుల తరఫున నిలుద్దాం' అని ట్విట్టర్లో సోనూసూద్ కోరారు. Something that happened in Chandigarh University is very unfortunate. It’s time for us to stand with our sisters and set an example of a responsible society. These are testing times for us, not for the victims. Be responsible 🙏 — sonu sood (@SonuSood) September 18, 2022 అసలేం జరిగిందంటే: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సీటీలోని హాస్టల్లో దాదాపు 60 మంది యువతుల ప్రైవేటు వీడియోలను వారితో కలిసి ఉండే మరో యువతి తీయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ వీడియోలు ఆ యువతి స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ కావడంతో బాధిత యువతులు ఆందోళనకు దిగారు. కొంతమంది బాధితులు ఆత్మహత్యకు కూడా యత్నించారు. అయితే ఈ ఘటనను పోలీసులు, యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. -
దేశంలో అక్కడ 36 గంటలు కరెంట్ కట్.. ఆందోళనలో ప్రజలు
ఛండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం ఛండీగఢ్‌లోని ప్రజలు 36 గంటల పాటు అంధకారంతో మగ్గిపోయారు. కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిపిపోవడంతో నీటి సరఫరా, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఛండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ఛండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ లైట్లు వెలగలేదు. ఆన్లైన్ క్లాసులకు, ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఆసుపత్రుల్లో వైద్య సేవలను జనరేటర్ సాయంతో అందించినప్పటికీ కొన్ని శస్త్ర చికిత్సలను మాత్రం వాయిదా వేసినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, 36 గంటల పాటు కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్లలో ఛార్జింగ్ లేక ప్రజలు పక్క నగరాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు క్యూ కట్టారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఛండీగఢ్ పాలనా యంత్రాంగం రంగంలోకి దిగింది. విద్యుత్ విభాగంలోని ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధించింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ ఉద్యోగులు మాత్రం సమ్మె విరమించకపోవడం గమనార్హం. సిబ్బంది ఇప్పటికీ విధులకు హాజరు కాకపోవడంతో బుధవారం కూడా పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, పంజాబ్, హర్యానా హైకోర్టు ‘విద్యుత్ సంక్షోభం’పై సుమోటో నోటీసును స్వీకరించింది. కేంద్రపాలిత ప్రాంత చీఫ్ ఇంజనీర్‌ను బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం!
వందేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైప శిరోమణి అకాలీదళ్ తర్వాత శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (గురుద్వారాల పాలనా వ్యవహారాలు చూసే సంస్థ) అవసరాల నిమిత్తం రాజకీయ పార్టీగా అవతరించింది. గత ఏడాది డిసెంబర్ 14న 101 వార్షికోత్సవాన్ని జరుపుకొన్న ఈ పార్టీ ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో అత్యంత కఠిన పరిస్థితులకు ఎదురీదుతోంది. సిక్కుల పార్టీగా దశాబ్దాలు హవా చలాయించిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కి ఈ పరిస్థితి రావడానికి 2007 నుంచి 2017 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. అధికారం కోల్పోయి ఐదేళ్లవుతున్నా.. ఆ కాలంలో పడిన ముద్రను తొలగించుకోవడానికి ఇప్పటికీ ఎస్ఏడీ గింజుకుంటూనే ఉంది. మరోవైపు పంజాబ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల పాటు అకాలీదళ్– కాంగ్రెస్‌ల మధ్యే ద్విముఖ పోరు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం. బీజేపీ-అమరీందర్ కూటమి, రైతు సంఘాలతో కూడిన సంయుక్త సమాజ్ మోర్చాలతో ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. అకాలీదళ్ స్వయం కృతాపరాధానికి కారణాలేమిటి, వాటి నుంచి బయటపడటానికి ఎస్ఏడీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రస్తుత పార్టీ పరిస్థితిపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం.. ముందు నుంచే దిద్దుబాటు చర్యలు ► జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్... ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ పోయారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు చోటిచ్చారు. ► మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం రగిలిపోతుండటాన్ని గ్రహించిన సుఖ్బీర్ బీజేపీతో రెండు దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకొని... ఎన్డీయే నుంచి బయటికి వచ్చేశారు. ► భారత్‌లో మరే రాష్ట్రంలో లేనంతగా... పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుఖ్బీర్ 2021 జూన్‌లోనే బీఎస్పీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 నియోజకవర్గాలను కేటాయించారు. 2007లో 4.17 ఓట్ల శాతాన్ని, 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 ఓట్ల శాతాన్ని సాధించిన బీఎస్పీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి దారుణంగా దెబ్బతింది. 1.59 శాతం ఓట్లు మాత్రమే పొందింది. ► అకాలీదళ్ అధికారంలోకి వస్తే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, ఇందులో ఒకటి బీఎస్పీకి కేటాయిస్తామని సుఖ్బీర్ ప్రకటించారు. దళిత ఓట్లను సాధ్యమైనంతగా ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎంను బీఎస్పీకి ఆఫర్ చేశారు. ఎన్నెన్నో కారణాలు... ► ఏఎస్డీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయింది. ► ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ► పంజాబ్ డ్రగ్స్ వాడకానికి భారత్‌లో కేంద్ర స్థానంగా మారిపోయింది. ‘ఉడ్తా పంజాబ్ (నిషాలో తేలిపోయే పంజాబ్)’గా పేరు స్థిరపడిపోయే స్థాయిలో ఇక్కడి యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ► 2015 ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం.. ఎయిమ్స్, మరో స్వచ్చంద సంస్థతో కలిపి నిర్వహించిన సర్వేలో పంజాబ్‌లో 2.32 లక్షల మంది డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలయ్యారని తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో (మైనారిటీ తీరిన వారిలో) 1.2 శాతం మంది డ్రగ్స్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న వారి సంఖ్య 8.6 లక్షలుగా ఉందని తేలింది. ► 2015లో అక్టోబరులో సిక్కుల పవిత్రగ్రంధం... గురు గ్రంధ్ సాహిబ్‌ను కొందరు దుండగులు అపవిత్రం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సిక్కులపైకి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన శిరోమణి అకాలీదళ్‌పై ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా పెంచేసింది. ► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎస్డీ కేవలం 15 స్థానాలు మాత్రమే సాధించి... అవమానకరంగా మూడోస్థానానికి పడిపోయింది. సిక్కుల ఆత్మగౌరవ నినాదం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్నా... పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారపర్వంలో చురుకుగా పాల్గొనడం లేదు. ఇక ఆమె పంజాబ్‌పై దృష్టి సారించడంపై అకాలీదళ్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. పైగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెచ్చిన సమయంలో శిరోమణి అకాలీదళ్ నరేంద్ర మోదీ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పదేపదే లేవనెత్తుతూ ఎస్ఏడీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. రైతుల్లో ఆగ్రహం తగ్గి అకాలీదళ్‌ను పూర్వస్థాయిలో ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రకాశ్‌సింగ్ బాదల్ హయాంలో అయితే రైతుల్లో అనేక మంది తరతరాలుగా అకాలీదళ్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ నేటితరం ఆలోచన మారుతోంది. రాజకీయాల్లో వారు కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఫలితంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే సుఖ్బీర్ తండ్రిపై రైతుల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచుకోవాలనే ఉద్దేశంతో 94 ఏళ్ల వయసులో ఆయన్ను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తున్నారు. గతంలో ఐదుసార్లు పంజాబ్ సీఎంగా వ్యవహరించిన ప్రకాశ్ సింగ్ బాదల్ భారత్‌లో అత్యధిక వయసులో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గడం, కొత్త ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నామనే అంశాన్ని గ్రహించిన సుఖ్బీర్ సిక్కుల ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు. బెంగాల్‌ను బెంగాలీలే పాలించుకుంటారని, బయటివారు ఇక్కడ అక్కర్లేదంటూ ప్రచారం చేసి బీజేపీని మట్టికరిపించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందిన సుఖ్బీర్ ఇప్పుడు అకాలీదళ్‌కు ఏకైక పంజాబీ ప్రాంతీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అకాలీదళ్ ప్రస్తుతం ఎదురీదుతోంది. పంజాబ్‌లో ఈనెల 20 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కెడ (అకాలీదళ్ ఎన్నికల గుర్తు కూడా) ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.! -
కాంగ్రెస్‌కు పోటీయే లేదు.. పంజాబ్ మళ్లీ మాదే
కాంగ్రెస్‌దే గెలుపన్న ఆత్మవిశ్వాసం. కలిసికట్టుగా పనిచేస్తే ఎవరూ పోటీకి రాలేరన్న ధీమా, కేజ్రివాల్‌పై విమర్శలు, భగవంత్ మాన్‌పై వ్యక్తిగత దాడి.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా బయటపెట్టారు. ప్రశ్న : సీఎం అభ్యర్థి కోసం పోటీ పడినపీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? జవాబు: ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని సిద్ధూ చెప్పారు. అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. ఇక మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి? మేము ఈ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం. టీమ్ వర్క్ చేసి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తాం. ప్రశ్న : కాంగ్రెస్ గెలిస్తే మీరు మరబొమ్మ సీఎంగా మారిపోతారని మాయావతి అంటున్నారు? దళితులు ఢిల్లీ చేతుల్లో ఉండాలా అన్న ఆమె ప్రశ్నలకు మీ సమాధానం? జవాబు: మాయావతి పంజాబ్‌లో కేవలం 20 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ శిరోమణి అకాలీదళ్ పోటీ పడుతోంది. అంటే దళితులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఈ విషయం ఆమె తెలుసుకోవాలి. నాకు ఈ కులాల రాజకీయాలు తెలీవు. పార్టీలో నాకు మద్దతు ఉందని సీఎం అభ్యర్థిని చేశారు. దళితుడినని చెయ్యలేదు. ప్రశ్న : ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడుని అడ్డుకోగలరా ? జవాబు: అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. మొదట్లో ఆయన ఆబ్కీ బార్ కేజ్రివాల్ పేరిటప్రచారానికి రూ.200–400 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు దానిని ఆమోదించకపోవడంతో భగవంత్ మాన్‌ను తీసుకువచ్చారు. కేజ్రివాల్ కన్న కలలు పంజాబ్‌లో నెరవేరవు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాలించే నాయకుల్ని ప్రజలు తిరస్కరిస్తారు. ప్రశ్న : భగవంత్ మన్ మీతో పోటీ పడగలరా ? జవాబు: భగవంత్ మన్ నాకు ఎప్పటికీ పోటీ కాలేరు. పన్నెండో తరగతి పాస్ కావడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. నేను పీజీ చేశాను. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్నాను. ఆయన తాగుడు మానేశానని అంటున్నారు. ఒక్కసారి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి ఫోన్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. -
Punjab Election 2022: ‘సీఎం అభ్యర్థి చాయిస్.. చాన్స్ కాదు’
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ స్వరం మారుతోంది. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న ఆయన ఇన్నాళ్లూ సీఎం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉందని అంటూ వచ్చారు. పార్టీ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను టెలి ఓటింగ్ ద్వారా ప్రారంభించిన కాంగ్రెస్ రేపో మాపో ఒక ప్రకటన చేస్తుందనుకున్న సమయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇసుక మాఫియా ఆరోపణలపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన రోజు సిద్ధూ నేరుగా చన్నీపైనే తన అస్త్రాలను సంధించారు. ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అభ్యర్థికి నీతినిజాయితీలే ముఖ్యమంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం ఒక్కటే చాలదని ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండాలంటూ తాను ఎంతకైనా తెగిస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ప్రశ్న: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎలాంటివారై ఉండాలి ? జవాబు: కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని, క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని ఎంపిక చేయాలి. కనీసం 17 ఏళ్ల ట్రాక్ రికార్డు చూడాలి. నైతికత కోల్పోయిన వారిని, అవినీతి, బంధుప్రీతి, మాఫియాతో సంబంధాలున్న వారిని ఎంపిక చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎన్నికల్లో పార్టీని నిలువునా పాతిపెడతారు. ప్రశ్న: మీరు సీఎం అభ్యర్థి అయ్యే అవకాశాలు ఏమేరకు ఉన్నాయంటారు? జవాబు: నేనే సీఎం అభ్యర్థినని అనుకోవడం లేదు. అలా చెబితే అది అహంకారమే అవుతుంది. కానీ నేను ఒక్క మాట చెప్పగలను. నవజోత్ సింగ్ సిద్ధూ అంటే అల్లాటప్పా వ్యక్తి కాదు. సెలెబ్రిటీ హోదాలో ఉండి ఆరు ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తుల్ని మీరు ఎంతమందిని చూశారో చెప్పండి. వాస్తవానికి ప్రజలే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ప్రజావాణినే ఆ దేవదేవుడి శాసనంగా భావించాలి. ప్రశ్న: కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఆమోదయోగ్యమేనా? జవాబు: నాకు అంగీకారమా కాదా అన్నది విషయం కాదు. ఆ నాయకుడికి ప్రజామోదం లభించాలి. ఎమ్మెల్యేల మద్దతు కూడా కచ్చితంగా ఉండాలి. ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరైనా సీఎం కాగలరా? కనీసం 60 మంది ఎమ్మెల్యేల మద్దతైనా ఉండాలి. ప్రశ్న: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? జవాబు: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి నీతి నిజాయితీ కలిగిన వారి నాయకత్వం అత్యంత అవసరం. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. సీఎం అభ్యర్థి ఎప్పుడైనా ఛాయిస్ అవాలి. అంతే తప్ప చాన్స్ తీసుకోకూడదు (విస్తృత ప్రజామోదం ఉన్న నాయకుడు కావాలేగాని... అధిష్టానం ఎంపిక చేసిన ఎవరో ఒకరు కాకూడదు). ఎవరికి పార్టీని గెలిపించే సత్తా ఉందో కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాలి. మాఫియా దందాలు చేసే వ్యక్తి పార్టీ కార్యక్రమాలను అమలు చేయగలరా? అవినీతిపరుల్ని కాపాడేవారికి పగ్గాలు అప్పగిస్తే, వాళ్లు మాఫియాను ఎలా అంతం చేయగలరు? ప్రశ్న: అమృత్సర్ (తూర్పు) నియోజకవర్గం అభ్యర్థిగా మీ లక్ష్యం ఏమిటి? శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్‌సింగ్ మజితాయి ఎంతవరకు పోటీ ఇస్తారు? జవాబు: నేను భావితరం బాగోగుల కోసం పోరాటం చేస్తాను. భావితరం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది ధర్మపోరాటం.ధర్మం ఎటువైపు ఉంటే విజయం అటువైపే ఉంటుంది. ధర్మయుద్ధంలో అకాలీదళ్ ఎప్పటికీ నెగ్గలేదు. -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్‌లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్‌రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్‌లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఫుల్ జోష్ లో ఆప్.... తరువాత టార్గెట్ అదే
-
Sonu Sood: నా సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనుంది
చంఢీఘర్: కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపన్నులను ఆదుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో రైతులు, కూలీల కోసం ట్రైన్లు, బస్సులు ఏర్పాటు చేసి మరీ వారిని ఊర్లకు చేర్చారు. ఇప్పటికీ కూడా సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు సోనూసూద్ స్వయంగా స్పందించలేదు. కానీ తాజాగా సోనూసూద్ తన సోదరి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. సోనూసూద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరి మాళవిక సూద్ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: అఖిలేశ్‌పై అమిత్ షా మాటల దాడి అయితే ఆమె ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇక సోనూ ఇటీవల పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీతో భేటీ అయ్యారు. అదేవిధంగా సోనూసూద్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా సమావేశం అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ‘దేశ్ కా మెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు సోనూసూద్ పేర్కొన్నారు. అయితే ఆయన పలు పార్టీ నేతలు, సీఎంలను కలిసినప్పటికీ ప్రధానంగా తన ఫౌండేషన్‌కు రాజకీయలతో సంబంధం లేదన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ కావటం వల్ల ఆప్ తరఫున సోనూసూద్ పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తమ మధ్య రాజకీయాలు చర్చకురాలేదని సోనూసూద్ స్పష్టం చేశారు. అయితే తాజాగా సోనూ తన సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడంతో.. ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
‘కళ్లు పీకి.. చేతులు విరుస్తా’ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీఘర్: హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకించిన వారి కళ్లు పీకి, చేతులు విరుస్తానని హెచ్చరించారు. ఓ పబ్లిక్ మీటింగ్‌లో అరవింద్ శర్మ మాట్లాడుతూ.. తాము మరో 25 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని, కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావటానికి చక్కర్లు కొడుతునే ఉంటుందని ఎద్దేవా చేశారు. రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలోని ఓ ఆలయానికి వచ్చిన బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను శుక్రవారం రైతు బయటకు రాకుండా అడ్డగించారు. రైతు నిరసనకారులపై నిరుద్యోగ తాగుబోతులని మనీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు నిరసనకారులు మనీష్ గ్రోవర్ ఆలయం నుంచి బయటకు రాకుండా సుమారు 8 గంటలు అడ్డుకున్నారు. తమకు క్షమాపణ చేప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో మనీష్ రైతులకు చేతులు జోడించిన క్షమాపణ చేప్పారు. కానీ తాను అక్కడ ఉన్నవారు అభివాదం చేయమంటే చేశానని.. క్షమాపణ చేప్పలేదని మాట మార్చారు. మనీష్ గ్రోవర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పత్రిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతం వ్యక్త చేస్తూ విమర్శలు గుప్పించారు. -
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు: అరవింద్ కేజ్రివాల్
చంఢీఘడ్: రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. పంజాబ్‌లోని మాన్సాలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకుండా చూస్తామని కేజ్రివాల్ అన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపోందిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. మీకు నేను.. వాగ్దానం చేసి చెబుతున్నాను.. ఒక నెల తర్వాత మళ్లి వచ్చాక దాని వివరాలు తెలియజేస్తామని తెలిపారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 117 స్థానాల్లో అభ్యర్థులు పోటిచేస్తారని అన్నారు. కాగా, ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. అరవింద్ కేజ్రివాల్ రెండు రోజులపాటు పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఆయన రేపు(శుక్రవారం) భటిండా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. చదవండి: ఏపీ గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్ జగన్ దంపతులు -
హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి
చండీగఢ్: పంజాబ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది గ్రామస్తులు దళిత దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సదరు కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను, ఆమె తల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, పంజాబ్‌లోని ఫాజిల్కా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ అమానుషాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (ఎన్సీఎస్సీ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించి, నిందితులను పట్టుకోవాలని పంజాబ్ పోలీసు అధికారులను ఆదేశించింది. కాగా, విచారణ వివరాలను మెయిల్ ద్వారా తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ కేసుపై పోలీసు అధికారులు జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత
-
వివాదాస్పదంగా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం
చంఢీగఢ్: ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కపుర్తాలా జిల్లాలోని ఫగ్వారా చెక్‌పోస్టుల వద్ద కాపలాగా ఉంచనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఫగ్వారా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సివిల్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు, కమ్యూనికేషన్ ఎక్సెంజ్లతో పాటు ఉపాధ్యాయులు కూడా రాత్రి 9 గంటల నుంచి 1 గంటల మధ్య చెక్ పాయింట్ల వద్ద డ్యూటీ చేయాలంటూ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం 24 మంది పాఠశాల ఉపాధ్యాయులను డిస్టిలరీలకు కాపాలాగా నియమించింది. కానీ దీనిని ఉపసంహరించిన నెల రోజులకే ప్రభుత్వం మరోసారి ఈ ఉత్తర్వును జారీ చేసింది. (వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు) దీనిపై శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడీ) పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డల్జిత్ సింగ్ చీమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘డిస్టిలరీల తరువాత ఇసుక తవ్వకాలను ఆపడానికి పంజాబ్ ప్రభుత్వం వివిధ పోలీసు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించింది. ఉపాధ్యాయులను మద్యం, ఇసుక మాఫియా కోసం ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఒక సిగ్గుమాలిన నిర్ణయం. ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా గత నెలలో గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వుపై ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. మద్యం సరఫరాపై నిఘా పెట్టడానికి 24 మంది ఉపాధ్యాయులను కర్మాగారాల్లో మోహరించింది. అయితే ప్రతిపక్షం ఆందోళనలతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. (ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్) -
భార్యను చంపిన భర్తపై లుకౌట్ నోటీసులు జారీ
చండీఘడ్ : ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న భార్యను స్కూల్ ఆవరణ బయట హత్య చేసిన కేసులో భర్తపై చండీఘడ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సరబ్జీత్ కౌర్, హర్విందర్ సింగ్‌లు భార్యాభర్తలు. హర్విందర్ ఏపనీ చేయకుండా తిరుగుతుండడంతో దంపతుల మధ్య విభేదాలొచ్చాయి. ఈ నేపథ్యంలో భార్య సరబ్జీత్ ప్రైవేటు టీచర్‌గా పనిచేసుకుంటూ భర్త నుంచి విడిగా ఉంటోంది. దీంతో కక్ష పెంచుకున్న హర్వీందర్ ఆమెను స్కూల్ ఆవరణ బయట దారుణంగా చంపేశాడు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందే భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని సరబ్జీత్ ఫిర్యాదు చేసి ఉండడంతో ఆ దిశగా విచారించిన పోలీసులు భర్త హర్వీందర్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా భావించి అతని కోసం వెతకటం ప్రారంభించారు. అతను ఆజ్ఞాతంలో ఉన్నట్టు తేలడడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, సరబ్జీత్ ఫోన్లో భర్త హర్వీందర్ సింగ్ ఫోన్ నెంబరు కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. దంపతులిద్దరూ విడిగా ఉంటున్నప్పటి నుంచీ కనీసం మాట్లాడుకోలేదని దంపతుల ఉమ్మడి స్నేహితుడొకరు పోలీసులకు తెలిపాడు. మరోవైపు హత్య చేయబడ్డ సరబ్జీత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె బంధువులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
‘భోలో తా రా రా... క్రేన్ తీసుకురావాలా!’
న్యూఢిల్లీ: పట్టణాల్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అంటే సాధారణ విషయమేమి కాదు. వాహనదారులను ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడానికి పోలీసులు నానాతంటాలు పడాల్సి వస్తుంది. వాహనాలను రాంగ్ పార్కింగ్‌లో నిలిపినా, రాంగ్ రూట్లో వెళ్లినా ట్రాఫిక్ పోలీసులు విజిల్స్‌తో హెచ్చరిస్తుంటారు.. అయినా పట్టించుకోకుండా వాహనదారులలో కొంతమంది తాము వెళ్లాలనుకున్న దారిలోనే వెళ్తుంటారనుకోండి అది వేరే విషయం. ఇటువంటి ఘటనలతో చిర్రెత్తుకువచ్చిందేమో ఏమో.. క్రమశిక్షణ లేని వాహనదారులను గాడిలో పెట్టేందుకు ఓ ట్రాఫిక్ పోలీస్ కొత్త దారి ఎంచుకున్నారు. ఇందుకోసం ఓ పాప్ సింగర్ పాడిన ‘భోలో తరా రా రా..’ పాటను ఫాలో అయ్యాడు. దీంతో ఆ పాట విన్న వాహనదారులు అప్రమత్తమవుతున్న వీడియో చూసిన ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మహాంది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వివరాలు.. చండీగడ్‌లోని ఓ ట్రాఫిక్ పోలీసు వాహనాలను రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేయగానే మైక్‌లో ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మెహాందీ పాడిన పాపులర్ పాటను తలపించేలా ‘భోలో తా రా రా... క్రేన్ తీసుకురావాలా!’ అంటూ పాట పాడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో... ‘నా పాటతో ప్రజలను ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రేరేపితం చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆనందం అంటే దలేర్ మహాంది. వేడుక అంటే దలేర్ మహాంది. మీ సపోర్టుకు ధన్యవాదాలు.. లవ్ యూ’ అనే క్యాప్షన్‌తో దలేర్ ఈ వీడియోను గురువారం షేర్ చేశారు. ఇక అప్పటినుంచి వీడియోకు వేలల్లో వ్యూస్ రాగా.. వందల్లో లైక్స్ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే ‘హా హ్హ హ్హ.. ఇది చాలా బాగుతుంది, మంచి ఐడియా, సింగ్ గారి నో పార్కింగ్’ సాంగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం పాప్‌స్టార్ దలేర్... ‘స రి గ మ పా’ అనే మ్యుజిక్ రియాలీటి షోలో జడ్జీగా వ్యవహరిస్తున్నవిషయం తెలిసిందే. View this post on Instagram I am glad that my music is used by Traffic police to inspire people to follow rules. Happiness Means Daler Mehndi Celebration Means Daler Mehndi Thank you for your love and Support #DalerMehndi #BoloTaRaRaRa #ChandigarhTrafficPolice #ChandigarhPolice A post shared by Dr. DalerMehndi (@dalersmehndi) on Oct 17, 2019 at 1:46am PDT -
డేరాబాబా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చండిఘర్ : ఇద్దరు మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా అధినేత గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ (డేరాబాబా)పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను జైలు సూపరిండెంట్ తిరస్కరించారు. రోహతక్ జైలులో 20 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా తన తల్లికి ఆరోగ్యం బాగాలేనందున మూడు వారాలు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. డేరాబాబా భార్య హర్జిత్‌కౌర్ ఇదే విషయమై పంజాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డేరాబాబా తల్లి నసీబ్‌కౌర్(83) గుండె ఆపరేషన్ ఉన్నందున బెయిల్ ఇవ్వాలని అడిగారు. అయితే డేరాబాబా బయటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తొచ్చన్న అనుమానంతో బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది జైలు అధికారుల విచక్షణకే హైకోర్టు వదిలేసింది. జైలు సూపరిండెంట్ డేరాబాబా ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తం చేసి అతనే బెయిల్ ఇచ్చినా తమకేం అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో జైలు సూపరిండెంట్ డేరాబాబా తల్లి ఆరోగ్యంపై నివేదికను తెప్పించుకొని పరిశీలించి ఆయన పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు. కేసు పూర్వపరాలు.. డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలడంతో హర్యానాలోని పంచకుల సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్షను 2017లో విధించింది. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 32 మంది మరణించిన విషయం తెలిసిందే. -
చండీగఢ్‌లో త్రిముఖ పోటీ
పంజాబ్, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్ లోక్‌సభ స్థానానికి చివరిదశలో మే 19న పోలింగ్ జరగనుంది. ఈ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రసిద్ధ నటుడు అనుపమ్ ఖేర్ భార్య, ప్రముఖ నటి, టీవీలో ప్రముఖ సంగీత కార్యక్రమాలెన్నింటికో వ్యాఖ్యాతగా ఉన్న కిరణ్ ఖేర్ ఈసారి కూడా తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. నాలుగుసార్లు లోక్‌సభకి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి వపన్ కుమార్ బన్సాల్‌పై కిరణ్ ఖేర్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చండీగఢ్ లోక్‌సభ స్థానాన్ని మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ 1991, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు. 2014లో కిరణ్ ఖేర్ 42.2 శాతం ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 1996లో బీజేపీ నుంచి సత్యపాల్ జైన్ ఈ స్థానంలో గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్, బీజేపీలకు తోడు గత ఎన్నికల్లో కిరణ్ ఖేర్ గెలుపుకోసం కీలకంగా పనిచేసిన హర్మోహన్ ధవన్ ఈసారి ఆమ్ ఆద్మీ తరఫున పోటీచేస్తున్నారు. హర్మోహన్ ధవన్ ఈసారి ఓట్లు చీలుస్తారనే భయంలో కాంగ్రెస్ ఉంది. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకన్నా ఆప్ అభ్యర్థిపైనే ఆశలు పెట్టుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే నాలుగు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీలేదని బీజేపీ విమర్శిస్తోంది. స్వచ్ఛత, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ వల్ల ఒరిగిందేమీ లేదని కిరణ్ ఖేర్ ఆరోపణ. అయితే కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ మాత్రం ప్లాన్డ్ సిటీ అయిన చండీగఢ్‌ని స్వచ్ఛత ర్యాంకింగ్‌లో 3వ స్థానం నుంచి 20వ స్థానానికి దిగజార్చిన ఘనత బీజేపీదేనని తిరుగుదాడి చేస్తున్నారు. ఐదేళ్ల నా పాలన చూడండి, 15 ఏళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని పోల్చుకుని ఓటెయ్యండని కిరణ్ ఖేర్ ప్రజల్లోకి వెళుతున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు రాబోయే ఐదేళ్ళ ఎజెండాని ముందుగానే ప్రకటించిన కిరణ్ ఖేర్ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌గా మారుస్తాననీ, సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తాననీ అంటున్నారు. చండీగఢ్‌ని సిలికాన్ వ్యాలీప్రమాణంగా పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తానంటోన్న కిరణ్‌ఖేర్ ఈసారి గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. అయితే ఈసారి ప్రజలు ఈ మూడు పార్టీల్లో ఎవరిని ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. -
సొంత చెల్లెలిపై లైంగిక వేధింపులు
చండీగఢ్ : తోడబుట్టిన చెల్లెలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. బలవంతంగా పదేళ్ల చెల్లెలి గొంతులో మధ్యం పోసి లైంగిక వేధింపులకు గురిచేశాడు ఓ అన్న. ఈ సంఘటన హర్యానాలోని పాలెం విహార్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని పాలెం విహార్ కార్టర్పురి గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక మూడవ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిపోవటంతో బాలిక తన చిన్న తమ్ముడితో కలిసి ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన బాలిక పెద్ద అన్నయ్య ఆమె నోట్లో బలవంతంగా మధ్యం పోశాడు. తోడబుట్టిన చెల్లి అని చూడకుండా పైశాచికంగా ప్రవర్తించాడు. బాలిక గట్టిగా అరవటంతో పక్కగదిలో ఉన్న బాలిక తమ్ముడు ఇది గ్రహించి బిగ్గరగా అరుస్తూ తల్లికి సమాచారమిచ్చాడు. దీంతో భయానికి గురైన ఆ కీచకుడు అక్కడినుంచి పరారయ్యాడు. బాలిక తల్లి పోలీసులకు సమాచరామివ్వటంతో వారు పరారీలో ఉన్న నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. -
కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్..
చండీగఢ్ : విడాకులు తీసుకున్న భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్తపద్దతి ఎంచుకున్నాడో లాయర్ భర్త. భరణంగా ఇవాల్సిన డబ్బు ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కిన భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కోర్టులో భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంది ఆ భార్య. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కు చెందిన ఓ లాయర్ 2014లో భార్య నుంచి వేరుపడి కొద్ది సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్యకు నెలవారీ ఖర్చుల నిమిత్తం భరణంగా నెలకు 25వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశింది. అయితే రెండు నెలలుగా తన భర్త భరణం ఇవ్వటం లేదని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమె భర్త డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడే భార్యకు చుక్కెదురైంది. ఇవ్వాల్సిన 25వే రూపాయల్లో కేవలం నాలుగు వందలు మాత్రమే నోట్లుగా ఇచ్చి మిగిలిన 24,600కు రూపాయి, రెండు రూపాయల నాణేల చిల్లర రూపంలో ఇచ్చాడు. అంతే ఆ భార్య కోర్టులోనే గొల్లుమంది. భర్త తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన వద్ద డబ్బులు లేవన్న భర్త వాదనను ఆమె తప్పుబట్టింది. కాగా లాయర్ భర్త తన పనిని సమర్థించుకుంటూ.. భరణం డబ్బులు ఇలా చిల్లర ఇవ్వకూడదని ఎక్కడా రాసిలేదని అన్నాడు. ఈ చిల్లర పనితో కంగుతిన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
కారు కోసం కట్టుకున్న భార్యను..
చండీగఢ్ : కారు కొనటానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను పెనంతో కొట్టి చంపాడు ఓ భర్త. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని మొహలి జిల్లాకు చెందిన మమన్‌దీప్ కౌర్(28), భర్త గురుప్రీత్ సింగ్‌తో కలిసి జిరక్పూర్లో నివాసముంటోంది. గురుప్రీత్ సింగ్ 10 సంవత్సరాలు లండన్‌లో ఉండి సంవత్సరం క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆనాటి నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించేవాడు. గత కొద్దినెలలుగా కారు కొనటానికి డబ్బులు కావాలని మమన్‌దీప్‌ను ఇబ్బంది పెట్టేవాడు. క్యాబ్ సర్వీస్ మొదలుపెట్టడానికి ఇంటి నుంచి డబ్బులు తెమ్మంటూ హింసించే వాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. గురువారం గొడవ తారాస్థాయికి చేరటంతో ఆగ్రహానికి గురైన గురుప్రీత్ ఆమెను పెనంతో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె సోదరుడు గురుప్రీత్‌కు ఫోన్ చేయగా.. అతని మాటలు అనుమానానికి దారితీశాయి. అనుమానంతో చెల్లెలి కోసం ఇంటికి వెళ్లి చూడగా.. సోదరి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గురుప్రీత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
11 నెలల చిన్నారి అవయవదానం
చండీగఢ్: చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. తల్లిదండ్రుల అంగీకారంతో బతికే అవకాశంలేని 11 నెలల చిన్నారి కిడ్నీలను ఓ వ్యక్తికి అమర్చారు. నేపాల్‌కు చెందిన దంపతులు 11 నెలల వయసున్న తమ బాబుతో కలసి చండీగఢ్‌లో ఉంటున్నారు. జూలై 6న పిల్లాడు ఊయల నుంచి కిందపడడంతో తలకు దెబ్బతగిలి స్పృహ కోల్పోయాడు. చికిత్స కోసం పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. పిల్లాడు బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. తల్లిదండ్రుల అంగీకారంతో పిల్లాడి 2 కిడ్నీలను మరో వ్యక్తికి ఆపరేషన్‌చేసి అమర్చారు. ఆస్పత్రి చరిత్రలో అవయవదానం చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా ఈ పిల్లాడు నిలిచాడు. కిడ్నీలను చిన్నారులకే అమర్చాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఓ రోగితో బాలుడి కిడ్నీలు మ్యాచ్ కావడంతో ఆ వ్యక్తికే అమర్చారు. -
36 గంటలు డ్యూటీ చేసి...
చండీగఢ్ : ఫరీదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 36 గంటల పాటు నిరంతరాయంగా పని చేయడం వల్ల ఓ సెక్యూరిటీ గార్డు మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. హరీశ్ చందర్ అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా ఓ ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ తరపున వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని సెక్టార్ 59లో గల ఎస్టీఎల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం షిఫ్టు మారాల్సి ఉండగా వేరొక గార్డు రాకపోవడంతో హరీశ్ చందర్ డ్యూటీలోనే ఉండాల్సి వచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, తాగటానికి మంచి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. వేడిమి అధికంగా ఉండడం, నిరంతరాయంగా పనిచేయడం వల్ల అలసటతో హరీశ్ మరణించినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
సిమ్లా టూ చండీగఢ్.. జస్ట్ 20 నిమిషాలే!
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ టూరిస్ట్ రిసార్ట్ నుంచి చండీగఢ్‌కు అరగంటలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి అది కూడా సాధ్యమవుతుంది. సిమ్లా నుంచి చండీఘడ్‌కు కేవలం 20 నిమిషాల్లో చేరుకునే హెలీ-ట్యాక్సీ సర్వీసును సోమవారం ప్రారంభించారు. హెలికాప్టర్ సర్వీసు ఆపరేటర్ పవన్ హ్యాన్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వీసులను లాంచ్ చేసింది. రోడ్డు మార్గం ద్వారా నాలుగు గంటల ప్రయాణ సమయాన్ని ఈ సర్వీసులు 20 నిమిషాలకే కుదించనున్నాయి. 19 ప్రయాణికులను ఈ హెలీ-ట్యాక్సీలో ప్రయాణించవచ్చు. కనీస ఛార్జ్ ఒక్కో వ్యక్తికి 2,999 రూపాయలు. వారానికి రెండు సార్లు అంటే సోమవారం, శుక్రవారం ఈ హెలీ-ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సిమ్లా ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 8 గంటలకు టేకాఫ్ అయ్యే ఈ హెలికాప్టర్, చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8.20 కల్లా ల్యాండ్ అవుతుంది. అనంతరం చండీగఢ్ నుంచి ఉదయం 9 గంటలకు టేకాఫ్ అయి, సిమ్లాకు ఉదయం 9.20 కి చేరుకుంటుందని పవన్ హ్యాన్స్ అధికారులు చెప్పారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన బట్టి ఈ సర్వీసులను మరింత పెంచుతామని తెలిపారు. సిమ్లా నుంచి తొలి సర్వీసును హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్ ప్రారంభించారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. చండీగఢ్ నుంచి మనాలీ మధ్యలో కూడా ఈ హెలీ-ట్యాక్సీ సర్వీసులను లాంచ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
‘బీసీలను వేధిస్తున్న బీజేపీ’
సాక్షి, ఛండీగర్ : యూపీ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విపక్షాల విజయంతో పాలక బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శల దాడి పెంచారు. దళితులు, బీసీలపై బీజేపీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. ఛండీగర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాస్త్రాలకు పదునుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె రోహిత్ వేముల విషాదాంతం, సహరన్పూర్ హింసాకాండ వంటి పలు అంశాలను ప్రస్తావించారు. రాజ్యసభలో సహరన్పూర్ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేపీ తనను అనుమతించలేదని ఆరోపించారు. పార్లమెంట్లో దళిత సమస్యలను లేవనెత్తనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తాను ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. తాను ఓబీసీల రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపైనా మాయావతి విరుచుకుపడ్డారు. అగ్రవర్ణ భావజాలంతోనే కాంగ్రెస్ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదని ఆరోపించారు. -
ఆడవాళ్ల జాగ్రత్తల గురించి ఆమెకు తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : చండీగఢ్‌లో గత నెల 22 ఏళ్ల యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనపై ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ స్పందిస్తూ ‘నీవు ఎక్కాల్సిన ఆటోలో అప్పటికే ముగ్గురు యువకులు కూర్చొని ఉన్నప్పుడు ఆ ఆటో నీవు ఎక్కాల్సింది కాదు’ అని బాధితురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా రవాణాకు కిరణ్ ఖేర్ చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్టున్నారు. అసలు ఆమెకు ఎన్నడూ ప్రజా రవాణాలో ప్రయాణించిన అనుభవమే ఉండక పోవచ్చు. చండీగఢ్ లాంటి నగరాన్ని తీసుకుంటే షేరింగ్ టాక్సీలోగానీ, షేరింగ్ ఆటోలోగానీ వెళ్లాలంటే క్యూలో నిలబడాల్సిందే. నీ వంతు రాగానే గుడ్డిగా ఎక్కాల్సిందే, మరో ఛాయిస్ ఉండదు. లేదంటే పక్కకు తోసేస్తారు. ఒక్కసారి క్యూ నుంచి పక్కకు వచ్చావంటే మళ్లీ అందరికన్నా వెనక నిలబడాల్సిందే. ఎక్కాల్సిన ఆటోలో ఎంత మంది ఉన్నారు? వారిలో పురుషులు ఎంత మంది ? మహిళలు ఎంత మంది? వారెలా ఉన్నారు? రౌడీల్లా ఉన్నారా? రేపిస్టుల్లా ఉన్నారా? సాధు జీవుల్లా ఉన్నారా? తెలుసుకునేందుకు వారి ముఖాలను పరికించి చూసే అవకాశంగానీ, ఆలోచించే క్షణంగానీ ఉండదు. ముందున్నది ట్యాక్సీ అయినా, ఆటో అయిన జనంతోపాటు ముందుకు నడవాల్సిందే. షేరింగ్ కాకుండా సొంతంగా టాక్సీ లేదా ఆటో తీసుకోవడం వేరు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా చేరుకునేందుకు ఆరాటపడే మహిళల్లో ఎక్కువ మందికి అంతటి స్థోమత ఉండదు. అంతటి స్థోమత ఉన్నవాళ్లు కూడా వాటిల్లో వెళ్లేందుకు ఇష్టపడరు. ఎందుకంటే భద్రత. ఒంటరిగా వెళితే జరుగకూడదేదో జరుగుతుందన్న ఆందోళన. అందుకనే పట్టణాల్లో ఉద్యోగాలు చేసి బతికే దిగువ, మధ్య తరగతి మహిళల్లో 99 శాతం ప్రభుత్వ లేదా ప్రజా రవాణేనే ఆశ్రయిస్తారు. కారణం, పదిమందిలోనే భద్రత ఉంటుందన్న నమ్మకం. అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రభుత్వ బస్సుల్లో వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు దేశంలోని అనేక పట్టణాల్లో బస్సుల్లో, సెట్విన్లలో, షేరింగ్ ఆటో లేదా ట్యాక్సీల్లో వెళ్లాలంటే క్యూల్లో నిలబడాల్సిందే. భారతీయ మహిళలకు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కిరణ్ ఖేర్ లాంటి వారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లులు, అత్తలు, కజిన్స్, స్నేహితులు ఇలాంటి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అవి కాకుండా స్వానుభవంతో మరికొన్ని జాగ్రత్తలు తెలుసుకుంటారు. మనం ఎక్కడికి వెళుతున్నాం ? ఏ ప్రాంతానికి వెళుతున్నాం ? అక్కడ ఎలాంటి రకం మనుషులు ఉంటారు? వారి దృష్టిలో పడకుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి దుస్తులు ధరించి వెళ్లాలి? ఇన్ని అంశాలను ఆలోచించి మహిళలు రోడ్డెక్కుతారన్న విషయం కిరణ్ ఖేర్‌కు ఎంత మేరకు తెలుసు? రైళ్లలో ఎక్కినప్పుడు కూడా ఆ కంపార్ట్మెంట్లో మహిళలు ఉన్నారా, లేరా? ఉంటే ఎంత మంది మహిళలు ఉన్నారు? వారు గుంపుగా ఒక దగ్గరున్నారు ? వేర్వేరుగా ఉన్నారా? వాది వద్దకు వెళితే తనకు మరింత భద్రత ఉంటుందా? మగవాళ్లు ఎక్కువుంటే వారు గ్రూపులుగా కూర్చొని ఉన్నారా? విడివిడిగా ఎక్కువగా ఉన్నారా? వారు కాకతాళీయంగా గుంపులుగా కూర్చున్నారా? లేదా వారి మధ్య పరిచయం ఉందా? అదే కంపార్ట్మెంట్లో ఉంటే తనకు మంచిదా, మరో కంపార్ట్‌మెంట్‌కు వెళ్లడం శ్రేయస్కరమా? ఇన్ని విధాలుగా మహిళలు ఆలోచిస్తారన్న విషయం కిరణ్ ఖేర్ లాంటి వారికి తెలుసా? దేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ ఉండాలని, దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అందుకు పోరాడాల్సిన బాధ్యత తన లాంటి ఎంపీలదని ఆమె ఎప్పటికైనా గ్రహిస్తారా? అత్యుత్తమ రవాణా వ్యవస్థ లేకనే ఇలా అప్పుడప్పుడు మహిళలు మగాళ్లకు బలవుతున్నారన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా? ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థ అంటే ‘బుల్లెట్ ట్రెయిన్’ అనుకుంటే ఇక ఆ బుర్రలను ఏం చేయలేం! ఇక్కడ చండీగఢ్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన అమ్మాయి ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. పైగా రిస్కు తీసుకువడం అనేది ఆమె ఇష్టం. నగరంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా, రాత్రయినా, పగలైనా వెళ్లే హక్కు, పౌరుల మధ్య తిరిగే హక్కు ఆమెకుంది ? ఆమె హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. (ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ స్కూల్ ఆఫ్ మిడియా అండ్ కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్ శిల్పా పాడ్కే వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షరరూపం) -
15 నుంచి కొత్త విమాన సర్వీసులు
వెంకోజీపాలెం : విశాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త. ఢిల్లీ, ఛండీఘర్, జమ్ము నగరాలకు కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. ఈ సర్వీసులు వచ్చే నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎస్జి-224 విశాఖ-బెంగళూర్-ఢిల్లీ-ఛండీఘర్-జమ్ము విమానం ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూర్ నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వరదారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఛండీఘర్‌కు, 3.40 గంటలకు జమ్ముకు చేరుకుంటుందన్నారు. జమ్ములోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ విమానం సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు.