![BJP MP Warns To Congress Leaders He Will Gouge Eyes And Cut Arms - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/6/haryana.jpg.webp?itok=lCn7xY49)
ఛండీఘర్: హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకించిన వారి కళ్లు పీకి, చేతులు విరుస్తానని హెచ్చరించారు. ఓ పబ్లిక్ మీటింగ్‌లో అరవింద్ శర్మ మాట్లాడుతూ.. తాము మరో 25 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని, కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావటానికి చక్కర్లు కొడుతునే ఉంటుందని ఎద్దేవా చేశారు.
రోహ్‌తక్ జిల్లా కిలోయ్ గ్రామంలోని ఓ ఆలయానికి వచ్చిన బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను శుక్రవారం రైతు బయటకు రాకుండా అడ్డగించారు. రైతు నిరసనకారులపై నిరుద్యోగ తాగుబోతులని మనీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు నిరసనకారులు మనీష్ గ్రోవర్ ఆలయం నుంచి బయటకు రాకుండా సుమారు 8 గంటలు అడ్డుకున్నారు.
తమకు క్షమాపణ చేప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో మనీష్ రైతులకు చేతులు జోడించిన క్షమాపణ చేప్పారు. కానీ తాను అక్కడ ఉన్నవారు అభివాదం చేయమంటే చేశానని.. క్షమాపణ చేప్పలేదని మాట మార్చారు. మనీష్ గ్రోవర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పత్రిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతం వ్యక్త చేస్తూ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment