land aquisition
-
అనంతపురం: హైవే ప్రాజెక్టుల హైస్పీడ్‌లో భూసేకరణ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ రహదారి ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలను కలపడంతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లాలో 1,452 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 623 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఇప్పటికే అనంతపురం జిల్లాలో 312 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించింది. శ్రీసత్యసాయి జిల్లాలో 216 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా ముందుకెళుతున్నారు. రోడ్లతో పాటు పలు ప్రాంతాల్లో వంతెనలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టులు మొత్తం 2024 సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ జరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల వివరాలు.. = ఉరవకొండ – అనంతపురం – కదిరి – మదనపల్లి – కుప్పం – కృష్ణగిరి వరకూ మొత్తం 197 కిలోమీటర్ల రోడ్డుకు సేకరణ పూర్తి చేయనున్నారు. = ధార్వాడ్ – హుబ్లి – గదగ్ –కొప్పలæ – హొసపేటె– బళ్లారి – గుత్తి – తాడిపత్రి – ముద్దనూరు – మైదుకూరు – బద్వేల్ – ఆత్మకూరు – నెల్లూరు – కృష్ణపట్నం వరకూ జాతీయ రహదారి–67లో మొత్తం 118 కిలోమీటర్లు చేపడుతున్నారు. = అనంతపురం – తాడిపత్రి – బనగానపల్లి – గాజులపల్లి – గిద్దలూరు – కంభం – వినుకొండ – నరసరావుపేట – గుంటూరు వరకూ జాతీయ రహదారి 544డీలో భాగంగా భూ సేకరణ చేపడుతున్నారు. = కొడికొండ – లేపాక్షి – హిందూపురం – మడకశిర వరకూ 544ఈ జాతీయ రహదారిలో 102 కిలోమీటర్ల రోడ్డు చేపడుతున్నారు. = ముదిగుబ్బ జంక్షన్ ఏర్పాటు చేస్తూ కనెక్టింగ్ ఏర్పాటులో భాగంగా పుట్టపర్తి మీదుగా ఎన్‌హెచ్–44లో కోడూరు వద్ద కలుపుతారు. = జాతీయ రహదారి ఎన్‌హెచ్ – 716లో ముద్దనూరు – పులివెందుల – కదిరి – ఓబుళదేవర చెరువు – గోరంట్ల – పాలసముద్రం క్రాస్ నుంచి హిందూపురం ఎన్‌హెచ్ 544ఈకి అనుసంధానిస్తారు. వేగంగా భూసేకరణ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా ఏర్పాటవుతున్న పలు జాతీయ రహదారులకు భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలామటుకు పూర్తిచేశాం. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. కొంత అటవీ భూములను కూడా డైవర్షన్ చేశారు. –మధుసూదన్‌రావు, ఈఈ, జాతీయ రహదారులు -
ఆర్ఆర్ఆర్: చివరి దశకు భూసేకరణ.. 15 రోజుల్లో త్రీడీ నోటిఫికేషన్!
గజ్వేల్: ట్రిపుల్ఆర్ భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రజాభిప్రాయసేకరణ పూర్తి కాగా, త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత రెండు సభల్లో బాధితుల నుంచి వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, పరిహారం లెక్కలు కూడా తేల్చనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ట్రిపుల్ఆర్ 110 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండనుంది. 14 మండలాల్లోని 73కిపైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. జగదేవ్‌పూర్ – గజ్వేల్ – తూప్రాన్ –నర్సాపూర్ –సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. ఈ క్రమంలోనే భూసేకరణను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో, మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. భూముల విలువ పెరిగిన తరుణంలో వాస్తవ విలువకు, ప్రభుత్వమిచ్చే పరిహారానికి పొంతన ఉండదని, ఈ నేపథ్యంలో భూమికి బదులు భూమి ఇవ్వాలనే డిమాండ్‌ను అధికారుల ముందుంచారు. త్వరలోనే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనున్న సంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. 980 ఎకరాలు.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఇక త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగ తలమునలై ఉన్నది. ఈ నోటిఫికేషన్లో సర్వే నంబర్లవారీగా రైతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలిరాజపేట, మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, మక్తమాసాన్‌పల్లి, బంగ్లావెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ జరగనుంది. ఆ గ్రామాలకు సంబంధించిన త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ 15 రోజుల్లో విడుదల కానుంది. మరో రెండు నెలల్లో.. మెదక్ జిల్లాకు సంబంధించి తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల నోటిఫికేషన్ సైతం త్వరలో రానుంది. రైతుల నుంచి అభిప్రాయసేకరణ ఎలా ఉన్నా.. ఈ త్రీడీ నోటిఫికేషన్ తర్వాత పరిహారం లెక్కలు తేల్చి భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టనున్నారు. పరిహారం పంపిణీకి గతంలో అవలంబించిన విధానాలలు అనుసరిస్తారా? మార్పులు చేస్తారా...? అనేది వేచి చూడాల్సి ఉంది. పరిహారం లెక్కలు తేలిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు వెంటనే పరిహారం అందిస్తారు. ముందుకురాని రైతులకు సంబంధించిన పరిహారాన్ని కోర్టుల్లో జమచేసి పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ముందుకుసాగుతోంది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్ గజ్వేల్ డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియను తుది దశకు చేరుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం. దీని తర్వాత భూముల విలువ ఆధారంగా పరిహారం లెక్కలు కూడా తేలనున్నాయి. ఆ తర్వాత ప్రక్రియను రెండు నెలల్లోపు పూర్తి చేసే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. –విజయేందర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గజ్వేల్ -
‘కారు’చౌకగా భూములెలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి బంజారాహిల్స్‌లో స్థలం కేటాయింపుపై వివరాలివ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఆదేశాలిచ్చింది. టీఆర్ఎస్కు రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌లో కారుచౌకగా భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కె.మహేశ్వర్‌రాజ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ‘గుర్తింపు పొందిన పార్టీలకు జిల్లా కేంద్రాల్లో గజానికి రూ. 100 చొప్పున ఎకరం స్థలం కేటాయించేలా 2018లో ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ క్రమంలో 2022 మే 11న బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం గజానికి రూ. 100 చొప్పున 4,935 గజాలను రూ. 4,93,500కు ప్రభుత్వం కేటాయించింది. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ గజానికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలు ఉంటుంది. మొత్తం విలువ రూ. 110 కోట్ల వరకు ఉంటుంది. 33 జిల్లా కేంద్రాల్లో కూడా రూ. 100 చొప్పున ఎకరం స్థలం పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు. ఈ స్థలం కేటాయింపులో సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించారు. 2005లో టీఆర్ఎస్కు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో పార్టీ కార్యాలయంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఓ చానల్‌ను కూడా నిర్వహిస్తు న్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు హైదరాబాద్‌లో స్థలం లేదంటున్న ప్రభుత్వం... పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించడం ఏకపక్ష నిర్ణయం’ అని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితోపాటు సీసీఎల్ఏ, రెవెన్యూ సీఎస్, హైదరాబాద్ కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 20కి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: సీసీఎల్ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీ -
ఎమ్మెల్సీ కుమారుడి కబ్జాపర్వం: కేసు నమోదు
మైసూరు: బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కుమారుడు అమిత్ దేవరహట్టిపై మైసూరు విజయనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మైసూరు హినకల్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని దేవరహట్టి మద్దతుదారులతో కబ్జా చేసి, కాంపౌండ్ కట్టాడని, అడ్డుకున్న యజమాని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లు కేసు నమోదు అయింది. స్థలం యజమాని యోగీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్, పటేల్, అనూప్, వైకుంఠాచార్ తదితర 8 మందిపై కేసు నమోదు చేశారు. -
దేవరయాంజాల్ భూములపై సమగ్ర విచారణ: బాల్క సుమన్
-
13న ‘భోగాపురం’ సినిమా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముంగిట మరో శంకుస్థాపన సినిమాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నద్ధమయ్యారు. భూ సేకరణ పూర్తి కాకుండా, ప్రాజెక్టు ఎవరు నిర్మిస్తారో తెలియకుండానే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ ఫిబ్రవరి 22తో ముగిసిన తర్వాత మార్చి మొదటి వారంలో శంకుస్థాపన తలపెడితే, ఎన్నికల కోడ్ వచ్చేస్తుందన్న భయంతో ఫిబ్రవరి 13న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భూ సేకరణ, టెండర్లు వంటి కీలక పనులు కూడా కాకుండా కేవలం ఎన్నికల ప్ర,చారం కోసమే శంకుస్థాపన చేస్తుండడం గమనార్హం. టెండర్ల ప్రక్రియపై నీలినీడలు భోగాపురంలో సుమారు రూ.4,208 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని 2015లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 2,700 ఎకరాల భూమి అవసరమని అంచనా వేయగా, అందులో ఇంకా 300 ఎకరాలను సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2016లో టెండర్లు పిలవగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసి మెయింటినెన్స్, ఓవర్ ఆయిలింగ్(ఎంఆర్వో)తో కలిపి టెండర్లను పిలిచింది. తాజా టెండర్లలో ఎయిర్‌పోర్టు నిర్మించడానికి ఏడు సంస్థలు ఆసక్తి చూపించగా, ఈ సంస్థలు ఎంత ఆదాయం ఇస్తాయో తెలపాలంటూ ఫిబ్రవరి 22 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలైన తర్వాత కూడా వైజాగ్ ఎయిర్‌పోర్టును కొనసాగిస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడంతో ఈ టెండర్ల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 22న ఎంతమంది టెండర్లలో పాల్గొంటారనేది ప్రశ్నార్థకరంగా మారింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, ముందుగానే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ పేరుతో కొబ్బరికాయ కొట్టి మరో శిలాఫలకం వేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప ఉక్కు, రామాయపట్నం పోర్టులకు ఇదే విధంగా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. -
చిక్కుల్లో బుల్లెట్ ట్రైన్..?
సాక్షి, ముంబయి : ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అవసరమైన భూ సేకరణపై అధికారులు తలపట్టుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్‌కు ఎంతకాలమైనా వేచిచూస్తామని, ముందుగా వైద్యులు, మందులు వంటి మౌలిక వసతులను కల్పించాలని అభిప్రాయసేకరణకు గ్రామాలకు వెళ్లిన అధికారులకు స్ధానికుల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బుల్లెట్ ట్రైన్‌కు నోడల్ సంస్థగా వ్యవహరిస్తున్న నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను చేపడుతోంది. వైద్య సేవలతో పాటు చెరువులు, సోలార్ విద్యుత్ దీపాలు, అంబులెన్స్‌ల వంటి పలు డిమాండ్లను పాల్ఘార్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు అధికారులు ముందుంచుతున్నారు. ఆయా గ్రామ కూడళ్లలో గ్రామసభలు నిర్వహించి ప్రాజెక్టుపై అవగాహన కల్పిస్తున్న అధికారులకు స్ధానికులు తమ డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ రూటు మార్చింది. గ్రామసభలకు బదులు నేరుగా భూయజమానులను కలిసి పరిహారంతో పాటు వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. 2022 నాటికి బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. 508 కిమీ ట్రైన్ కారిడార్‌లో అత్యధిక భాగం 110 కిమీ మేర పాల్ఘార్ జిల్లా మీదుగానే సాగుతుంది. జిల్లాలోని 73 గ్రామాలకు చెందిన 300 హెక్టార్ల భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం. అయితే ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూసేకరణను జిల్లాలోని గిరిజనులు, పండ్ల పెంపకందారులు తీవ్రంగా వ్యతిరేకిస్తునా్నరు. మరోవైపు గ్రామస్థుల నిర్ధిష్ట డిమాండ్లను నెరవేర్చడం ద్వారా భూసేకరణ సాఫీగా సాగేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ వ్యవహరిస్తోంది. గ్రామస్థులు వ్యక్తిగత సమస్యలు కాకుండా సామాజిక సమస్యలనే తెరపైకి తెస్తుండటంతో వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతున్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న సపోటా, మామిడి పెంపకందార్లను కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ అధికారులు ఊరడిస్తున్నారు. మెరుగైన ప్యాకేజ్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కితే స్ధానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
నిర్వాసితులకు మస్కా
వేలేరుపాడు: పోలవరం భూసేకరణలో భాగంగా ఎసైన్మెంట్ భూములకు పరిహారం అందించే విషయంలో అనేక మంది నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగింది. అధికారులు ఎంజాయిమెంట్ సర్వే అనంతరం నోటీసు బోర్డులో పేర్లు ప్రకటించి, అవార్డు కూడా పాస్ చేశారు. అవార్డులో విస్తీర్ణం, పరిహారం ఎంత అన్నది స్పష్టంగా ఉన్నప్పటికీ, తుది జాబితాలో మాత్రం పరిహారం ఎంతో తేల్చలేదు. ఫలితంగా నిర్వాసితులకు భూ నష్ట పరిహారం నేటికీ అందలేదు. ఈ తప్పిదం ఎక్కడ జరిగిందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 18,730 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 16,025 ఎకరాలు సేకరించారు. ఇందులో 14,000 ఎకరాల పట్టా భూమి ఉండగా, 2025 ఎకరాల అసైన్ భూమి ఉంది. ఈ రెండు మండలాల్లో మొత్తం 7,300 మంది రైతులకు ఇప్పటివరకు రూ.1270 కోట్ల పరిహారం అందించారు. అయితే వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము రెవెన్యూ పరిధిలో ఎసైన్మెంట్ భూములకు పరిహారం పంపిణీ గందరగోళంగా ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటూ సాగుదారులుగా కొనసాగుతున్న 28 మంది నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించకుండా మొత్తం 56 ఎకరాల భూమికి ఏకంగా నిండు సున్నాగా ప్రకటించడం వింతగా ఉంది. సున్నా జాబితాలో ఎంతో మంది నిర్వాసితులు అధికారులు ప్రకటించిన పరిహారం బిల్లులో మాత్రం సున్నాగా వచ్చిన నిర్వాసితులు అనేక మంది ఉన్నారు. పూచిరాల గ్రామానికి చెందిన సోడే చెల్లెమ్మకు 301, 218, 370 సర్వే నంబర్లలో 2.28 ఎకరాల భూమికి గాను రూ.28,35,000 పరిహారంగా ప్రకటించారు. 329, 330 సర్వే నంబర్లలో పిట్టా రమేష్‌కు 5.28 ఎకరాలుండగా రూ.59,85000, 329, 218‡ సర్వే నంబర్లలో పిట్టా మారయ్య పేర 4.19 ఎకరాలుండగా రూ.49,35,000, 329, 218 సర్వే నంబర్లలో పిట్టా రాములు పేర ఉన్న 4.25 ఎకరాలకు రూ.48,30,000, 330 సర్వే నంబర్లో పిట్టా ముత్తమ్మ, రాములమ్మ పేర ఉన్న 3.16 ఎకరాలకు రూ.35,75,000, ఇంకా 192 సర్వే నంబర్లో గారా హనుమంతురావు, కుచ్చర్లపాటి జయరావు, కుచ్చర్లపాటి సత్యనారాయణలకు ఇలా పరిహారం ప్రకటించి బిల్లులో అంతా మాయ చేశారనే ఆరోపణలు నిర్వాసిత రైతుల నుంచి విన్పిస్తున్నాయి. భూమి లాక్కుని రూపాయీ ఇవ్వలే ఈ గిరిజనుడి పేరు బీరబోయిన దేశయ్య. పూచిరాల గ్రామం. ఇతడికి రేపాకగొమ్ము రెవెన్యూ పరిధిలోని 384, 218 సర్వే నెంబర్లలో 3 ఎకరాల 25 కుంటల భూమి ఉంది. ఈ భూమికి రూ. 38,06,250 పరిహారంగా ప్రకటించారు. తుది జాబితాలో సున్నాగా చూపారు. ఈ గిరిజనుడు ఇప్పటికి ఐదారుసార్లు కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి తిరిగినా అధికారుల నుంచి సరైన సమాధానం రావడంలేదు. ఈ సున్నాకు అర్థమేమిటో అధికారులకే తెలియాలి. అవార్డులో మూడెకరాల ఆరుకుంటలు ఉంటే.. తుది జాబితాలో సున్నా ఈమె పేరు కమటం చిట్టెమ్మ. నడిమిగొమ్ము గ్రామం. రేపాకగొమ్ము రెవెన్యూలో సర్వే నెంబర్ 165/1 లో ఈమె పేర 3.06 ఎకరాల భూమి ఉంది. గత 32 ఏళ్లుగా ఈ భూమి సాగుచేసుకుంటోంది. ఎంజాయిమెంట్ సర్వే చేసిన అధికారులు నోటీస్‌బోర్డులో పెట్టిన జాబితాలో పేరు ప్రకటించారు. ఈ భూమికి ఏప్రిల్ నెలలో అవార్డు పాస్ చేశారు. అవార్డులో రూ. 33,07,500 పరిహారంగా ప్రకటించారు. తనకు అందరితోపాటు పరిహారం వస్తుందని చిట్టెమ్మ గత నాలుగు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. పరిహారం సొమ్ము తన ఖాతాలో జమ అయ్యిందేమోనని అనేక సార్లు బ్యాంక్ చుట్టూ తిరిగింది. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి వెళితే డబ్బులు ఎకౌంట్లో పడతాయని అధికారులు చెప్పేవారు. కానీ అసలు బిల్లులో మాత్రం సున్నాగా ప్రకటించారు. æచిట్టెమ్మ భర్త శంకరయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి కూరగాయలు అమ్ముకొని జీవిస్తోంది. బిల్లులో తన భూమికి సున్నా ఉందని తెలియడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. అసలు భూమిలేకుండా అవార్డు ఎలా పాస్ చేశారు... ఈమె పేరు కుచ్చర్లపాటి కుమారి. ఎర్రబోరు గ్రామం. ఈమెకు రేపాకగొమ్ము రెవెన్యూలో 192 సర్వే నెంబర్లో 2.05 ఎకరాల భూమి ఉంది. అసలు భూమి లేకుండా అవార్డు పాస్ చేయడం అసాధ్యం. గత 20 ఏళ్లుగా ఇదే భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తోంది. రూ. 22,31,250 పరిహారంగా ప్రకటించిన అధికారులు కుమారి భూమికి అవార్డు పాస్ చేశారు. తుది బిల్లులో మాత్రం సున్నాగా పెట్టి ఉంచారు. ఈమెకు నేటి వరకు పరిహారం అందలేదు. ఆమె భర్త రాజారావు ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారుడు, కుమార్తెలను ఆమె తన రెక్కల కష్టంతో చదివిస్తోంది. -
సర్వేలో చేతివాటం
కుక్కునూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుబారిన పడే కుక్కునూరు మండలంలో సర్వేయర్ల చేతివాటం వెలుగు చూసూ్తనే ఉంది. భూ సేకరణలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆ విభాగం అధికారి గతంలో అవార్డు విచారణ చేపట్టి అవకతవకలను సరిచేశారు. ఇకపై ఇలాంటి తప్పులు చోటుచేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయినా సర్వేయర్లలో ఏ మాత్రం మార్పురాలేదని మండలంలోని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తాజాగా వింజరం పంచాయతీలో అసైన్మెంట్ భూముల గుర్తింపునకు సర్వే చేపట్టగా.. సర్వేయర్లు అవినీతికి పాల్పడి పేదల భూములను పెద్దలకు కట్టబెట్టారని బాధితులు చెబుతున్నారు. ఉదాహరణలివిగో.. వింజరం గ్రామంలో సర్వే నంబర్ 131లో ఒక వ్యక్తికి 2 ఎకరాల 16 కుంటల భూమి ఉండగా.. సర్వేయర్లు 4 ఎకరాల 16 కుంటల భూమి ఉన్నట్టు నమోదు చేశారు. ఆ భూములు అతని వారసులకు చెందుతాయని పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్‌కు సంబంధించి పంచాయతీలో ప్రదర్శించిన నోటిఫికేషన్, ఆన్లైన్ పహాణీలో తేడా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. స్థానిక నాయకుడితో వాటాలు మాట్లాడుకున్న సర్వేయర్లు అతడికి సంబంధం లేని భూమిని కూడా అతడి పేరుమీద రాశారనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయం చేయాలి వింజరంలో సర్వే నంబర్ 131లో మా నాన్న పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది. మరో ఎకరాన్ని పోడు చేసుకుని సాగు చేసుకుంటున్నాను. సర్వేయర్లు వచ్చిన సమయంలో స్థానికంగా ఉండే ఒక వ్యక్తి.. మొత్తం ఐదెకరాలు నా పేరిట రాయిస్తానన్నాడు. చివరకు అరెకరం రాయించి మిగిలిన భూమిని తనపేరిట రాయించుకున్నాడు. – కొత్తా మనోహరం, వింజరం, కుక్కునూరు స్థానిక నేత బెదిరించాడు వింజరంలో సర్వే నంబర్ 68లో ఎకరం వరి కుంటను మా కుటుంబ సభ్యులు ఎప్పుడో కొన్నారు. దానికి చుట్టూ నాలుగెకరాల పోడును సాగు చేసుకుంటున్నాం. భూమి అమ్మిన వ్యక్తి వచ్చి ఐదెకరాల్లో తనకు వాటా ఉందన్నాడు. మాకు అమ్మింది ఎకరమే కదా అంటే.. బెదిరించాడు. నోటిఫికేషన్లో మాకు చెందిన 2 ఎకరాల భూమి అతని పేరు మీద వచ్చింది. –దాసరి ఇమ్మానుయేలు, వింజరం -
పెద్దలు కాదు గద్దలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం చేపట్టిన భూసేకరణ అధికార పార్టీ పెద్దలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వేరొకరి భూములను దర్జాగా అమ్మేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలోని జీలుగువిుల్లి, బుట్టాయగూడెం మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య భూ వివాదాలు తలెత్తాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏజెన్సీ ప్రాంతంలో భూ వివాదాలు పూర్తిస్థాయిలో సద్దుమణిగాయి. గిరిజనులు, గిరిజనేతరులు ఎవరికి హక్కున్న భూయుల్లో వారు సాగు చేసుకుంటూ సోదర భావంతో మెలిగారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వివాదాలు మొదటికొచ్చాయి. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. తహసీల్దార్ కార్యాలయాల్లో తిష్టవేసి.. తెలుగు తమ్ముళ్లు తహసీల్దార్ కార్యాలయాల్లో తిష్టవేసి ఆన్లైన్లో భూమి రికార్డులను తమకు నచ్చిన విధంగా మార్చుకున్నారు. వీఆర్ఓ, ఆర్ఐలతో సంబంధం లేకుండా తహసీల్దార్లే కంప్యూటర్ ఆపరేటర్‌తో కూర్చుని భూముల వివరాలను కంప్యూటరీకరణ చేశారు. అదే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కాసుల వర్షం కురిపిస్తుంది. తమ భూములు కాకపోయినా అన్లైన్ రికార్డులను చూపించి భూ సేకరణలో వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా జీలుగుమిల్లి మండల టీడీపీ అ«ధ్యక్షుడు వి.సోమసుందరం స్వర్ణవారి గూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న 30 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయించి.. పోలవరం ప్యాకేజీలో అమ్మకానికి పెట్డారు. అన్ని హక్కులూ తనకే ఉన్నాయని అదే గ్రామానికి చెందిన బుద్దే శ్రీనివాసరావు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. అధికార పార్టీ అ«ధ్యక్షుడు సోమసుందరం తనదిగా చెప్పుకుంటున్న భూమికి సంబంధించి 1997లో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై సోమసుందరం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని సాగు చేసుకుంటున్నాడు. హైకోర్టులో స్టే కొనసాగుతుండగానే అదే భూమిని పోలవరం భూసేకరణలో అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ విషయమై భూసేకరణ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదని సమాచారం. దీనిపై అధికారులు దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. -
అడిగితే.. అంతే!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం తమ నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించా లని అడిగిన రైతులను ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కించింది. పరిహారం ఇవ్వకుండా కాలువ తవ్వడానికి వీల్లేదన్న అన్నదాతలు గురువారం చింతలపూడిలోని కోర్టుకు హాజరుకావా ల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే గత ఏడాది జూలైలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం రైతుల పొలాల్లోంచి కాలువ తవ్వేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. తమకు సొమ్ములు చెల్లించకుండా కాలువ ఎలా తవ్వుతారంటూ అక్కడి రైతులంతా అధికారులను నిలదీశారు. భూములను సేకరించి.. పూర్తి నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టిం చుకోకపోవడంతో రైతులంతా కలిసి యర్రగుంటపల్లి వద్ద కాలువ తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి కోపమొచ్చింది. ఆ రైతులపై డీఈతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. చింతలపూడి జెడ్పీటీసీ రాధారాణి, యర్రగుంటపల్లి సర్పంచ్ సదరబోయిన వరలక్షి్మతోపాటు పిండపర్తి ముత్తారెడ్డి, పుల్లూరి సోమశేఖరాచార్యులు, అలవాల ఖాదర్‌బాబురెడ్డి, చిట్టూరి అంజిబాబు, మావూరి సత్యనారాయణరెడ్డి, జంగా రామచంద్రారెడ్డి, గుంటక రాఘవ, చిల్లూరి వెంకట లక్ష్మణరావు, గోలి శాంతరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వారందరికీ నోటీసులు రావడంతో గురువారం చింతలపూడి కోర్టుకు హాజరయ్యారు. కేసు ఈనెల 29వ తేదీకి వాయి దా పడింది. న్యాయం చేయకపోగా.. ఏడాది క్రితం రైతులు కాలువ పనులను అడ్డుకోగా.. ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. యర్రగుంటపల్లిలోని రైతులకు ఒక్కపైసా కూడా పరిహారం అందలేదు. పరి హారం ఇవ్వకుండా పనులు చేయాలని ప్రయత్నించడమే కాకుండా తమపై అక్రమ కేసులు బనాయించి కోర్టుకు లాగడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబం ధించి ప్రభుత్వం ఇచ్చిన అవార్డును వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించడం, దానిపై స్టే రావడం తెలిసిందే. భూసేకరణ మొత్తం అవినీతిమయంగా మారడం, లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటంతో భూసేకరణ ప్రక్రియ ఎంత అడ్డగోలుగా సాగుతోందో స్పష్టమవుతోంది. రైతులపై కేసులు పెట్టడాన్ని చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులను భయపెట్టి పనులు చేయాలని ప్రభుత్వం భావిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. -
నిర్వాసితులపై దళారుల పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక రైతు తనకున్న 40 ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వానికి ఇచ్చాడు. ఇంతలో ఓ దళారి రంగప్రవేశం చేశాడు. సొమ్ములు ఇస్తేనే ఆ భూమికి సంబంధించిన నష్టపరిహారం అందుతుందని.. లేదంటే నీ సంగతి అంతేనంటూ భయపెట్టాడు. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఆ రైతుతో సంతకం చేయించుకున్నాడు. మూడు ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నాడు. భూసేకరణ జరిపిన ఐటీడీఏ పీఓ షణ్మోహ¯ŒS నేరుగా ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేయించారు. అయినా.. దళారి ఊరుకోలేదు. తనవల్లే ఆ పని అయ్యిందని, ఎకరానికి రూ.50 వేల చొప్పున 40 ఎకరాలకు రూ.20 లక్షలు చెల్లించాలని పట్టుబట్టాడు. లేదంటే తనవద్ద ఉన్న స్టాంప్ పేపర్, బ్యాంకు చెక్కులను వినియోగించి రకరకాల కేసులు వేయిస్తానని బెదిరించాడు. దిక్కులేని పరిస్థితిలో ఆ దళారికి రైతు రూ.20 లక్షలు ముట్టజెప్పాడు. ఈ విషయం బయటపడితే తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాడోననే భయంతో నోరు మెదపటం లేదు. ఇదిలావుంటే.. దర్భగూడెం గ్రామానికి చెందిన మరో రైతుకు అదే గ్రామంలో 7 ఎకరాల భూమి ఉంది. 30 ఏళ్లుగా ఆ భూమిని మరొకరు అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో ఏజెన్సీలో తలెత్తిన ఘర్షణల కారణంగా ఆ రైతు ఊరొదిలి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేశారు. అంతకుముందే దళారులు అతని నుంచి చెక్కులు తీసుకున్నారు. అతనికి అందిన పరిహారంలో సగం సొమ్ము తీసుకున్నారు. అందులో కొంత సొమ్మును అనుభవదారుకు ఇచ్చారు. దీంతో లబోదిబోమనడం అటు రైతు, ఇటు భూమి అనుభవదారుల వంతయ్యింది. పెచ్చుమీరిన పర్సంటేజీల దందా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే వారి కోసం సేకరిస్తున్న భూముల విషయంలో దళారుల దందా పెచ్చుమీరింది. భూములిచ్చిన రైతులకు చెల్లించే పరిహారం వారికి అందాలంటే తాము అడిగినంత సొమ్ము ఇవ్వాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపుబారిన పడే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు జీలుగుమిల్లి మండలం లోని దర్భగూడెం, ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం, పి.అంకంపాలెం, పి.నారాయణపురం, రాచన్నగూడెం, బుట్టాయగూడెం, దొరమామిడి గ్రామాల్లో 4,035 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. భూములిచ్చిన రైతులకు పరిహారం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశారు. అప్పటికే వారినుంచి ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్న దళారులు తాము అడిగినంత సొమ్ములు ఇవ్వకపోతే పరిహారం సొమ్ము వెనక్కి వెళ్లిపోయేలా చేస్తామని బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెగబడుతున్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. దర్భగూడెంలో 230 ఎకరాలు సేకరించగా.. ఒక చోటా నాయకుడు రైతుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. కేసులు తప్పవు పరిహారం అందిన రైతుల నుంచి ఎవరైనా కమీషన్ల రూపంలో సొమ్ములు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని భూసేకరణ అధికారి షణ్మోహన్ తెలిపారు. బాధితులు తనకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. -
సర్వేషురూ
ఉంగుటూరు : జిల్లాలో జల రవాణా అభివృద్ధి దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు ప్రధాన కాలువను విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన భూములను గుర్తించేందుకు ఉంగుటూరు మండలం బాదంపూడి, ఉప్పాకపాడు వద్ద సర్వే పనులకు మంగళవారం శ్రీకారం చుడుతున్నారు. ఈ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కాలువ అధికారులు ఉంగుటూరు రానున్నారు. ఇందుకు అవసరమైన రికార్డులను స్థానిక అధికారులు సిద్ధం చేశారు. సర్వే పనులకు ఏలూరు ఆర్డీఓ చక్రధరరావు కో–ఆరి్డనేటర్గా వ్యవహరిస్తారు. విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకూ.. జిల్లాలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ప్రారంభమయ్యే నిడదవోలు మండలం విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు ఎంత భూమిని సేకరించాలనే విషయంపై అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. భూముల సర్వే చేపట్టాలంటూ 8 మంది తహసీల్దార్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వారు గ్రామాల వారీగా భూసేకరణ జాబితాను వీఆర్వోలకు అందజేశారు. స్థల సేకరణకు రంగం సిద్ధం చేశారు. ఆలయాల తరలింపు జల రవాణా అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువ గట్లపై ఉన్న ఆలయాలను తొలగించి మరోచోట నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. శ్మశాన వాటికలను తొలగించాల్సి వస్తే మరోచోట స్థలాలను చూపిస్తామని చెబుతున్నారు. గట్టు నుంచి 120 మీటర్లు జల రవాణా కోసం కాలువ గట్టు నుంచి 120 మీటర్ల వరకు కాలువను వెడల్పు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎక్కడెక్కడ ఎంతెంత భూముల్ని సేకరించాలనే విషయాన్ని నిర్థారించేందుకు సర్వే పనులు చేపడుతున్నారు. ఇది పూర్తయిన అనంతరం భూములను సేకరించి అప్పగించేందుకు తహసీల్దార్లు సంసిద్ధంగా ఉన్నారు. స్థల సేకరణలో భాగంగా ఎనిమిది మండలాల్లో కాలువ గట్ల వెంబడి ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. దీనివల్ల తలనొప్పులు తప్పవని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. మార్కింగ్ వేస్తారు జల రవాణా అభివృద్ధి పనుల కోసం మంగళవారం ఉంగుటూరు మండలం బాదంపూడి, వెల్లమిల్లిలో సర్వే మొదలవుతుంది. సర్వే చేసి మార్కింగ్ వేయనున్నారు. –వైకేవీ అప్పారావు, తహసీల్దార్, ఉంగుటూరు జిల్లాలోని 8 మండలాల పరిధిలో 2,547 ఎకరాల 13 సెంట్ల భూమిని జల రవాణా అభివృద్ధి పనుల కోసం సేకరించనున్నారు. మండలం సేకరించనున్న భూమి (ఎకరాల్లో) ఏలూరు 150.5 దెందులూరు 349.19 భీమడోలు 448.47 ఉంగుటూరు 403.31 పెంటపాడు 152.60 తాడేపల్లిగూడెం 467.98 నిడదవోలు 470.57 సెంట్లు కొవ్వూరు 104.94 సెంట్లు మొత్తం 2,547.13 -
చట్టాలకు తూట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో గిరిజన చట్టాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. 1/70 చట్టం ప్రకారం అటవీ ప్రాంతంలో గిరిజనేతరుల భూముల విక్రయాలు, నిర్మాణాలు నిషేధం. ఇక్కడి భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తే అవి ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ (భూ బదలాయింపు నియంత్రణ) చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం గిరిజనేతరులకే కాదు.. ప్రభుత్వానికి సైతం వర్తిస్తుంది. అటవీ ప్రాంతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కేవలం గిరిజనుల మధ్య మాత్రమే జరగాల్సి ఉంటుంది. ఇలాంటి చోట్ల ప్రభుత్వం భూములను సేకరించాల్సి వస్తే పీసా చట్టం ప్రకారం విధిగా గ్రామసభలు నిర్వహించి గిరిజనుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం భూములు సేకరిస్తున్న ప్రభుత్వం గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అటవీ ప్రాంతంలో భూముల్ని సేకరించి గిరిజనేతరులకు మేలు చేసేవిధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. దీనివెనుక పెద్దఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం. చట్టం ఏం చెబుతోందంటే.. గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపు నియంత్రణ చట్టం (ఎల్టీఆర్) 1963 డిసెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగువిుల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఈ చట్టం వర్తిస్తుంది. దీని ప్రకారం.. గిరిజన గ్రామాల్లోని అన్నిరకాల స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలు భూ బదలాయింపు నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తాయి. దీని ప్రకారం నోటిఫైడ్ గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య అన్నిరకాల స్థిరాస్తుల బదలాయింపుల్ని నిషేధించారు. ఈ చట్టా న్ని 1970 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు. గిరిజనేతరులు ఎవరైనా భూములు విక్రయించేందుకు ప్రయత్నిస్తే దానిని ఎల్టీఆర్గా పరిగణిస్తున్నారు. అడ్డగోలుగా సేకరించారు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల నుంచి సేకరించిన భూమికి బదులుగా భూమి ఇచ్చే వ్యవహారమంతా అడ్డగోలుగా సాగుతోందని గిరిజన, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగువిుల్లి, పోలవరం మండలాల్లో అధికారులు భూసేకరణ జరుపుతున్నారు. ఇప్పటివరకూ 19,300 ఎకరాలు సేకరించినట్టు చెబుతుండగా.. భూములు కోల్పోయిని వారికి ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ భూములన్నీ గిరిజనేతరుల నుంచే సేకరించారు. భూబదలాయింపు చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులెవరికీ భూములు ఉండవు. అలాంటప్పుడు గిరిజనేతరుల నుంచి సేకరించినట్టు చూపిస్తూ వారికి పరిహారం చెల్లించడం ఏమిటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పీసా చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించకుండా భూ సేకరణ చేశారని.. దీనిపై కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గిరిజన నాయకులు చెబుతున్నారు. 1/70 చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు లేకపోవడం వల్ల ఈ భూములకు అంత విలువ ఉండదు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల లోపే పలుకుతోంది. ప్రభుత్వం మాత్రం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.10.50 లక్షల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలోనే గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ ప్రాంతంలో నిర్మించిన చిన్న నీటి ప్రాజెక్టుల వల్ల అనేకమంది గిరిజనులు భూములను కోల్పోయారు. వారికి మాత్రం ప్రభుత్వం ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు మించి ఇవ్వలేదు. భూములిచ్చిన గిరిజనుల్లో కొందరికి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు మాత్రమే అందాయి. అయితే, పోలవరం ప్రాజెక్టు భూ సేకరణకు సంబంధించి గిరిజనేతరులకు పెద్దమొత్తంలో పరిహారం చెల్లించడమంటే అధికార పార్టీ నేతలకు మేలు చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మరోపోరాటం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాడేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు. ఇప్పటివరకూ గ్రామాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన రైతులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు కోర్టులను ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోగా.. కోర్టులకు వెళ్లలేని వారు ప్రభుత్వం చెల్లించిన అరకొర నష్టపరి హారం వల్ల నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. వీరంతా ఇకపై దశల వారీగా ఐక్య ఉద్యమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతులు చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు రైతుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి.. ఈ నెల 24న తెడ్లం గ్రామంలో సమావేశమయ్యారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ చట్టం ద్వారా ఉన్న హక్కులు, వారికి రావాలి్సన పరిహారం విషయంలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు ముద్రించి అన్ని గ్రామాల్లో అతికించాలని నిర్ణయించారు. కాలం చెల్లిన జీఓ ఆధారంగా ఉద్యాన పంటలకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువల ఆధారంగా పరిహారం పొందేందుకు హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేయాలని నిర్ణయించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని నాలుగు రెట్లు ఇచ్చే విధంగా అధికారులతో చర్చలు జరపడంతోపాటు కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న భూములు, నివాస యోగ్యమైన స్థలాలు, వాణిజ్యపరమైన స్థలాలకు అదనపు విలువలు నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ ప్రయత్నాలు ఫలించని పక్షంలో కోర్టులను ఆశ్రయించాలని తీర్మానించారు. అసైన్డ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ అంశాలపై త్వరలో మరోసారి సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు. -
భూసేక‘రణం’
సాక్షి ప్రతినిధి, ఏలూరు/జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం భూములు సేకరించిన వ్యవహారం గిరిజనుల మధ్య చిచ్చు రేపింది. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను అధికారులు అడ్డగోలుగా కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమికి సంబంధించి పట్టాలు వేరే వారి పేరిట ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాలుగా తామే సాగు చేసుకుంటున్నామని.. ఆ భూములను పట్టాలు కలిగిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి నిర్వాసితులకు అప్పగించడం అన్యాయమనే వాదన వినిపిస్తోంది. ఇదికాస్తా స్థానిక గిరిజనులు, స్థానికేతరులైన నిర్వాసిత గిరిజనుల మధ్య అగ్గి రాజేస్తోంది. జిల్లాలోని జీలుగువిుల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ఈ తరహా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో స్థానిక గిరిజనులు సర్వే రాళ్లను తొలగించడంతోపాటు మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. తాము సాగు చేసుకుంటున్న భూములను నిర్వాసితులకు కేటాయించడంతో స్థానిక గిరిజనులు అడ్డం తిరుగుతున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాలైన రాజులగొంది, కొరుటూరు, శివగిరి, కొత్త మామిడిగొంది గ్రామాల గిరిజనులకు జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో భూమికి భూమితోపాటు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ గ్రామంలోని భూములకు అగ్రవర్ణాల పేరుతో పట్టాలు ఉన్నాయి. ఆ భూములను కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వీటిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంపై ఈ ప్రాంత గిరి జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు ఉపక్రమిస్తుంటే అడ్డుకుంటున్నారు. పి.నారాయణపురం రెవెన్యూ పరిధిలో సుమారు 500 ఎకరాల భూములకు సంబంధించి నిర్వాసిత గిరిజనులు, స్థానిక గిరిజనుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూముల్లో పోలీస్ రక్షణతో పోలవరం నిర్వాసితులు సాగు చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లోని భూముల్లో స్థానిక గిరిజనులు వేసిన పత్తి పంటను గత ఏడాది జూన్ నెలలో పోలీస్ రక్షణతో నిర్వాసిత గిరిజనులు దున్నేశారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా.. పోలవరం నిర్వాసితుల కోసం పి.నారాయణపురంలో కేటాయించిన ఇంటి స్థలాల్లోని సరిహద్దు రాళ్లను స్థానిక గిరిజనులు మంగళవారం తొలగించారు. ఇక్కడ మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్స్‌ను ధ్వంసం చేశారు. నిర్వాసితులను సాగు చేసుకోని వ్వకపోవడం, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడంతో గిరిజనుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారిం చకపోతే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. -
భూమి లాక్కుంటారన్న భయంతో.. రైతు మృతి
తమ పంట భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటారన్న భయంతో ఒక రైతు ఆర్డీవో కార్యాలయంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణలో భాగంగా ఆర్డీవో ఆఫీసులో గురువారం సమావేశం ఏర్పాటుచేశారు. ఇప్పటికే అక్కడ 600 ఎకరాలు తీసుకోగా, మరో 1400 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం ఏర్పాటుచేసిన సమావేశానికి పలువురు రైతులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న బాలు నాయక్ (50) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. తమ భూములను బలవంతంగా తీసుకుంటారని గత కొంతకాలంగా ఆయన భయపడుతున్నారని బంధవులు చెబుతున్నారు. ప్రభుత్వం అతి తక్కువ ధరకే తమ విలువైన భూములు తీసుకుంటుందని అనుమానపడుతున్నారని, అందుకే ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలునాయక్ మృతిపట్ల బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
విస్తరణలో విచిత్రాలు
ఈయన పేరు మండా వీర వెంకట సత్యనారాయణ (బుజ్జిబాబు). దేవరపల్లి మండలం యర్నగూడెం వాసి. ఈయనకు ఆ రెవెన్యూ గ్రామంలో మూడు చోట్ల 4.25 ఎకరాల పొలం ఉంది. పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకానికి ఇందులో 1.25 ఎకరాలు పోయింది. తాడిపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువ తవ్వకం నిమిత్తం 1.25 ఎకరాలు, ఉపకాలువ తవ్వకానికి అర ఎకరం పోయాయి. ఇక ఉన్న 1.25 ఎకరాల మధ్యలోంచి ఇప్పుడు గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు విస్తరించనున్న (జీకే)జాతీయ రహదారి–16 వెళుతుంది. ఇలా ఉన్న భూమంతా భూసేకరణలో తీసేసుకుంటే ఈ రైతుకు సెంటుభూమి కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు. ఇటువంటి బాధితులు ఎందరో. విస్తరణలో విచిత్రాలెన్నో.. కొందరు బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లు కోల్పోయి సాగుకు దూరమయ్యే దుస్థితి ఉంది. కొవ్వూరు : గుండుగొలను– కొవ్వూరు మధ్య విస్తరించతలపెట్టిన జాతీయ రహదారి జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలోని 22 రెవెన్యూ గ్రామాల మీదుగా వెళ్తుంది. దీనికోసం 1,111 ఎకరాల భూమి సేకరించాలని సర్కారు నోటిఫికేష¯ŒS ఇచ్చింది. కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 574.95 ఎకరాలు, ఏలూరు రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో 436.05 ఎకరాలు సేకరించనున్నారు. ప్రస్తుతం మార్కింగ్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ 9న భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేష¯ŒS జారీ చేసింది. అదే నెల 29 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. నోటిఫికేష¯ŒSలో ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరిస్తున్నారో మాత్రమే ప్రకటించారు. ఏ రైతుకు చెందిన ఎంతభూమి తీసుకుంటారో స్పష్టం చేయలేదు. అభ్యంతరాలను పట్టించుకోలేదు కొవ్వూరు రెవెన్యూ డివిజ¯ŒSనుంచి 71, ఏలూరు డివిజ¯ŒS నుంచి 89 అభ్యంతరాలు అందాయి. వీటిలో ఏ ఒక్క అభ్యంతరానికీ అధికారులు స్వష్టమైన వివరణ ఇవ్వలేదు. ఒకవైపు రైతులు సర్వేకి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎక్కడికక్కడే రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. భూములకు ధర నిర్ణయం, పొలాలకు వెళ్లె పుంతరోడ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని అధికారులను రైతులు నిలదీస్తున్నారు. రైతులకు చెందిన కొంత భూమి జాతీయ రహదారికి ఒకవైపు ఉంటే మరికొంత భూమి మరో వైపు ఉండడం వల్ల సాగునీరందించే బోర్లు, ట్రా¯Œ్సఫార్మర్లను అన్నదాతలు కోల్పోతున్నారు. పొలాలకు వెళ్లే పుంతరోడ్లు మాయం కానున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారన్నదానిపై అధికారులు నోరుమెదపడం లేదు. అక్కడక్కడ సర్వీసు రోడ్లు వేస్తారని చెబుతున్నా.. ఎక్కడెక్కడ వేస్తారన్న విషయం వెల్లడించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారుల భూసేకరణ చట్ట ప్రకారం.. నిర్బంధ భూసేకరణకు అవకాశం ఉండడంతో రైతుల వాదనలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరల నిర్ణయంపై అభ్యంతరాలు గోదావరి నుంచి కృష్ణానదికి నీళ్లు తరలించుకుపోయేందుకు నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం దెందులూరు మండలంలో ఎకరం బేసిక్ విలువ రూ.8లక్షలుంటే రూ.38 లక్షలు పరిహారం చెల్లించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 13న 262 జీవోను జారీ చేసింది. 2006లో తాడిపూడి, పోలవరం కాలువల తవ్వకం సమయంలో కొబ్బరి, ఆయిల్‌పామ్ చెట్లకు చెట్టుకు రూ.1,600 చెల్లించారు. ఇదే పోలవరం కాలువ తవ్వకంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కోసం ప్రభుత్వం 262 జీవో ప్రకారం కొబ్బరి, ఆయిల్‌పామ్æ చెట్టు ఒక్కంటికి రూ.9,200 చొప్పున గత ఏడాది చెల్లించారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భూసేకరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడంతో రాష్ట్ర సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులూ శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారుల భూసేకరణ చట్టం ప్రకారం 389 జీవో సెక్ష¯ŒS 28 ప్రకారం కేవలం బేసిక్ విలువపై రెండున్నర రెట్లు మాత్రమే చెల్లిస్తామని అధికారులు అంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పోలవరం, తాడిపూడి కాలువ తవ్వకం మూలంగా ఇదే ప్రాంతంలో రైతులు భూములు కోల్పోయారు. మళ్లీ దేవరపల్లి, నల్లజర్ల, భీమడోలు అదే రైతులకు చెందిన భూములను ఇప్పుడు జాతీయ రహదారి నిమిత్తం సేకరిస్తుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమకు చెల్లించినట్టే నాలుగురెట్ల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుని రైతుల అభ్యంతరాలకు పరిష్కార మార్గాలు చూపిన తర్వాతే భూసేకరణ చేయాలని రైతులు కోరుతున్నారు. -
రెండేళ్లలో రీజినల్ 'రింగ్'
-
రెండేళ్లలో రీజినల్ 'రింగ్'
⇒ భూసేకరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం ⇒ ‘ఔటర్’ అవతల 330 కి.మీ. మేర నిర్మాణం ⇒ డీపీఆర్‌లలో జాప్యం లేకుండా చూడండి ⇒ రహదారులపై ప్రాణనష్టం కలచివేస్తోంది ⇒ రోడ్ల నిర్మాణంపై సమగ్ర అధ్యయనం అవసరం ⇒ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ ఎలా ఉండాలో ⇒ విజన్ డాక్యుమెంట్ రూపొందించండి ⇒ యూరప్, అమెరికాలోని రోడ్లను పరిశీలించాలని ఆదేశం ⇒ జాతీయ రహదారులపై గడ్కారీని కలవాలని నిర్ణయం 40 నుంచి 50 కి.మీ. దూరంలో నగరం చుట్టూ వివిధ రహదారులపై ఉన్న ఈ పట్టణాలను అనుసంధానిస్తూ రీజినల్ రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు. 1. చౌటుప్పల్ 2. భువనగిరి 3. ములుగు 4. తూప్రాన్ 5. నర్సాపూర్ 6. సంగారెడ్డి 7. శంకర్పల్లి 8. చేవెళ్ల 9. షాబాద్ 10. షాద్‌నగర్ 11. కందుకూరు 12. గున్గల్ సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల 330 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియకు వెంటనే శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. డీపీఆర్‌ల తయారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చాలా పనుల్లో డీపీఆర్‌ల పేరుతో ఎడతెగని జాప్యం జరుగుతోందని, అవసరమైతే పనులను ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి సత్వరమే డీపీఆర్‌లు రూపొందించాలని సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆ శాఖ ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది చనిపోవటం కలచివేస్తోందని, దీన్ని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ‘‘భవిష్యత్తులో మన రోడ్లు ప్రమాదరహితంగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఓ పదేళ్ల తర్వాత తెలంగాణ రోడ్ నెట్వర్క్ ఎలా ఉండాలి? అందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిందేంటి? తదితర వివరాలతో ఓ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయండి. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే నెంబర్ వన్ రోడ్నెట్వర్క్ తెలంగాణలో ఉండాలి’’ అని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత రోడ్ల పరిస్థితిని అధ్యయనం చేసి వచ్చే పదేళ్ల తర్వాత ఎలా ఉండాలన్న అంశంపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. రోడ్లు పది కాలాలపాటు మన్నేలా ఉండాలి భారీ వర్షాలకు రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయని, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని పదికాలాల పాటు మన్నేలా రహదారులు ఉండేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇది యావత్ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, విస్తరణ, మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, కేంద్రం నుంచి కూడా 2,500 కి.మీ. మేర జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని చెప్పారు. వర్షం వస్తే రోడ్లు ఎక్కువగా పాడవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక విధానాలు అనుసరించాలన్నారు. ఇందుకు ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అమెరికా, యూరప్ దేశాల్లో రోడ్లు బాగుంటాయని, ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఎక్కడెక్కడ ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, అండర్‌పాస్‌లు అవసరం? నదులు, వాగులపై ఎక్కడ వంతెనలు, కాజ్‌వేలు అవసరమో కూడా విజన్ డాక్యుమెంట్లో పొందుపరచాలన్నారు. రోడ్లపై మలుపులు తక్కువగా ఉండాలి ప్రమాదాల నివారణకు రోడ్లపై మలుపులు తక్కువగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. పట్టణాలు, పెద్ద గ్రామాల మీదుగా జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లు సాగకుండా బైపాస్‌లు నిర్మించాలన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారుల వెంట అవసరమైన ప్రాంతాల్లో ఐలాండ్స్ నిర్మించి పక్కాగా నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారులపై గడ్కరీతో మాట్లాడదాం ఇటీవలే తెలంగాణకు కేంద్రం 2500 కి.మీ. మేర కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసింది. అయితే నెలలు గడుస్తున్నా ఆ మేరకు అధికారిక పత్రాలు అందలేదు. రెండుమూడు పర్యాయాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ అధికారులతో మాట్లాడినా ఫలితం లేదు. దీంతో ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్... వెంటనే ఢిల్లీకి వెళ్లి స్వయంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవాలని నిర్ణయించారు. దానిపై చర్చించేందుకే మంగళవారం ఈ సమీక్ష ఏర్పాటు చేయటం విశేషం. వీలైతే వచ్చేనెల మొదటివారంలో ఢిల్లీ పర్యటన ఉంటుందని, ఆ లోపు గడ్కరీతో మాట్లాడి భేటీకి ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్య కార్యదర్శి నర్సింగరావును సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన కేంద్రమంత్రి కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి డబుల్ రోడ్లను సుందరంగా నిర్మిస్తుంటే.. జాతీయ రహదారులు నెలల తరబడి గుంతలో ఉండాల్సిన పరిస్థితి సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. మంజూరైన జాతీయ రహదారులను వెంటనే అభివృద్ధి చేయాల్సి ఉందని, ఆ దిశగా నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. అలాగే ఇతర పథకాల కింద రోడ్ల కోసం కేంద్రం నుంచి ఈ సంవత్సరం అదనంగా రూ.వెయ్యి కోట్లు సాధించాలన్నారు. -
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు
-
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు. రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఇతర మంత్రివర్గ సభ్యులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. pic.twitter.com/8JihFfz7vd — Pawan Kalyan (@PawanKalyan) August 28, 2015 ముఖ్యంగా రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు... — Pawan Kalyan (@PawanKalyan) August 28, 2015 -
బలవంతపు భూసేకరణకు సిద్ధమైన ప్రభుత్వం
-
పవన్ వద్దకు మంత్రుల బృందం?
-
పవన్ వద్దకు మంత్రుల బృందం?
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ విషయంలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న పవన్ కల్యాణ్ వద్దకు మంత్రుల బృందాన్ని పంపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే స్వయంగా తాను కూడా పవన్‌తో భేటీ కావాలని అనుకుంటున్నారట. రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణ చేయొద్దని పవన్ ఇంతకుముందు, తాజాగా కూడా ట్వీట్లలో చెప్పారు. బేతపూడి, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో గతంలో పవన్ పర్యటించినప్పుడు తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే బలవంతంగా భూసేకరణకు దిగితే ఊరుకునేది లేదని పవన్ చెప్పారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో మళ్లీ ట్వీట్ చేశారు. అయితే.. దానిపై మంత్రులు కొందరు సెటైర్లు వేశారు. భూసేకరణ చేయకుండా రాజధాని ఎలా నిర్మిస్తారో చెప్పాలంటూ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. దానిపై మళ్లీ పవన్ స్పందించారు. రైతుల సమస్యను ప్రస్తావిస్తే వెటకారం చేస్తున్నారంటూ నేరుగా యనమల పేరు పెట్టి ట్వీట్లు చేశారు. దీంతో వివాదం క్రమంగా ముదురుతోందని భావించిన చంద్రబాబు.. మంత్రుల బృందాన్ని పవన్ వద్దకు పంపుతున్నారు. ఆయన మరోసారి బేతపూడి, పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాలకు వెళ్తే రైతుల నుంచి ఉద్యమం మొదలు కావచ్చని, దానికి పవన్ మద్దతు ఇచ్చి తీరుతారని అనుకుంటున్నారు. భూసేకరణకు తీవ్రస్థాయిలో అన్నాహజారే, మేధాపాట్కర్ లాంటి వాళ్లనుంచి కూడా విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్తోంది. దానిపైనే పవన్ ఇప్పుడు స్పందించడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టింది. పవన్‌ను రాజీమార్గంలోకి తెచ్చుకుని భూసేకరణకు వెళ్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముందుగా మంత్రుల బృందాన్ని పంపి, ఆ తర్వాత రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు కూడా పవన్‌తో భేటీ కావచ్చని అంటున్నారు.