controvercial
-
సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు. 'కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.' అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 'సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? ' అని ప్రశ్నించారు. Udhayanidhi Stalin’s hate speech with Hindi subtitles. Rahul Gandhi speaks of ‘मोहब्बत की दुकान’ but Congress ally DMK’s scion talks about eradicating Sanatana Dharma. Congress’s silence is support for this genocidal call… I.N.D.I Alliance, true to its name, if given an… https://t.co/hfTVBBxHQ5 pic.twitter.com/ymMY04f983 — Amit Malviya (@amitmalviya) September 2, 2023 ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. బలహాన వర్గాల పక్షాన తాను మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 'ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW — Udhay (@Udhaystalin) September 2, 2023 ఇదీ చదవండి: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ -
వివాదంలో యోగ గురువు రాందేవ్ బాబా
-
లాజిక్ లేకుండా మాట్లాడొద్దు.. హిజాబ్ వాదనలపై సుప్రీం అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలల్లో హిజాద్ నిషేధంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదికి కోర్టుకు మధ్య వాదోపవాదనలు వాడివేడిగా సాగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం కూడా ఓ హక్కు అని న్యాయవాది దేవ్‌దత్ కమాత్ కోర్టుకు తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా.. అహేతుకంగా మాట్లాడవద్దని న్యాయవాది దేవ్‌దత్‌కు సూచించారు. ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? అని ప్రశ్నించారు. దీనికి దేవ్‌దత్ స్పందిస్తూ స్కూళ్లలో ఎవరూ దుస్తులు తీసేయరని పేర్కొన్నారు. అసలు సమస్య ఏంటంటే.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించాలని ఓ వర్గం వారు మాత్రమే కోరుకుంటున్నారు, మిగతా విద్యార్థులంతా డ్రస్ కోడ్‌ను పాటిస్తున్నారని జస్టిస్ హేమంత్ గుప్తా అన్నారు. మిగతా వర్గాల వారు మేం అది ధరిస్తాం, ఇది ధరిస్తామని చెప్పడం లేదని పేర్కొన్నారు. న్యాయవాది దేవ్ దత్ మాట్లాడుతూ.. స్కూళ్లలో కొంతమంది విద్యార్థులు మతపరమైన రుద్రాక్షను కూడా ధరిస్తున్నారని కోర్టుకు చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. రుద్రాక్షను షర్టు లోపలే ధరిస్తారని, రుద్రాక్ష ఉందా? లేదా ? అని ఎవరూ చెక్ చేయరని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లలో హిజాబ్‌ను నిషేధించడాన్ని హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుగుతోంది. చదవండి: భారత్ జోడో యాత్ర.. లేఖ విడుదల చేసిన సోనియా -
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం..
తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం ఎదురైంది. ఈ ఘటన కేరళలోని కాసర్గడ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాసర్గఢ్లోని మున్సిపల్ స్టేడియంలో పోర్టులు,ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాను తలకిందులుగా ఎగరవేశారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, అక్కడే ఉన్న కొంత మంది మీడియా సిబ్బంది, ఇతర కార్యకర్తలు దీన్ని గమనించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి.. తిరిగి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు. ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. కాగా, సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డిఎఫ్ మిత్రపక్షమైన ఇండియన్ నేషనల్ లీగ్(ఐఎన్ఎల్) మంత్రి అయిన దేవర్కోవిల్ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హజరయ్యారు. అయితే, అధికారులు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో చేశారు. చాలా సేపటికి ఎవరు కూడా జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం గమనించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే, దీనిపై ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. అహ్మద్ దేవరకోవిల్ వెంటనే రాజీనామా చేయాలని.. కేరళ బీజేపీ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ డిమాండ్ చేశారు. అదే విధంగా జెండాను అవమానపర్చిన మంత్రి దేవరకోవిల్ పై పోలీసులు కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి.. కనీసం గమనించకుండా సెల్యూట్ చేసి వెళ్లిపోవడం మంత్రి బాధ్యతారాహిత్యానికి అద్దంపడుతుందని, అధికారులు కూడా లోపాన్ని గుర్తించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదే ఘటనపై కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితాన్ స్పందించారు. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడం దురదృష్టకరమన్నారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు -
మహిళపై అసభ్యకర పోస్టులు.. అమ్మకానికి పెడుతున్నట్లు..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): తమపై బుల్లి బాయ్స్ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గిట్‌హాబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సులీ డీల్స్ పేరుతో ఖాతా తెరిచి ఆ తరువాత దానిని బుల్లీ బాయ్స్‌గా పేరు మార్చారు. ఇందులో ముస్లిం మహిళలను విక్రయిస్తున్నట్లు పోస్టులు పెట్టారు. దీనిపై ట్విట్టర్లో దుమారం రేగడంతో ఢిల్లీ, ముంబాయి సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న బాధితురాలి ఫోటోను కూడా అలాగే ఆ పోస్టులో పెట్టడంతో బాధితురాలు తాజాగా సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై 509, 354డీ, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మరో మహిళ సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. -
‘కళ్లు పీకి.. చేతులు విరుస్తా’ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీఘర్: హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకించిన వారి కళ్లు పీకి, చేతులు విరుస్తానని హెచ్చరించారు. ఓ పబ్లిక్ మీటింగ్‌లో అరవింద్ శర్మ మాట్లాడుతూ.. తాము మరో 25 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని, కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావటానికి చక్కర్లు కొడుతునే ఉంటుందని ఎద్దేవా చేశారు. రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలోని ఓ ఆలయానికి వచ్చిన బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను శుక్రవారం రైతు బయటకు రాకుండా అడ్డగించారు. రైతు నిరసనకారులపై నిరుద్యోగ తాగుబోతులని మనీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు నిరసనకారులు మనీష్ గ్రోవర్ ఆలయం నుంచి బయటకు రాకుండా సుమారు 8 గంటలు అడ్డుకున్నారు. తమకు క్షమాపణ చేప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో మనీష్ రైతులకు చేతులు జోడించిన క్షమాపణ చేప్పారు. కానీ తాను అక్కడ ఉన్నవారు అభివాదం చేయమంటే చేశానని.. క్షమాపణ చేప్పలేదని మాట మార్చారు. మనీష్ గ్రోవర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పత్రిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతం వ్యక్త చేస్తూ విమర్శలు గుప్పించారు. -
చంద్రబాబు ప్లాన్ ప్రకారమే పట్టాభి వ్యాఖ్యలు: పేర్నినాని
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్లాన్ ప్రకారమే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వయసుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలన్నాదే బాబు లక్ష్యమని అన్నారు. చంద్రబాబుకు అధికారం లేకపోతే నిద్రపట్టదని విమర్శించారు. అందుకే.. గతంలో అయ్యన్నపాత్రుడుతో దుర్భాషలాడించారు. అప్పుడు వారి ప్లాన్ ఫలించలేదని అన్నారు. అందుకే మళ్లి ఇప్పుడు పట్టాభితో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాతో.. చంద్రబాబు ఫోన్లో మాట్లాడితే వీడియోలు రిలీజ్ చేసి హడావిడి చేసేవారని అన్నారు. కేవలం అమిత్ షా అపాయింట్ మెంట్ కోసమే బాబు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో అమిత్‌షాపై టీడీపీ నేతలు రాళ్లేయించారని అన్నారు. చంద్రబాబు ప్రతిసారి దిగజారీ రాజకీయాలు చేస్తుంటారని అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష.. లేకపోతే మరో భాష మాట్లాడతారని మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చదవండి: అధికారం దక్కలేదని చిచ్చుపెడుతున్నారు: సీఎం జగన్ -
వివాదాస్పదంగా మారిన నిర్మల్ జిల్లా పోలీసుల తీరు
-
చనిపోయిన విద్యార్థినిపై ప్రిన్సిపాల్ చెత్త కామెంట్లు
న్యూఢిల్లీ : నోయిడాలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై ప్రిన్సిపాల్ బాధ్యతా రహితంగా షాకింగ్ కామెంట్లు చేశాడు. ఒక మహిళా టీచర్ విద్యార్థినిని ఎలా లైంగికంగా వేధిస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే, మరో ఉపాధ్యాయుడు తమ వద్ద 25 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి లైంగిక పరమైన ఆరోపణలు రాలేదంటూ వారిని వెనుకేసుకొచ్చాడు. దీంతో ఆ స్కూల్ వద్ద తీవ్ర దుమారం రేగింది. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. నోయిడాలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్కూలులో సోషల్, సైన్స్ టీచర్లు తమ కూతురును వేధించారని, అకారణంగా, ఉద్దేశ పూర్వకంగా ఫెయిల్ చేశారని, ఆ అవమానాలతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్ 'ఆరోపణలు చేసిన టీచర్లలో ఒకరు మహిళ ఉన్నారు.. ఒక టీచర్ మా వద్ద 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఒక మహిళా టీచర్ విద్యార్థినిపై ఎలా లైంగిక వేధింపులకు పాల్పడుతుంది. 25 ఏళ్లుగా మా వద్ద పనిచేస్తున్న టీచర్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆ అమ్మాయి సగటు విద్యార్థిని. ఏనాడు ఆమె తల్లిదండ్రులు ప్యారెంట్స్ మీటింగ్‌లకు వచ్చేవారు కాదు. బాగా చదవలేదు.. అయితే, మంచి డ్యాన్సర్. ఆమె ఇంకా ఫెయిల్ కాలేదు.. రెండోసారి పరీక్ష రాయాల్సి ఉంది' అంటూ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారు. -
విస్తరణలో విచిత్రాలు
ఈయన పేరు మండా వీర వెంకట సత్యనారాయణ (బుజ్జిబాబు). దేవరపల్లి మండలం యర్నగూడెం వాసి. ఈయనకు ఆ రెవెన్యూ గ్రామంలో మూడు చోట్ల 4.25 ఎకరాల పొలం ఉంది. పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకానికి ఇందులో 1.25 ఎకరాలు పోయింది. తాడిపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువ తవ్వకం నిమిత్తం 1.25 ఎకరాలు, ఉపకాలువ తవ్వకానికి అర ఎకరం పోయాయి. ఇక ఉన్న 1.25 ఎకరాల మధ్యలోంచి ఇప్పుడు గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు విస్తరించనున్న (జీకే)జాతీయ రహదారి–16 వెళుతుంది. ఇలా ఉన్న భూమంతా భూసేకరణలో తీసేసుకుంటే ఈ రైతుకు సెంటుభూమి కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు. ఇటువంటి బాధితులు ఎందరో. విస్తరణలో విచిత్రాలెన్నో.. కొందరు బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లు కోల్పోయి సాగుకు దూరమయ్యే దుస్థితి ఉంది. కొవ్వూరు : గుండుగొలను– కొవ్వూరు మధ్య విస్తరించతలపెట్టిన జాతీయ రహదారి జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలోని 22 రెవెన్యూ గ్రామాల మీదుగా వెళ్తుంది. దీనికోసం 1,111 ఎకరాల భూమి సేకరించాలని సర్కారు నోటిఫికేష¯ŒS ఇచ్చింది. కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 574.95 ఎకరాలు, ఏలూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 436.05 ఎకరాలు సేకరించనున్నారు. ప్రస్తుతం మార్కింగ్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ 9న భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేష¯ŒS జారీ చేసింది. అదే నెల 29 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. నోటిఫికేష¯ŒSలో ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరిస్తున్నారో మాత్రమే ప్రకటించారు. ఏ రైతుకు చెందిన ఎంతభూమి తీసుకుంటారో స్పష్టం చేయలేదు. అభ్యంతరాలను పట్టించుకోలేదు కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒSనుంచి 71, ఏలూరు డివిజ¯ŒS నుంచి 89 అభ్యంతరాలు అందాయి. వీటిలో ఏ ఒక్క అభ్యంతరానికీ అధికారులు స్వష్టమైన వివరణ ఇవ్వలేదు. ఒకవైపు రైతులు సర్వేకి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎక్కడికక్కడే రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. భూములకు ధర నిర్ణయం, పొలాలకు వెళ్లె పుంతరోడ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని అధికారులను రైతులు నిలదీస్తున్నారు. రైతులకు చెందిన కొంత భూమి జాతీయ రహదారికి ఒకవైపు ఉంటే మరికొంత భూమి మరో వైపు ఉండడం వల్ల సాగునీరందించే బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లను అన్నదాతలు కోల్పోతున్నారు. పొలాలకు వెళ్లే పుంతరోడ్లు మాయం కానున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారన్నదానిపై అధికారులు నోరుమెదపడం లేదు. అక్కడక్కడ సర్వీసు రోడ్లు వేస్తారని చెబుతున్నా.. ఎక్కడెక్కడ వేస్తారన్న విషయం వెల్లడించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారుల భూసేకరణ చట్ట ప్రకారం.. నిర్బంధ భూసేకరణకు అవకాశం ఉండడంతో రైతుల వాదనలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరల నిర్ణయంపై అభ్యంతరాలు గోదావరి నుంచి కృష్ణానదికి నీళ్లు తరలించుకుపోయేందుకు నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం దెందులూరు మండలంలో ఎకరం బేసిక్ విలువ రూ.8లక్షలుంటే రూ.38 లక్షలు పరిహారం చెల్లించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 13న 262 జీవోను జారీ చేసింది. 2006లో తాడిపూడి, పోలవరం కాలువల తవ్వకం సమయంలో కొబ్బరి, ఆయిల్‌పామ్ చెట్లకు చెట్టుకు రూ.1,600 చెల్లించారు. ఇదే పోలవరం కాలువ తవ్వకంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కోసం ప్రభుత్వం 262 జీవో ప్రకారం కొబ్బరి, ఆయిల్‌పామ్æ చెట్టు ఒక్కంటికి రూ.9,200 చొప్పున గత ఏడాది చెల్లించారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భూసేకరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడంతో రాష్ట్ర సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులూ శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారుల భూసేకరణ చట్టం ప్రకారం 389 జీవో సెక్ష¯ŒS 28 ప్రకారం కేవలం బేసిక్ విలువపై రెండున్నర రెట్లు మాత్రమే చెల్లిస్తామని అధికారులు అంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పోలవరం, తాడిపూడి కాలువ తవ్వకం మూలంగా ఇదే ప్రాంతంలో రైతులు భూములు కోల్పోయారు. మళ్లీ దేవరపల్లి, నల్లజర్ల, భీమడోలు అదే రైతులకు చెందిన భూములను ఇప్పుడు జాతీయ రహదారి నిమిత్తం సేకరిస్తుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమకు చెల్లించినట్టే నాలుగురెట్ల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుని రైతుల అభ్యంతరాలకు పరిష్కార మార్గాలు చూపిన తర్వాతే భూసేకరణ చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఆక్వా పార్క్ ఏర్పాటుకు సీఎం సుముఖం
నరసాపురం : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి సుముఖంగా ఉన్నారని నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్ పార్కు విషయంలో జరుగుతున్న ఆందోళనలు, లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మధుసూదనరావు, మత్స్యశాఖ ఏడీ పి.రామ్మోహన్రావు, ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఫ్రొఫెసర్ ఎస్.సందీప్‌లను నియమించినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారని చెప్పారు. ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి హానికరమైన వ్యర్థాలు వెలువడవని సబ్‌కలెక్టర్ వివరించారు. అది ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించిందన్నారు. వ్యర్థాలను పైప్లైన్ల ద్వారా సముద్రంలో కలపడానికి యాజమాన్యం అంగీకరించందిన్నారు. రూ.11 కోట్లతో పైప్లైన్లు నిర్మించనున్నారని సబ్ కలెక్టర్ చెప్పారు. ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంట్‌గా అందిస్తుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలకు ఈ విషయాలను చెప్పి ఒప్పిస్తామని తెలిపారు.