విస్తరణలో విచిత్రాలు | vistaranalo vichitralu | Sakshi
Sakshi News home page

విస్తరణలో విచిత్రాలు

Nov 28 2016 1:12 AM | Updated on Sep 4 2017 9:17 PM

విస్తరణలో విచిత్రాలు

విస్తరణలో విచిత్రాలు

కొవ్వూరు : గుండుగొలను– కొవ్వూరు మధ్య విస్తరించతలపెట్టిన జాతీయ రహదారి జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలోని 22 రెవెన్యూ గ్రామాల మీదుగా వెళ్తుంది. దీనికోసం 1,111 ఎకరాల భూమి సేకరించాలని సర్కారు నోటిఫికేష¯ŒS ఇచ్చింది. కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 574.95 ఎకరాలు, ఏలూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 436.05 ఎకరాలు సేకరించనున్నారు. ప్రస్తుతం మార్కింగ్‌ పనులు సాగుతున్నాయి.

ఈయన పేరు మండా వీర వెంకట సత్యనారాయణ (బుజ్జిబాబు).  దేవరపల్లి మండలం యర్నగూడెం వాసి. ఈయనకు ఆ రెవెన్యూ గ్రామంలో మూడు చోట్ల  4.25 ఎకరాల పొలం ఉంది. పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకానికి ఇందులో 1.25 ఎకరాలు పోయింది. తాడిపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువ తవ్వకం నిమిత్తం 1.25 ఎకరాలు, ఉపకాలువ తవ్వకానికి అర ఎకరం పోయాయి. ఇక ఉన్న 1.25 ఎకరాల మధ్యలోంచి ఇప్పుడు గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు విస్తరించనున్న (జీకే)జాతీయ రహదారి–16 వెళుతుంది. ఇలా ఉన్న భూమంతా భూసేకరణలో తీసేసుకుంటే ఈ రైతుకు సెంటుభూమి కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు. ఇటువంటి బాధితులు ఎందరో. విస్తరణలో విచిత్రాలెన్నో.. కొందరు బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లు కోల్పోయి సాగుకు దూరమయ్యే దుస్థితి ఉంది. 
 
కొవ్వూరు : గుండుగొలను– కొవ్వూరు మధ్య విస్తరించతలపెట్టిన జాతీయ రహదారి జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలోని 22 రెవెన్యూ గ్రామాల మీదుగా వెళ్తుంది. దీనికోసం 1,111 ఎకరాల భూమి సేకరించాలని సర్కారు నోటిఫికేష¯ŒS ఇచ్చింది.  కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 574.95 ఎకరాలు, ఏలూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 436.05 ఎకరాలు సేకరించనున్నారు.  ప్రస్తుతం మార్కింగ్‌ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్‌ 9న భూసేకరణకు ప్రభుత్వం  నోటిఫికేష¯ŒS జారీ చేసింది. అదే నెల 29 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. నోటిఫికేష¯ŒSలో ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరిస్తున్నారో మాత్రమే ప్రకటించారు. ఏ రైతుకు చెందిన ఎంతభూమి తీసుకుంటారో స్పష్టం చేయలేదు.   
 
అభ్యంతరాలను పట్టించుకోలేదు 
కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒSనుంచి 71, ఏలూరు డివిజ¯ŒS నుంచి 89 అభ్యంతరాలు అందాయి. వీటిలో ఏ ఒక్క అభ్యంతరానికీ అధికారులు స్వష్టమైన వివరణ ఇవ్వలేదు. ఒకవైపు రైతులు సర్వేకి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎక్కడికక్కడే రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. భూములకు ధర నిర్ణయం, పొలాలకు వెళ్లె పుంతరోడ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని అధికారులను రైతులు నిలదీస్తున్నారు. రైతులకు చెందిన కొంత భూమి జాతీయ రహదారికి ఒకవైపు ఉంటే మరికొంత భూమి మరో వైపు ఉండడం వల్ల సాగునీరందించే బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లను అన్నదాతలు కోల్పోతున్నారు. పొలాలకు వెళ్లే పుంతరోడ్లు మాయం కానున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారన్నదానిపై అధికారులు నోరుమెదపడం లేదు.  అక్కడక్కడ సర్వీసు రోడ్లు వేస్తారని చెబుతున్నా.. ఎక్కడెక్కడ వేస్తారన్న విషయం వెల్లడించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారుల భూసేకరణ చట్ట ప్రకారం.. నిర్బంధ భూసేకరణకు అవకాశం ఉండడంతో రైతుల వాదనలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ధరల నిర్ణయంపై అభ్యంతరాలు
గోదావరి నుంచి కృష్ణానదికి నీళ్లు తరలించుకుపోయేందుకు నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం దెందులూరు మండలంలో ఎకరం బేసిక్‌ విలువ రూ.8లక్షలుంటే రూ.38 లక్షలు పరిహారం చెల్లించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 13న 262 జీవోను జారీ చేసింది. 2006లో తాడిపూడి, పోలవరం కాలువల తవ్వకం సమయంలో కొబ్బరి, ఆయిల్‌పామ్‌ చెట్లకు చెట్టుకు రూ.1,600 చెల్లించారు. ఇదే పోలవరం కాలువ తవ్వకంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కోసం ప్రభుత్వం 262 జీవో ప్రకారం కొబ్బరి, ఆయిల్‌పామ్‌æ చెట్టు ఒక్కంటికి రూ.9,200 చొప్పున గత ఏడాది చెల్లించారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భూసేకరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడంతో రాష్ట్ర సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులూ  శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారుల భూసేకరణ చట్టం ప్రకారం 389 జీవో సెక్ష¯ŒS 28 ప్రకారం కేవలం బేసిక్‌ విలువపై రెండున్నర రెట్లు మాత్రమే చెల్లిస్తామని అధికారులు అంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పోలవరం, తాడిపూడి కాలువ తవ్వకం మూలంగా ఇదే ప్రాంతంలో రైతులు భూములు కోల్పోయారు. మళ్లీ దేవరపల్లి, నల్లజర్ల, భీమడోలు అదే రైతులకు చెందిన భూములను ఇప్పుడు జాతీయ రహదారి నిమిత్తం సేకరిస్తుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమకు చెల్లించినట్టే నాలుగురెట్ల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుని రైతుల అభ్యంతరాలకు పరిష్కార మార్గాలు చూపిన తర్వాతే భూసేకరణ చేయాలని రైతులు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement