
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ బీసీజీ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నామని ఎస్సీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే విధంగా బీసీజీ నివేదిక ఉందని, విశాఖలో రాజధాని ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, రోడ్డు, వైమానిక, సముద్ర మార్గాలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు మోసం చేయడం వల్లే అమరావతి రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు. అభివృద్ది 23 గ్రామాలకే పరిమితం కావాలా... రాష్ట్రమంతా అభివృద్ది చెందకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసింది పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులే కానీ.. అమరావతి రైతులు కాదని అన్నారు. చంద్రబాబు మాటలను నమ్మి అమరావతి రైతులు మోసపోవద్దని హితవు పలికారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళన కృత్రిమమైనదన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , కమ్యూనిస్టులకు పోలవరం రైతుల త్యాగాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment