రైతులు అత్యాశకు వెళ్లవద్దు: చంద్రబాబు
విజయవాడ: రాజధాని కోసం చేపట్టే భూసమీకరణ, సేకరణ అంశంపై రైతులే నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానికి భూసేకరణ చట్టంతో భూములు సేకరిస్తామని ఆయన తెలిపారు. కోట్ల రూపాయలు చెల్లించాలని రైతులు ఆత్యాశకు వెళ్లోద్దని చంద్రబాబు సలహా ఇచ్చారు.
ల్యాండ్ పూలింగ్ విధానమే రైతులకు మేలైనదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ అనివార్యమని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. రైతులు సహకరిస్తేనే రాజధాని నిర్మాణం సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.